‘భారతీయ పత్రిక విమోచనకారి’ అని ఎవరిని అన్నారు?
అక్టోబర్ 12వ తేదీ తరువాయి..
లార్డ్ వెల్లస్లీ (1798-1805)
- ఈయన బెంగాల్ టైగర్‌గా వినుతికెక్కాడు.
- సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్.
- భారతదేశ రక్షణ ఈయన కాలంలో కంపెనీ బాధ్యతగా మారింది. దుష్పరిపాలన కింద తంజావూరు, కర్ణాటకలను ఆక్రమించి, మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు.
- యువ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు 1800లో ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు.
జార్జ్ బర్లో (1805-07)
- వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఈయన కాలంలో జరిగింది.
లార్డ్ మింటో (1807-13)
- ఇతని కాలంలో 1809లో రంజిత్ సింగ్‌తో అమృత్ సర్ సంధి జరిగింది.
- ఈయన కాలంలో 1813 చార్టర్ వచ్చింది. దీనిపరంగా విద్య కోసం రూ.లక్ష కేటాయించారు.
లార్డ్ హేస్టింగ్స్ (1813-23)
- ఈయన కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పడింది.
- lఆంగ్లో నేపాలిస్ యుద్ధం 1814 నుంచి 1816 వరకు సంభవించింది.
- గూర్ఖా నాయకుడైన అమర్ సింగ్‌ను ఓడించాడు.
- పిండారీలను తీవ్రంగా అణచివేశాడు. ఇందుకు సర్ థామస్ హిప్లావ్ అనే సైన్యాధికారిని ఉపయోగించుకున్నాడు.
- భారతదేశంలో లార్డ్ హేస్టింగ్స్ 28 యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఈయన మన దేశంలో 128 కోటలను జయించాడు.
- ఈయన కాలంలో మూడో మహారాష్ట్ర యుద్ధం జరిగింది. దీనిలో పీష్వాలు పూర్తిగా ఓడిపోయి, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోయారు.
- రాజపుత్రులను బ్రిటిష్ వారికి సహజ మిత్రులుగాను, మరాఠాలను సహజ శత్రువులుగాను భావించిన ఏకైక గవర్నర్ జనరల్.
- హేస్టింగ్స్ కాలంలోనే భారతదేశంలో మొట్టమొదటి వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అయిన సమాచార్ దర్పన్ను ప్రారంభించారు.
- ఈయన కాలంలో మద్రాస్ రాష్ట్రంలో సర్ థామస్ మన్రో నాయకత్వంలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టారు.
జాన్ ఆడమ్స్ (1823)
- ప్రింటింగ్ ప్రెస్‌లను స్థాపించడానికి లైసెన్స్‌లను తప్పనిసరి చేశాడు.
- మొట్టమొదటి ప్రెస్ ఆర్డినెన్స్‌ను జారీచేశాడు.
లార్డ్ అమెరెస్ట్ (1823-28)
- ఈయన కాలంలో మొదటి బర్మా యుద్ధం జరిగింది.
- మొఘల్ చక్రవర్తి అక్బర్-2 ద్వారా సమానంగా గుర్తింపు పొందిన మొట్టమొదటి గవర్నర్ జనరల్.
విలియం బెంటింక్ (1828-35)
- బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్నటువంటి విలియం బెంటింక్ 1833 చార్టర్ చట్టం ప్రకారం మొట్ట మొదటిసారిగా భారత గవర్నర్ జనరల్‌గా మారాడు.
- lపబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, దాని అధ్యక్షుడిగా మెకాలేను నియమించాడు.
- థగ్గులను అణచివేశాడు. ఇందుకు 1831లో కల్నల్ విలియం స్లీమ్యాన్ సేవలు ఉపయోగించుకున్నాడు. దాదాపు 1500 మంది థగ్గులను అరెస్ట్ చేశాడు.
- మైసూర్, కూర్గు, సెంట్రల్ కచార్లను దుష్పరిపాలనాధారంగా ఆక్రమించాడు. అధికార భాషలుగా పర్షియన్, వెర్నాక్యులర్ భాషలను బెంటింక్ గుర్తించాడు.
- ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతవాసుల సౌలభ్యం కోసం ప్రత్యేక సదర్ నిజామత్, సదర్ దివానీ అదాలత్‌లను అలహాబాద్‌లో ఏర్పరిచాడు.
- కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన అప్పీల్, సర్క్యూట్ ప్రొవిన్షియల్ కోర్టులను 1831లో రద్దుచేశాడు.
- lన్యాయ సలహా సభ్యుడైన మెకాలే నివేదిక ప్రకారం ఈయన కాలంలో పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లిష్‌ను అధికార భాషగా గుర్తించారు.
సర్ చార్లెస్ మెట్కాఫ్ (1835-36)
- 1835లో ప్రెస్ లా జారీ చేశారు.
- ఈ ప్రెస్ లా ఇండియన్ ప్రెస్‌లపై గల వివిధ నిబంధనలను తొలగించాడు. దీంతో ఈయనను భారతీయ పత్రిక విమోచనకారి అని అన్నారు.
లార్డ్ ఆక్లాండ్ (1836-42)
- పిలిగ్రిం పన్నును రద్దు చేశాడు.
- ఆక్లాండ్ నాయకత్వంలో మొదటి ఆఫ్గన్ యుద్ధం జరిగింది. బ్రిటన్ దాదాపుగా ఓడిపోయి పేరుప్రఖ్యాతలను కోల్పోయింది.
లార్డ్ ఎలెన్ బరో (1842-44)
- అఫ్గాన్ యుద్ధానికి ముగింపు తెచ్చాడు. సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. సింధు ప్రాంతంలో కంపెనీ పాలకుడిగా చార్లెస్ నేపియర్‌ను నియమించాడు.
లార్డ్ హార్డింజ్ (1844-48)
- ఉద్యోగాల్లోను, ఇతర సర్వీసుల్లోను ఇంగ్లిష్ విద్యాధికులకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు.
- చోటా నాగపూర్, ఒరిస్సా ప్రాంతంలోని ఖోండులు అనే తెగల ప్రజలు నరబలిని పాటించేవారు. దాన్ని అణచివేశాడు.
- ఈయన కాలంలోనే మొదటి సిక్కు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లాహోర్ సంధి (1846)తో ముగిసింది.
లార్డ్ డల్హౌసీ (1848-56)
- రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
- 1848 సతారాను, 1849లో జైపూర్, సంబాల్పూర్, 1850లో బహత్, 1852లో ఉదయ్‌పూర్, 1853లో ఝాన్సీ, 1854లో నాగపూర్‌లను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేశాడు.
- రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం, రెండో ఆంగ్లో-బర్మా యుద్ధం డల్హౌసీ కాలంలో జరిగాయి. సిక్కులను ఓడించి మొత్తం పంజాబ్‌ను ఆక్రమించాడు. బర్మా యుద్ధంలో గెలుపొంది, దిగువ బర్మాను కలుపుకొన్నాడు. దుష్పరిపాలన పేరుతో 1853లో బీరార్‌ను, 1856లో ఔద్‌ను ఆక్రమించాడు.
- రాజవంశీకుల బిరుదులను, పెన్షన్లను రద్దుచేశాడు. పీష్వా బాజీరావు-2 మరణానంతరం అతని కుమారుడైన డోండూ పండిట్ (నానా సాహెబ్)నకు పెన్షన్ ఇవ్వలేదు. అంతేగాక మొఘల్ చక్రవర్తి అనే బిరుదును మొఘలులకు లేకుండా చేయాలని ప్రయత్నించాడు.
- నూతనంగా జయించిన ప్రాంతాల్లో కేంద్రీకృత పరిపాలన ప్రవేశపెట్టాడు. దీన్నే ‘Bon-Regulation System’ అని అంటారు.
- 1853లో వాయవ్య ప్రాంతంలో థామ్సోనియం సిస్టమ్ అనే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. అనంతరం 1854లో విద్యావిధానంపై ‘ఉడ్స్ కమిటీ’ని నియమించాడు. ఈ కమిటీని భారతదేశ విద్యావిధానంలో మాగ్నాకార్టా అంటారు.
- కలకత్తా, బొంబాయి, మద్రాస్‌లలో యూనివర్సిటీలు నెలకొల్పడానికి ప్రణాళికలు రచించాడు.
- వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856లో జారీచేశాడు. సైన్యం ముఖ్య కేంద్రంగా సిమ్లాను మార్చాడు.
- బెంగాల్ పరిపాలనను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పజెప్పాడు. రైల్వేలకు 1853లో పునాదిరాయి వేశాడు. మొట్టమొదటి రైల్వే లైన్ బాంబే-థానే వరకు వేయించాడు.
- రూర్కీ వద్ద ఒక ఇంజినీరింగ్ కాలేజీని ఈయన కాలంలో స్థాపించారు.
- భారతదేశంలో ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ పితామహుడిగా పేరుగాంచాడు. ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్కు సూపరింటెండెంట్‌గా ‘ఓ షాంగ్నెస్సే’ను నియమించాడు.
- ఆధునిక పోస్టల్ విధానానికి పునాది వేశాడు. 1854లో పోస్టాఫీసు చట్టాన్ని జారీచేశారు.
- ప్రజాపనుల శాఖ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు.
- ఒక వ్యవసాయ సంబంధ సంస్థను కలకత్తాలో స్థాపించాడు.
- కరాచీ, కలకత్తా, బొంబాయి రేవులను డల్హౌసీ కాలంలో అభివృద్ధి చేశారు.
- ఇతని పరిపాలనను కమిటీల పరిపాలన అనేవారు.
లార్డ్ కానింగ్ (1856-62)
- ఈయన భారతదేశపు చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారింది.
- ఈ చట్టం ద్వారా భారతదేశాన్ని పరిపాలించే అధికారం ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది.
- కలకత్తా, బొంబాయి, మద్రాస్ యూనివర్సిటీలను 1857లో లార్డ్ కానింగ్ కాలంలో స్థాపించారు.
- డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1859లో రద్దుచేశారు.
- lభారత ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు.
- 1858లో అలహాబాద్ దర్బార్‌ను ఏర్పాటు చేశాడు.
- ఈయన కాలంలో యూరోపియన్ సైనికులు చేపట్టిన తెల్ల తిరుగుబాటును అణచివేశాడు.
- కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌ను కానింగ్ కాలంలో 1859లో జారీచేశారు.
- ఈయన కాలంలో ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) అమల్లోకి వచ్చింది.
- భారత హైకోర్టు చట్టంను 1861లో జారీ చేశారు.
సర్ జాన్ లారెన్స్ (1864-69)
- విస్తృత నీటి పారుదల పథకాలను ప్రారంభించాడు.
- అఫ్గానిస్థాన్ పట్ల మాస్టర్లి ఇన్ యాక్టివిటీ విధానాన్ని అనుసరించాడు.
- lయూరప్‌తో టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించారు.
- ఈయన కాలంలో సముద్ర టెలిగ్రాఫ్ విధానాన్ని ప్రారంభించారు.
- కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులను 1865లో ప్రారంభించారు.
- మొట్టమొదటి అడవుల సంరక్షణ చట్టాన్ని 1865లో జారీచేశాడు.
- సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాల్గొనడానికి గరిష్ఠ వయస్సును 23 నుంచి 21 సంవత్సరాలకు 1866లో కుదించాడు.
లార్డ్ మేయో (1869-72)
- భారతదేశంలో ఆర్థిక రంగాన్ని వికేంద్రీకరించాడు.
- కథియవార్‌లో రాజ్‌కోట్ కాలేజీని, అజ్మీర్‌లో మేయో కాలేజీని స్థాపించాడు.
- డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ భారతదేశాన్ని ఈయన కాలంలోనే సందర్శించాడు.
- lభారతదేశంలో హత్యకు గురైన మొట్టమొదటి వైస్రాయ్.
- భారత గణాంక సర్వే (ఎస్ఎస్ఐ)ను స్థాపించాడు. ప్రత్యేక వ్యవసాయ, వాణిజ్య శాఖను స్థాపించాడు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక అంశాలను వేరుచేశాడు.
లార్డ్ నార్త్ బ్రూక్ (1872-76)
- పంజాబ్‌లోని కుకా ఉద్యమం ఈయన కాలంలో తిరుగుబాటుగా మారింది.
- ఆదాయ పన్నును రద్దు చేశాడు.
- ఈయన కాలంలో వేల్స్ యువరాజు భారతదేశాన్ని సందర్శించాడు.
- అఫ్గాన్ సమస్యపై ఇతను రాజీనామా చేశాడు.
లార్డ్ లిట్టన్ (1876-80)
- కన్జర్వేటివ్ ప్రభుత్వాధినేత బెంజిమన్ డిజ్రౌలి ఇతడిని భారత వైస్రాయ్గా నామినేట్ చేశాడు.
- ఇతడు భారతదేశ పరిపాలనలో అనేక వ్యతిరేక అంశాలను చేపట్టాడు.
- l1877లో భారతదేశంలో విపరీతమైన కరువు ఉన్నప్పుడు ఇతడు గ్రాండ్ దర్బార్‌ను ఏర్పాటు చేశాడు.
- రాయల్ టైటిల్స్ చట్టాన్ని ఆమోదించి, విక్టోరియా మహారాణిని ‘ఖైజర్-ఇ-హింద్’గా ప్రకటించాడు.
- భారత ఆయుధాల చట్టం (1878)ను జారీచేశాడు.
- భారత పత్రికల చట్టం (వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్-1878)ను జారీచేసి, దేశీయ పత్రికలపై ఆంక్షలు విధించాడు.
- స్టాట్యుటరీ సివిల్ సర్వీస్ విధానాన్ని సూచించాడు.
- భారతదేశ వైస్రాయ్‌లలో ఇతడు ఒక ప్రముఖ నవలాకారుడు, కవిగా సాహితీ ప్రపంచానికి సుప్రసిద్ధుడు.
- ఇతడిని సాహిత్య ప్రపంచంలో ‘Owen Meredith’ అని అంటారు.
- 29 వస్తువులపై దిగుమతి సుంకాలను రద్దు చేశాడు.
- స్ట్రా అధ్యక్షతన ఒక ఆర్థిక సంఘాన్ని నియమించాడు.
- 1876లో సివిల్ సర్వీసుల గరిష్ఠ వయస్సును 21 నుంచి 19 ఏండ్లకు తగ్గించాడు.
- బ్రిటిష్ పార్లమెంట్ రాయల్ బిరుదుల చట్టాన్ని 1876లో చేసింది.
- 1876లో రాష్ర్టాల ప్రివీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశాడు.
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు