భారతదేశ మొదటి రిసెర్చ్ రియాక్టర్?
1. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మూడు దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి కింది జాబితాను ఇంధనం ఆధారంగా జతపర్చండి?
ఎ. మొదటి దశ 1. యురేనియం-233
బి. రెండో దశ 2. యురేనియం-235
సి. మూడో దశ 3. ప్లూటోనియం
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-2, బి-1, సి-3
2. భారత్ ష్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మూడు దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
ఎ. భారత్‌లో యురేనియం నిల్వలు ఎక్కువగా లేనందున ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమం రూపుదిద్దుకుంది
బి. దీనిలో భాగంగా భారత్‌లో మూడు దశల్లో వివిధ రకాల రియాక్టర్లను ఏర్పాటు చేసి వినియోగిస్తారు
సి. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా కేవలం 1.8 శాతం మాత్రమే
డి. 2032 నాటికి భారత్ అణుశక్తి స్థాపిత సామర్థ్యాన్ని 63,000 మెగావాట్లకు చేర్చాలని నిర్ణయించుకున్నారు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
3. భారత్‌లో అణుకార్యక్రమాలను నియంత్రించే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ గురించి కింది వాక్యాల్లో సరికానిది?
ఎ. దీనికి అణుశక్తి చట్టం-1962, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ఆధారంగా అధికారాలను బదలాయించారు
బి. దీన్ని నవంబర్ 15, 1986లో ఏర్పాటు చేశారు
సి. దేశంలోని కేంద్రక రియాక్టర్లను ఇతర అణ్వస్త్ర సదుపాయాలను పర్యవేక్షించడం దీని బాధ్యత
డి. దీని ఏర్పాటుకు డాక్టర్ ఎండీ కార్ఖానావాల కమిటీ, వీఎన్ మెకోని కమిటీ సిపారసు చేశాయి
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
4. ఎ. NPT-1968 ఒప్పందంలోని అంశాల ప్రకారం భారతదేశం అణ్వస్త్ర దేశం కాదు.
ఆర్. కేవలం 1973 ముందు అణు పరీక్షలు జరిపిన దేశాలకు మాత్రమే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర హోదా కల్పించారు.
1) ఎ, ఆర్ సంత్యం, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ సత్యం. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సత్యం, ఆర్ అసత్యం
4) ఎ, ఆర్ రెండూ అసత్యం
5. కింది భారజల కేంద్రాలను సంబంధిత రాష్ర్టాల ఆధారంగా జతపరచండి.
ఎ. HWP, తాల్చేరు 1. తెలంగాణ
బి. HWP, థాల్ 2. ఒడిశా
సి. HWP, హజీరా 3. మహారాష్ట్ర
డి. HWP, మణుగూరు 4. గుజరాత్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-1, సి-3, డి-4
6. ఎస్పీటీ ఒప్పందానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
ఎ. దీన్ని 1968లో ఏర్పాటు చేశారు
బి. ప్రపంచ దేశాలు అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకునేలా ఇది కృషి చేస్తుంది
సి. ఒప్పందంపై 191 దేశాలు సంతకం చేశాయి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనాకు అణ్వస్త్ర హోదా దక్కింది
డి. ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్, సౌత్ సూడాన్ దేశాలు ఈ ఒప్పందంలో చేరలేదు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
7. అంతర్జాతీయ ఒప్పందాలు లేదా సంస్థలను వాటి స్థాపిత సంవత్సరాల ఆధారంగా జతపర్చండి?
ఎ. 1974
1. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే
బి. 1996
2. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్
సి. 1987
3. వాసెనార్ అరెంజ్మెంట్
డి. 1957
4. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
8. A. భారత్‌లో ఉన్న అణు ఇంధన నిల్వల దృష్ట్యా బ్రీడర్ రియాక్టర్ మేలైనవి.
R. దేశంలో థోరియమ్ నిల్వలు అపారం. అంతేకాకుండా బ్రీడర్ రియాక్టర్లు తాము వినియోగించుకున్న ఇంధనం అధిక మొత్తంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు.
1) A, R సత్యం. Aకు R సరైన వివరణ
2) A, R సత్యం. Aకు R సరైన వివరణ కాదు
3) A సత్యం R అసత్యం
4) A, R రెండూ అసత్యం
9. భారత్‌కు సభ్యత్వం ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలు?
ఎ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి)
బి. ఆస్ట్రేలియా గ్రూప్
సి. వాసెనార్ అరెంజ్మెంట్
డి. మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే
(ఎమ్.టి.సి.ఆర్ )
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
10. A. ఎన్పీటీలో భారత్‌కు సభ్యత్వం లేకున్నా 2008లో భారతదేశానికి అణుఇంధనాన్ని సరఫరా చేయాలని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది.
R. భారత్ స్వయంగా అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడం NPT, IAEA షరతులను స్వచ్ఛందంగా పాటించడం, ఏ దేశంపైకి మొదటగా అణుదాడి చేయబోమని నిర్ణయించుకోవడం.
1) A, R సత్యం. Aకు R సరైన వివరణ
2) A, R సత్యం. Aకు R సరైన వివరణ కాదు
3) A సత్యం R అసత్యం
4) A, R రెండూ అసత్యం
11. మిసైల్ టెక్నాలజీ రెజిమే(ఎమ్.టి.సి.ఆర్ )కి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి
ఎ. దీన్ని బహుముఖ క్షిపణుల ఎగుమతుల నియంత్రణ ఒప్పందంగా 1967లో ప్రారంభించారు
బి. 2018లో భారత్ ఈ ఒప్పందంలో చేరింది
సి. ఈ ఒప్పందంలోని సభ్య దేశాలకు మాత్రమే 300 కిలోమీటర్లకు మించిన పరిధి 500 కిలోల పేలోడ్ సామర్థ్యం గల క్షిపణులను ఎగుమతి చేసుకునే వీలు కలుగుతుంది
డి. ఈ ఒప్పందం ఫలితంగానే బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ పెంచుకునే వీలు కలిగింది
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
12. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
1) ఇది భారత్, రష్యా, బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్
2) 2.4 గిగావాట్ల సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని పద్మానది ఒడ్డున నిర్మించారు
3) ఈ ప్రాజెక్టుకు అవసరమైన అణు ఇంధనాన్ని కెనడా సరఫరా చేయనుంది
4) 1200 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల రెండు యూనిట్లు వరుసగా 2022, 2024 నాటికి పూర్తికానున్నాయి
13. భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మూడు దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ. ఒక్కో దశలో వినియోగించే రియాక్టర్ల ద్వారా తదుపరి దశలోని రియాక్టర్లకు అవసరమైన ఇంధనం సమకూరుతుంది
బి.తొలిదశలోని పీడన సహిత భారజల రియాక్టర్లలో సహజ యురేనియంను ఇంధనంగా వినియోగిస్తారు.
సి. తొలిదశలో రియాక్టర్ల నుంచి రెండో దశలోని రియాక్టర్లకు అవసరమైన ఫ్లూటోనియమ్-239 ఉత్పత్తి అవుతుంది
డి. రెండో దశలోని రియాక్టర్ల ద్వారా మూడో దశ రియాక్టర్లకు అవసరమైన యురేనియం-233 ఇంధనం ఉత్పత్తి అవుతుంది
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
14. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి?
1) ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరు అణు రియాక్టర్ల సరఫరాకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది
2) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మించి నిర్వహించనుంది
3) ఇక్కడి రియాక్టర్లలో ఇంధనంగా యురేనియం-235 వినియోగించనున్నారు
4) భారజలాన్ని శీతలీకరణి, మితకారి (మోడరేటర్)గా వినియోగిస్తారు
15. భారత్‌లో అణుశక్తి రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంస్థలను వాటి ప్రధాన కార్యాలయం ఆధారంగా సరికాని జతను గుర్తించండి?
1) రాజా రామన్న సెంటర్ ఫర్ టెక్నాలజీ- ఇండోర్
2) ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్- ముంబై
3) భారతీయ నభీకియా విద్యుత్ నిగం లిమిటెడ్- హైదరాబాద్
4) వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్-కోల్‌కతా
16. అణువిద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లో చర్య నియంత్రించిన పరిస్థితిల్లో జరిగేది?
1) కేంద్రక విచ్ఛిత్తి 2) కేంద్రక సంలీనం
3) అణుసంయోగం 4) అణుసాంద్రీకరణ
17. U- 235 యురేనియం ఎక్కువగా ఉన్న యురేనియాన్ని ఏమని పిలుస్తారు?
1) మిక్స్డ్ ఆక్సైడ్
2) ఎన్రిచ్డ్ యురేనియం
3) బ్లాక్ యురేనియం
4) ఎల్లోకేక్
18. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ ఎక్కడ ఉంది?
1) ముంబై 2) హైదరాబాద్
3) కల్పకం- తమిళనాడు
4) ఇండోర్
19. అణురంగానికి సంబంధించిన ఏ సంస్థ హైదరాబాద్‌లో ఉంది?
1) హెవీ వాటర్ బోర్డ్
2) యురేనియం ఫ్యూయల్ కాంప్లెక్స్
3) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
4) భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్
20. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉన్న రాష్ట్రం?
1) తమిళనాడు 2) మహారాష్ట్ర
3) బీహార్ 4) ఉత్తరప్రదేశ్
21. గాంధీనగర్ (ఆహ్మదాబాద్)లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ సెంటర్లో భారత మొదటి టోక్మాక్ ప్రారంభించారు. దీనికి పెట్టిన పేరు?
1) కల్పన 2) ఆదిత్య
3) అప్సర 4) పూర్ణిమ
22. భారత్‌లో ఉన్న ప్రెషరైజ్డ్ హెవీవాటర్ రియాక్టర్లో దేనిని శీతలీకరిణిగా, మాడరేటర్‌గా ఉపయోగిస్తున్నారు?
1) ద్రవసోడియం 2) లిక్విడ్ నైట్రోజన్
3) భారజలం 4) సాధారణ నీరు
23. రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) క్యూరిమీటర్ 2) రేడియోమీటర్
3) గోనియోమీటర్ 4) గిగర్మీటర్
24. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్?
1) సోడియం-24 2) కోబాల్ట్-60
3) అయోడిన్-I 4) కోబాల్ట్-90
25. సోడియం-24 అనే రేడియో ఐసోటోప్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
1) క్యాన్సర్ నిర్ధారణ
2) రక్తప్రసరణలోని అడ్డంకులు తెలుసుకోవడానికి
3) శిలాజాల వయస్సును లెక్కించడానికి
4) థైరాయిడ్ చికిత్సకు
26. భారతదేశ మొదటి రిసెర్చ్ రియాక్టర్?
1) కామిని 2) ధ్రువ
3) పూర్ణిమ 4) అప్సర
27. భారత్‌లో అత్యధిక యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
1) జాదూగఢ్-బీహార్
2) కడప- ఆంధ్రప్రదేశ్
3) కల్పకం- తమిళనాడు
4) ఇండోర్- మధ్యప్రదేశ్
అణుశక్తి రంగంలో కృషి చేస్తున్న సంస్థలు
1.భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్, ముంబై
2. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్
3. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇండోర్
4. ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ, తేని (తమిళనాడు)
5. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, కోల్‌కతా
6. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్‌కతా
7. ఇండియా రేర్ ఎర్త్స్ లిమిటెడ్, ముంబై
8. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ముంబై
9. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జాదూగూడ
10. భారతీయ నభీకియా విద్యుత్ నిగం లిమిటెడ్, కల్పకం (తమిళనాడు)
11. హెవీ వాటర్ బోర్డ్, ముంబై
12. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్
13. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, ముంబై
14. హోమీభాభా నేషనల్ ఇన్స్టిట్యూట్, ముంబై
15. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, ముంబై, హైదరాబాద్
16. అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, ముంబై
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






