తెలంగాణలో ప్రసిద్ధిచెందిన రుద్రేశ్వరాలయానికి మరోపేరు?
- తెలంగాణ చరిత్ర -1
1. తెలంగాణలోని భద్రకాళీ సరస్సు కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) మానేరు డ్యాం
2) నాగార్జున సాగర్ డ్యాం
3) శ్రీరామ్ సాగర్ డ్యాం
4) సింగూరు డ్యాం
2. శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింది వాటిలో దేనికి దగ్గరలో ఉంది?
1) కామారెడ్డి 2) మంచిర్యాల
3) సిద్దిపేట 4) మంథని
3. తెలంగాణలోని నదులపై కింది అంశాలను పరిగణించి, సరైన జవాబును గుర్తించండి.
ఎ. కృష్ణా నది తెలంగాణలో తంగడి గ్రామం దగ్గర ప్రవేశిస్తుంది
బి. గోదావరి నదిని మంజీర నది నిజామాబాద్ జిల్లాలో కలుస్తుంది
1) బి 2) ఎ
3) ఎ, బి సరైనవి కావు
4) ఎ, బి రెండూ సరైనవి
4. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. నిర్మల్ సుసంపన్నమైన హస్తకళలకు పేరు
బి. చేర్యాల అద్భుతమైన నకాశీకి పేరు
సి. పెంబర్తి పందాపై చేసే అనేక కళాకృతులకు (షీట్ మెటల్ ఆర్ట్) పేరు
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
5. ప్రాణహిత-గోదావరి లోయ కింది వాటిలో ఏ నిల్వలకు ప్రసిద్ధి?
1) గ్రాఫైట్ 2) గ్రానైట్
3) బొగ్గు 4) డోలమైట్
6. రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం గల లింబాద్రి గుట్ట దేవాలయం ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌గల్‌కు సమీపంలో ఉంది
బి. రామలింగేశ్వర దేవాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేటలో ఉంది
1) ఎ 2) ఎ, బి రెండూ సరైనవి కావు
3) బి 4) ఎ, బి రెండూ సరైనవే
7. సాధారణంగా తెలంగాణలో అత్యధిక వేసవికాల ఉష్ణోగ్రత ఏ స్టేషన్ వద్ద నమోదు చేయబడింది?
1) మంచిర్యాల 2) ఇల్లందు
3) రామగుండం 4) నల్లగొండ
8. తెలంగాణలో పండించే కింది పంటలలో ప్రధానమైన ఆహార పంటలు ఏవి?
సరైన జవాబును గుర్తించండి.
ఎ. వరి బి. వేరు శనగ
సి. పత్తి డి. మొక్కజొన్న
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, డి
9. తెలంగాణలో ‘ధూళికట్ట’ అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధిగాంచింది?
1) తెలంగాణలో గోదావరి నది ఇక్కడ
ప్రవేశిస్తుంది
2) ఈ ప్రదేశంలో రాణి రుద్రమను
చంపారు
3) క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధస్థూపం ఇక్కడ ఉంది
4) శాతవాహనుల కాలంలో ఇది ఒక ప్రసిద్ధ వర్తక ప్రదేశం
10. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప పొడవు గల జాతీయ రహదారి?
1) NH 61 2) NH 765
3) NH 161 4) NH 63
11. రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో 2011 జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత కంటే ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు ఎన్ని?
1) 13 2) 15
3) 11 4) 20
12. జతపరచండి.
ఎ. శ్రీరాం సాగర్ 1. కరీంనగర్
బి. ప్రియదర్శిని జూరాల 2. ఆదిలాబాద్
సి. కడెమ్ 3. మహబూబ్‌నగర్
డి. శనిగరమ్ 4. నిజామాబాద్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
13. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి?
1) 11 2) 13
3) 10 4) 12
14. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నీటి పారుదల సదుపాయాలు ఏవి? సరైన జవాబును గుర్తించండి.
ఎ. బావులు బి. చెరువులు
సి. సముద్రం డి. కాలువలు
1) ఎ, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
15. తెలంగాణలో ఎర్ర ఇసుక లోమ్ మృత్తికలు, స్థానికంగా ఎలా పిలువబడతాయి?
1) దుబ్బ 2) చల్క
3) రేగడి 4) లేటరైట్
16. తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) ఛత్తీస్‌గఢ్ 4) ఆంధ్రప్రదేశ్
17. కింది వాటిలో ఏ ప్రాంతం బొగ్గు నిక్షేపాలు కలిగింది కాదు?
1) పాల్వంచ 2) శివపురం
3) కొత్తగూడెం 4) నమ్మాపూర్
18. తెలంగాణలో హెరిటేజ్ జైలు మ్యూజియం ఎక్కడ ఉంది?
1) జగిత్యాల 2) వనపర్తి
3) వరంగల్ 4) సంగారెడ్డి
19. తెలంగాణలో బొగ్గు నిల్వలు –
1) భారతదేశపు మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం కలవు
2) భారతదేశపు మొత్తం బొగ్గు నిల్వల్లో 30 శాతం కలవు
3) భారతదేశపు మొత్తం బొగ్గు నిల్వల్లో 15 శాతం కలవు
4) భారతదేశపు మొత్తం బొగ్గు నిల్వల్లో 10 శాతం కలవు
20. హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది?
1) లాడ్ బజార్ 2) పురానీ హవేలీ
3) గోషామహల్ 4) శాలిబండ
21. కింది నదుల్లో ఏ రెండు ప్రధాన నదులు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రవహిస్తున్నాయి?
1) గోదావరి, కృష్ణా 2) భీమ, నర్మద
3) పాతాళ గంగ, తపతి
4) కృష్ణా, తుంగభద్ర
22. రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది?
1) అలంపూర్-జోగులాంబ, గద్వాల జిల్లా
2) కొలనుపాక-యాదాద్రి భువనగిరి జిల్లా
3) కాళేశ్వరం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా
4) కీసర-మేడ్చల్ జిల్లా
23. ఉపగ్రహం నుంచి భూ సంకేతాలు సంగ్రహించే భూ స్టేషన్ ఎక్కడ ఉంది?
1) మహబూబ్‌నగర్
2) షాద్‌నగర్
3) హైదరాబాద్
4) రంగారెడ్డి
24. అలంపూర్ ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా 2) తుంగభద్ర
3) గోదావరి 4) పెన్నా
25. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది?
1) జగిత్యాల 2) పెద్దపల్లి
3) కరీంనగర్ 4) రాజన్న సిరిసిల్ల
26. తెలంగాణలో భౌగోళిక ఆకృతుల (geological formations)లో అతి పురాతన రకం?
1) వింధ్య శిలలు 2) ఆర్కియన్ శిలలు
3) కడప శిలల వ్యవస్థ
4) ధార్వార్ శిలల సమూహాలు
27. ఉత్తర తెలంగాణ వ్యవసాయిక వాతావరణ మండలపు ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించారు?
1) వరంగల్ 2) చింతపల్లి
3) జగిత్యాల 4) పాలెం
28. కింది నమూనాలకు, వాటి తయారీ స్థలాలను జతపరచండి.
ఎ. ఇక్కత్ 1. సిద్దిపేట
బి. గొల్లభామ 2. వరంగల్
సి. కుట్టంచు 3. పోచంపల్లి
డి. తివాచీలు 4. గద్వాల
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
29. తెలంగాణ రాష్ట్రంలోని అతి పొడవైన జాతీయ రహదారి ?
1) NH 163 2) NH 44
3) NH 65 4) NH 221
30. వర్షపాతాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం?
1) హరితహారం 2) గ్రామజ్యోతి
3) మిషన్ కాకతీయ 4) మిషన్ భగీరథ
31. ఏ ప్రాంతంలో 500 ఎకరాల అటవీ ప్రాంతంలో ఉండే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇటీవల అటవీ శాఖ అనుమతి లభించింది?
1) పరిగి మండలం, వికారాబాద్ జిల్లా
2) పెబ్బేరు మండలం, వనపర్తి జిల్లా
3) నవాబ్‌పేట్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
4) కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
32. ఫ్లోరింగ్, పైకప్పులకు ఉపయోగపడే భీమా గ్రూప్ సున్నపురాయి తెలంగాణలో ఎక్కడ లభిస్తుంది?
1) మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్
2) మంచిర్యాల జిల్లాలోని తాండూర్
3) నల్లగొండ జిల్లాలోని తడకమళ్ల
4) వికారాబాద్ జిల్లాలోని తాండూర్
33. జతపరచండి.
ఎ. అనంతగిరి కొండలు
1.వికారాబాద్
బి. నల్లమల కొండలు 2. నాగర్‌కర్నూల్
సి. ఎర్ర కొండలు 3. కరీంనగర్
డి. రాచకొండలు 4. నల్లగొండ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
34. రాష్ట్రంలోని ఏ జిల్లా అత్యధిక మండలాలను కలిగి ఉంది?
1) కామారెడ్డి 2) ఖమ్మం
3) వరంగల్ 4) నల్లగొండ
35. తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గుగని అని పిలుస్తారు?
1) సిద్దిపేట 2) కొత్తగూడెం
3) కరీంనగర్ 4) బెల్లంపల్లి
36. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ‘ఆసియా రుమాల్’ తయారవుతుంది?
1) పోచంపల్లి 2) కొత్తకోట
3) గద్వాల్ 4) సిరిసిల్ల
37. తెలంగాణలో వందలాది సంవత్సరాలుగా సాగునీటి వనరులలో ప్రధానమైనది ఏది?
1) సాధారణ బావులు 2) చెరువులు
3) బోరు బావులు 4) కాలువలు
38. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలు గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై ఏ మూడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంపై సంతకాలు చేశాయి?
1) తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, ఛనాకా కొరాటా ప్రాజెక్టులు
2) తుమ్మడిహట్టి, ఏలేశ్వరం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు
3) మేడిగడ్డ, ఏలేశ్వరం, ఛనాకా కొరాటా ప్రాజెక్టులు
4) మేడిగడ్డ, కాళేశ్వరం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు
39. కుంతల జలపాతం గల నది?
1) స్వర్ణ నది 2) ప్రాణహిత నది
3) పెన్ గంగా నది 4) కడెం నది
40. కింది వాటిలో ఒకటి తెలంగాణ ట్రైబల్ ఎకో టూరిజం సర్క్యూట్లో గుర్తించిన గమ్య స్థానాల్లో భాగం కాదు?
1) జోడేఘాట్
2) కొరటికల్ వాటర్ ఫాల్స్
3) అనంతగిరి కొండలు
4) శ్యాంగఢ్ కోట
41. కింది వాటిలో సున్న పురాయి నిక్షేపాలు లేని జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) పెద్దపల్లి
3) మంచిర్యాల
4) వికారాబాద్
42. నల్లగొండ జిల్లాలోని పులిచెర్ల, నమ్మాపురం, ఎల్లాపురంలో కింది వాటిలో ఏ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి?
1) రాగి 2) యురేనియం
3) ఇనుము 4) మాంగనీస్
43. సూర్యాపేట జిల్లాలోని ‘ఫణిగిరి’ దేనికి ప్రసిద్ధి చెందింది?
1) నిజాం పాలనకు వ్యతిరేకంగా
సాయుధ పోరాటం ఆరంభమైంది
2) లింగమంతుల జాతర
3) మూసీనది కృష్ణాలో ప్రవేశిస్తుంది
4) బౌద్ధక్షేత్రం
44. వర్షపాతం, నేలల స్వభావం, పంటల సాగు పద్ధతులు మొదలైన అంశాల ఆధారంగా రాష్ర్టాన్ని వ్యవసాయక వాతావరణ మండలాలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో గల వ్యవసాయక వాతావరణ మండలాల సంఖ్య ఎంత?
1) 5 2) 3 3) 4 4) 6
45. తెలంగాణ ప్రభుత్వం కింది ఏ పథకం నీటి వనరుల సంరక్షణకు ఉద్దేశించింది?
1) కాళేశ్వరం ప్రాజెక్టు
2) ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు
3) మిషన్ భగీరథ
4) మిషన్ కాకతీయ
46. తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కింది వాటిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగిన జిల్లా ఏది?
1) కుమ్రం భీం ఆసిఫాబాద్
2) ఆదిలాబాద్ 3) వరంగల్
4) భద్రాద్రి కొత్తగూడెం
47. కృష్ణానది ఒడ్డున జూరాల వద్ద గల చంద్రగఢ్ పర్వత కోటను ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం నిర్మించారు?
1) ఆయుధాలు నిల్వ చేయడానికి
2) జిల్లాదార్ చంద్రసేన్ నివాసం
3) ప్రజల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలను, పన్నులను నిల్వ చేయడానికి
4) జైలు
48. తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో అతిపెద్ద రాష్ట్ర రహదారి ఏది?
1) SH 18 2) SH 1
3) SH 16 4) SH 15
49. వేయి స్తంభాల గుడిని కింది వాటిలో ఏ పేరుతో కూడా పిలుస్తారు?
1) స్వయంభూ దేవాలయం, కేశవాలయం
2) పద్మాక్షి ఆలయం
3) సిద్ధేశ్వరాలయం
4) రుద్రేశ్వరాలయం, త్రికూట ఆలయం
50. కింది వాటిలో ఏది తెలంగాణలో సంప్రదాయ పట్టునేత కేంద్రం కాదు?
1) పోచంపల్లి 2) గద్వాల
3) బోధన్ 4) నారాయణ పేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు