20 సంఖ్యల సరాసరి 100 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత?
- మేధో సామర్థ్యం
1. 5 వరుస సంఖ్యల సరాసరి 18 అయితే ఈ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది?
ఎ) 22 బి) 21 సి) 23 డి) 20
2. 7 మ్యాచ్‌లలో సచిన్ చేసిన సగటు పరుగులు 12. 8వ మ్యాచ్ తర్వాత సచిన్ సగటు పరుగుల సంఖ్య 14 అయిన 8వ మ్యాచ్‌లో సచిన్ స్కోర్ ?
ఎ) 28 బి) 31.5
సి) 29 డి) 32.5
3. ఒక ఉమ్మడి కుటుంబంలోని 16 మంది వ్యక్తుల సగటు వయస్సు 28 సంవత్సరాల 3 నెలలు. అయితే కుటుంబంలోని 58 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా మరణించారు. మిగిలిన వారి సగటు వయస్సు ఎంత?
ఎ) 26 బి) 24 సి) 22 డి) 20
4. 20 సంఖ్యల సరాసరి 100 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత?
ఎ) 2000 బి) 3000
సి) 4000 డి) 5000
5. ఒక క్లాసులో నలుగురు విద్యార్థులు కొత్తగా చేరడం వల్ల ఈ క్లాసు సగటు బరువు 50 కిలోల నుంచి 49.5 కిలోలకు తగ్గింది. కొత్తగా చేరిన నలుగురు విద్యార్థుల సగటు బరువు 47.5 కిలోలయిన, క్లాసులో మొదట ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత?
ఎ) 12 బి) 16 సి) 14 డి) 15
6. ఒక వ్యక్తి, ఒక సంవత్సరంలో మొదటి 8 నెలల పాటు సగటున నెలకు 250 రూపాయల చొప్పున, మిగిలిన 4 నెలల పాటు నెలకు సగటున 200 రూపాయల చొప్పున ఖర్చు చేశాడు. ఖర్చులు పోగా సంవత్సరం చివర అతని వద్ద 800 రూపాయలు మిగిలితే అతనికి సగటున నెలకు వచ్చే ఆదాయం ఎంత?
ఎ) 250 బి) 280
సి) 340 డి) 300
7. 75, 77, 79, 81, 83, 85 సంఖ్యల సరాసరి విలువ ఎంత?
ఎ) 77 బి) 78 సి) 81 డి) 80
8. 13 సంఖ్యల సగటు విలువ 68. అందులో మొదటి 7 సంఖ్యల సగటు విలువ 63, చివర 7 సంఖ్యల సగటు విలువ 70 అయితే 7వ సంఖ్య విలువ ఎంత?
ఎ) 68.5 బి) 50
సి) 40 డి) 55
9. ఒక క్రికెట్ క్రీడాకారుని 16 మ్యాచ్‌ల సగటు పరుగుల విలువతో పోలిస్తే అతని 19 మ్యాచ్‌ల సగటు పరుగులు తక్కువ. చివరి 3 మ్యాచ్‌లలో అతను మొత్తం 82 పరుగులు స్కోర్ చేశాడు. అయితే మొత్తం 19 మ్యాచ్‌లకు అతని సరాసరి పరుగుల విలువ ఎంత?
ఎ) 30 బి) 32 సి) 35 డి) 36
10. ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 16 సంవత్సరాలు. వారి టీచరు వయస్సు 47 సంవత్సరాలు అయితే విద్యార్థులు, టీచరు మొత్తం సగటు వయస్సు ఎంత?
ఎ) 17 2/3 సంవత్సరాలు
బి) 31 1/3 సంవత్సరాలు
సి) 16 సంవత్సరాలు
డి) 17 సంవత్సరాలు
11. ఒక విద్యార్థికి 4 సబ్జెక్టుల్లో వచ్చిన సగటు మార్కులు 75. ఆ విద్యార్థికి 5వ సబ్జెక్టులో 80 మార్కులు వస్తే, 5 సబ్జెక్టులతో కలిపి అతనికి వచ్చిన సగటు మార్కులెన్ని?
ఎ) 74 బి) 77.5 సి) 76 డి) 75
12. 30 పెన్నులు, 75 పెన్సిళ్ల ఖరీదు 510 రూపాయలు. ఒక పెన్సిల్ సగటు ధర 2 రూపాయలు అయిన ఒక పెన్ను సగటు ధర ఎంత?
ఎ) 9 బి) 12
సి) 14 డి) 13
13. 11 రాశుల సగటు విలువ 50. మొదటి 6 రాశుల సగటు విలువ 49. చివరి 6 రాశుల సగటు విలువ 52 అయితే 6వ రాశి విలువ?
ఎ) 54 బి) 57 సి) 55 డి) 56
14. మొదటి 30 సహజ సంఖ్యల సరాసరి?
ఎ) 15.5 బి) 14.5
సి) 16.5 డి) 13.5
15. శ్రీకాంత్‌కు త్రైమాసిక పరీక్షల్లో 6 సబ్జెక్టుల్లో వరుసగా 50, 57, 63, 48, 72, 52 మార్కులు వచ్చాయి. అయితే శ్రీకాంత్‌కు సగటున ఎన్ని మార్కులు వచ్చాయి?
ఎ) 56 బి) 57 సి) 55 డి) 58
16. దీపక్ 5 కి.మీ. దూరాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేశాడు. అయితే అతను 50 ని.లలో ఎంత దూరం పూర్తి చేయగలడు?
ఎ) 10.5 కి.మీ. బి) 12.5 కి.మీ.
సి) 13.5 కి.మీ. డి) 12 కి.మీ.
17. ఒక రైలు 450 కి.మీ. దూరాన్ని 7 గంటల్లోను, 740 కి.మీ. దూరాన్ని 10 గంటల్లో ప్రయాణించింది. అయితే ఆ రైలు సరాసరి వేగం ఎంత?
ఎ) 80 కి.మీ. బి) 70 కి.మీ.
సి) 75 కి.మీ. డి) 73 కి.మీ.
18. ఒక మనిషి గంటకు 3 కి.మీ. వేగంతో ఒక చతురస్రం కర్ణాన్ని 2 నిమిషాల్లో దాటాడు. అయితే ఈ చతురస్రం వైశాల్యం ఎంత?
ఎ) 2500 మీ. బి) 5000 మీ.
సి) 7500 మీ. డి) 10,000 మీ.
19. ఒక బస్సు మధ్యలో ఆగకుండా గంటకు 54 కి.మీ. వేగంతోను, మధ్య మధ్య ఆగడం వల్ల గంటకు 45 కి.మీ. వేగంతోను ప్రయాణిస్తూ ఉంది. అయితే బస్సు గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది?
ఎ) 9 నిమిషాలు
బి) 10 నిమిషాలు
సి) 106/7 నిమిషాలు
డి) 135/7 నిమిషాలు
20. (16 మీ./సె.) ను (కి.మీ./గంటల)లో తెలపండి.
ఎ) 55.6 కి.మీ./గం బి) 50 కి.మీ./గం
సి) 57.6 కి.మీ./గం డి) 55 కి.మీ./గం
21. (B) కంటే (A) రెండురెట్లు వేగం కలవాడు, (C) కంటే (B)మూడు రెట్లు వేగం కలవాడు. ఒక ప్రయాణానికి (C)కు పట్టిన సమయం 42 నిమిషాలు అయితే (A)కు ఎంత సమయం పడతుంది?
ఎ) 7 నిమిషాలు
బి) 14 నిమిషాలు
సి) 32 నిమిషాలు
డి) 63 నిమిషాలు
22. శివ గంటకు 3 కి.మీ. వేగంతో ప్రయాణించడం వల్ల 15 నిముషాలు ఆలస్యంగా చేరుకొంటాడు. అయితే గంటకు 4 కి.మీ. వేగంతో ప్రయాణించడం వల్ల 15 నిమి-షాలు ముందుగా చేరుకుంటాడు. అయితే శివ ప్రయాణించవలసిన దూరమెంత?
ఎ) 1 కి.మీ. బి) 6 కి.మీ.
సి) 7 కి.మీ. డి) 12 కి.మీ.
23. ఇద్దరు మనుషులు కలిసి నడిచి ఒక గమ్య స్థానాన్ని చేరాలనుకొన్నారు. అందులో ఒకరు గంటకు 3.75 కి.మీ.ల వేగంతో, రెండో వారు గంటకు 3 కి.మీ.ల వేగంతో ప్రయాణించారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి కంటే అరగంట ముందుగా చేరాడు. ఆ దూరమెంత?
ఎ) 6 కి.మీ. బి) 7 కి.మీ.
సి) 7.5 కి.మీ. డి) 8 కి.మీ.
24. ఒక మనిషి 9 కి.మీ. దూరాన్ని 4 గంటలలో నడిచాడు. అతను 24 కి.మీ. దూరాన్ని ప్రయాణించాలంటే ఎంతకాలం పడుతుంది?
ఎ) 9 గంటల 40 నిమిషాలు
బి) 10 గంటల 30 నిమిషాలు
సి) 10 గంటల 40 నిమిషాలు
డి) 10 గంటల 50 నిమిషాలు
25. ఒక బస్సు 840 కి.మీ. దూరాన్ని ఒకే వేగంతో ప్రయాణిస్తే, ఒక కారు గంటకు 10 కి.మీ. ఎక్కువ వేగంతో అదే దూరాన్ని ప్రయాణించటం వల్ల 2 గంటలు తక్కువ సమయం పడుతుంది. అయితే కారు వేగం ఎంత?
ఎ) 45 కి.మీ./గం. బి) 50 కి.మీ./గం.
సి) 60 కి.మీ./గం. డి) 75 కి.మీ./గం.
26. ఒక వర్తకుడు ఒక వాషింగ్ మెషిన్‌ను రూ.1045కు అమ్మడం ద్వారా 5 శాతం నష్టాన్ని పొందాడు. ఈ వాషింగ్ మెషిన్‌పై 5 శాతం లాభం రావాలంటే, ఆ వర్తకుడు ఆ మెషిన్‌ను ఎంత ధరకు అమ్మవలసి ఉంటుంది?
ఎ) రూ. 1100 బి) రూ. 1062
సి) రూ. 1097 డి) రూ. 1155
27. ఒక కిరాణా వర్తకుడు ఏడు నిమ్మకాయలను రూ.2కు కొనుగోలు చేసి రూ.1కి మూడు నిమ్మకాయల చొప్పున అమ్మితే, అతనికి ఎంత శాతం లాభం వస్తుంది?
ఎ) 20 (1/2) శాతం బి) 18 (1/2) శాతం
సి) 18 (1/3) శాతం డి) 16 (2/3) శాతం
28. రామయ్య రెండు ఆవులను ఒక్కొక్క దాన్ని రూ.3080కు విక్రయించాడు. ఒక ఆవు మీద అతనికి 12 శాతం నష్టం వస్తే, మరో ఆవుపై 12 శాతం లాభం వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వచ్చింది లాభమా? నష్టమా ?
ఎ) నష్టం రూ.90 బి) లాభం రూ.55
సి) నష్టం రూ.55 డి) లాభం రూ.90
29. ఒక ఉత్పత్తిదారుడు టేప్‌రికార్డర్‌ను హోల్‌సేల్ వర్తకునికి 12 శాతం లాభానికి విక్రయించగా, ఆ హోల్‌సేల్ వర్తకుడు 8 శాతం లాభానికి ఈ టేప్‌రికార్డర్‌ను రిటైల్ వర్తకునికి అమ్మివేశాడు. ఆ టేప్‌రికార్డర్‌ను రిటైల్ వర్తకుడు రూ.1512 లకు కొనుగోలు చేస్తే ఆ టేప్‌రికార్డర్ ఉత్పత్తి ఖర్చు ఎంత?
ఎ) రూ.1300 బి) రూ.1225
సి) రూ.1175 డి) రూ.1250
30. ఒక చీరల వ్యాపారి చీరల ధరను కొన్న వెల కంటే 50 శాతం ఎక్కువ పెంచి, పెంచిన ధరపై 25 శాతం డిస్కౌంట్‌కు చీరలను విక్రయించాడు. అయితే అతనికి ఎంత లాభం వస్తుంది?
ఎ) 10 శాతం బి) 12 (1/2) శాతం
సి) 25 శాతం డి) 20 శాతం
31. ఒక కిరాణా వర్తకుడు ఒక కిలోరాయికి బరువుగా 900 గ్రా. తప్పుడు తూకాన్ని ఉపయోగిస్తూ, సరుకులను కొన్నధరకే అమ్మడం వల్ల అతనికి ఎంతశాతం లాభం వస్తుంది?
ఎ) 13 (3/7) శాతం
బి) 15 (4/9) శాతం
సి) 11 (1/2) శాతం
డి) 15 (4/9) శాతం
32. ఒక స్టేషనరీ దుకాణం యజమాని 11 పుస్తకాలను రూ.10కు కొనుగోలు చేసి మొత్తం పుస్తకాలన్నిటినీ రూ.11కు 10 పుస్తకాల చొప్పున విక్రయిస్తే ఎంత శాతం లాభం వస్తుంది?
ఎ) 10 శాతం బి) 11 శాతం
సి) 100 శాతం డి) 21 శాతం
33. ఒక వర్తకుడు ఒక వస్తువును 10శాతం లాభానికి విక్రయించగా, ఆ వర్తకుడు ఆ వస్తువును 10 శాతం తక్కువ ధరకే కొని రూ.132 తక్కువకే అమ్మితే అతనికి 10 శాతం లభిస్తుంది. అయితే అతడు ఆ వస్తువును ఎంత మొత్తానికి కొన్నాడు?
ఎ) రూ.1200 బి) రూ.1350
సి) రూ.1188 డి) రూ.1300
34. ఒక వర్తకుడు 80 కేజీల చక్కెరను కిలో రూ.6.75 చొప్పున, 120 కేజీల చక్కెరను కిలో రూ.8 చొప్పున కొని ఈ రెండింటినీ కలిపి విక్రయించాడు. అయితే అతనికి 20 శాతం లాభం వస్తే అతను ఆ చక్కెరను ఏ రేటు చొప్పున విక్రయించి ఉంటాడు?
ఎ) రూ. 7.50 బి) రూ. 9
సి) రూ. 8.20 డి) రూ. 8.85
35. రాజేష్ 150 కేజీల గోధుమలను కొన్నాడు. వాటిలో నాలుగోవంతు గోధుములను 10 శాతం నష్టానికి విక్రయించాడు. మొత్తం అతనికి 10 శాతం లాభం రావాలంటే మిగిలిన గోధుములను అతను ఎంత లాభానికి విక్రయించాల్సి ఉంటుంది?
ఎ) 12 (2/3) శాతం బి) 16 (1/2) శాతం
సి) 12 (3/4) శాతం డి) 16 (2/3) శాతం
36. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ రెండు సంఖ్యలకు ‘10’ కలిపితే వాటి నిష్పత్తి 5:7 అవుతుంది. అయితే ఆ సంఖ్యలు ఏవి?
ఎ) 3, 5 బి) 12, 20
సి) 15, 25 డి) 18, 30
37. ఒక క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుర సంఖ్య , బాలికల సంఖ్య కంటే 12 శాతం అధికంగా ఉంది. అయితే ఆ క్లాసులోని బాలురు, బాలికల నిష్పత్తి ఎంత?
ఎ) 11 : 14 బి) 14 : 11
సి) 25 : 28 డి) 28 : 25
38. రూ.1870ను 3 భాగాలు చేశారు. మొదటి భాగంలో 1/2వ వంతు విలువ, రెండో భాగంలో 1/3వ వంతు విలువ, మూడవ భాగంలో 1/6వ వంతు విలువ సమానమైతే 3వ భాగం విలువ ఎంత?
ఎ) రూ.510 బి) రూ.680
సి) రూ.850 డి) రూ.1020
39. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి క.సా.గు. 180 అయితే మొదటి సంఖ్యను కనుగొనండి.
ఎ) 15 బి) 20
సి) 45 డి) 60
40. రెండు సంఖ్యలు 7:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యల నుంచి 12 తీసివేస్తే వాటి నిష్పత్తి 3:5 అవుతుంది. అయితే ఆ సంఖ్యల లబ్దం ఎంత?
ఎ) 432 బి) 567
సి) 1575 డి) 1235
41. 35 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమానికి మరో 7 లీటర్ల నీటిని కలిపితే ఏర్పడే కొత్త మిశ్రమంలో పాలు, నీళ్ల నిష్పత్తి ఎంత?
ఎ) 15:18 బి) 16:18
సి) 21:20 డి) 20:21
42. 94 రూపాయలను రెండుగా విభజించారు. మొదటి భాగంలో 5వ వంతు, రెండవ భాగంలో 8వ వంతు 3:4 నిష్పత్తిలో మొదటి భాగం విలువ ఎంత?
ఎ) 30 బి) 27 సి) 36 డి) 48
43. ఒక మిశ్రమంలో ఆల్కహాల్, నీరు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమానికి 5 లీటర్ల నీటిని కలిపితే వాటి నిష్పత్తి 4:5 అవుతుంది. అయితే ఈ మిశ్రమంలోని ఆల్కహాల్ పరిమాణం ఎంత?
ఎ) 7.5 బి) 5
సి) 10 డి) 12
44. (ఎ), (బి)ల మధ్య రూ. 1,050 పంచడం జరిగింది. (ఎ)కు లభించిన వాటా (బి), (సి)ల ఇద్దరికి కలిపి లభించిన వాటిలో 2/5వ వంతుకు సమానమైతే, (ఎ)కు లభించిన మొత్తం ఎంత?
ఎ) 200 బి) 320
సి) 420 డి) 300
45. కింది నిష్పత్తులలో అన్నింటికంటే తక్కువ విలువ కలది ?
ఎ) 7 : 15 బి) 15 : 23
సి) 17 : 25 డి) 21 : 29
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు