ఏ రాష్ట్రాన్ని నిమజ్జిత రాష్ట్రంగా పిలుస్తున్నారు?
నవంబర్ 23వ తేదీ తరువాయి..
- 2) సహజ లెవిలు: నది ప్రవాహ మార్గంలో, నదికి పార్శభాగాన నిక్షేపించబడే నదిలోని ఎత్తయిన ఒండ్రు మట్టి భూ భాగాలను‘సహజ లెవిలు’ అంటారు.
- లెవి (Levi) అనే ఆంగ్ల భాషా పదానికి మూలపదం Liver అనే ఫ్రెంచ్ పదం. దీనికి అర్థం ‘ఎత్తయిన’. ఇటలీలోని ‘పో’ నదికి సహజ లెవిలు ఎక్కువ.
- లెవి (ఎత్తయిన) వద్ద కనిపించే నది నూతన ఒండ్రు నిక్షేపాలను ఖాదర్ మైదానం అంటారు.
3) వరద మైదానాలు: నదికి వరదలు వచ్చినప్పుడు నది ఏర్పరిచే ఒండలి మైదానాలను వరద మైదానాలు అంటారు.
4) డెల్టా: నది సముద్రంలో కలిసే ముందుగా వివిధ శాఖలుగా చీలిపోయినప్పుడు ఆ శాఖల మధ్య కనిపించే నది నిక్షేపిత ఒండ్రు మట్టిని డెల్టా అని పిలుస్తారు. - ఈ డెల్టా పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ‘హెరిడోటస్ (క్రీ.పూ485)’. ఇతడు ఈ జిప్టును నైలు నది వరప్రసాదంగా పిలిచాడు.
- డెల్టాలను వాటి ఆకారం ఆధారంగా కింది విధంగా వర్గీకరించవచ్చు.
1) ధనస్సు ఆకార డెల్టా 2) పక్షిపద డెల్టా
3) లోబెట్ డెల్టా 4) డిజిటల్ డెల్టా - గంగా నది డెల్టాను ‘డిజిటల్ డెల్టా’ అని పిలుస్తారు.
- మహా నది డెల్టాను ‘లోబెట్ డెల్టా’ అని పిలుస్తారు.
- మిసిసిపి నది డెల్టాను ‘పక్షిపాద డెల్టా’అని పిలుస్తారు.
- సముద్రాలు తమ క్రమక్షయంలో భాగంగా కింది ప్రక్రియలను కలిగి ఉంటాయి.
- 1) అపఘర్షణ: సముద్ర తరంగాలు తీరంపై ఉన్న శిలలపై దాడి చేసినప్పుడు మాతృక శిలలు చిన్న చిన్న పొరలుగావిడిపోవడాన్ని అపఘర్షణ అంటారు.
- 2) రాపిడి: సముద్ర తరంగాల్లో చిక్కుకున్న రాళ్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రక్రియను రాపిడి అంటారు.
- 3) ఘర్షణ: అపఘర్షణ, రాపిడి ద్వారా సముద్ర జలాల్లో కలిసిన శిలలు సముద్ర భూతలాన్ని క్రమక్షయం చేసి లోతుగామార్చడాన్ని ఘర్షణ అంటారు.
- 4) జలోత్పీడన చర్య: జిప్సం, ఉప్పు, సున్నపురాయి మొదలైన ఖనిజాలు సముద్ర జలాల్లో కలిసి ద్రావణంగా మారడాన్ని జలోత్పీడన చర్య అంటారు.
- 5) తరంగ దెబ్బ: సముద్ర తరంగాలు తమ అధిక వేగం, పీడన శక్తితో తీరంపై దాడి చేయడాన్ని తరంగ దెబ్బ అంటారు.తరంగ దెబ్బలోని దశలు
- 1) SWELL- కొద్దిపాటి చలనం కలిగిన సముద్ర తరంగ సమూహం.
- 2) PLUNZ- తీరంపై వేగంగా దాడిచేసే కెరటం.
- 3) BACK WASH- తీరాన్ని సమీపించే కొద్దీ లోతు తగ్గడం వల్ల తరంగం ఒక్కసారిగా విరిగిపోయి తీరంపై దాడిచేసి వెనుకకు వెళ్లిపోవడం BACK WASH అంటారు.
- సముద్ర తరంగాలు తీరంపై కలుగజేసే ఒత్తిడిని హైడ్రాలిక్ పీడనం అని పిలుస్తారు.
- ఈ పీడనం వల్ల శిల పగుల్లోకి నీరు చేరి శిలలు ముక్కలుగా విరిగిపోతాయి.
- సముద్ర మట్టం: సముద్ర మట్టంలో 2 రకాల కారకాల వల్ల మార్పులు సంభవిస్తాయి.
- 1) నదీ జలాలు వల్ల లేదా కలవకపోవడం వల్ల సముద్ర మట్టంలో మార్పులు సంభవిస్తే వాటిని ‘యూస్టాటిక్’ మార్పులు అనిపిలుస్తారు.
- 2) భూ తలాల కదలిక వల్ల సముద్ర మట్టంలో మార్పులు వస్తే వాటిని ‘ఐసోస్టాటిక్’ మార్పులు అని పిలుస్తారు.
- సముద్ర తీరం: సముద్ర తీరం, తీరం నుంచి భూ దూరం ఆధారంగా నాలుగు రకాలు
- 1) BACK SHORE- నేలను ఆనుకొని ఉన్న భాగం
- 2) FORE SHORE- బీచ్ నుంచి లోపలికి విస్తరించిన భాగం
- 3) IN SHORE- ఒక్కసారిగా లోతు పెరిగిన భాగం
- 4) OFF SHORE- తీరానికి దూరంగా విస్తరించిన భాగం. ఇది పెట్రోల్, సహజ వాయువులకు ప్రసిద్ధి.
- తీరం వంకరగా ఉన్న ప్రాంతం తక్కువగా సముద్ర క్రమక్షయానికి గురవుతుంది.
ఉదా: భారతదేశ తూర్పు తీరం - తీరం వంకరగా లేకుండా తిన్నగా ఉన్నచోట ఎక్కువగా సముద్ర క్రమక్షయం జరుగుతుంది.
ఉదా: భారతదేశ పశ్చిమ తీరం, ఈ లక్షణం వల్లకేరళను నిమజ్జిత రాష్ట్రం (Submerged State)గా పిలుస్తున్నారు. - 1) సముద్ర తరంగాల ద్వారా క్రమక్షయం చేయబడి
నిట్టనిలువుగా ఏర్పడిన కొండప్రాంతాలను ‘సముద్ర భృగువు’ అంటారు.
ఉదా: డాల్ఫిన్ నోస్ - 2) సముద్ర భృగువులు మెత్తని శిలలు కలిగి ఉన్నప్పుడు సముద్ర తరంగాల క్రమక్షయం వల్ల సమతలంగా ఏర్పడితే ‘సముద్ర వేదిక’ అంటారు.
- 3) సముద్ర తరంగాల క్రమక్షయం వల్ల తొలగింపబడినటువంటి గుహ వంటి సముద్ర భృగువును ‘సముద్ర గృహ’ అంటారు.
ఉదా: విశాఖపట్నంలోని సముద్ర తీరం - 4) సముద్ర గృహ లోపలి భాగం సముద్ర తరంగాల వల్ల క్రమక్షయం జరిగి గుహ పైభాగం కూలిపోయి రంధ్రం ఏర్పడితే ‘Blow Hole’ అంటారు.
- 5) ‘సముద్ర వంతెన’ అంటే సముద్ర గృహలు కూలిపోయి సహజంగా ఏర్పడే వంతెన వంటి రూపాలు.
- 6) సముద్ర తరంగ క్రమక్షయం వల్ల సముద్ర వంతెన కూడా నశించినప్పుడు సముద్రాల్లో కనిపించే ఒంటరి గుట్టలనే ‘Sea Stock’ అంటారు.
- 7) సముద్ర తరంగాల క్రమక్షయం వల్ల తీరం వద్ద ఏర్పడే సమతల మైదానాన్ని ‘స్ట్రాండ్ ప్లాట్ మైదానం’ అని పిలుస్తారు.
1) బీచ్: సముద్రాల వద్ద రెండు రకాలు - ఎ) ఎగువ బీచ్: నేలకు ఆనుకొని ఉంటుంది. అంటే ఎత్తులో ఉంటుంది. ఇందులో రాళ్లు
ఎక్కువగా ఉంటాయి.
బి) దిగువ బీచ్: సముద్రానికి ఆనుకొని ఉంటుంది. ఇసుక ఎక్కువగా ఉంటుంది. - సముద్రాల వల్ల నిక్షేపించబడే మైదానాన్ని బీచ్ అని పిలుస్తారు.
2) బార్: మహాసముద్రాల్లో తీరాన్ని ఆనుకొని సముద్ర జీవుల మృత కళేబరాలతో Caco3 నిక్షేపాలు నిక్షేపితమై ఉంటాయి. - వీటికి అనుసంధానమై సముద్రంలోకి విస్తరించిన సన్నని పొడవైన కోరల్ రీఫ్‌ను ‘బార్ లేదా రోధిక’ అంటారు. ఇది పెద్దదిగా ఉంటే బారియర్ అంటారు.
ఉదా: గ్రేట్ బారియర్ ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఇది అతిపెద్ద బారియర్. - 3) స్పిట్ (Spit): నేలను ఆనుకొని సముద్రంలో విస్తరించిన సన్నని పొడవైన కోరల్ రీఫ్‌లను స్పిట్ అని
పిలుస్తారు.
ఉదా: కాకినాడ స్పిట్ - 4) టంబోలా: స్పిట్‌కు అనుసంధానించబడిన సముద్ర దీవిని టంబోలా అంటారు.
- ఇది తీరానికి చాలా దూరంగా ఉంటుంది.
ఉదా: పాంబన్ దీవి (ఇండియా,
శ్రీలంక మధ్య), హోప్ దీవి (కాకినాడ) - 5) షోల్ (Shole): పెద్ద పెద్ద నదులు
తమ ముఖ ద్వారాల వద్ద సముద్రాల్లో
నిక్షేపించే ఇసుక దిబ్బలను షోల్ అంటారు. - ఇవి నౌకాయానానికి ప్రమాదకారి.
ఉదా: పులికాట్ షోల్-నెల్లూరు, కోరింగాషోల్-తూర్పుగోదావరి
- భూ సైంటిస్టులు భూమిమీద నాలుగు ఆవరణాల గురించి ప్రస్తావించారు. అవి..
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) జీవావరణంశిలావరణం - ఈ ఆవరణాన్ని ఇంగ్లిష్‌లో ‘లిథోస్పియర్’ అంటారు.
- గ్రీకు భాషాపదాలైన లితో అంటే రాయి (శిల), స్పెయిరా అంటే గోళం (బంతి).
- భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
- దీంట్లో రాళ్లు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
- ఎత్తయిన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, మహాసముద్రాలు వంటివి వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
- సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, తర్వాత చల్లబడినప్పుడు అది గాలిని, నీటిని ప్రభావితం చేస్తుంది.
- లోతైన అగాథాలు నీటితో నిండి మహాసముద్రాలుగా, మిగిలినది ఖండాలుగా ఉన్నాయి.
- భూమి పై పొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజించబడి ‘మొదటి శ్రేణి’ భూ స్వరూపాలుగా ఉంటుంది.
- ఖండాల ఉపరితలం సమతలంగా లేక పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు వంటి స్వరూపాల ద్వారా ఏర్పడి ఉండటంతో వీటిని ‘రెండో శ్రేణి భూస్వరూపాలు’ అంటారు.
- మొదట్లో ఖండాలన్నీ ఒకేచోట ఉండేవని తర్వాత అవి విడిపోయి ఖండాలు, మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఇవి ఫలకాలు అనే అతిపెద్ద రాళ్లమీద ఉననాయని సైంటిస్టులు తెలుసుకున్నారు.
- ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో-ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేషియా, పసిఫిక్ పెద్ద ఫలకాలు, నాజ్కా, అరేబియా వంటి చిన్న ఫలకాలు ఉన్నాయి.
- ఈ ఫలకాలు నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
- ఒక ఫలక మరొక ఫలకాన్ని నెడుతూ ఒకదానిమీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతూ, ఒక ఫలక కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ ఫలకాల కదలికను ‘ఫలక చలనాలు (Plate Tectonics)’ అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.
- ఫలకల అంచులవద్ద లేదా ఫలకలు కలిసే సరిహద్దుల వద్ద భూచర్యలు ఎక్కువగా ఉంటాయి.
- ఫలక అంచు మధ్య పొరలోకి వెళ్లి అక్కడి వేడికి ద్రవంగా మారుతుంది. మధ్యపొరలోకి వెళ్తున్న ఫలక దానితో పాటు మొత్తం ఫలకాన్ని తనతో పాటు లాగుతూ ఉంటుంది. ఇది తిరిగి మహాసముద్రపు మిట్ట ప్రాంతం వద్ద కొత్తగా ఏర్పడిన సముద్రపు నేలను లాగుతుంది.
- ఇండియా ఫలక యురేషియా ఫలకను నెడుతూ హిమాలయాలు ఉన్నచోట దానికిందకు వెళ్తుంటుంది.
- భవిష్యత్తులో మనం నిలుచున్న భూ ప్రాంతం హిమాలయాల కింద మధ్యపొరలోని ద్రవంలో కలిసిపోతుంది.
- యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
- అనేక ఫలకాల అంచుల వద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి.
- మహాసముద్రాల్లోని భూమి పైపొర, మధ్యభాగంలో మిట్టలు, పర్వతశ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్యపొరల నుంచి పైకి లేచి లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతంలో నేల పైకి నెట్టబడి బీటలు వారడం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది. దీన్నే ‘సముద్రపు నేల విస్తరణ’ క్రియకు దారితీస్తుంది.
- భూగర్భంలోని శిలాద్రవం అనుకూలపరిస్థితుల్లో గొట్టం వలె ఉన్న భాగాల నుంచి బయటకు వస్తుంది.
- బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడితే దాన్ని‘అగ్నిపర్వతం’ అంటారు.
- కరిగిన పదార్థంతో పాటు భూమి లోపలి పొరల్లోంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు (మాగ్మా) ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థం చల్లబడి కఠిన
శిలలుగా ఏర్పడతాయి. వీటిని అగ్నిశిలలు అంటారు. - లావాలోని కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి, శిలలుగా గట్టిపడుతుంది. వీటిని ‘లోపలికి ఏర్పడిన భూస్వరూపాలు’ అంటారు. ఇవి సాధారణంగా
పురాతన శిలలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. కప్పి ఉన్న శిలలు భూమి కోత వల్ల బయటపడతాయి. - దక్కన్ పీఠభూమిలో అనేకసార్లు ఈ రకంగా లావా వెలుపలికి వచ్చి లావాతో కూడుకున్న విస్తార పీఠభూమిగా ఏర్పడింది.
- టెక్టానిక్స్ (Tectanicx) అనే పదం గ్రీకు
‘టెక్టాన్’ నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంగి (భవన నిర్మాణదారు). వడ్రంగి అనే సంస్కృత పదం ‘తక్షణ్’కి సంబంధం ఉంది. - పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవిస్తాయి. అగ్నిపర్వతాల్లో ప్రతి నాలుగులో మూడు ఇక్కడే వస్తాయి.
- ఇలా ఉండటానికి కారణాన్ని ‘ఫలక టెక్టానిక్స్ సిద్ధాంతం’ తెలుపుతుంది. పసిఫిక్ మహాసముద్రం అంచు అంతటా ఫలక సరిహద్దులు వల్ల అగ్నిపర్వతాలు,భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకే దానికి ‘పసిఫిక్ అగ్నివలయం’ అనే పేరు వచ్చింది.
జీ గిరిధర్ సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్ అశోక్‌నగర్: 9966330068
- Tags
Previous article
రిజర్వ్‌బ్యాంకు పరపతి నియంత్రణ సాధనాలు
Next article
He was caught in the act and landed in..?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?