పూర్తి భారతీయ యాజమాన్యంతో ఏర్పడిన తొలి బ్యాంకు?
- ఎకానమీ
1. ప్రపంచంలో మొదటిసారి ద్రవ్యాన్ని కాగిత రూపంలో ఉపయోగించినవారు?
1) జపాన్ 2) స్వీడన్
3) బ్రిటన్ 4) చైనా
2. ఏ సంవత్సరంలో మనదేశంలో మొదటిసారి ద్రవ్యాన్ని కాగితరూపంలో ఉపయోగించారు?
1) 1856 2) 1806
3) 1757 4) 1824
3. భారతదేశంలో రూపియా పేరుతో మొదటిసారిగా వెండి రూపాయి నాణేన్ని ముద్రించినది ఎవరు?
1) జహంగీర్ 2) షేర్షా
3) హుమాయున్ 4) అక్బర్
4. ఏ సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం రూపీ పేరుతో కరెన్సీని ప్రవేశపెట్టింది?
1) 1834 2) 1857
3) 1858 4) 1934
5. నోట్ల ముద్రణలో భద్రతా దారాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
1) 1940 2) 1935
3) 1955 4) 1938
6. కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఎ. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. విదేశాల్లో అధిక బ్రాంచ్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేసింది
సి. భారతదేశంలో అతిపెద్ద రెండో వాణిజ్య బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి. మహాత్మగాంధీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముంబైలో ఏర్పాటు చేశారు
1) 1, 2 2) 2, 3
3) 1, 3 4) పైవన్నీ
7. భారతదేశంలో మొదటిసారి రూపాయి విలువను ఎప్పుడు తగ్గించారు?
1) 1949 2) 1966
3) 1951 4) 1956
8. 1 ఏప్రిల్ 1957 నుంచి నూతన దశాంశ పద్ధతి అమలులోకి వచ్చిన తొలిసారిగా 1 పైసా నాణేన్ని ఎప్పుడు విడుదల చేశారు?
1) 1957 2) 1959
3) 1962 4) 1967
9. కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం ఏటా ఎంత వ్యయం చేస్తుంది?
1) రూ.2,872 కోట్లు
2) రూ.2,562 కోట్లు
3) రూ.3,232 కోట్లు
4) రూ.4,326 కోట్లు
10. భారతదేశంలో అత్యంత విలువ గల కరెన్సీ రూ.10,000 నోటును తొలిసారి ఎప్పుడు ముద్రించారు?
1) 1938 2) 1946
3) 1950 4) 1952
11. 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ ఎంత?
1) రూ.24,20,975 కోట్లు
2) రూ.24,20,463 కోట్లు
3) రూ.28,26,863 కోట్లు
4) రూ.25,22,863 కోట్లు
12. భారత రూపాయికి విశిష్ట చిహ్నాన్ని రూపొందించింది ఎవరు?
1) ఉదయ్ కుమార్ 2) రంజిత్ కుమార్
3) ఉమేశ్ కుమార్ 4) రణబీర్ అక్బర్
13. భారత రూపాయికి విశిష్ట చిహ్నాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2010 జూలై 15 2) 2015 జూన్ 10
3) 2010 జూలై 5 4) 2010 జూన్ 5
14. ప్రపంచంలో కరెన్సీ చిహ్నంగా ఉన్న ఎన్నో ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది?
1) 4 2) 8 3) 3 4) 5
15. భారతదేశంలో అధిక విలువ గల కరెన్సీ నోట్లను మొదటిసారిగా ఎప్పుడు రద్దు చేశారు?
1) 1945 2) 1949
3) 1951 4) 1946
16. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఎప్పుడు రద్దు చేసింది?
1) 2016 నవంబర్ 18
2) 2016 అక్టోబర్ 18
3) 2016 నవంబర్ 8
4) 2018 నవంబర్ 8
17. ప్రపంచంలో అతి ప్రాచీనమైన రిక్స్ బ్యాంక్ ఏ దేశానికి చెందినది?
1) స్వీడన్ 2) నార్వే
3) బ్రిటన్ 4) జర్మనీ
18. ప్రతి వాణిజ్య బ్యాంకు తన మొత్తం ఆస్తుల్లో కొంత ఆస్తిని తన దగ్గర నిల్వ ఉంచుకోవడాన్ని ఏమంటారు?
1) చట్ట బద్ధ ద్రవ్య పరపతి
2) నగదు నిల్వల నిష్పత్తి
3) బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు
4) పైవన్నీ
19. భారతదేశంలో 1770లో మొదటిసారి బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముంబై 2) ఢిల్లీ
3) చెన్నై 4) కోల్‌కతా
20. భారతదేశంలో రిజర్వు బ్యాంకును ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు?
1) సి.డి. దేశ్‌ముఖ్ 2) మహల్నోబిస్
3) హిల్టన్ యంగ్ కమిషన్
4) సి. సుబ్రమణ్యం
21. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. రిజర్వు బ్యాంకు 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు
బి. రిజర్వు బ్యాంకును 1949 జనవరి 1న జాతీయం చేశారు
సి. రిజర్వు బ్యాంకు మొదటి గవర్నర్ ఓస్బర్న్ స్మిత్
డి. ప్రస్తుత రిజర్వు బ్యాంకుకు 25వ గవర్నర్ శక్తికాంతదాస్
1) ఎ, బి, డి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
22. రిజర్వు బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1935 ఏప్రిల్ 15 2) 1935 ఏప్రిల్ 1
3) 1932 మార్చి 31 4) 2010 మార్చి 1
23. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) కోల్‌కతా
3) ముంబై 4) చెన్నై
24. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు?
1) 5 2) 4 3) 3 4) 6
25. ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) స్వీడన్ 2) అమెరికా
3) ఇటలీ 4) బ్రిటన్
26. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. రిజర్వు బ్యాంకుకు అత్యధిక కాలం పని చేసిన గవర్నర్ బెనగల్ రామారావు (7 సంవత్సరాల 197 రోజులు)
బి. రిజర్వు బ్యాంకుకు అత్యల్ప కాలం పనిచేసిన గవర్నర్ అమిత్ ఘోష్ (20 రోజులు)
సి. రిజర్వు బ్యాంకుకు మొదటి భారతీయ గవర్నర్ సి.డి. దేశ్‌ముఖ్
డి. రిజర్వు బ్యాంకుకు పనిచేసిన తెలుగు గవర్నర్లు వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు
1) ఎ, బి, డి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
27. పూర్తి భారతీయ యాజమాన్యంతో ఏర్పడిన తొలి బ్యాంకు ఏది?
1) ఆంధ్రా బ్యాంకు
2) పంజాబ్ నేషనల్ బ్యాంకు
3) అవధ్ బ్యాంకు
4) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
28. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 1957 నుంచి మనదేశంలో దశాంశ
పద్ధతిని ప్రవేశపెట్టారు
బి. 1957 నుంచి దేశంలో నోట్ల జారీ కనీస నిల్వల పద్ధతిని అవలంబిస్తున్నారు
సి. భారత ప్రామాణిక ద్రవ్యం రూపాయిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది
డి. రూపాయి నోటుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం, మిగతా నోట్లపై రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
29. దేశంలో ద్రవ్య విధానాన్ని రూపొందించింది ఎవరు?
1) రిజర్వు బ్యాంకు 2) నీతి ఆయోగ్
3) ఆర్థిక మంత్రి 4) కేంద్ర ఆర్థిక శాఖ
30. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. కేంద్ర ప్రభుత్వం 1992లో ద్రవ్యత్వ సర్దుబాటు కింద రెపోను ప్రవేశపెట్టింది
బి. రిజర్వు బ్యాంకు దగ్గర వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలానికి తీసుకున్న రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు
సి. రెపో అనేది స్వల్పకాలానికి సంబంధించినది (ఒక రోజు నుంచి 14 రోజుల వరకు)
డి. ప్రస్తుత రెపో రేటు 5.90 శాతం
1) ఎ, బి, డి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
31. భారత రిజర్వు బ్యాంకు ఆర్థిక సంవత్సరం?
1) ఏప్రిల్ 1 నుంచి మార్చి 31
2) జూలై 1 నుంచి జూన్ 30
3) జనవరి 1 నుంచి డిసెంబర్ 31
4) మార్చి 1 నుంచి ఫిబ్రవరి 28
32. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. రిజర్వు బ్యాంకు రివర్స్ రెపోరేటును 1996లో ద్రవ్యత్వ సర్దుబాటు కింద ప్రవేశపెట్టింది
బి. వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు దగ్గర ఉంచిన ద్రవ్యంపై చెల్లించే వడ్డీ రేటు
సి. ప్రస్తుత రివర్స్ రెపోరేటు 3.35 శాతం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) పైవన్నీ
33. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం
బి. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను 2016 డిసెంబర్ 30 వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది
సి. 2016 నవంబర్ 8న చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల వాటా శాతం 86
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవి
34. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2016 నవంబర్ 4 వరకు చలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు
బి. 2022 అక్టోబర్ నాటికి చలమాణిలో ఉన్న నగదు రూ.30.88 లక్షల కోట్లు
సి. 2016తో పోల్చితే 2022లో నగదు చలామణి 72 శాతం పెరిగింది
1) ఎ 2) బి
3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
35. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2022 అక్టోబర్ నాటికి 141 మంది ప్రజల వద్ద ఉన్న నగదు రూ.30.88 లక్షల కోట్లు
బి. 2017-18లో జీడీపీలో నగదు నిష్పత్తి 10.7 శాతం
సి. 2020-21లో జీడీపీలో నగదు నిష్పత్తి 14.4 శాతం
1) ఎ 2) బి
3) ఎ, సి 4) పైవన్నీ సరైనవి
36. మన దేశంలో రిజర్వు బ్యాంకు కొత్తగా రూ.2000 నోట్లను ఎప్పుడు అమల్లోకి తెచ్చింది?
1) 2016 నవంబర్ 18
2) 2016 అక్టోబర్ 18
3) 2016 నవంబర్ 10
4) 2018 నవంబర్ 8
37. భారతదేశంలో అధిక విలువ గల కరెన్సీ నోట్లు రూ. 1000, రూ.5000, రూ.10,000 ను తిరిగి ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1954 2) 1950
3) 1952 4) 1956
38. భారతదేశంలో అధిక విలువ గల కరెన్సీ నోట్లు రూ.1000, రూ.5,000, రూ.10,000ను తిరిగి మొరార్జీ దేశాయ్ ఎప్పుడు రద్దు చేశారు?
1) 1977 2) 1976
3) 1978 4) 1979
39. ప్రస్తుత కరెన్సీ నోటు వెనుక భాగంలో ఉన్న లాంగ్వేజ్ ప్యానల్‌పై భారత రాజ్యాంగం గుర్తించిన ఎన్ని భాషల్లో కరెన్సీ విలువను రాశారు?
1) 22 2) 18 3) 19 4) 17
40. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1 రూపాయి నోట్‌ను ఎప్పుడు ముద్రించారు?
1) 1948 2) 1947
3) 1949 4) 1950
41. ప్రస్తుతం అత్యధికంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోటు ఏది?
1) 500 2) 2000
3) 100 4) 200
42. భారతదేశంలో సర్క్యులేషన్లో ఉన్న నాణేల్లో ఏవి అధికంగా ఉన్నాయి?
1) 1 రూపాయి 2) 2 రూపాయలు
3) 5 రూపాయలు 4) 10 రూపాయలు
43. రూపాయి నోట్‌పై ఎవరి సంతకం ఉంటుంది?
1) ఆర్థిక మంత్రి
2) ఆర్థిక శాఖ కార్యదర్శి
3) నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
4) రిజర్వు బ్యాంకు గవర్నర్
44. ఏ సంవత్సరం నుంచి అన్ని రకాల కరెన్సీ నోట్ల వెనుకభాగంపై ముద్రిత సంవత్సరం ఉంటుంది?
1) 2006 2) 2008
3) 2002 4) 2005
45. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశం జీడీపీ ఎంత?
1) 4.3 లక్షల కోట్ల డాలర్లు
2) 5.2 లక్షల కోట్ల డాలర్లు
3) 3.96 లక్షల కోట్ల డాలర్లు
4) 3.4 లక్షల కోట్ల డాలర్లు
46. మోర్గాన్ స్టాన్లీ భారతదేశానికి సంబంధించి సరైనవి ఏవి? (డౌట్)
ఎ. భారత్ జీడీపీ వచ్చే ఏడేళ్లలో మరో 3 లక్షల కోట్ల డాలర్లు పెరగనుంది
బి. భారత్ ఏటా తన జీడీపీని 400 బిలియన్ డాలర్లు జత చేయవచ్చు
సి. 2027 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారవచ్చు
డి. 20232 కల్లా భారత్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవి
47. రిజర్వు బ్యాంకు రూ.2000 నోట్ల ముద్రణ ఎప్పటి నుంచి నిలిపివేసింది?
1) 2017 2) 2018
3) 2019 4) 2020
48. డాక్టర్ భోగరాజు పట్టాభిరామయ్య ఆంధ్రా బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1920 2) 1921
3) 1923 4) 1922
49. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు?
1) రాజమన్నార్ 2) రంగరాజన్ కమిటీ
3) నరసింహం కమిటీ
4) సరయూ కమిటీ
50. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1972 2) 1975
3) 1976 4) 1978
- Tags
- economy
- India
- nipuna
- Study material
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు