32వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఎప్పుడు ఆమోదించింది?
తెలంగాణ చరిత్ర
1. తెలంగాణ పరిరక్షణ దినంగా ఏ రోజున పాటించారు?
1) 10 జూలై 1968
2) 10 ఆగస్టు 1968
3) 10 సెప్టెంబర్ 1968
4) 10 అక్టోబర్ 1968
2. జీవో 36 ను జారీ చేసిన సంవత్సరం?
1) 1969 2) 1970
3) 1971 4) 1972
3. జీవో 36ను జారీ చేసిన ముఖ్యమంత్రి?
1) పీవీ నరసింహారావు
2) కాసు బ్రహ్మానందరెడ్డి
3) నీలం సంజీవరెడ్డి
4) వెంగళరావు
4. ఆరు సూత్రాల పథకాన్ని చట్టబద్ధం చేస్తూ ఏ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఆమోదించింది?
ఎ) 31 బి) 42 3) 32 4) 44
5. జీవో 674 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు?
1) 4 2) 5 3) 6 4) 7
6. కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని 6 జోన్లుగా
విభజించారు.
బి) 1, 2, 3 జోన్లు కోస్తాంధ్ర, 4వ జోన్ రాయలసీమ ప్రాంతానికి చెందినది
సి) 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంతానికి చెందినవి
డి) రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ 6వ జోన్‌కు చెందుతుంది.
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) అన్నీ సరైనవే
7. ఎన్.టి. రామారావు నియమించిన త్రిసభ్య కమిటీ చైర్మన్?
1) జయభారత్ రెడ్డి 2) కమల్‌నాథన్
3) ఉమాపతి 4) పై ఎవరూకాదు
8. ఎన్టీ రామారావు నియమించిన త్రిసభ్య కమిటీకి చెందినవారు?
1) జయభారత్‌రెడ్డి 2) కమల్‌నాథన్
3) ఉమాపతి 4) పైవారందరూ
9. జీఎస్ఆర్ 524 (ఇ)ను ఏ తేదీన రాష్ట్రపతి జారీ చేశారు?
1) 18 అక్టోబర్ 1975
2) 18 నవంబర్ 1975
3) 1 నవంబర్ 1975
4) 1 జూలై 1974
10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 729ని ఎప్పుడు జారీ చేసింది?
1) 1 జూలై 1974
2) 18 అక్టోబర్ 1975
3) 1 నవంబర్ 1975
4) 15 నవంబర్ 1975
11. ఎన్టీ రామారావు నియమించిన త్రిసభ్య కమిటీ ఎన్ని పేజీలు నివేదికను సమర్పించింది?
1) 36 2) 46 3) 56 4) 62
12. 610 జీవోను ఎప్పుడు జారీ చేశారు?
1) 18 అక్టోబర్ 1975
2) 1 నవంబర్ 1975
3) 30 డిసెంబర్ 1985
4) 31 మార్చి 1986
13. 610 జీవోను జారీ చేసిన ముఖ్యమంత్రి?
1) కాసు బ్రహ్మానందరెడ్డి
2) ఎన్.టి. రామారావు
3) నీలం సంజీవరెడ్డి
4) పై ఎవరూ కాదు
14. గిర్గ్లానీ కమిషన్ ఎన్ని పేజీల నివేదికను సమర్పించింది?
1) 750 2) 650
3) 850 4) 950
15. గిర్గ్లానీ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి?
1) కాసు బ్రహ్మనంద రెడ్డి
2) ఎన్.టి. రామారావు
3) చంద్రబాబు నాయుడు
4) వెంగళరావు
16. ముల్కీ నిబంధనలకు భారత రాజ్యాంగం చట్టబద్ధత కల్పించిన సంవత్సరం?
1) 1957 2) 1958
3) 1959 4) 1960
17. రాజ్యాంగంలోని ఏ నిబంధన అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 813 జీవోను జారీ చేసింది?
1) 308 2) 309
3) 310 4) 311
18. జీవో నెంబర్ 36ను రాజ్యాంగంలోని ఏ నిబంధనకు వ్యతిరేకమని కొట్టి వేశారు?
ఎ) 16(1) 2) 16(2)
3) 16(3) 4) 15(1)
19. పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం?
1) 1971 2) 1972
3) 1973 4) 1974
20. ముల్కీ నిబంధనలు చట్టబద్దమేనని 1972లో ప్రకటించినప్పడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
1) ఎ.ఎన్. రాయ్ 2) ఎస్.ఎం. సిక్రీ
3) ఐ.డి. దువా 4) డి.జి.పాలేకర్
21. 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టంలోని ఏ సెక్షన్ తెలంగాణలో ఉద్యోగాలకు కొత్త నివాస అర్హత విధించింది?
1) 1 2) 2 3) 3 4) 4
22. పంచసూత్ర పథకాన్ని భారత పార్లమెంట్ ఎప్పడు ఆమోదించింది?
1) 23 డిసెంబర్ 1972
2) 23 జనవరి 1973
3) 23 ఫిబ్రవరి 1973
4) 23 మార్చి 1973
23. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు ముల్కీలు కాదని, తెలంగాణకు వలస వచ్చి స్థిరపడ్డవారే ముల్కీలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఎప్పుడు చెప్పింది?
1) 17 ఫిబ్రవరి 1973
2) 17 మార్చి 1973
3) 17 ఏప్రిల్ 1973 4) 17 మే 1973
24. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు?
1) 18 డిసెంబర్ 1972
2) 18 ఫిబ్రవరి 1973
3) 18 జనవరి 1973
4) 18 మార్చి 1973
25. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ఆగిపోయింది?
1) అక్టోబర్ 1973 2) నవంబర్ 1973
3) డిసెంబర్ 1973 4) జనవరి 1974
26. రాజ్యాంగానికి ఏ ఆర్టికల్ జత చేయడం ద్వారా 6 సూత్రాల పథకం రాజ్యాంగబద్దం చేశారు?
1) 371 (డి) 2) 371 (ఇ)
3) 1, 2 4) పైవేవీకావు
27. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు తొలగించారు?
1) 10 డిసెంబర్ 1973
2) 10 జనవరి 1974
3) 10 ఫిబ్రవరి 1974
4) 10 మార్చి 1974
28. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పడు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) 6 మార్చి 1978
బి) 6 ఏప్రిల్ 1975
సి) 6 మార్చి 1975
డి) 6 జూన్ 1975
29. 32వ రాజ్యాంగ సవరణ ఆధారంగా వెలువ డిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నివాసార్హతను ఎన్ని సంవత్సరాలకు పరిమితం చేశారు?
1) 15 2) 12 3) 4 4) 5
30. తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏ పథకం ఆధారంగా రద్దు చేశారు?
1) అష్ట సూత్ర పథకం
2) ఆరు సూత్రాల పథకం
3) పంచ సూత్ర పథకం 4) పైవేవీకావు
31. 32వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఎప్పుడు ఆమోదించింది?
1. 23 డిసెంబర్ 1973
2. 23 జనవరి 1974
3. 23 ఫిబ్రవరి 1974
4. 23 మార్చి 1974
32. 32వ రాజ్యాంగ సరవణ బిల్లుకు లోక్‌సభలో వచ్చిన అనుకూల వ్యతిరేక ఓట్లు?
1) 311-18 2) 311-8
3) 301-8 4) 320 -10
33. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ నిబంధనను సవరించారు?
1) 371 2) 372
3) 373 4) 374
34. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) 32వ రాజ్యాంగ సరవణ ద్వారా 7వ షెడ్యూల్ మొదటి జాబితాలోని 63వ అంశాన్ని సవరించారు.
బి) ఈ సవరణ బిల్లుపై 3 మే 1974న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
సి) ఈ సవరణ చట్టం 1. జూలై 1974 నుంచి అమల్లోకి వచ్చింది.
1) ఎ 2) బి 3) సి 4) అన్ని సరైనవి
35. జీవో. 729 ప్రకారం సరైనవి ఏవి?
ఎ) ఎల్డీసీ స్థాయికి సమానమైన ఉద్యోగాలను జిల్లాస్థాయిలో హైదరాబాద్‌లో 80 శాతం స్థానికులకు కేటాయించారు.
బి) రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకు రిజర్వ్ చేశారు.
సి) జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాల్లో 60 శాతం స్థానికులకు రిజర్వ్ చేశారు.
1) ఎ 2) బి
3) సి 4) అన్నీసరైనవే
36. జీవో 720లోని ఏ పేరా ప్రకారం హైదరాబాద్, ఆరో జోన్లోకి వస్తుంది?
1) 14 2) 19 3) 9 4) 12
37. జీవో 720లోని ఏ పేరా ప్రకారం స్థానిక వ్యక్తి అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధి?
1) 19 2) 9 3) 14 4) 8
38. ముల్కీ నిబంధనలు చట్టబద్దమేనని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది?
1) 2 జవనరి 1972
2) 2 మార్చి 1972
3) 3 ఆగస్టు 1972
4) 2 అక్టోబర్ 1972
39. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా గుర్తించిన నిబంధన?
1) 4 (ఎ) 2) 14 (బి)
3) 14 (ఎ) 4) 14 (ఎఫ్)
40. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి గిర్గ్లానీ కమిషన్ పేర్కొన్న వాటిలో సరైనది ఏది?
ఎ) రాష్ట్రపతి ఉత్తర్వులు 126 విధాలుగా ఉల్లంఘనకు గురయ్యాయి
2) ఈ ఉల్లంఘనలను 18 రకాలుగా
వర్గీకరించింది
3) 35 పరిష్కార మార్గాలు సూచించింది
1) ఎ 2) బి 3) సి
4) అన్నీ సరైనవే
41. జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం 30 జూన్ 1961 నాటికి తెలంగాణలో స్థానికేతరుల సంఖ్య?
1) 58, 962 2) 59,400
3) 64,531 4) 78,469
42. 30 జూన్ 1981 నాటికి స్థానికేతరులు అత్యధికంగా ఉన్న రెండవ జిల్లా?
1) ఖమ్మం 2) హైదరాబాద్
3) నల్లగొండ 4) మెదక్
43. 610 జీవోకి సంబంధించి సరైనది ఏది?
ఎ) ఈ జీవోపై ప్రధాన కార్యదర్శి
శ్రావణ్‌కుమార్ సంతకం చేశారు
బి) ఈ ప్రభుత్వ ఉత్తర్వుల్లో 6 నిబంధనలు కలవు
సి) 5వ నిబంధనలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన ఒప్పందం ఫలితంగా అమలు చేయాల్సిన 13 అంశాలు కలవు
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) సి మాత్రమే 4) అన్నీ సరైనవే
44. గిర్గ్లానీ కమిషన్‌ను ఎప్పడు నియమించారు?
1) 25 జూన్ 2001 2) 25 జూలై 2001
3) 25 ఆగస్టు 2001
4) 25 సెప్టెంబర్ 2001
45. గిర్గ్లానీ కమిషన్ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది?
1) 30 సెప్టెంబర్ 2004
2) 30 అక్టోబర్ 2004
3) 30 నవంబర్ 2004
4) 30 డిసెంబర్ 2004
46. గిర్గ్లానీ కమిటీకి సంబంధించి సరైంది ఏది?
ఎ) మొదటి సంపుటిలో 1975 నుంచి ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
బి) రెండో సంపుటిలో సేకరించిన
సమాచారాన్ని అనుబంధాల రూపంలో పొందుపరిచారు
సి) మూడో సంపుటిలో సెప్టెంబర్ 2004 వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లోని సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేశారు.
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
47. గిర్గ్లానీ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అంశాలను ఎన్ని అధ్యాయాల్లో సమగ్రంగా తెలిపింది?
1) 10 2) 11 3) 13 4) 15
48. హైదరాబాద్ ఫ్రీ జోన్, ఏడో జోన్ అని నియామకాలు జరిపి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని గిర్గ్లానీ కమిషన్ ఏ అధ్యాయంలో తెలిపింది?
1) 7 2) 8 3) 9 4) 10
49. గిర్గ్లానీ కమిషన్‌కు సంబంధించి సరైనది ఏది?
ఎ) మొదటి అధ్యాయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై సిద్ధాంత పరంగా
ఆచరణాత్మకంగా వివిధ శాఖల ఉదాసీన
వైఖరిని పేర్కొన్నారు
బి) రెండో అధ్యాయంలో శాఖాధిపతుల కార్యాలయాలను 2004 సంవత్సరానికి 200లకు పైగా పెంచారని పేర్కొన్నారు.
సి) మూడో అధ్యాయంలో జోనల్‌స్థాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అంశాన్ని
వివరించారు.
డి) అయిదో అధ్యాయంలో జిల్లా పోస్టులను జోనల్ పోస్టులుగా జోనల్ పోస్టులను రాష్ట్రపోస్టులుగా మార్చారని పేర్కొన్నారు
1) ఎ 2) బి 3) సి, డి డి) పైవన్నీ
50. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా జీవో 610 విడుదలైంది?
1) జయభారత్‌రెడ్డి కమిటీ
2) సుందరేశన్ కమిటీ
3) లలిత్ కమిటీ 4) 1, 2
51. జీవో 610 ప్రకారం తెలంగాణలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన నాన్ లోకల్ ఉద్యోగులను ఎప్పటిలోగా పంపించాలి?
1) 18 అక్టోబర్ 1975
2) 30 డిసెంబర్ 1985
3) 31 మార్చి 1986 4) పైవేవీకావు
52. గిర్గ్లానీ కమిషన్ నివేదికకు సంబంధించి సరైనది?
ఎ) నాలుగో అధ్యాయంలో హడా, కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో స్థానిక రిజర్వేషన్లు పాటించలేదని పేర్కొన్నది.
బి) ఆరో అధ్యాయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పేరా 5(2)లో గల వెసులుబాటు ను దుర్వినియోగపరిచారని పేర్కొన్నది.
సి) ఏడో అధ్యాయంలో రాష్ట్రపతి ఉత్తర్వులోని 14(ఇ) పేరా ఆధారంగా జరిపిన ఉల్లంఘనలు ప్రస్తావించారు.
డి) ఎనిమిదో అధ్యాయంలో నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చారని పేర్కొన్నది.
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) అన్నీ సరైనవే
విజేత కాంపిటీషన్స్
హైదరాబాద్ , 9963293399
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?