మైటోకాండ్రియాను పరిశీలించడానికి ఉపయోగించే ద్రావణం?
- కణశాస్త్రం
1. కింది వాటిలో సరికానిది?
ఎ. ఆంటోనివాన్ ల్యూవెన్హుక్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రొటోజోవాల మీద పరిశోదనలు చేశాడు
బి. మొదటిసారిగా ల్యూవెన్హుక్ 1675లో పరిశోధన ప్రారంభించాడు
సి. ల్యూవెన్హుక్ మొదటిసారిగా కణాన్ని కనుగొన్నాడు
డి. ల్యూవెన్హుక్ 1674లో పరిశోధనలు ప్రారంభించాడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
2. కణసిద్ధాంతం గురించి సరైనది?
ఎ.కణ సిద్ధాంతాన్ని ష్లీడన్, ష్వాన్ ప్రతిపాదించారు
బి. 1830లో కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
సి. ష్లీడన్ వృక్ష శాస్త్రవేత్త, ష్వాన్ జంతు శాస్త్రవేత్త
డి. వృక్ష, జంతు రాజ్యాల్లో జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి
1) ఎ, డి, సి 2) ఎ, బి, డి
3) బి, డి 4) పైవన్నీ సరైనవే
3. వృక్ష కణాల్లో లేని కణాంగాలు?
ఎ. కణకవచం బి. హరితరేణువు
సి. రిక్తిక డి. విచక్షణ త్వచం
1) డి 2) ఎ, బి
3) బి, సి, డి 4) పైవేవీ కాదు
4. కేంద్రకం గురించి సరికాని అంశం?
ఎ. కేంద్రకాన్ని రాబర్ట్ హుక్ కనుగొన్నాడు
బి. కణ నియంత్రణ గది
సి. బ్యాక్టీరియాలో కేంద్రకం ఉంటుంది
డి. 1831లో కేంద్రకాన్ని కనుగొన్నారు
1) ఎ, సి 2) సి
3) సి, డి 4) అన్నీ సరైనవే
5. కింది వాటిని అధ్యయనం చేయండి.
ఎ. కేంద్రకం-1893
బి. కణం-1665
సి. కణ విభజన-1855
డి. గాల్జీ సంక్లిష్టం-1898
పై అంశాల్లో సరికాని అంశం ఏది?
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, సి 4) అన్నీ సరైనవే
6. సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొనే ఏకకణ జీవులు?
ఎ. అమీబా బి. పారామీషియం
సి. యూగ్లీనా డి. వర్టిసెల్లా
1) ఎ, బి 2) బి, డి
3) సి, డి 4) బి మాత్రమే
7. కింది వాటిని జతపరచండి.
ఎ. రాబర్ట్ హుక్ 1. అమెరికా
బి. రాబర్ట్ బ్రౌన్ 2. ఇంగ్లండ్
సి. విర్కోవ్ 3. స్కాట్లాండ్
డి. ల్యూవెన్హుక్ 4. పోలెండ్
5. డచ్
1) ఎ-1, బి-3, సి-5, డి-2
2) డి-1, బి-5, సి-4, ఎ-3
3) ఎ-2, బి-3, సి-4, డి-5
4) డి-5, ఎ-4, సి-1, బి-2
8. ప్లాస్మా పొరను తయారుచేసే పదార్థాలు?
ఎ. ప్రొటీన్లు బి. లిపిడ్లు
సి. సెల్యూలోజ్ డి. కార్బోహైడ్రేట్లు
1) ఎ, బి 2) బి మాత్రమే
3) ఎ మాత్రమే 4) ఎ, బి, డి
9. ప్లాస్మా త్వచం గురించి సరికాని విషయం?
ఎ. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది
బి. సమతాస్థితి, నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది
సి. ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు
డి. కణానికి ఆకారాన్నిస్తుంది
1) ఎ, సి, డి 2) బి, డి
3) ఎ, సి 4) పైవేవీ కాదు
10. కింది వాటిలో సరైన వరస క్రమం ఏది?
ఎ. కణజాలం-కణం-అవయవం-అవయవ వ్యవస్థ-జీవి
బి. కణం-కణజాలం-అవయవ వ్యవస్థ-అవయవం-జీవి
సి. కణం-కణజాలం-అవయవం-అవయవ వ్యవస్థ-జీవి
డి. కణం-అవయవం-అవయవ వ్యవస్థ-
కణజాలం-జీవి
1) ఎ 2) బి 3) సి 4) డి
11. మైటోకాండ్రియాను పరిశీలించడానికి ఉపయోగించే ద్రావణం?
1) జోనస్ గ్రీన్-బి 2) జోనస్ గ్రీన్-సి
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
4) అయోడిన్
12. మైటోకాండ్రియా గురించి సరైన అంశం.
ఎ. మైటోకాండ్రియాను ఆవరించి ఏక త్వచం ఉంటుంది
బి. క్రిస్టేలను కలిగి ఉంటుంది
సి. కణశక్త్యాగారాలు అంటారు
డి. రెండు త్వచాలను కలిగి ఉంటుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
13. మైటోకాండ్రియా పరిమాణం?
1) 2-8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసం
2) 9-18 మైక్రాన్ల పొడవు, 1.15 మైక్రాన్ల వ్యాసం
3) 12-18 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసం
4) 2-8 మైక్రాన్ల పొడవు, 15.5 మైక్రాన్ల వ్యాసం
14.పై పటంలో గుర్తించిన భాగాల పేర్లు?
ఎ. మాత్రిక, జీవపదార్థం
బి. మాత్రిక సి. క్రిస్టే
డి. బాహ్యత్వచం, అంతరత్వచం
1) బి మాత్రమే 2) ఎ
3) బి, సి 4) డి మాత్రమే
15. కణ కవచం గురించి సరికానిది.
ఎ. కణ కవచం లిపిడ్లతో నిర్మితమవుతుంది
బి. కణకవచం జంతు కణంలో ఉంటుంది
సి. కణ కవచం వృక్ష కణంలో ఉంటుంది
డి. కణ కవచం కణానికి ఆకారం, రక్షణ ఇస్తుంది
1) ఎ, సి, డి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, బి
16. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. కేంద్రకం, కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రక త్వచం ఉంటుంది
బి. కేంద్రకాన్ని రుడాల్ఫ్ విర్కోవ్ కనుగొన్నాడు
సి. కేంద్రక త్వచంలేని కణాన్ని నిజకేంద్రక కణం అంటారు
డి. కేంద్రక త్వచం ఉన్న కణాన్ని నిజకేంద్రక కణం అంటారు.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) సి, ఎ
17. రైబోజోమ్లు వేటిలో ఏర్పడతాయి?
1) RNA, ప్రొటీన్లు
2) DNA, ప్రొటీన్లు
3) RNA, DNA
4) RNA, విటమిన్లు
18. రైబోజోమ్లు వేటి సంశ్లేషణలో తోడ్పడతాయి?
ఎ. ప్రొటీన్లు బి. లిపిడ్లు
సి. విటమిన్లు డి. కార్బోహైడ్రేట్లు
1) ఎ, సి 2) బి, సి
3) ఎ మాత్రమే 4) ఎ, డి
19. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. అంతర్జీవ ద్రవ్యజాలం నాలుగు రకాలు
బి. కణంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది
సి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్లు ఉంటాయి.
డి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్లు ఉంటాయి
1) ఎ, డి 2) ఎ, బి
3) డి మాత్రమే 4) ఎ, బి, డి
20. కింది వాటిలో సరైన అంశం?
ఎ. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లను సంశ్లేషిస్తుంది
బి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రొటీన్లను సంశ్లేషిస్తుంది
సి. ప్రొటీన్లు, లిపిడ్లు ప్లాస్మాపొర నిర్మాణంలో తోడ్పడుతుంది
డి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కాలేయ కణాల్లో విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది
1) ఎ, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) డి మాత్రమే
21. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. గాల్జీ సంక్లిష్టంను కామెల్లో గాల్జీ
కనుగొన్నారు
బి. గాల్జీ సంక్లిష్టం అనేక త్వచాలతో నిర్మితమై
ఉంటాయి
సి. గాల్జీ సంక్లిష్టం ఒకే త్వచంతో
నిర్మితమవుతుంది
డి. మధ్య కుహరం చుట్టూ ఏక త్వచపు
పొర ఉంటుంది
1) ఎ, బి 2) బి మాత్రమే
3) సి, డి 4) సి మాత్రమే
22. కింది వాటిలో సరైన అంశం?
ఎ. గాల్జీ సంక్లిష్టం కణాల త్వచాలను పునరుత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది
బి. స్రావక కణాల్లో గాల్జీ సంక్లిష్టం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది
సి. గాల్జీ సంక్లిష్టాలు వివిధ పదార్థాల నిల్వలో తోడ్పతుంది
డి. గాల్జీ సంక్లిష్టాలను ఆత్మహత్య కోశాలు అంటారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) డి మాత్రమే 4) సి మాత్రమే
23. హరితరేణువు (క్లోరోప్లాస్ట్) పరిమాణం?
1) 4-10 మైక్రాన్లు
2) 8-15 మైక్రాన్లు
3) 10-12 మైక్రాన్లు
4) 9-20 మైక్రాన్లు
24. హరితరేణువుల ఆకారం?
ఎ. గుండ్రం, అండాకారం
బి. నిచ్చెన ఆకారం
సి. సర్పిలం, జాలాకారం
డి. అండాకారం
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
25. లైసోజోమ్ల గురించి సరైన అంశం?
ఎ. లైసోజోమ్లు త్వచ నిర్మిత ఆశయాలు
బి. లైసోజోమ్లలో ఉండే ఎంజైమ్లు ఆసిడ్ హైడ్రోలేజ్లు
సి. లైసోజోమ్లను ఆత్మహత్య తిత్తులు అంటారు
డి. ఇది కణంలో ప్రవేశించిన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది
1) ఎ, బి, సి, డి 2) సి, డి
3) డి మాత్రమే 4) ఎ, బి, సి
26. సెంట్రోజోమ్ గురించి సరికాని అంశం?
ఎ. వృక్షకణాల్లో ఉంటాయి
బి. జంతు కణంలో ఉంటాయి
సి. కణ విభజనలో తోడ్పతుంది
డి. కణత్వచం ఉండదు
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఎ, డి
27. హరితరేణువుల గురించి సరికానిది.
ఎ. హరితరేణువులు రెండు త్వచాలను కలిగి ఉంటాయి
బి. క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చగా ఉంటాయి
సి. సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా మార్చడం ముఖ్య విధి
డి. హరితరేణువులు (ప్లాస్టిడ్లు) ఐదు రకాలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) డి మాత్రమే
28. కణం ఏ భాషా పదం?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఫ్రెంచ్ 4) డచ్
29. కిందివాటిలో సరైన అంశం.
ఎ. పెలిన్ పాంటానా ఉపకళాకణాల్లో కేంద్రకాన్ని చూశారు
బి. రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకం అంతర్భాగమని తెలిపారు
సి. బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల్లో కేంద్రకాన్ని గుర్తించాడు
డి. 1839లో కేంద్రకాన్ని కనుగొన్నారు
1) ఎ, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి మాత్రమే
30. కింది వాటిని జతపరచండి.
ఎ. అమీబా 1. టెంటకిల్
బి. పారామీషియం 2. కశాభాలు
సి. హైడ్రా 3. శైలికలు
డి. క్లామిడో మోనాస్ 4. మిద్యాపాదం
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
31. కింది వాటిలో ఏకకణ నిర్మిత జీవులు?
ఎ. అమీబా బి. పారామీషియం
సి. క్లామిడోమోనాస్ డి. హైడ్రా
1) ఎ, బి, డి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
32. కింది వాటిని జతపరచండి.
ఎ. బ్యాక్టీరియా కణం 1. 17సెం.మీ X18 సెం.మీ
బి. మూత్రపిండ కణం 2. 90 సెం.మీ-100 సెం.మీ
సి. నాడీ కణం 3. 0.01 మైక్రాన్స్ నుంచి 0.5 మైక్రాన్స్
డి. ఆస్ట్రిచ్ అండ కణం 4. 20-30 మైక్రాన్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-3, బి-2, సి-1, డి-4
33. 1 మి.మీ అంటే ఎన్ని మైక్రాన్/మైక్రోమీటర్లు?
1) 10 2) 20
3) 1000 4) 10000
34. మొక్కల్లో నీటి సంగ్రహణ జరిగే ప్రాంతం?
1) పత్రం 2) వేరు
3) కాండం 4) పత్రరంధ్రం
35. ఉల్లిపొర కణాల గురించి సరైన వాక్యం?
ఎ. ఉల్లిపొర కణం గుండ్రంగా ఉంటుంది
బి. కణంలోని కేంద్రకం మధ్యలో ఉంటుంది
సి. ఉల్లిపొర కణం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది
డి. కేంద్రకం కణ త్వచానికి దగ్గరగా అమరి ఉంటుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) సి, డి
36. వృక్ష కణజాలంలో రకాలు?
1) 4 2) 5 3) 3 4) 2

13
-శ్రీకాంత్
విషయ నిపుణులు ఏకేఆర్ స్టడీసర్కిల్ వికారాబాద్
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






