రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
అక్టోబర్ 19వ (3వ పేజీ) తేదీ తరువాయి..
23. క్రిప్స్ ప్రతిపాదనలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. బ్రిటిష్ రాజమకుటం పరిశీలనలో ‘భారత స్వాతంత్య్రం’ ఉంది
బి. రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం ప్రతిపత్తి
సి. భారతీయులకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన
డి. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942, మార్చి 22న భారతదేశానికి క్రిప్స్ రాయబారాన్ని పంపాడు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
24. కింది అంశాల్లో సరికానిదాన్ని గుర్తించండి?
1) గాంధీజీ 1942, ఆగస్టు 8న ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చారు
2) క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీ ‘డూ ఆర్ డై’ అనే నినాదం ఇచ్చారు
3) ది వే అవుట్ పాంప్లెట్ అనే కరపత్రాన్ని సీ రాజగోపాలచారి రూపొందించారు
4) కేబినెట్ మిషన్‌లో పెథిక్ లారెన్స్,
ఏవీ అలెగ్జాండర్, స్టాన్లీ సభ్యులు
25. కేబినెట్ మిషన్ సిఫారసులలో సరైన జవాబును గుర్తించండి?
ఎ. భారతీయులతో కూడిన ‘రాజ్యాంగ సభ’ ద్వారా రాజ్యాంగ రచన
బి. దేశంలోని అన్ని వర్గాలవారికి ప్రాతినిధ్యం కల్పించే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
సి. బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు కలిసి ‘ఇండియన్
యూనియన్’గా ఏర్పడాలి
డి. పాకిస్థాన్‌కు ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
26. కేబినెట్ మిషన్ సిఫారసుల ప్రకారం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?
1) 1946, ఆగస్టు 14
2) 1946, సెప్టెంబర్ 2
3) 1947, ఆగస్టు 15
4) 1946, డిసెంబర్ 23
27. 1947, ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన స్వతంత్ర భారతదేశ మొదటి కేంద్ర మంత్రి మండలిలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన మంత్రులకు సంబంధించి సరిగా జతపర్చండి?
ఎ. బాబు రాజేంద్రప్రసాద్ 1. విద్య
బి. బాబు జగ్జీవన్‌రామ్ 2. వ్యవసాయం, ఆహార
సి. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 3. న్యాయశాఖ
డి. బీఆర్ అంబేద్కర్ 4. కార్మికశాఖ
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
28. రాజ్యాంగ పరిషత్/రాజ్యాంగ సభకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన తొలి భారతీయుడు
– మానవేంద్రనాథ్ రాయ్
బి. రాజ్యాంగ సభకు 1946లో ఎన్నికలు జరిగాయి
సి. రాజ్యాంగ సభకు ప్రత్యక్ష పద్ధతిలో, పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి
డి. రాజ్యాంగ సభకు పరోక్ష పద్ధతిలో, పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
29. రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన సభ్యుల సంఖ్యకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య- 389
బి. రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారి సంఖ్య- 70
సి. రాజ్యాంగ సభకు 11 బ్రిటిష్ పాలిత రాష్ర్టాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య- 292
డి. రాజ్యాంగ సభకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య- 9
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
30. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. 1946లో రాజ్యాంగ సభకు ఎస్సీల నుంచి ఎన్నికైనవారు- 26
బి. 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు- 15
సి. 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికైన ఆంగ్లేయులు- 13
డి. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య- 299
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, డి
31. రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన సభ్యులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. భారత జాతీయ కాంగ్రెస్ 1. 7
బి. యూనియనిస్ట్
మహ్మదీయ పార్టీ 2. 73
సి. ముస్లిం లీగ్ 3. 202
డి. స్వతంత్ర అభ్యర్థులు 4. 3
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
32. దేశవిభజన సందర్భంగా బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన బీఆర్ అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఎవరి రాజీనామా ఫలితంగా బొంబాయి నుంచి అంబేద్కర్‌కు రాజ్యాంగ సభలో తిరిగి ప్రాతినిధ్యం లభించింది?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) ఎంఆర్ జయకర్
3) శ్యామాప్రసాద్ ముఖర్జీ
4) సోమనాథ్ లహరి
33. కింది వాటిని జతపర్చండి?
ఎ. మహిళలు 1. బాబు జగ్జీవన్‌రామ్
బి. కార్మికవర్గం 2. హెచ్‌సీ ముఖర్జీ
సి. మైనారిటీలు 3. హంసా మెహతా
డి. పారశీకులు 4. హెచ్‌బీ మోదీ
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
34. రాజ్యాంగ సభకు ఎన్నిక కానిది ఎవరు?
1) మహాత్మాగాంధీ
2) మహ్మద్ అలీజిన్నా
3) 1, 2
4) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
35. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి సరిగా జతపర్చండి?
ఎ. రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక
అధ్యక్షుడు 1. ఫ్రాంక్ ఆంటోని
బి. రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక
అధ్యక్షుడు 2. బీఎన్ రావు
సి. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుడు 3. సచ్చిదానంద సిన్హా
డి. రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శి
4. హెచ్‌వీఆర్ అయ్యంగార్
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
36. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ- బేగం ఎయిజాజ్ రసూల్
బి. రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడు- బాబు రాజేంద్రప్రసాద్
సి. రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత
ఉపాధ్యక్షులు- వీటీ కృష్ణమాచారి,
హెచ్‌సీ ముఖర్జీ
డి. రాజ్యాంగ పరిషత్‌కు తొలి మహిళా
అధ్యక్షురాలు- విజయలక్ష్మీ పండిట్
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
37. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ జరిపిన కృషికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. రాజ్యాంగ సభ నిర్వహించిన
సమావేశాలు- 11
బి. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన
కమిటీలు- 22
సి. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన
విషయ నిర్ణాయక కమిటీలు- 12
డి. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు- 12
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
38. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 1947, ఆగస్టు 29న ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానిది ఎవరు?
1) శ్యామాప్రసాద్ ముఖర్జీ, బీఎన్ రావు
2) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మున్షీ
3) ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహ్మద్ సాదుల్లా
4) బీఎల్ మిట్టల్, డీపీ ఖైతాన్
39. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో బీఎల్ మిట్టల్ దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడంతో అతని స్థానంలో ఎన్ మాధవరావు నియమితులయ్యారు
బి. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో డీపీ ఖైతాన్ ఆకస్మిక మరణంతో అతని స్థానంలో టీటీ కృష్ణమాచారి నియమితులయ్యారు
సి. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946, డిసెంబర్ 9న జరిగింది
డి. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1949, నవంబర్ 26న జరిగింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
40. బాబు రాజేంద్రప్రసాద్ కింది ఏ కమిటీకి అధ్యక్షత వహించలేదు?
1) నియమావళి కమిటీ
(Rules Comm ittee)
2) సారథ్య కమిటీ
(Stearing Comm ittee)
3) సాంఘిక, ఆర్థిక సంఘం (Socio and Ecomomic Committee)
4) భాషా కమిటీ
(Linguistic Comm ittee)
41. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. 1946, డిసెంబర్ 11న రాజ్యాంగసభకు శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు
బి. 1946, డిసెంబర్ 13న రాజ్యాంగసభలో జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
సి. 1947, జనవరి 22న రాజ్యాంగ సభ ఉద్దేశాల తీర్మానాన్ని ఆమోదించింది
డి. 1947, జూలై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేసింది హంసామెహతా
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
42. ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేస్తున్న పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరన్నారు?
1) మహాత్మాగాంధీ
2) బాబు రాజేంద్రప్రసాద్
3) బీఆర్ అంబేద్కర్
4) జవహర్లాల్ నెహ్రూ
43. రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి?
ఎ. కేంద్ర రాజ్యాంగ కమిటీ 1. భోగరాజు పట్టాభి రామయ్య
బి. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ 2. కేఎం మున్షీ
సి. సభా కమిటీ 3. జవహర్లాల్ నెహ్రూ
డి. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ 4. సర్దార్ వల్లభాయ్ పటేల్
1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-2, బి-4, సి-1, డి-3
44. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. ఈశాన్య ప్రాంతాల హక్కుల కమిటీ 1. బాబు రాజేంద్రప్రసాద్
బి. సుప్రీంకోర్టుపై అధ్యయన కమిటీ 2. నళినీ రంజన్ సర్కార్
సి. జాతీయ పతాకంపై అడ్హాక్ కమిటీ 3. గోపీనాథ్ బార్డోలోయ్
డి. ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ 4. ఎస్ వరదాచారి అయ్యర్
1) ఎ-3, బి-1, సి-4, డి-2 2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-4, బి-2, సి-3, డి-1
45. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం (12వది) ఎప్పుడు జరిగింది?
1) 1950, జనవరి 24
2) 1950, నవంబర్ 26
3) 1950, జనవరి 25
4) 1950, జనవరి 26
46. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. జాతీయగీతం ‘జనగణమన’ ఆమోదం
బి. జాతీయ గేయంగా ‘వందేమాతరం’ ఆమోదం
సి. భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఎంపిక
డి. భారతదేశ రాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్ ఎంపిక
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
47. రాజ్యాంగ పరిషత్‌లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ‘చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానం’లోని అంశాన్ని గుర్తించండి?
ఎ. భారతదేశం సర్వసత్తాక, గణతంత్ర దేశంగా వర్ధిల్లాలి
బి. భారతదేశం ప్రపంచ శాంతి, మానవాళి అందరి సంక్షేమం కోసం కృషిచేయాలి
సి. దేశంలోని రాష్ర్టాలు స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి
డి. అల్పసంఖ్యాక, అణగారిన, గిరిజన వర్గాల ప్రయోజనాలను రక్షించాలి
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
సమాధానాలు
23-2, 24-4, 25-2, 26-2, 27-2, 28-3, 29-1, 30-3, 31-1, 32-2, 33-1, 34-3, 35-2, 36-4, 37-3, 38-1, 39-2, 40-4, 41-1, 42-4, 43-1, 44-3, 45-1, 46-3, 47-4.
సత్యనారాయణ
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు