రిజర్వ్‌బ్యాంకు పరపతి నియంత్రణ సాధనాలు
- ఆర్బీఐ ఆధీనంలో ఉండే ద్రవ్య విధాన పరికరాలు, పరపతి నియంత్రణ సాధనాలను ‘ద్రవ్య విధాన సాధనాలు’ అంటారు.
- ఆర్బీఐ చట్టం 1934 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 ప్రకారం ఆర్బీఐ పరపతి నియంత్రణ చేస్తుంది.
- రిజర్వుబ్యాంక్ అవలంబించే పరపతి నియంత్రణ సాధనాలు 2 రకాలు
1) పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు
2) గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు
దీనినే సంప్రదాయ పద్ధతి (Traditional Measures/Method), Blanket Method అని కూడా అంటారు. - ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయిని నియంత్రించడానికి ద్రవ్య పరిమాణంలో మార్పులకు ఆర్బీఐ ఉపయోగించే సాధనాలనే పరిమాణాత్మక సాధనాలు అంటారు.
- బ్యాంకు రేటు, నగదు నిల్వల నిష్పత్తి,చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, బహిరంగ మార్కెట్ చర్యలు, రెపోరేటు, రివర్స్ రెపోరేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మొదలైన వాటిని పరిమాణాత్మక సాధనాలుగా ఉపయోగిస్తారు.
- ఆర్బీఐ బిల్ ఆఫ్ ఎక్సైజ్ / కమర్షియల్
- పేపర్లను ఏ రేటుకు డిస్కౌంట్ చేస్తుందో ఆ రేటును బ్యాంకురేటు అంటారు.
- కేంద్రబ్యాంకు నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద కేంద్రబ్యాంకు వసూలు చేసే వడ్డీరేటును బ్యాంకు రేటు అని అంటారు. దీనినే వడ్డీరేటు అని కూడా అంటారు.
- వినిమయ బిల్లులు వాణిజ్య పేపర్లు ఇతర అనుమతి పొందిన సెక్యూరిటీలు హామీలుగా పెట్టుకొని ఆర్బీఐ రుణం ఇచ్చినప్పుడు విధించే వడ్డీరేటును బ్యాంకురేటు అంటారు. దీనిని రీడిస్కౌంట్ రేటు అని కూడా అంటారు.
- ద్రవ్య విధాన సాధనాల్లో బ్యాంకు రేటు అతి పురాతనమైనది.
- ప్రపంచంలో మొదట 1839లో ఇంగ్లండ్ ఉపయోగించింది.
- భారతదేశం 1934 నుంచి బ్యాంకురేటు విధానాన్ని పాటిస్తుంది.
- 2012 ఫిబ్రవరి నుంచి బ్యాంకు రేటును ఎంఎస్ఎఫ్తో ముడి పెట్టారు.
- ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటు పెంచి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకురేటు తగ్గించబడుతుంది.
- 2022 నవంబర్ నాటికి బ్యాంకు రేటు 4.25 శాతం ఉంది.
- సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో వాణిజ్య బ్యాంకులకు, విత్త సంస్థలకు, ప్రజలకు, కేంద్రబ్యాంకు అమ్మడం, కొనుగోలు చేయడాన్ని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు.
- ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే వాణిజ్య బిల్లులు, టీ బిల్స్, జీ సెక్యూరిటీస్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లు ఇతర అనుమతి పొందిన సెక్యూరిటీలు మొదలైనవి.
- ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో అమ్మినపుడు బ్యాంకులు ఇతర విత్త సంస్థలు వాటిని కొన్నప్పుడు వారి వద్ద ఉండే అదనపు ద్రవ్యత్వం ఆర్బీఐకి బదిలీ అవుతుంది. ఫలితంగా బ్యాంకు పరపతి సృష్టి సామర్థ్యం తగ్గుతుంది.
- ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది.
- బహిరంగ మార్కెట్ చర్యలు ప్రతి బుధవారం జరుగుతాయి.
- బహిరంగ మార్కెట్ చర్యలు అనేవి బ్యాంక్రేటు, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ల కంటే సమర్థవంతమైనవి.
- వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదు రూపం లో ఆర్బీఐ వద్ద హామీ రూపంలో ఉంచాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు.
- ఈ సీఆర్ఆర్ను ఆర్బీఐ నిర్ణయిస్తుంది.
- ఈ సీఆర్ఆర్పైన ఆర్బీఐ ఎలాంటి వడ్డీ చెల్లించదు.
- సీఆర్ఆర్ను ఎన్‌డీటీఎల్ (Net Demond Time Liabilities) పైన లెక్కిస్తారు. ఈ సీఆర్ఆర్ను 1934 నుంచి అమలు చేస్తున్నారు.
- ద్రవ్యోల్బణం కాలంలో సీఆర్ఆర్ను పెంచడం జరుగుతుంది. అందుకు ‘డియర్ మనీ పాలసీ’ని అనుసరిస్తారు. తద్వారా ద్రవ్య సప్లయి తగ్గి ధరలు తగ్గుతాయి. ఆర్థిక మాంద్యం కాలంలో సీఆర్ఆర్ను తగ్గించడం జరుగుతుంది. అందుకు చీప్ మనీ పాలసీని అనుసరిస్తారు. తద్వారా ద్రవ్య సప్లయి పెరిగి ధరలు తగ్గుతాయి.
- 2022 నవంబర్ నాటికి సీఆర్ఆర్ విలువ 4.50 శాతం ఉంది.
- వాణిజ్య బ్యాంకులు తన మొత్తం ఆస్తుల్లో కొంత భాగాన్ని ఆస్తులు/ నగదు రూపంలో తమ వద్ద నిల్వ ఉంచుకోవాలి. దీనినే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటారు.
- ఎస్ఎల్ఆర్ నిల్వలపైన ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది.
- ఎస్ఎల్ఆర్ను 1949 నుంచి అమలు చేస్తున్నారు.
- ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ పెరుగుతుంది.
- ఆర్థిక మాంద్యం కాలంలో ఎస్ఎల్ఆర్ తగ్గుతుంది .
- 2022 నవంబర్ నాటికి ఎస్ఎల్ఆర్ విలువ 18 శాతం ఉంది.
- రెపోరేటు భావనను వాఘల్ వర్కింగ్ గ్రూప్ సూచించింది.
- రెపోరేటును 1992 డిసెంబర్ 10 నుంచి ప్రవేశ పెట్టారు.
- రెపోరేటు అంటే రీపర్చేజింగ్ రేటు.
- REPO అంటే Short Term Lending Rate
- ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీరేటును రెపోరేటు అంటారు. దీనినే రీ పర్చేజింగ్ రేటు అని కూడా అంటారు.
- ద్రవ్యోల్బణ కాలంలో రెపోరేటు పెరుగుతుంది.ఆర్థిక మాంద్యం కాలంలో రెపోరేటు తగ్గుతుంది.
- 2022 నవంబర్ నాటికి రెపోరేటు 5.90 శాతం ఉంది.
- రివర్స్ రెపోరేటు భావనను వాఘల్ వర్కింగ్ గ్రూప్ సూచించింది. రివర్స్ రెపోరేటు అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్.
- రివర్స్ రెపోరేట్‌ను 1996 నవంబర్ 1 నుంచి ప్రవేశ పెట్టారు.
- వాణిజ్య బ్యాంకులు కేంద్రబ్యాంకుకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీరేటును ‘రివర్స్ రెపోరేటు’ అంటారు.
- ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రెపోరేటును పెరుగుతుంది.
- ఆర్థికమాంద్యం కాలంలో రివర్స్ రెపోరేటు తగ్గుతుంది.
- 2022 నవంబర్‌లో రివర్స్ రెపోరేటు 3.35 శాతం ఉంది.
- ఎంఎస్ఎఫ్ను ఓవర్ నైట్ బారోయింగ్ఫెసిలిటీ అని కూడా అంటారు.
- ఎంఎస్ఎఫ్ను 2011 నుంచి ప్రవేశ పెట్టారు. వాణిజ్య బ్యాంకులు తమ ఒక్కరోజు అవసరాల కోసం ఆర్బీఐ నుంచి రుణం పొందే సౌకర్యాన్ని ‘మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ’ అంటారు.
- ఎంఎస్ఎఫ్ రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీరేటు ఎంఎస్ఎఫ్ రేటు అంటారు.
- ఎంఎస్ఎఫ్ రేటును ఇంటర్ బ్యాంక్ రేటు అని కూడా అంటారు.
- ఎంఎస్ఎఫ్ విలువ బ్యాంక్రేటుతో సమానంగా ఉంటుంది.
- 2022 నవంబర్ నాటికి ఎంఎస్ఎఫ్ రేటు 6.15 శాతం ఉంది.
- దీనినే ఎంపిక చేసిన పరపతి నియంత్రణ అని విచక్షణాత్మక పరపతి నియంత్రణ అనికూడా అంటారు.
- భారతదేశంలో 1956 నుంచి గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలను ఆర్బీఐ చేపడుతుంది.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు ఉపయోగించే సాధనాలను ‘గుణాత్మక సాధనాలు’ విచక్షణాత్మక సాధనాలు ’ అంటారు
- గుణాత్మక నియంత్రణ అంటే పరపతిని గుణాత్మకంగా నియంత్రించే చర్యలు అని అర్థం.
- మార్జిన్లను నిర్ణయించటం, వినియోగదార్ల పరపతి నియంత్రణ, పరపతి రేషనింగ్, నైతిక ఉద్బోధ, ప్రత్యక్ష చర్యలు మొదలైనవి గుణాత్మక సాధానాలు.
మార్జిన్ల నిర్ణయం
- కేంద్ర బ్యాంకు రుణాలు ఇచ్చేటప్పుడు విలువైన వస్తువులను హామీగా పెట్టుకొని వాటి వాస్తవిక విలువకంటే తక్కువ ద్రవ్యాన్ని రుణాలుగా మంజూరు చేస్తుంది. అంటే హామీ వస్తువుల వాస్తవిక విలువకు, రుణ విలువకు మధ్యగల తేడానే మార్జిన్ అంటారు.
- ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ పెరుగుతుంది ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ తగ్గుతుంది.
పరపతి రేషనింగ్ (Credit Rationing)
- కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలపై గరిష్ఠపరిమితిని విధించడాన్ని పరిపతి రేషనింగ్ అంటారు.
- వినియోగదారుడు ఇచ్చే డౌన్ పేమెంట్‌లో మార్పులు చేయడం ద్వారా వాయిదాల సంఖ్యలో మార్పులు చేయడం ద్వారా పరపతిని నియంత్రించడం.
నైతిక ఉద్బోధ (Moral Suasion)
ఆర్బీఐ తమ దిశ నిర్దేశాలను సలహాలను పాటించమని వాణిజ్య బ్యాంకులకు సూచించడాన్ని ‘నైతిక ఉద్బోధ’ అంటారు.
ప్రత్యక్ష చర్యలు (Direct Actions)
- వాణిజ్య బ్యాంకులు వ్యతిరేక విధానాలు అవలంబించినపుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులపై తీసుకునే చర్యలను ప్రత్యక్ష చర్యలు అంటారు.
- నూతన శాఖల ఏర్పాటు, నిరాకరణ
- బ్యాంకు నిర్వహణలో మార్పుచేయడం
- లైసెన్సుల రద్దు చేయటం
- పెనాల్టీలు విధించడం
- వివిధ బ్యాంకుల విలీనం
ప్రాక్టీస్ బిట్స్
1. ద్రవ్య విధాన సాధనాలు/ పరపతి నియంత్రణ సాధనాలు ఏ బ్యాంకు ఆధీనంలో ఉంటాయి.
ఎ) ఎస్బీఐ బి) ఆర్బీఐ
సి) యూనియన్ బ్యాంకు డి) పైవన్నీ
2. ఆర్బీఐ అనుసరించే పరపతి నియంత్రణ సాధనాలు ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
3. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలకు మరొక పేరు?
ఎ) సంప్రదాయ పద్ధతి
బి) బ్లాంకెట్ మెథడ్
సి) విచక్షణాత్మక పరపతి నియంత్రణ
డి) ఎ, బి
4. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలకు మరొక పేరు?
ఎ) ఎంపిక చేసిన పరపతి నియంత్రణ
బి) విచక్షణాత్మక పరపతి నియంత్రణ
సి) డిస్క్రిమినేటివ్ క్రెడిట్ కంట్రోల్
డి) పైవన్నీ
5. బ్యాంకు రేటుకు మరొక పేరు?
ఎ) డిస్కౌంట్ రేటు బి) వడ్డీరేటు
సి) రెపోరేటు డి) ఎ, బి
6. ప్రభుత్వ సెక్యూరిటీలను కేంద్ర బ్యాంకు కొనే, అమ్మే విధానాన్ని ఏమంటారు?
ఎ) ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు బి) రెపోరేటు
సి) రివర్స్ రెపోరేటు డి) పైవన్నీ
7. ఎంఎస్ఎఫ్ అంటే
ఎ) Money Standing Facility
బి) Marginal Standing Facility
సి) Money Supply Facility
డి) Moral Stand Facility
8. కిందివాటిలో పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనం కానిది ఏది?
ఎ) రెపోరేటు బి) రివర్స్ రెపోరేటు
సి) మార్జిన్ డి) బ్యాంకురేటు
9.కిందివాటిలో గుణాత్మక పరపతి నియంత్రణ సాధనం కానిది ఏది?
ఎ) సీఆర్ఆర్ బి) ఎస్ఎల్ఆర్
సి) పరపతి రేషనింగ్ డి) ఎ, బి
10. హామీ వస్తువుల వాస్తవిక విలువకు, రుణ విలువకు మధ్య తేడాను ఏమంటారు?
ఎ) బ్యాంకు రేటు బి) రెపోరేటు
సి) మార్జిన్ డి) పరపతి
11.ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై విధించే వడ్డీరేటును ఏమంటారు?
ఎ) బ్యాంకు రేటు బి) రెపోరేటు
సి) రివర్స్ రెపోరేటు డి) ఎంఎస్ఎఫ్
12. వాణిజ్యబ్యాంకులు కేంద్ర బ్యాంకుకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీరేటును ఏమంటారు?
ఎ) బ్యాంకు రేటు బి) రెపోరేటు
సి) రివర్స్ రెపోరేటు డి) ఎంఎస్ఎఫ్
13. ప్రస్తుతం బ్యాంకు రేటు ఎంత ఉంది?
ఎ) 4.25 శాతం బి) 4.50 శాతం
సి) 18 శాతం డి) 5.90 శాతం
14. బ్యాంకురేటును ప్రపంచంలో మొదట ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారు?
ఎ) 1839 ఇంగ్లండ్ బి) 1854 ఇటలీ
సి) 1934 భారతదేశం
డి) 1800 జర్మనీ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని: 9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు