పరస్పర సంస్కృతి ప్రసరణలే సామాజీకరణ
సామాజీకరణనిర్వచనాలు, భావన
సీడీపీవో పరీక్షల ప్రత్యేకం
- సమూహం ప్రమాణాలను వ్యక్తి అనుసరించడానికి నేర్పే విధానమే సామాజీకరణ – అగ్బర్న్
- సంస్కృతి నియమాలు ఆచార వ్యవహారాలు అలవరచుకునే ప్రక్రియనే సామాజీకరణ అంటారు – వెస్లే
- సమాజ జీవనానికి అవసరమైన సూత్రాలను అభ్యసించే ప్రక్రియే సామాజీకరణ – Maclver
సామాజీకరణ లక్షణాలు
- సామాజీకరణ సంస్కృతీకరణ ప్రభావానికి లోనవుతుంది
- జైవిక జంతువుని సామాజిక జంతువుగా మార్పు చెందిస్తుంది
- Personalityని రూపొందే ప్రక్రియే Socialization
- సమాజంలో పూర్తిస్థాయి సభ్యుడిగా మనిషిని తయారు చేసే ప్రక్రియే సామాజీకరణ
- Socializationను ‘సంస్కృతి ప్రసరణ’ అని కూడా అంటారు
- ఇది నిరంతరం, జీవితాంతం జరిగే ప్రక్రియ
- సమాజాన్ని బట్టి, సంస్కృతిని బట్టి Socialization మారుతుంది.
- ఒకతరం నుంచి మరో తరానికి ఈ ప్రక్రియ ద్వారా సంస్కృతి అందజేయబడుతుంది
- Punishment, Reward, Imitation, Motivation, Observationలను ప్రధాన సామాజీకరణ పద్ధతులు అంటారు
- సామాజీకరణలో వైయక్త్తీకరణ ఉంటుంది
- సోషల్ నార్మ్స్ను అభ్యసించడమే సామాజీకరణ
- సమాజంలో విషయాలను అంతర్లీనం చేసుకోవడమే Socialization
- సామాజిక పరస్పర చర్యలు అనేవి కూడా సామాజీకరణలో భాగమే
- అభిలషణీయమైన అభ్యసనలనే సామాజీకరణ అంటారు
సామాజీకరణ రూపాలు
- సామాజీకరణ లక్ష్యం, దాని విధానాన్ని బట్టి వివిధ రూపాల్లో తెలుపవచ్చు. ఇయాన్ రాబర్ట్ సన్ తన గ్రంథమైన ‘సోషియాలజీ’ నందు నాలుగు రకాల సామాజీకరణలు తెలిపాడు. అవి..
1. ప్రాథమిక సామాజీకరణ
2. ముందస్తు లేదా పూర్వదాన సామాజీకరణ
3. అభివృద్ధి సామాజీకరణ
4. పునర్ సాంఘీకీకరణ
నోట్ – ప్రతి వ్యక్తి పైన తెలిపిన అన్ని సామాజీకరణలకు గురికావచ్చు లేదా కొన్నింటికే గురికావచ్చు
- పైవాటితో పాటు ఇతర సామాజీకరణ రూపాలు కూడా ఉన్నాయి. అవి..
1. గౌణ/ద్వితీయ సామాజీకరణ
2. బాల్య సామాజీకరణ
3. వయోజన సామాజీకరణ
4. లింగ బేధ సామాజీకరణ
5. చేతన పూర్వక సామాజీకరణ
6. అచేతన పూర్వక సామాజీకరణ
7. నియత సామాజీకరణ
8. అనియత సామాజీకరణ
9. Reverse/ De Socialization
- ప్రాథమిక సామాజికరణ జీవిత ప్రారంభ దశలో భాష, శారీరక క్రియలు, కట్టుబాట్లు, విలువలు, ఉద్వేగాలు వంటి వాటితో కూడుకొని ప్రాథమిక సంస్థలు, ప్రాథమిక సమూహంలో ముఖ్యంగా కుటుంబం ద్వారా సామాజీకరణ చేయబడుతుంది.
- దీనివల్ల మూర్తిమత్వ వికాసానికి, Self or నేను అనే భావన ఏర్పడుతాయి. ఈ దశలో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయదగింది, ఏది చేయకూడనిది వంటి విషయాలు ఇందులో భాగంగా తెలుస్తాయి. శిక్షలు, బహుమతులు, యత్నదోషం, పరిశీలన వంటి పద్ధతుల ద్వారా ప్రాథమిక సామాజీకరణం జరుగుతుంది
- భవిష్యత్తు పాత్రల కోసం ప్రస్తుతం సంసిద్ధం కావడం ‘Anticipatory Socialisation’ లేదా పూర్వ సాధన సామాజీకరణ అంటారు.
- ఉదా. – ఎస్.ఐ. పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారు ముందే దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవడం
- బాల, బాలికలకు వేర్వేరుగా సామాజీకరణ కలిగించడాన్ని లింగభేద సామాజీకరణ అంటారు.
- చేతనాపూర్వకంగా సామాజిక అంశాలను అంతర్లీనం చేసుకోవడాన్ని చేతనాపూర్వక సామాజీకరణ అని అలాగే అచేతనంగా, ఉపచేతనంగా సామాజిక అంశాలను అంతర్లీనం చేసుకోవడాన్ని అచేతన సామాజీకరణ అని అంటారు.
- ఇప్పటివరకు నేర్చుకున్న సామాజిక అంశాల స్థానంలో నూతన సామాజిక అంశాలను నేర్చుకోవడాన్ని రివర్స్ సోషలైజేషన్ అంటారు.
- ఉదా. అమెరికాలో నివసించే భారతీయ ఎన్.ఆర్. ఐ.లు భారతీయ సంస్కృతి స్థానంలో అమెరికన్ సంస్కృతి నేర్చుకోవడం.
సామాజీకరణ ప్రభావితం చేసే కారణాలు
- వ్యక్తి చుట్టూ ఉన్న అన్ని రకాల పరిసరాలు అంటే కుటుంబం, మిత్రులు, ఇరుగు-పొరుగు, మతం, పండుగలు, మీడియా ఇలా వివిధ అంశాలు జీవితాంతం వ్యక్తిని సామాజీకరణకు గురిచేస్తాయి. కానీ వీటన్నింటిలో అతిముఖ్యమైన సామాజీకరణ సాధనం కుటుంబం, తల్లి. సామాజీకరణ ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు.
1. జైవిక లేదా వారసత్వ కారకాలు
- వ్యక్తిలో సామాజిక అంశాలు నేర్చుకునే సామర్థ్యం, మూర్తిమత్వానికి సంబంధించి అంశాలు అతడి పూర్వీకుల ద్వారా వ్యక్తికి సంక్రమిస్తాయి. ఇవే వారసత్వ కారకాలు
2. సాంస్కృతిక కారకాలు
- వారసత్వ కారకాలతో పాటు వ్యక్తి పెరిగిన ప్రాంతం, దేశం, అతడి మతం, అలవాట్లు, కట్టుబాట్లు వంటివి కూడా వ్యక్తి సామాజీకరణను ప్రభావితం చేస్తాయి. వీటితో పాటు సామాజిక కారకాలు, రాజకీయ కారకాలు, పర్యావరణ కారకాలు కూడా వ్యక్తి సామాజీకరణ కీలకపాత్ర వహిస్తాయి.
సామాజీకరణ సాధనాలు
- వ్యక్తిని సామాజీకరణ గురిచేసుటవంటి వాటినే సామాజీకరణ సాధనలు అంటారు. ఇవి ప్రాధానంగా రెండు రకాలు.
1. ప్రాథమిక సామాజీకరణ సాధనాలు
2. ద్వితీయ లేదా గౌణ సామాజీకరణ సాధనాలు
- వ్యక్తి బాల్యంలో జరిగే సామాజీకరణకు కారణం ప్రాథమిక సామాజీకరణ సాధనాలు
- కుటుంబం, పాఠశాల, పనిప్రదేశం, సమవయస్సు బృందాలు వంటి వాటిని ప్రాథమిక సామాజిక సాధనాలు అంటారు.
- ప్రాథమిక సామాజిక సాధనాలు వ్యక్తి మూర్తిమత్వం ఏర్పడుటకు ప్రధాన కారణాలు.
- ‘David Rishman’ ప్రకారం సమవయస్సు సంస్కృతి అనేది తల్లిదండ్రుల సంస్కృతి, పాఠశాల సంస్కృతి కంటే కూడా భిన్నమైనది, ముఖ్యమైనది.
సామాజీకరణ పద్ధతులు
- సామాజీకరణ అనేది కింది పద్ధతుల ద్వారా కొనసాగుతుంది.
1. తన చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి నేర్చుకోవడం దీన్నే ‘నమూనా అభ్యసనం’ లేదా సామాజిక అభ్యసనం లేదా అనుకరణ లేదా పరిశీలనా అభ్యసనం అంటారని ‘ఆల్బర్ట్ బండూరా’ తెలిపారు. వ్యక్తి సామాజీకరణలో అధికశాతం అంశాలు ఈ విధానంలోనే నేర్చుకుంటారు.
2. వ్యక్తిలో ఉన్న అంతర్గత ప్రేరణ, బయట సమాజం కల్పించే ప్రేరణ వల్ల వ్యక్తి నూతన విషయాలు నేర్చుకొని సామాజీకరణ గురవుతారు.
3. దండనకు కూడా బయపడి వ్యక్తి చేయదగిన అంశాలను మాత్రమే నేర్చుకుంటాడు.
4. సమాజంలోని సామాజీకరణకు చెందిన వివిధ అంశాలను యత్న దోషం ద్వారా, నిబంధనం ద్వారా, శిక్షణ ద్వారా, ఉద్దీపన ప్రతిస్పందనల ద్వారా నేర్చుకుంటాడు.
5. అనుకరణ అనేది మానవనైజం కాబట్టి సామాజీకరణలో అనుకరణ కీలకపాత్ర వహిస్తుంది.
6. నమూనా అభ్యసనం గురించి ‘మిల్లర్ డీలార్డ్’ తన గ్రంథమైన సోషల్ లెర్నింగ్ & ఇమిటేషన్ లో మొదటిసారి పేర్కొన్నాడు. వీరి ప్రకారం దీర్ఘకాలం పరిశీలించి అనుసరించడమే నమూనా అభ్యసనం
7. ప్రేరణ అనేది కూడా సామాజీకరణలో కీలకపాత్ర వహిస్తుంది. ‘మోటివేషన్ అనే పదం మొవర్’ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. దీనికి కదలిక అని అర్థం.
8. ప్రేరణ ప్రధానంగా-
1. అంతర్గత ప్రేరణ
2. బహిర్గత ప్రేరణ
3. సాధనా ప్రేరణ అనే రూపాల్లో ఉంటుంది. అన్ని రకాల ప్రేరణలో అంతర్గత ప్రేరణ బలీయమైనది.
- సాధనా ప్రేరణ అనే భావననే ‘మెక్లిలాండ్ & అట్కిన్సన్’లు తెలిపారు.
సామాజీకరణ ప్రక్రియను వివరించే సిద్ధాంతాలు
- సామాజీకరణ ఎలా కొనసాగుతుంది అనే అంశాన్ని వివరించేందుకు శాస్త్రవేత్తలు వారి అభిప్రాయాలను కింది సిద్ధాంతాల రూపంలో తెలిపారు.
1. దర్పణ ఆత్మభావన సిద్ధాంతం – CH Chooley
2. దశత్రయ సిద్ధాంతం – GH Mead
3. మనో విశ్లేషణ సిద్ధాంతం – Sigment Freud
4. మనోలైంగిక వికాస సిద్ధాంతం – AnnaFreud & Sigmand Freud
5. మనోసాంఘిక వికాస సిద్ధాంతం – Erikson
6. ఉమ్మడి ప్రాతినిధ్య సిద్ధాంతం – Emile Durikheim
7. సన్నివేశ నిర్వచన సిద్ధాంతం – WI Thomos
బింబ – ప్రతిబింబ సిద్ధాంతం
- ఈ సిద్ధాంతాన్ని కూలే ప్రతిపాదించాడు
- ఇతని ప్రకారం Family ప్రముఖమైన సామాజిక సంస్థ.
- Primary Groups అయిన Family వంటి వాటిలో బాల్యంలోనే నేను, లేదా Self, Ego ఏర్పడుతుంది.
- ‘Chooley’ ప్రకారం ఆత్మభావన లేదా నేను అనే భావన ఇతరుల సహాయం లేకుండా జరుగదు.
- ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపైనే వ్యక్తి ఒక అభిప్రాయానికి వచ్చి తన ఆత్మకు సంబంధించి Imageను ఏర్పరుచుకుంటాడు.
- ఇలా ఇతరుల అభిప్రాయాలకు ప్రతిస్పందించి తాను అలాంటివాడిని అని ఊహించుకొని తన ఆత్మకు సంబంధించిన ప్రతిబింబాన్ని రూపొందించుకునే ప్రక్రియనే Looking Glass Self Thoery అని Chooley అన్నాడు.
- అద్దంలో శరీర ప్రతిబింబం కనిపిస్తే సమాజంలోని అభిప్రాయాల్లో వ్యక్తి ఆత్మరూపం ప్రతిబింబిస్తుంది.
- ఆత్మభావన లేదా స్వార్థం లేదా నేను అనేది మొదటగా గర్వంతో ప్రారంభం అవుతుందని Chooley తెలిపాడు. మన ప్రవర్తన విధానాలపై సమాజం అనే అర్థం చూపించే ఇష్టత, అయిష్టత, విముఖత, Acceptance, Non-Acceptance, Approval- Disapproval, Reward, Incentive వంటి వాటి ఆధారంగా వ్యక్తి దేన్ని నేర్చుకోవాలి దేన్ని నేర్చుకోకూడదు అని తెలుసుకుంటాడు. దీన్నే ‘సామాజీకరణ’ అంటారు.
- ‘Chooley’ తన గ్రంథమైన ‘Human Nature and Social Order’లో ఆత్మదర్పణాన్ని మూడు రకాలుగా పేర్కొన్నాడు.
1. తాను ఇతరులకు ఎలా కనిపిస్తున్నాడు
2. ఇతరులు తనను చూచి ఎలా అర్థం చేసుకుంటున్నారు
3. పై రెండు భావనల ఆధారంగా వ్యక్తి తన మూర్తిమత్వాన్ని తెలుసుకుంటాడు
- ఇతని ప్రకారం మనస్సు సాంఘికమైనది, సమాజానికి మనస్సు ఉంటుంది
- ఆత్మ, సమాజాలు ‘కవల పిల్లలు’ ‘Society’ లేకుండా ‘Igo’ అనేది లేదుమనోవిశ్లేషణ సిద్ధాంతం
మనోవిశ్లేషణ సిద్ధాంతం
- Chooley సామాజిక కోణంలో సాంఘీకరణ వివరిస్తే Sigmen Freudలో ఉన్న మానసిక అంశాల ద్వారా సామాజీకరణను తెలిపాడు.
- ఇతని ప్రకారం మనస్సు Id, Ego, Super egoలతో నింపి ఉంటుంది.
- Id (ఆది) – పుట్టుకతోనే ఉండే లైంగిక శక్తి, లిబిడో లేదా Basket of Desires ఇది సహజాతాలతో నిండి ఉంటుంది. ఇది Principle of Pleasure లేదా ఆనంద సూత్రాన్ని అనుసరిస్తూ పాశవికత వంటి అంశాలతో కూడుకొని ఉంటుంది. Id అనేది సూపర్ఇగో పర్యవేక్షణలో ఇగో ద్వారా నియంత్రించబడుతుంది.
- Ego – సామాజీకరణ ప్రక్రియ ద్వారా సామాజిక అంశాలు నేర్చుకొని సమాజానికి అనుగుణంగా ‘ప్రిన్సిపుల్ ఆఫ్ రియాలిటీ’ లేదా వాస్తవిక సూత్రం ఆధారంగా ఏది చేయవలసింది? ఏది చేయకూడనిది, దేన్ని సమాజం ఆమోదిస్తుంది? దేన్ని సమాజం ఆమోదించదు వంటి ఆంశాలతో కూడిన దాన్నే ‘ఇగో’ అంటారు. ఇది అధ్యహం మార్గదర్శకత్వంలో ఇడ్ను నియంత్రిస్తుంది.
- Super Ego – ఇది ‘ప్రిన్సిపుల్ ఆఫ్ మొరాలిటీ’ లేదా నైతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అత్యున్నత విలువలను పాటిస్తూ నీతి, నిజాయితీ, నైతికత, ఆధ్యాత్మికత వంటి అంశాలతో కూడి ఉంటుంది.
- సూపర్ ఇగో Idను Ego ద్వారా నియంత్రిస్తుంది
- Sigment Freud ప్రకారం వ్యక్తిలో అదుపుతప్పి ఉన్న కోరికలు లేదా సహజంగా ఉన్న సమాజం ద్వారా నియంత్రించబడతాయి. ఇలా వ్యక్తి సమాజానికి నచ్చని తన ప్రవర్తనని దమనానికి గురి చేస్తాడు.
నిర్వాణ పబ్లిషింగ్ హౌజ్సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు