ఆదేశిక సూత్రాలకు జతచేసిన సామ్యవాద భావనలు ఏవి?
పాలిటీ
1. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి తప్పుగా పేర్కొన్నది?
1) ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి సలహాలు మాత్రమే కాని ప్రాథమిక హక్కులు మాత్రం అధికారాలకు సంబంధించింది
2) ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతం కానివి. ప్రాథమిక హక్కు న్యాయ సమ్మతం అయినది
3) ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రెండు న్యాయ సమ్మతం అయినవి
4) పైవేవీకాదు
2. పౌరుడు నిర్దేశిక నియమాల అమలుకు ఏ కోర్టును సంప్రదిస్తాడు?
1) సుప్రీంకోర్టు 2) హైకోర్టు
3) 1, 2 4) పై ఏ కోర్టు కాదు
3. ఆదేశ సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4. ఐర్లాండ్
4. కిందివాటిలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాన్ని సూచించని వాఖ్యలు ఏవి?
ఎ) ఆదేశిక సూత్రాల లక్ష్యం సమాజ సంక్షేమం అయితే ప్రాథమిక హక్కులు, వ్యక్తులను రాజ్యాధికారం నుంచి రక్షిస్తాయి.
బి) ప్రాథమిక హక్కులు రాజ్యాధికారంపై పరిమితులు విధిస్తే అదేశిక సూత్రాలు నుంచి సామాజిక ఆర్థిక సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వానికి అనుకూల సూచనలు
సి. ప్రాథమిక హక్కులు వాస్తవ రాజ్యాంగంలో అంతర్భాగం కానీ – ఆదేశిక సూత్రాలను మొదటి సవరణ ద్వారా చేర్చారు.
డి. ప్రాథమిక హక్కులు సవరించదగినవి అయితే ఆదేశిక సూత్రాలు సవరింపలేనివి.
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి
5. కింది వాటిలో ఆదేశిక సూత్రాలు ఏవి?
ఎ) స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం
బి) జీవనావసరాలు సరిపడినంత
సమానంగా పొందే హక్కు
సి) అంటరానితనం రద్దు
డి) తగిన మానవాత్మక పని పరిస్థితులు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) 3 మాత్రమే
6. కిందివాటిని జతపరచండి.
ఆదేశిక సూత్రాలు అధికారాలు
ఎ) సామ్యవాద 1. 38, 39,
నియమాలు 41, 42, 43
బి) గాంధేయ 2. 44, 45,
నియమాలు 50, 51
సి) ఉదార 3. 40, 46,
మేధాపరమైనవి 47, 48, 49
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-3. సి-1
7. ఆదేశిక సూత్రాలకు జతచేసిన సామ్యవాద భావనలు ఏవి?
ఎ) సంపద కేంద్రీకరణను నిరోధించటం
బి) పనిహక్కు కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయవ్యవస్థను వేరు చేయటం
సి) శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని
నిర్వహించటం
1) ఎ,బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) పైవేవీకాదు
8. కిందివాటిలో ఆదేశిక సూత్రాల్లోని గాంధేయవాద సూత్రాలు ఏవి?
ఎ) గోవధను నియంత్రించటం
బి) కళలను ప్రోత్సహించటం
సి) గ్రామ పంచాయతీలను స్థాపించటం
డి) దేశానికి ఉమ్మడి పౌరస్మృతి
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
9. కిందివాటిని జతపరచండి?
అధికరణ వివరణ
ఎ) 39(A) 1) ప్రజలకు ఉచిత
న్యాయసేవ
బి) 39 (a) 2) ప్రజలకు తగిన
జీవన సదుపాయాల
కల్పన
సి) 39 (b) 3) సంపదను సమష్టిగా వినియోగించుకోవడం
డి) 39 (d) 4) సమానపనికి
సమాన వేతనం
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
10. ఆదేశిక సూత్రాలను నిదానంగా అమలు జరపడానికి గల కారణం.
1) ప్రభుత్వానికి సౌకర్యాలు లేకపోవడం
2) రాజకీయ పార్టీలు ఒప్పుకోకపోవడం
3) దేశ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం
4) పైవన్నీ
11. కింది ఏ కారణంతో ఆదేశిక సూత్రాలను నెమ్మదిగా అమలు చేసే విధానంలో సరైనది కాదు.
1) రాజకీయ అంగీకార కొరత
2) ప్రభుత్వం దగ్గర సరైన ఆధారాలు
లేకపోవడం
3) సమాజం వ్యతిరేకించడం
4) దేశ భూభాగ విస్తీర్ణం అధికంగా ఉండటం వల్ల సమస్యలు అధికవుతున్నాయి.
12. ఆదేశిక సూత్రాల్లో ప్రతిబింబించే సామ్యవాద భావాల ఉద్దేశం ఏమిటి?
1) సంపద కేంద్రీకరణను నియంత్రిస్తూ దేశ భౌతిక వనరుల సమ పంపిణీ
జరిగేలా చూడటం
2) నేత పరిశ్రమలను ప్రోత్సహించటం
3) 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య 4) పైవన్నీ
13. కింది ఏ ఆదేశిక సూత్రం సామాజిక భావన అనే అంశాన్ని ప్రతిబింబిస్తాయి?
1) అందరికీ జీవన భృతిని కల్పించాలి
2) సంపద కేంద్రీకరణను నిషేధించి, సంపదను, వస్తువులను సమానంగా పంచాలి
3) కార్మికులకు ప్రామాణిక జీవన స్థాయిని కల్పించి తగిన విశ్రాంతినివ్వడం
4) పైవన్నీ
14. కింది ఏ ఆదేశిక సూత్రాన్ని వాస్తవ రాజ్యాంగం సవరణ చేసి చేర్చారు?
1) వ్యక్తిగతంగా, సమష్టిగా ఎవరికి కూడా ఆదాయపరంగా, హోదాపరంగా, సౌకర్యాల విషయంలో వ్యత్యాసం చూపరాదు.
2) పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కోసం అడవులను, వన్య సంరక్షణ కేంద్రాలను
అభివృద్ధి చేయాలి.
3) పరిశ్రమ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం
4) పైవన్నీ
15. ఆదేశ సూత్రాలకు న్యాయసంరక్షణ లేదని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోని ప్రకరణ?
1) 36వ ప్రకరణ 2) 39వ ప్రకరణ
3) 37వ ప్రకరణ 4) 38వ ప్రకరణ
16. కిందివాటిని జతపరచండి.
అధికరణ అంశం
ఎ) 47వ అధికరణ 1) కామన్ సివిల్ కోడ్
బి) 44వ అధికరణ 2) మద్యపాన నిషేధం
సి) 40వ అధికరణ 3) గోవధ నిషేధం
డి) 48వ అధికరణ 4) పంచాయతీరాజ్
వ్యవస్థ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
17. భారతదేశంలోని ప్రణాళికలు తమ సిద్ధాంతాలను కింది వాటి నుంచి తీసుకున్నాయి.
1) ప్రవేశిక
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు అదే విధంగా అదేశిక సూత్రాలు 4) పైవేవీకావు
18. అంతర్జాతీయ సంబంధాల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఏది?
1) దేశాల మధ్య తగిన గౌరవ ప్రదమైన
సంబంధాలు కొనసాగించడానికి పనిచేయటం
2) అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల్లోని నింబంధనల పట్ల గౌరవాన్ని చూపటం
3) అంతర్జాతీయ వివాదాలను మధ్య
వర్తిత్వం ద్వారా పరిష్కరించడాన్ని
ప్రోత్సహించడం
4) నిరాయుధీకరణకు పనిచేయటం
19. సమాజ భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలని ఆదేశిక సూత్రాలు అమలు చేయాలని రాజ్యం చట్టాన్ని ఆమోదిస్తే అది
1) 9వ షెడ్యూల్లో ఉంచాలా?
2) ప్రకరణ 14 నుంచి 19 వరకు ఉన్న హక్కులను ఉల్లంఘిస్తే అది చెల్లనిదిగా పట్టించుకోవాలి
3) ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు కొట్టేస్తుందా?
4) ఇది ప్రకరణ 14-19 హక్కులను ఉల్లంఘిస్తే దాన్ని చెల్లనిదిగా పట్టించుకోరాదు
20. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ) న్యాయ సంరక్షణ లేనివి
బి) రాజ్యాంగంలో 35-53 వరకు గల ఆర్టి కల్స్లో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను పేర్కొన్నారు
సి) ఆదేశిక సూత్రాల అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శాసనాలు చేయాలి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
21. కిందివాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది ఏది?
1) ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించారు.
2) ఇవి రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తాయి
3) ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడంలో తోడ్పడతాయి
4) వీటికి న్యాయ సంరక్షణ కలదు
22. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలు ఏవి?
ఎ) ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి
వ్యతిరేక అంశాలు, అయితే ఆదేశిక సూత్రాలు అనుకూల అంశాలు
బి) ప్రాథమిక హక్కులు న్యాయ
సమ్మతమైనవి కానీ ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతమైనవి కాదు
సి) ప్రాథమిక హక్కులు రాజ్యాంగ
ఆధారాన్ని కలిగి ఉంటే ఆదేశిక సూత్రాలు కేవలం ఒడంబడికల ఆధారమైనవి
డి) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు వివాదం వస్తే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
23. నిర్దేశిక నియమాలను రాజ్యాంగం ఎవరికి సమర్పించింది?
1) పౌరులకు 2) సమాజానికి
3) రాజ్యానికి 4) విదేశీయులకు
24. భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేన్ని ఉల్లంఘించినట్లు?
1) సమానత్వపు హక్కు
2) ఆదేశిక సూత్రాలు
3) స్వాతంత్య్రపు హక్కు
4) సంక్షేమ రాజ్య భావన
25. రాజ్యాంగం భారత పౌరులకు ఆర్థిక న్యాయాన్ని దేని ద్వారా హామీ ఇస్తుంది?
1) ఆదేశిక సూత్రాలతో
2) ప్రాథమిక హక్కులతో
3) ప్రాథమిక విధులతో
4) పై అన్నింటితో
26. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఎక్కడ పొందుపరిచారు?
1) ప్రాథమిక విధులు
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు 4) ప్రవేశిక
27. నిరుద్యోగులను, వృద్ధులను రాజ్యం ఆదుకోవాలని ఏ అధికరణలో ప్రస్తావించారు?
1) అధికరణ -43 2) అధికరణ -41
3) అధికరణ -42 4) ఏదీకాదు
28. కింది ఆదేశిక సూత్రాల్లో దేన్ని ఉదారవాద నియమాల (లిబరల్ ప్రిన్సిపుల్స్)కు సంబంధించి సరిగ్గా పేర్కొన లేదు?
1) కార్యనిర్వహణ, న్యాయశాఖను వేరు చేయడం
2) ఉమ్మడి పౌర స్మృతి
3) చార్రితక ప్రదేశాలను అంశాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
4) చిన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి
29. ‘ఆదేశిక సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం విస్మరించలేదు’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
2) కె. సంతానం
3) ఐవర్ జెన్నింగ్స్
4) టి.టి. కృష్ణమాచారి
30. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి దేనికి హామీ ఇస్తుంది?
1) ఆర్థిక సమానత్వం
2) జాతీయ రక్షణ
3) జాతీయ సమగ్రత
4) సమాజంలోని బలహీన వర్గాలకు మద్దతు
31. 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో జత చేసినవి కిందివాటిలో ఏవి?
ఎ) సమాన పనికి సమాన వేతనం
బి) ఉమ్మడి పౌరస్మృతి
సి) చిన్న కుటుంబం
డి) ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి, డి
32. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం
2) ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు చేస్తారు
3) న్యాయ రక్షణ లేనివి
4) ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని పరిమితం చేస్తాయి
33. రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయవాద సూత్రాలు ఏవి?
ఎ. సమాజంలోని బలహీన లేదా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలి
బి) వైద్య అవసరాలకు మినహా
మద్యపానాన్ని నిషేధించాలి.
సి) గ్రామీణ పంచాయతీలు
డి) గ్రామీణ ప్రాంతాల్లో నేత, చిన్న
తరహా పరిశ్రమలు స్థాపించాలి
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
34. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య ప్రాథమిక తేడా ఏమిటి?
1) ప్రాథమిక హక్కులు సహేతుకమైనవి, ఆదేశిక సూత్రాలు నిర్హేతుకమైనవి
2) అన్ని న్యాయస్థానాల్లో, అన్ని కేసుల్లో
ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు
ఆధిపత్యం ఇవ్వబడింది
3) ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతమైనవి కావు 4) ఏదీకాదు
35. ఆదేశిక సూత్రాలు స్వాభావికంగా
1) ప్రభుత్వం నిర్దిష్ట చట్టాలు చేయమని న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు
2) ప్రభుత్వం నిర్దిష్ట అంశాలపై శ్రద్ధ
చూపాలనే ప్రార్థన
3) ప్రభుత్వం నిర్దిష్టమైన పనులు
చేయరాదనే ఉత్తర్వులు
4) ప్రభుత్వం నిర్దిష్టమైన పనులు
చేయాలనే సూచనలు
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?