తొలి రాతియుగ సంస్కృతి ఆధారమైన ఆర్థిక వ్యవస్థ?
ప్రాచీన భారతదేశ చరిత్ర-2
(డిసెంబర్ 7 తరువాయి)
40. ప్రాచీన భారతీయ సంగీతంలోని నిచ్చెన శ్రేణిలో స, రి, గ, మ, ప, ద, ని అనే ఏడు ధ్వనులున్నాయి. ఇవి సంకేత చిహ్నాలు మాత్రమే. ఇందులోని మొదటి మూడు సంకేత చిహ్నాలైన స, రి, గ లను పూర్తిగా పేర్కొనండి.
1) షడ్జ్జ, రేవన, గాంధారీ
2) సాధన, రిషభ, గంపన
3) సమీర, రాజస, గుణాధి
4) షడ్జ, రిషభ, గాంధార
41. బౌద్ధమత శాఖలన్నీ మూల సూత్రాలుగా అంగీకరించే ‘నాలుగు ఉత్తమ సత్యములు’ ‘ఎనిమిది ఉత్తమ మార్గములు’ ఎందులో నిక్షిప్తం చేశారు?
1) వినయ పీఠికలో
2) అభిదమ్మ పీఠికలో
3) దమ్మచక్ర ప్రవర్తన సుత్తలో
4) దిఘనికాయలో
42. ప్రాచీన భారతదేశంలో కింది ఏ వంశపు రాజులు ‘దేవ పుత్ర’ అనే బిరుదును పెట్టుకున్నారు?
1) మౌర్యులు 2) గుప్తులు
3) హోయసాలులు 4) కుషాణులు
43. క్రీ.పూ. 317లో వాయవ్య భారతాన్ని వదిలివెళ్లిన అలెగ్జాండర్ సేనానుల్లో చివరివాడు?
1) యూడమస్ 2) ఆంటియోకస్
3) సెల్యూకస్ నికేటర్
4) మీనాండర్
44. బుద్ధుడైన సిద్దార్థుని గోత్రం?
1) గౌతమ 2) శాక్య
3) లుంబిని 4) అనావతప్త
45. జైనులు తమ ప్రథమ తీర్థంకరుడు రిషభ దేవుడు ఎక్కడ నిర్యాణం చెందాడని విశ్వసిస్తారు?
1) శ్రావణ బెళగోళలో
2) కైలాస పర్వత శిఖరం వద్ద
3) సారనాథ్ 4) గయలో
46. ఏ ప్రాంతం అధ్యయనం చేయడానికి కల్హణుడి ‘రాజతరంగిణి’ గ్రంథం ఉపయోగపడుతుంది?
1) ప్రాచీన కామరూపం
2) మౌర్యుల అనంతర మగధ
3) మధ్యకాలిక రాజస్థాన్
4) మధ్యకాలిక కశ్మీర్
47. ‘పురుష సూక్త’ను తెలిపేది?
1) మనుస్మృతి 2) అధర్వణ వేదం
3) భగవద్గీత 4) రుగ్వేద
48. ప్రముఖ చైనా యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని ఎవరి కాలంలో సందర్శించారు?
1) అశోక 2) చంద్రగుప్త-1
3) చంద్రగుప్త-2 4) కనిష్క
49. భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణేలు ప్రవేశపెట్టింది?
1) ఇండో-గ్రీకులు 2) కుషాణులు
3) గుప్త వంశీయులు 4) మౌర్యులు
50. ప్రాచీన మానవుడు మొదట నేర్చుకుంది?
1) నిప్పు చేయుట
2) జంతువులను మచ్చిక చేసుకోవటం
3) చక్రాన్ని తయారు చేయటం
4) ధాన్యాన్ని పండించడం
51. పాతరాతి యుగం నాటి వ్యక్తుల ప్రధాన వృత్తి?
1) వ్యవసాయం
2) పశుపోషణ
3) చేపలు పట్టడం
4) వేట, ఆహార సేకరణ
52. తొలి బౌద్ధ సాహిత్యం అధికంగా ఏ భాషలో రచించారు?
1) సంస్కృతం 2) ప్రాకృతం
3) పాళీ 4) పైవన్నీ
53. ఏ వంశాల రాజులను, రాజ్యాలను సంగం సాహిత్యం వర్ణించింది?
1) ఉత్తర భారత 2) పశ్చిమ భారత
3) దక్షిణ భారత 4) తూర్పు భారత
54. తొలి రాతియుగ సంస్కృతి ఆధారమైన ఆర్థిక వ్యవస్థ?
1) పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ
2) వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ
3) పశు పోషణ ఆర్థిక వ్యవస్థ
4) 2, 3
55. హరప్పా కాలంలో ‘శిలజాటా’ అనే మాటకు అర్థం?
1) వెండి ముక్క 2) బంగారం ముక్క
3) రాగి ముక్క 4) బొగ్గు ముక్క
56. మానవుని మనస్సు నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఏ వేదంలో చెప్పారు?
1) అధర్వణ వేదం 2) సామవేదం
3) యజుర్వేదం 4) రుగ్వేదం
57. వాసుదేవ కృష్ణ ఏ జైన తీర్థంకరునికి బంధువు అని జైనులు పరిగణించారు?
1) రిషభనాథ 2) పార్శనాథ
3) నేమినాథ 4) అరిష్టనేమి
58. గౌతమ బుద్ధుని సమకాలీనుడైన రాజు ?
1) అజాతశత్రువు 2) బిందుసారుడు
3) అశోకుడు 4) కనిష్కుడు
59. ఆత్మ పునర్జన్మను గురించి కింది వాటిలో ఎందులో ఉంది?
1) ఐతరేయ ఉపనిషత్తు
2) కౌషితకి ఉపనిషత్తు
3) తైత్తరీయ ఉపనిషత్తు
4) కేనోపనిషత్తు
60. రుగ్వేదంలో ఎక్కువగా పేర్కొన్న నది?
1) గంగ 2) యమున
3) సరస్వతి 4) కృష్ణా
61. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు?
1) దేవ్పాల్ 2) ధర్మపాల్
3) మణిపాల్ 4) విక్రపాల్
62. మౌర్యుల కాలంలో భూమిని ఎవరి ఆస్తిగా గుర్తించారు?
1) రాజ్యం 2) గ్రామపంచాయతి
3) వ్యక్తి 4) జమీందార్లు
63. హర్షవర్ధనుని కాలంలో అత్యధికంగా వ్యాప్తి చెందిన సామాజిక దుష్కార్యం?
1) పరదా వ్యవస్థ
2) బాల్య వివాహాలు
3) కులాంతర వివాహాల నిరోధం
4) సతి వ్యవస్థ
64. మహాభారత యుద్ధంలో ఆంధ్రులు ఎవరి తరఫున యుద్ధంలో పాల్గొన్నారు?
1) కీచకుడు 2) కౌరవులు
3) పాండవులు 4) శ్రీకృష్ణ
65. జాతక కథల్లో ఉన్న కథల సంఖ్య ఎంత?
1) 750 2) 320
3) 860 4) 500
66. బౌద్ధమతం పుట్టిన దేశంలోనే కనుమరుగు అవడానికి ప్రాథమిక కారణం?
1) రాజపోషణ లేకపోవుట
2) బౌద్ధ సంఘాలు క్షీణించుట
3) ఇది హిందూమతంలో లీనమగుట
4) మహాయానులు, హీనయానుల మధ్యగల భేదాభిప్రాయం
67. ప్రాచీన భారత వైయాకరిణి పాణిని?
1) ఉజ్జయినికి చెందినవాడు
2) తక్షశిలకు చెందినవాడు
3) కోసలకు చెందినవాడు
4) వజ్జికి చెందినవాడు
68. ప్రాచీన భారతదేశంలో బుద్ధుని కాలంలో వర్ధిల్లిన పదహారు మహాజనపదాల్లో అత్యంత బలశాలియైన జనపదం?
1) గాంధార 2) కాశ్కి
3) కాంభోజ 4) మగధ
69. పశ్చిమ భారతదేశంపై చంద్రగుప్తుని అధికారాన్ని ఏ శాసనం నిరూపించింది?
1) అశోకుడి సోపార శిలాశాసనం
2) కళింగ శిలాశాసనం
3) అశోకుడి గిర్నార్ శిలాశాసనం
4) రుద్రదామన్ జునాగఢ్ శిలాశాసనం
70. పంచతంత్రం ఎవరి కాలంలో రచించారు?
1) గుప్తుల కాలం
2) సుల్తానుల కాలం
3) వైదికుల తదనంతర కాలం
4) మయూరుల కాలం
71. ‘యోగసూత్ర’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) విశ్వామిత్రుడు 2) వశిష్ఠుడు
3) పతంజలి 4) మను
72. ప్రముఖ పండితుడు బాణభట్ట ఎవరి కాలంలో నివసించాడు?
1) హర్షుడు 2) కనిష్కుడు
3) అశోకుడు 4) చంద్రగుప్త-2
73. జతపరచండి.
ఎ. మొహెంజోదారో 1. 1921
బి. హరప్పా 2. 1924-61
సి. లోతాల్ 3. 1954-58
డి. కాళీబంగన్ 4. 1953
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
74. తప్పుగా జతపరిచినవి గుర్తించండి.
1) గౌతమి బాలశ్రీ – నాసిక్ శాసనం
2) ఖారవేలుడు – హాతిగుంఫా శాసనం
3) రుద్రదమనుడు – నానాఘాట్ శాసనం
4) అశోకుడు – మాస్కి శాసనం
75. హరప్పా సంస్కృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన గుర్తులు ఎక్కడ కనిపిస్తాయి?
1) కాలీబంగన్, రోపర్
2) లోథాల్, రంగాపూర్
3) చన్హుదారో, ఖేత్రి
4) మోహెహంజోదారో
76. మొట్టమొదటగా నాలుగు విధాలైన వర్ణవ్యవస్థకు సంబంధించిన సంకేతం/నిర్దేశం కనిపించునది?
1) పురుష సూక్తి 2) రుగ్వేదం
3) సతపత బ్రాహ్మణ
4) మను ధర్మ శాస్త్రం
77. దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్టు పిలిచే ముని ఎవరు?
1) అవస్తాంభ 2) వశిష్ట
3) విశ్వామిత్ర 4) అగస్త్య
78. అశోకుడు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం కొంతమంది ఖైదీలను కింది ఏ సందర్భంలో విడుదల చేశారు?
1) పుట్టినరోజు
2) కళింగను జయించిన రోజు
3) పట్టాభిషిక్తుడైన రోజు
4) బౌద్ధమతానికి పరివర్తన చెందిన రోజు
79. జైన మతం ఎవరి చేతిలో అపాయకర ప్రహారం పొందింది?
1) లింగాయతులు 2) నయనారులు
3) ఆళ్వారులు 4) శంకరాచార్యులు
80. కింది వారిలో మొట్టమొదటగా సింహాసనాన్ని పరిత్యజించిన భారతదేశ రాజు?
1) 1వ చంద్రగుప్తుడు
2) అశోకుడు
3) చంద్రగుప్తుడు 4) సముద్రగుప్తుడు
81. నలంద విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు?
1) కుమారగుప్తుడు 2) సముద్రగుప్తుడు
3) అశోకుడు 4) నలందుడు
82. హర్షుని ఓడించి ‘పరమేశ్వర్’ అనే బిరుదును సొందినవారు?
1) ఒకటవ పులకేశి 2) రెండవ పులకేశి
3) ఒకటవ మహేంద్రవర్మ
4) రెండవ మహేంద్ర వర్మ
83. ‘దేవానామ్ ప్రియ’ అనే బిరుదు పొందినవారు?
1) సముద్రగుప్తుడు 2) కనిష్కుడు
3) హర్షుడు 4) అశోకుడు
84. కింది వాటిలో షడ్-దర్శనాల్లో (ఆరు ప్రాచీన భారత సంప్రదాయక తాత్విక భావనా వ్యవస్థలు) భాగం కానిది ఏది?
1) సాంఖ్య 2) యోగ
3) స్మృతి 4) న్యాయ
85. కింది వాటిలో తప్పుగా జతపరిచినది?
1) బృహత్కథ – గుణాఢ్యుడు
2) గాథాసప్తశతి – హాలుడు
3) హర్షచరితం – హర్షవర్ధనుడు
4) మల్లన – రాజశేఖర చరిత్రం
86. కింది నగరాల్లో అజాత శత్రువు స్థాపించిన నగరం?
1) ధాన్యకటకం 2) నలంద
3) పాటలీపుత్రం 4) లుంబిని
87. కింది వాటిలో హటడు రచించిన గ్రంథం ఏది?
1) నాగానందం 2) లీలావతి
3) నలచరిత్రం 4) నైషాధీయం
88. కింది వాటిలో దయాభాగ రచయిత ఎవరు?
1) విఘ్నేశ్వర 2) కుల్లుక్భట్ట
3) విశ్వరుద్ర
4) జీమూతవాహనుడు
89. నంద వంశం వారు ఏ వంశం అనుయాయులు?
1) శిశునాగ వంశం
2) హర్యాంక వంశం
3) అకెమనీడు వంశం
4) మౌర్య వంశం
90. సముద్రగుప్తుడు సాధించిన సిద్ధులు ఎక్కడ చెక్కబడినవి?
1) హాథిగుంఫా శిలా చెక్కడాలు
2) అలహాబాద్ స్థూప చెక్కడాలు
3) గిర్నార్ శిలా చెక్కడాలు
4) సారనాథ్ శిలా చెక్కడాలు
91. మొత్తం పురాణాల సంఖ్య?
1) 18 2) 20 3) 12 4) 16
92. రాళ్లపై చెక్కిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉంది?
1) సంస్కృతం 2) బ్రాహ్మీ
3) పాళీ 4) ప్రాకృతం
93. మానవుడు మొదటిసారి ఏ లోహంపై రచించాడు?
1) ఇత్తడి 2) తగరం
3) ఇనుము 4) రాగి
94. హరప్పా ప్రజలు పూజించిన పక్షులు ?
1) పావురం 2) నెమలి
3) కాకి 4) గద్ద
95. సింధూలోయ నాగరికత ఎందులో ప్రత్యేకీకరణ కలిగింది?
1) భవన నిర్మాణం 2) పట్టణ ప్రణాళిక
3) శిల్పకళ 4) పైవన్నీ
96. ‘గోత్ర’ అనే పదం మొదటిసారి ఉపయోగించిన వేదం?
1) సామవేదం 2) రుగ్వేదం
3) అధర్వణ వేదం 4) యజుర్వేదం
97. బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖను ఏమంటారు?
1) దిగంబరుడు 2) హీనయానం
3) మహాయానం 4) శ్వేతాంబరులు
98. ఉపనిషత్తులు కింది వాటిలో దేనికి సంబంధించిన గ్రంథాలు?
1) మత సంస్కారాలు
2) యోగ
3) తత్వశాస్త్రం 4) సామాజిక శాసనం
99. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?
1) శాసనాల ద్వారా
2) ప్రాకృతాన్ని ఉపయోగించడం ద్వారా
3) విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా
4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు