ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఏర్పడే వాయువు?
అలోహాలు
59. నిశ్చితం (ఎ)- co తటస్థ వాయువు కారణం (ఆర్)- co2 ఆమ్ల స్వభావం ఉన్న వాయువు
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు, (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు, (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
60. నిశ్చితం (ఎ)- CO విషవాయువు
కారణం (ఆర్)- COను పీల్చినప్పుడు హిమోగ్లోబిన్‌తో బంధం ఏర్పరచి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను ఏర్పరచి ఆక్సిజన్‌ను అందకుండా చేస్తుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి.
(ఎ) కు, (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి.
(ఎ) కు, (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
61. ఫొటోఫిల్మ్పై ఉపయోగించే రసాయనం ఏది?
ఎ) సోడియం సల్ఫేట్ బి) సిల్వర్ క్లోరైడ్
సి) సిల్వర్ బ్రోమైడ్
డి) సిల్వర్ అయోడైడ్
62. గాజుపై డిజైన్లు పెట్టడానికి ఉపయోగపడేది ఏది?
ఎ) HF బి) H2O
సి) H2SO4 డి) KF
63. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోని అలోహం?
ఎ) క్లోరిన్ బి) బ్రోమిన్
సి) అయోడిన్ డి) ఫ్లోరిన్
64. విరంజన చూర్ణం విడుదల చేసే వాయువు ఏది?
ఎ) క్లోరిన్ బి) ఫ్లోరిన్
సి) బ్రోమిన్ డి) అయోడిన్
65. అయోడిన్‌కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి.
1. దీనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉంటుంది
2. స్టార్చ్‌తో నీలిరంగును ఇస్తుంది
3. థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది
4. ఉత్పతనం చందే ధర్మం ఉంటుంది
5. సముద్రపు మొక్కలలో ఉంటుంది
ఎ) 1, 2 బి) 1, 3
సి) 1, 2, 3, 4 డి) అన్నీ
66. ‘గాయిటర్’ వ్యాధి ఉన్నవారికి అవసరమైన మూలకం?
ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్
సి) బ్రోమిన్ డి) అయోడిన్
67. హాలోజన్లకు ప్రధాన ఆధారం?
ఎ) సూర్యుడు బి) సముద్రాలు
సి) వర్షపు నీరు డి) అగ్నిపర్వతాలు
68. టేబుల్ సాల్ట్ అనేది?
ఎ) NaCl బి) NaNO3
సి) KCl డి) NH4Cl
69. మేఘ బీజనం ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించడానికి ఉపయోగించే రసాయనం?
1. సిల్వర్ అయోడైడ్ 2. సోడియం క్లోరైడ్
3. సిల్వర్ సల్ఫైడ్
4. సోడియం కార్బోనేట్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 4
70. చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మదిగా మండి మెరవడాన్ని ఏమంటారు?
ఎ) ఫ్లోరిసెన్స్ బి) పాస్ఫారిసెన్స్
సి) ఫైర్సెన్స్ డి) ఏదీకాదు
71. పాస్ఫరస్ పరిశ్రమల్లో పనిచేసే శ్రామికుల దవడ ఎముకలు నశించడం ఏ జబ్బు?
ఎ) ఫ్లోరోసిన్ బి) ఫాసీజా
సి) క్లోరోసిస్ డి) మినిమేటా
72. అగ్గిపుల్ల మండటం గురించి సరైన వాక్యం?
ఎ) అగ్గిపుల్ల గీసినప్పుడు పెట్టె పక్కభాగానికి గల ఎర్రభాస్వరం మొదట మండుతుంది
బి) మండిన భాస్వరం అగ్గిపుల్ల చివరన ఉన్న యాంటిమొనీ సల్ఫైడ్ను మండిస్తుంది
సి) కావాల్సిన ఆక్సిజన్‌ను పొటాషియం క్లోరేట్ అందిస్తుంది
డి) అన్నీ సరైనవే
73. చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలను అమ్మోనియా, అమ్మోనియం లవణాలుగా మార్చే బ్యాక్టీరియా?
ఎ) అమ్మోనిఫైయింగ్ బి) సహజీవన
సి) నైట్రిఫైయింగ్
డి) నైట్రొసోఫియింగ్
74. నత్రజని సమ్మేళనాలను నైట్రోజన్ వాయువుగా మార్చే బ్యాక్టీరియా?
ఎ) డీనైట్రిఫైయింగ్ బి) అమ్మోనిఫైయింగ్
సి) నైట్రిఫైయింగ్ డి) ఏదీకాదు
75. భూమిలో నత్రజనిని స్థాపించగల బ్యాక్టీరియా?
ఎ) అమ్మోనిఫైయింగ్
బి) నైట్రోసోఫైయింగ్
సి) సహజీవన డి) నైట్రిఫైయింగ్
76. నత్రజని స్థాపన చేయగల మొక్క?
ఎ) మొక్కజొన్న బి) చిక్కుడు
సి) వరి డి) వెదురు
77. సూపర్ పాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఒక?
ఎ) నత్రజని ఎరుపు
బి) పాస్ఫాటిక్ ఎరుపు
సి) పొటాషియం ఎరుపు
డి) కాల్షియం ఎరుపు
78. చర్మంపై ఏ ఆమ్లం పడినప్పుడు ప్రొటీన్ జాంథోప్రొటీన్లుగా మారి పసుపుపచ్చగా మారుతుంది?
ఎ) HNO3 బి) H2SO4
సి) HCl డి) H3PO4
79. వేడిగా ఉన్న ఏ పదార్థంపై CO2 వాయువును పంపిస్తే చల్లని, ఆకుపచ్చ మంటను పొందవచ్చు?
ఎ) తెల్ల భాస్వరం బి) గంధకం
సి) తగరపు బూడిద డి) కోక్
80. TNTని పేల్చడానికి దేన్ని కలుపుతారు?
ఎ) అమ్మోనియం క్లోరైడ్ (NH4Cl)
బి) అమ్మోనియం నైట్రేట్ (NH4NO3)
సి) అమ్మోనియం సల్ఫేట్ ((NH4)2 SO4)
డి) అమ్మోనియం నైట్రైట్ (NH4NO2)
81. ఎముకల్లో పాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
ఎ) కాల్షియం పాస్ఫైడ్
బి) కల్షియం పాస్ఫేట్
సి) కల్షియం పాైస్ఫెట్
డి) సోడియం పాస్ఫేట్
82. నైట్రోజన్ ఉన్న ఏ ఎరువులో నైట్రోజన్ శాతం అత్యధికం?
ఎ) అమ్మోనియం సల్ఫేట్
బి) అమ్మోనియం నైట్రేట్
సి) కాల్షియం సయనమైడ్
డి) యూరియా
83. డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా చేసే పని?
ఎ) అమ్మోనియాను నైట్రోజన్‌గా ఆక్సీకరించడం
బి) నైట్రోజన్‌ను అమ్మోనియాగా క్షయీకరించడం
సి) నైట్రోజన్‌ను నైట్రేట్‌గా ఆక్సీకరించడం
డి) అమ్మోనియాను నైట్రేట్‌గా మార్చడం
84. డ్రై సెల్లో ఉపయోగించే ఎలక్ట్రోలైట్లు ఏవి?
ఎ) అమోనియం క్లోరైడ్ + జింక్ క్లోరైడ్
బి) సోడియం క్లోరైడ్ + కాల్షియం క్లోరైడ్
సి) మెగ్నీషియం క్లోరైడ్ + జింక్ క్లోరైడ్
డి) అమ్మోనియం క్లోరైడ్ + కాల్షియం క్లోరైడ్
85. మొక్కలు నైట్రోజన్‌ను ఏ రూపంలో తీసుకుంటాయి?
ఎ) మూలక నైట్రోజన్ బి) నైట్రైట్లు
సి) నైట్రేట్లు డి) అమోనియా
86. మొక్కల పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన మూలకం?
ఎ) నైట్రోజన్ బి) ఆక్సిజన్
సి) పాస్ఫరస్ డి) సిలికాన్
87. ఆక్సిజన్ రూపాంతరమైన ఓజోన్ స్ట్రాటోవరణంలో ఉండి మనకు చేసే మేలు ?
ఎ) ఎండను ఆపుతుంది
బి) హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా కాపాడుతుంది
సి) ఆమ్లవర్షాలను ఆపుతుంది
డి) కాస్మిక్ కిరణాలను ఆపుతుంది
88. గాలి తగలగానే మండే స్వభావం ఉన్న మూలకం?
ఎ) సల్ఫర్ బి) పాస్ఫరస్
సి) కార్బన్ డి) ఆర్శెనిక్
89. లోతైన బోరుబావుల నీటితో కలసి వచ్చే విషపూరిత మూలకం?
ఎ) నైట్రోజన్ బి) పాస్ఫరస్
సి) ఆర్సినిక్ డి) సల్ఫర్
90. ఎలుకల మందులో ఉండే పదార్థం?
ఎ) జింక్ పాస్ఫేట్ బి) జింక్ పాస్ఫైడ్
సి) జింక్ నైట్రేట్ డి) జింక్ సల్ఫైట్
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?