వ్యవసాయానికి చేయూత.. పంట రుణాలకు భరోసా
వ్యవసాయ పరపతి రుణాలు
- వ్యవసాయ రంగంలో పెట్టుబడికి వ్యవసాయ పరపతి మూలాధారం.
- 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగం వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 91541 కోట్ల్ల లక్ష్యంతో రూ.75,977 పంట రుణాలకు కేటాయించగా, వ్యవసాయ టర్మ్‌లోన్స్, అనుబంధ కార్యకలాపాలకు రూ. 32,101 కోట్ల లక్ష్యంతో రూ.31813 కోట్లు పంపిణీ చేశారు.
- వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాముఖ్యత కారణంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి రుణం 2015 నుంచి 2021 మధ్య 92 శాతం
పెరిగింది. - తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లా సహకార బ్యాంకులు, 818 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల ద్వారా రుణాలు నాబార్డు నుంచి రైతులకు చేరవేయడానికి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ 42 బ్రాంచీల ద్వారా అందిస్తుంది.
- 2018–19 నుంచి 2019-20 సంవత్సరాల మధ్యకాలంలో వ్యవసాయానికి కేటాయించిన రుణాల్లో 10 శాతం పెరుగుదల కనిపిస్తుంది.
వడ్డీలేని పంటరుణాలు, పావలా వడ్డీ
- రైతులకే ఆర్థిక భారాన్ని తగ్గించడం వారికి సంస్థాగత రుణాలు అందేలా, పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందేలా చేయడం జరుగుతుంది.
- ఒక లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీతో పంట రుణాలను అమలు చేస్తుంది.
- ఈ వడ్డీ భారం కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం భరిస్తున్నాయి.
రుణమాఫీ పథకం
- రాష్ట్ర ప్రభుత్వం 2014 మార్చి 31 నాటికి రూ. లక్షలోపు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసింది.
- ఈ పథకం కింద అన్ని రకాల పంట రుణాలు, పంట కోసం తెచ్చుకున్న వ్యవసాయ, బంగారు రుణాలను పరిగనలోకి తీసుకున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా మొత్తం 35.30 లక్షల మంది రైతులకు రూ. 16,124 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
- 2020-21 బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.6225 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 25000/- లోపు రుణాల మాఫీ కోసం రూ.1210 కోట్లు విడుదల చేసింది.
- రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో రూ.5225 కోట్లు కేటాయించింది.
- 2020-21లో రూ.733 కోట్లతో 4.07 లక్షల మంది రైతులకు రుణాలను
మాఫీ చేసింది.
వ్యవసాయ మార్కెంటింగ్
- ఒక రైతు తాను పండించిన పంటలో కొంత సొంత అవసరాలకు వినియోగించుకోగా మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన పంటను విక్రయం కాగల మిగులు అంటారు.
- వ్యవసాయదారుడు తన ఉత్పత్తులను మార్కెట్లకు చేరవేయడానికి సరైన ధరలకు విక్రయించడానికి అవసరమైన సదుపాయాల కల్పనను వ్యవసాయ మార్కెటింగ్ అంటారు.
- వ్యవసాయ మార్కెటింగ్‌లో4 దశలుంటాయి. అవి
సమీకరణ
- వ్యవసాయదారులు వేర్వేరు అల్ప పరిమాణాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను సేకరించి పెద్ద మొత్తంగా పోగుచేసే పద్ధతిని సమీకరణ అంటారు.
2) తారతమ్య నిరూపణ లేదా ప్రామాణీకరణ :
- వ్యవసాయ ఉత్పత్తులను, నాణ్యతను బట్టి వర్గీకరించి నాణ్యతా ప్రమాణాన్ని నిర్ణయించే విధానాన్ని గ్రేడింగ్ అంటారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే నాణ్యతా ప్రమాణం – అగ్మార్క్ (AGMARK)
- అగ్రికల్చర్ ప్రొడ్యూస్ (గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్) యాక్ట్ 1937 ప్రకారం అగ్ మార్క్‌ను ఇస్తారు. ఈ చట్టాన్ని 1986లో సవరించారు.
3) ప్రాసెసింగ్
- వ్యవసాయ ఉత్పత్తులను వినియోగానికి అనువుగా మార్చడాన్ని ఆగ్రో ప్రాసెసింగ్ అంటారు.
- ఉదా: నూనెగింజలను నూనెగా పత్తిని నూలుగా మార్చడం మొదలైనవి.
4) పంపిణీ
- ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులను టోకు వ్యాపారులు రిటైల్ వ్యాపారుల ద్వారా వినియోగదారులకు చేర్చడాన్ని పంపిణీ అంటారు.
మార్కెటింగ్ వ్యవస్థ లోపాలు
- గిడ్డంగి సౌకర్యాల కొరత
- దళారుల పాత్ర అధికంగా ఉండటం
- ప్రామాణీకరణ సదుపాయాల కొరత
- తూనికల విషయంలో అక్రమాలు
- మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం
- రవాణా సౌకర్యాల లోపం
- భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ
- భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో 7 రకాల మార్కెట్లున్నాయి.
1) ప్రాథమిక మార్కెట్లు
2) ద్వితీయ మార్కెట్లు
3) అంతిమ మార్కెట్లు
4) సంతలు
5) క్రమబద్ధ మార్కెట్లు
6) సహకార మార్కెట్లు
7) ప్రభుత్వ వ్యాపారం
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం
వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ల సంఖ్య -192
అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్
కమిటీలున్న జిల్లాలు
సిద్దిపేట -14 మార్కెట్లు
జగిత్యాల – 13 మార్కెట్లు
నల్లగొండ – 10 మార్కెట్లు
కామారెడ్డి – 10 మార్కెట్లు
వ్యవసాయ మార్కెట్లో అత్యల్ప
కమిటీలున్న జిల్లాలు
మేడ్చల్ మల్కాజిగిరి
భద్రాద్రి కొత్త గూడెం,పెద్దపల్లి
- ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేయడానికి రాష్ట్ర
- ప్రభుత్వం తెలంగాణ మార్కెట్ చట్టం -2016 ప్రకారం సంస్కరణలు ప్రవేశపెట్టింది.
- తెలంగాణ నూతనంగా ఏర్పాటు చేసిన కమోడిటీ మార్కెట్స్
- తీపి బత్తాయి మార్కెట్ గంధం వారి గూడెం – నల్లగొండ
- బత్తాయి – నకిరేకల్ నల్లగొండ
- దొండకోసం – కొన మేకలవారి గూడెం
నిల్వ వసతులు
- రాష్ట్రంలో గోడౌన్లు నిల్వ సామర్థ్యం 60.12 లక్షల మెట్రిక్ టన్నులు
- ఇందులో 97 గోడౌన్లు తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్ (SWC) పరిధిలో ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 26.5లక్షల మెట్రిక్ టన్నులు
- దేశంలో గోడౌన్స్ నిల్వస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో (వరుసగా మూడేళ్లు) ఉంది.
వ్యవసాయ ఎగుమతులు
- రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జరిగే ఎగుమతుల్లో తృణధాన్యాలు, మసాలాలు, మాంసం, పత్తి ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి.
- ఇదే కాకుండా ప్రపంచంలోని 18 దేశాలకు తెలంగాణ రాష్ట్రం విత్తనాలను సరఫరా చేస్తుంది.
- రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో వ్యవసాయ ఎగుమతులు కీలకపాత్ర పోషిస్తాయని అంచనా వేశారు
- రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో 141.1 లక్ష మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించింది. ఇది మొత్తం ఉత్పత్తిలో 65 శాతానికి సమానం.
- రాష్ట్రంలో వరిని పండించే అన్ని జిల్లాల్లో స్వయం సహాయక బృందాలు ఎస్జీహెచ్ ద్వారా ధాన్యన్ని సేకరిస్తున్నారు.
- 2019-20, 2020-21లో పౌరసరఫరాల శాఖ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా గత 7 సంవత్సరాల్లో వరిని భారీ మొత్తంలో కొనుగోలు చేసింది.
- వరి సేకరణలో 23,552 పీపీసీఎస్ సంఖ్య నుంచి 252.4 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు పరిమాణం సేకరించడం ద్వారా 41.37 మంది రైతులు లబ్ది పొందారు.
- పత్తి సేకరణలో 39.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు ద్వారా 14.64 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
- 2020 సంవత్సరానికి ఎఫ్‌సీఐ నుంచి అత్యధికంగా వరి సేకరణలో పంజాబ్ (22.6శాతం) తర్వాత తెలంగాణ సుమారు గా 16 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- 2019-20లో భారత్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అత్యధిక పత్తి సేకరణ జరిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లక్ష్యాలు
- వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో రైతుల లాభాలను పరిరక్షించడం.
- మధ్యవర్తుల నుంచి రైతుల ఉత్పత్తులను కాపాడటం.
- శాస్త్రీయ పద్ధతుల్లో గోడౌన్ల నిర్మాణం
- రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉన్న గోడౌన్లు -176
- నాబార్డు సహాయంతో నిర్మించనున్న మొత్తం గోదాములు 364
- ఇప్పటికీ పూర్తయిన గోదాముల సంఖ్య 331
- గోడౌన్లు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి, కనీస మద్దతు ధర నిధుల కోసం సామర్థ్యం పెంపుదల కోసం ఉపయోగిస్తారు.
- రాష్ట్రంలో మిల్లింగ్, గిడ్డంగుల సామర్థ్యం
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి మిల్లింగ్, గిడ్డంగుల సామర్థ్యం పెంచుతూ వచ్చింది.
- వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2200 రైస్ మిల్లులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా కోటిటన్నుల బియ్యంను మిల్లింగ్ చేయగలవు.
- వరి ఉత్పత్తి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మరికొన్ని కొత్త మిల్లులు నిర్మించాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లర్స్‌కు అనుకూలమైన వాతావరనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
- 2014 నుంచి రాష్ట్ర సగటు గిడ్డంగుల సామర్థ్యం దాదాపు 140 శాతం మొత్తం గిడ్డంగుల సంఖ్య 70 నుంచి 313కి పెరిగింది.
ఫుడ్ ప్రాసెసింగ్
- రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార ఉత్పత్తి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్, యూనిట్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వరి, మొక్కజొన్న, నిమ్మ, ద్రాక్ష మామిడి సోయాబీన్లకు ప్రత్యేకంగా యూనిట్లను ఏర్పాటు చేసింది.
- రాష్ట్ర ప్రభుత్వం పసుపు, బత్తాయి (తీపి నారింజ) ఉత్పత్తిలో మొదటి స్థానంలో, టీ, కాఫీ ఉత్పత్తిలో మూడవ స్థానం, సముద్ర చేపల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది.
- ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌లో జీఓఐ చేయడానికి రూ.10000 కోట్లతో 2020-21 నుంచి 2024-25 వరకు ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ పథకం అమలు జరుగుతుంది.
- ఈ ప్రతిపాదిత పథకం కింద మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు 35 శాతం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీతో సహ రూ.10 లక్షల సీలింగ్‌తో అర్హత గల ప్రాజెక్టు వ్యయంతో తమ యూనిట్ల విస్తరణ ఆధునికీకరణ కోసం సపోర్ట్ చేస్తుంది.
- ఈ స్కీమ్ కింద ‘వన్ డైరెక్ట్ వన్ ప్రొడక్ట్’ విధానంపై కొత్త యూనిట్లకు అవకాశం ఇస్తుంది. తెలంగాణలో 2021 -22 ఆర్థిక సంవత్సరానికి కొత్త యూనిట్ల లక్ష్యం 1168.
- ఆర్థిక సంవత్సరం 2021-22కు గాను ఎస్ఈఆర్పీ (SERP) నుంచి రూ. 24.84 కోట్ల సీడ్ క్యాపిటల్‌ను మంజూరు చేసి 6207 స్వయం సహాయక బృందాల (ఎస్జీహెచ్) మహిళలకు పంపిణీ చేసింది.
యాంత్రీకరణ
- రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు భారీగా నిధులు కేటాయిస్తుంది.
ఉద్దేశం: సాగు వ్యయం, పొలం పనుల్లో తవ్వకాలు తగ్గించడం, సకాలంలో వ్యవసాయ పనులు సాగేలా చూడటం - ఎస్సీ ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ ఇతరులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించడం.
- రాష్ట్రీయ వికాస్ యోజన వంటి కార్యక్రమాలను అమలు చేస్తుంది.
- మినీ ట్రాక్టర్లు పశువులు లాగే యంత్రాలు కోసం వ్యవసాయ యంత్ర బ్యాంక్‌ల ఏర్పా టుకు 10 నుంచి 25 లక్షలు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.
- రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సుమారు రూ, 951.28 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను 6.66 లక్షల మందికి పైగా రైతులకు సరఫరా చేసింది.
- వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్క రిస్తూ వచ్చే 3,4 సంవత్సరాల్లో ప్రభుత్వ విధానాల్లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణను 45 శాతం నుంచి 90 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తుంది.
ధరల విధానం
- వ్యవసాయదారులు తమ పంటకు లాభసాటి ధర లభించినపుడే ‘విక్రయం కాగల మిగులు’ను ఉత్పత్తి చేయడానికి సిద్ధపడతాయి.
- అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రధాన రంగంగా ఉంటుంది. ఈ
- ఆర్థిక వ్యవస్థల్లో వ్యవసాయ ధర స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
- వ్యవసాయ ధరల అస్థిరత్వం 3 రకాలుగా ఉంటుంది.
- రుతుసంబంధ అస్థిరత్వం, వార్షిక అస్థిరత్వం చక్రీయ అస్థిరత్వం
వ్యవసాయ ధరల విధాన లక్ష్యాలు
- వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం
- ఆహార వస్తువుల ధరల స్థిరీకరణ సాధించడం
- పేద ప్రజలకు ఆహార భద్రత కల్పిచండం.
- వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం.
- దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడం.
- పరిమితి వనరులను సమర్థవంతంగా, అభిలషణీయంగా ఉపయోగించడం మొదలైనవి.
-జీబీకే పబ్లికేషన్స్
9959361278
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






