సమగ్రభావనే వికాసం
-
సీడీపీవో పరీక్షల ప్రత్యేకం
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ వయస్సుల్లో నిర్దేశిత వికాసాన్ని, కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. అందుకే ఒకే రకమైన లక్షణాలు, వికాస రీతి గోచరించే వయస్సునే ఒక దశగా పరిగణిస్తూ మానసిక శాస్త్రవేత్తలు వ్యక్తి జీవితాన్ని వివిధ వికాస దశలుగా వర్గీకరించారు, ఇందులో Elizabeth B. Hurlock వర్గీకరణ అమితంగా ఆమోదం పొందింది.
వ్యక్తి వికాస దశలు
ఎలిజబెత్ హర్లాక్ వ్యక్తి జీవిత కాలాన్ని పది దశలుగా విభజించాడు. అవి
1. జనన పూర్వదశ
ఎ. సంయుక్త బీజదశ
(ఫలదీకరణం నుంచి రెండవ వారం వరకు)
బి. పిండదశ
(రెండవ వారం నుంచి రెండవ నెల వరకు)
సి. భ్రూణదశ
(రెండవ నెల నుంచి జన్మించే వరకు)
2. నవజాత శిశు దశ
(పుట్టుకతో ప్రారంభమై రెండు వారాల వరకు)
3. శైశవ దశ
(2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు)
4. పూర్వబాల్యదశ
(2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు)
5. ఉత్తర బాల్యదశ
(6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు)
6. యవ్వనారంభ దశ
(10 లేదా 12 నుంచి 14 సంవత్సరాల వరకు)
7. కౌమార దశ
(13 లేదా 14 నుంచి 18 సంవత్సరాల వరకు)
8. వయోజన దశ (18 – 40 సంవత్సరాల వరకు)
9. మధ్య వయస్సు (40 – 60 సంవత్సరాల వరకు)
10. వృద్ధాప్యం (60 సంవత్సరాల పైన)
సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరించిన, విశ్వవ్యాప్తంగా ఆమోదించిన జీవిత దశలు
1. శైశవ దశ (0-3 సంవత్సరాలు)
2. బాల్య దశ (4-12 సంవత్సరాలు)
3. కౌమార దశ (13-21 సంవత్సరాలు)
4. వయోజన దశ (21 సంవత్సరాలు దాటిన దశ)
వికాసంలోని వివిధ అంశాలు
వికాసం అనేది సమగ్రమైన భావన, వికాసంలో పలు అంశాలు ఇమిడి ఉంటాయి
1. శారీరక వికాసం
(Physical Development)
2. చలన వికాసం
(Motor Development)
3. భాషా పరమైన వికాసం
(Language Development)
4. ఉద్వేగ వికాసం
(Emotional Development)
5. సామాజిక వికాసం
(Social Development)
6. బౌద్ధిక వికాసం
(Intellectual Development)
7. సంజ్ఞానాత్మక వికాసం
(Cognative Development)
8. నైతిక వికాసం
(Moral Development)
శారీరక అభివృద్ధి (లేదా) శారీరక వికాసం
- శారీరక వికాసం జీవితాంతం కొనసాగదు. వివిధ జీవిత దశల్లో శారీరక వికాసం వివిధ రకాలుగా ఉంటుంది.
- జన్మించిన తర్వాత ఆరు నెలల వరకు శారీరక వికాసం వేగంగా ఉంటుంది.
యవ్వనారంభ దశలో వేగంగా ఉంటుంది. - నిశ్శబ్ధంగా ఉండే పిల్లలు వేగంగా పెరుగుతారు. ఎక్కువ ఉద్వేగాలు కలిగిన పిల్లలు నిదానంగా పెరుగుతారు.
- Multiple Birthలో శారీరక వికాసం నెమ్మదిగా ఉంటుంది
- నవజాత దశలో శిశువు 17 నుంచి 21 ఇంచుల వరకు పొడవు ఉంటాడు.
- 4 నెలల కాలంలో 23 నుంచి 24, ఒక సంవత్సరం నిండేసరికి 28 నుంచి 30 ఇంచులు, 5 ఏళ్లు నుంచి యవ్వనారంభ (Puberty) దశకు వచ్చేవరకు ప్రతి సంవత్సరం 5 ఇంచుల చొప్పున పెరుగుతారు
సాధారణంగా జన్మించినప్పుడు శిశువు సరాసరిగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ంటాడు. (1 పౌండ్ = 0.454 కిలో) - 3 నుంచి 4 ఏళ్ల మధ్యకాలంలో నాడీ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది
- జన్మించిన సమయంలో మెదడు బరువు శిశువు మొత్తం బరువులో సుమారుగా 1/8వ వంతు ఉంటుంది. 15 సంవత్సరాలు నిండే సరికి 1/30వ శాతం వరకు ఉంటుంది.
- యవ్వనారంభ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. యవ్వనారంభ దశనే ‘పుబెర్టీ’ అంటారు. ‘Puberty’ అనే ఆంగ్లపదం ‘Pubertas’ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. Pubertas అంటే Age of Manhood అని అర్థం.
- యవ్వనారంభ దశలోనే లైంగిక హార్మోన్లు అయిన బాలురులో టెస్టోస్టిరాన్, బాలికల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ దశలో ద్వితీయ లైంగిక లక్షణాలు గోచరిస్తాయి. ఇందులో భాగంగా క్షీరగ్రంథులు వృద్ధి ఆరంభమవడం, బాలురలో, బాలికలలో గొంతు మారడం, లైంగిక అవయవాలు వృద్ధి ఆరంభమవుతుంది.
- తొందరగా ప్యుబెర్టీకి వచ్చే వారిని Early Bloomers అని ఆలస్యంగా ప్యుబెర్టీకి వచ్చేవారిని Late Bloomers అని అంటారు.
- 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో మొదటిసారి తాత్కాలిక దంతాలు వస్తాయి. వీటినే పాలదంతాలు అంటారు.
- 9 నెలల వరకు 3 దంతాలు, రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వరకు 20 దంతాలు కనిపిస్తాయి. ఈ సమయం వరకు వచ్చిన దంతాలు పాల దంతాలు వీటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి.
- 6 సంవత్సరాల వరకు 1 లేదా 2 శాశ్వత దంతాలు వస్తాయి. 10 సంవత్సరాల వరకు 14 లేదా 16 శాశ్వత దంతాలు వస్తాయి.
- 13 సంవత్సరాల వరకు 27 నుంచి 28 దంతాలు వస్తాయి
మొత్తం 32 దంతాలు 17 నుంచి 25సంవత్సరాల సమయంలో వచ్చే అవకాశం ఉంది. చివరగా వచ్చే శాశ్వత దంతాన్నే జ్ఞానదంతం అంటారు.
చలన వికాసం
- శరీరంలోని కాళ్లు, చేతులు, ఇతర అవయవాలను దైనందిన అవసరాల నిమిత్తం కావాలసిన రీతిలో వినియోగించుకోగలిగే రీతినే చలన వికాసంగా పరిగణిస్తారు.
- పరిణితి చెందిన ప్రతిచర్యల సహాయంతో, నాడీ వ్యవస్థ సహాయంతో శరీరం మొత్తంపై నియంత్రణ, సమన్వయం కలిగి ఉండటమే చలన వికాసంగా పరిగణిస్తారు.
- తగిన వయస్సు రావడం, పరిణితి రావడం, శిక్షణ కలిగి ఉండటం, అనుకరించడం సరైన పోషణను కలిగి ఉండటం వంటి అంశాలు చలన వికాసంపై ప్రభావం చూపిస్తాయి.
ఉదా : పోలియోటీకా తీసుకోవడం వల్ల చలన వికాసంపై ప్రభావం చూపెట్టవచ్చు. కావున టీకాలు, - వ్యాధుల బారిన పడటం వంటివి కూడా చలన వికాసంపై ప్రభావం చూపిస్తాయి.
l కింది వాటిని చలన వికాస నియమాలుగా పరిగణిస్తారు
1. చలన వికాసం అనేది నాడీ కండర పరిణితిపై ఆధారపడి ఉంటుంది
2. చలన సంబంధింత అంశాలు నేర్చుకోవడం అనేది పరిణితి లేకుండా సాధ్యం కాదు
3. చలన వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి అంటే అందరిలో చలన వికాసం ఒకే రీతిలో ఉండదు.
4. శిశువు నాలుగు నెలలకు వస్తువును పరిశీలిస్తాడు, 5వ నెలలో తాకేందుకు ప్రయత్నిస్తాడు. 8వ నెలకు వస్తువును చేతిలోకి తీసుకోగలుగుతాడు. - 9వ నెలకు వస్తువు పట్టుకోవడంలో పరిణితి ప్రదర్శిస్తాడు.
చలన వికాసంలో ముఖ్యమైన మైలురాళ్లు
- 3 నెలలకు సామాజిక నవ్వు చూపెడతారు
- 4 నెలలకు కనుల సమన్వయం కనిపిస్తుంది
- 2 నెలలకు పక్కకు, వెనక్కు మరలుతారు
- 4 నెలలకు వెనుక నుంచి పక్కకు మరలుతారు
- 6 నెలలకు మొత్తంగా Trunkని Bend చేస్తారు
- 2 సంవత్సరాలకు విసర్జనపై నియంత్రణ తెచ్చుకుంటారు
- 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో మూత్రాశయంపై నియంత్రణ వస్తుంది
- ఒక నెల వయస్సు వచ్చేసరికి బొటన వేలును నోటిలో పెట్టుకుంటారు
- 8 నెలలకు సహాయంతో నిలబడగలుగుతారు.
- 11 నెలలకు సహాయం లేకుండా నిలబడగలుగుతారు
- 11 నెలలకు సహాయం ఉంటే నడవగలుగుతారు
- 14 నెలలకు సహాయం లేకుండా నడిచే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది
- 9 నెలలకు పాకడం చేస్తాడు
- అనుకరణ, యత్నదోషం, శిక్షణతో శిశువు చలన వికాసం అభ్యసిస్తాడు.
సామాజిక వికాసం
- సమాజ అంచనాలకు, ప్రమాణాలకు అనుగుణంగా, బృందజీవనం, సామాజిక పాత్రలను నిర్వహించడం, కలిసి జీవించడం, పరస్పర సహాయ సహకారాలు అందించటం, తీసుకోవడం, చూపించడం అనే వాటినే సామాజిక వికాసం అంటారు.
- ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం సామాజిక సంబంధాల్లో పరిణతి సాధించడమే సామాజిక వికాసం.
- సామాజిక వికాసంలో సామాజిక సంబంధాలు, పరస్పర అవగాహన, సహకారం, సామాజిక విలువలు అలవర్చుకోవడం సంప్రదాయాలు, ఆచారాలు అలవర్చుకోవడం, సామాజిక సంస్థలకు అనుగుణంగా ప్రవర్తించడం వంటి అంశాలుంటాయి.
- బాల్య దశలో ఏర్పడిన సామాజిక అనుభవాలు సామాజిక వికాసంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
- జన్మించిన శిశువు మనస్సును అరిస్టాటిల్ టబులరస అని పిలిచాడు. అంటే ఏమీ రాయని నల్ల బల్ల అని అర్థం.
- కుటుంబంలో, పాఠశాలలో, మిత్రులలోనూ ఇలా వివిధ సామాజిక సందర్భంలో శిశువు వివిధ సామాజిక అంశాలను అభ్యసిస్తాడు. దీన్నే ‘సామాజీకరణ’ అంటారు.
- సామాజీకరణ జీవితాంతం కొనసాగే ప్రక్రియ. శిశువు సామాజీకరణలో తల్లి, కుటుంబం అమితమైన ప్రభావాన్ని చూపిస్తారు.
సామాజిక వికాసం కలిగిన వ్యక్తిలో ఈ లక్షణాలుంటాయి. అవి
- సహకార భావన/స్వభావం, ఇతరులను గౌరవించడం, సమూహ జీవనం, బాధ్యతలు స్వీకరణ, నిర్వహణ, బృంద కార్యక్రమాల్లో పాల్గొనడం, సామాజిక క్రమాన్ని పాటించడం. స్వీయ, సామాజిక భావనలను కలిగి ఉండటం, సమూహ అనుభవాలకు ప్రయత్నించడం, సమన్వయం కలిగి ఉండటం.
- వ్యక్తి జీవిత చక్రంలో వివిధ రకాల సాంఘిక వికాస కార్యక్రమాల్లో కనిపిస్తాయి.
- స్వయం కేంద్రీకృతంగా ఉన్న శిశువు క్రమక్రమంగా సమాజంలో సభ్యుడవుతాడు.
- 3 నెలల సమయంలో తల్లిని గుర్తుపట్టి నవ్వుతాడు. ఇదే సమాజిక వికాసానికి తొలి నాందిగా భావించవచ్చు.
- జెర్రెల్ ప్రకారం శిశువు తొలి సాంఘిక ప్రవర్తన మూడు దశల్లో కనిపిస్తుంది
1. మొదటి దశ – ఏకాంత క్రీడ – శైశవ దశ
2. రెండవ దశ – సమాంతర క్రీడ – 2 నుంచి 3 సంవత్సరాలు
3. మూడవ దశ – సహకార క్రీడ – 3 నుంచి 4 సంవత్సరాలు - భవిష్యత్తు సామాజీకరణకు చెందిన పునాదులు బాల్యదశలోనే పడతాయి. బాల్యదశ సామాజిక వికాసానికి సంబంధించి చాలా కీలకమైంది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ,
సోషియాలజీ డిపార్ట్మెంట్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు