జీవక్రియల నియంత్రణ.. అవయవాల అనుసంధానం
మానవ శరీరంలో అన్ని రకాల జీవక్రియలను తన ఆధీనంలో ఉంచుకునేది నాడీ వ్యవస్థ. శరీరంలో జరిగే ప్రతి జీవక్రియను నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. మానవ ప్రవర్తన, నడవడిక, చర్యలకు ప్రతి స్పందించడం, సమయానుకూలంగా మాట్లాడటం వంటి అనేక అంశాలు నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ, నిర్మాణం, పనిచేసే విధానం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
- నాడీ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం- న్యూరాలజీ
- నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్యుడు- న్యూరాలజిస్ట్
- మానవుడి ప్రవర్తన గురించి చదివే శాస్త్రం- సైకాలజీ
- మానవ నాడీ వ్యవస్థలో మూడు భాగాలుంటాయి. అవి 1. కేంద్రీయ నాడీ వ్యవస్థ
2. పరదీయ నాడీ వ్యవస్థ 3. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. - కేంద్రీయ నాడీ వ్యవస్థలో రెండు భాగాలుంటాయి. అవి మెదడు, వెన్నుపాము.మెదడు
- మెదడు గురించి చదివే శాస్త్రం-ఫ్రీనాలజీ
- కపాలంలో మెదడు ఉంటుంది.
- కపాలం గురించి చదివే శాస్త్రం- క్రైనాలజీ
- మానవుడి మెదడు బరువు పురుషుల్లో- 1350-1400 గ్రాములు, స్త్రీలలో 1250-1300 గ్రాములు.
- చిన్న పిల్లల్లో మెదడు బరువు 370-400 గ్రాములు ఉంటుంది.
- మెదడు బరువు ఎక్కువగా ఉండే జంతువు- నీలి తిమింగలం (సుమారు 4 కిలోలు)
- మానవ శరీర బరువులో మెదడు బరువు శాతం- 2 శాతం
- మానవుడు తీసుకున్న ఆక్సిజన్‌లో మెదడు వినియోగించుకునే ఆక్సిజన్ శాతం – 20 శాతం
- మెదడు బయట వైపు బూడిద రంగు పదార్థంతో, లోపలి వైపు తెలుపు రంగు పదార్థంతో నిండి ఉంటుంది.
- మెదడును కప్పి మూడు పొరలుంటాయి. అవి బయటి పొర వరాశిక, మధ్య పొర లౌతికళ, లోపలి పొర మృద్వి. ఈ మూడింటిని కలిపి ‘మెనింజస్’ అంటారు.
- మెనింజస్ మెదడును బయటి నుంచి జరిగే ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
- మెదడును మూడు భాగాలుగా విభజించారు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు.
ముందు మెదడు
- దీనిలో మస్తిష్కం అనే భాగం ఉంటుంది.మస్తిష్కం (సెరిబ్రం)
- దీన్ని ‘పెద్ద మెదడు’ అని పిలుస్తారు. దీని బరువు 995 గ్రాములు.
- మస్తిష్కంలో ఎత్తులు, పల్లాలు ఉంటాయి. ఎత్తులను ‘గైరీ’ అని, పల్లాలను ‘సల్సీ’ అని అంటారు.
- గైరీ, సల్సీలు చేసే ముఖ్యమైన పని- మానవుడి తెలివితేటలకు మూలంగా పనిచేస్తాయి
- మస్తిష్కానికి దిగువ భాగాన ద్వారా గోర్థం ఉంటుంది.
- ద్వారా గోర్థం: దీని ఆధీనంలో మానవుడి శరీరానికి సంబంధించిన భావోద్వేగాలు (కోపం, బాధ, ఆనందం, ప్రేమ, సంతోషం, సుఖం, దుఃఖం) ఉంటాయి.
- మస్తిష్కానికి దిగువ భాగాన బఠానీ గింజ ఆకారంలో ఉండే గ్రంథి ఉంటుంది. దాన్ని పీయూష గ్రంథి అంటారు.
- పీయూష గ్రంథి ఒక కాడతో అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ కాడను హైపోథలామస్ అంటారు.
- హైపోథలామస్: మానవుడి శరీరానికి సంబంధించి ఉష్ణం, ఆకలి, దప్పిక వంటివి నియంత్రించే భాగాలు దీనిలో ఉంటాయి.
- మస్తిష్కాన్ని రెండు సమాన అర్థ భాగాలుగా విభజిస్తూ ‘కార్పస్ కెల్లోజమ్’ ఉంటుంది.
- రెండు మస్తిష్క అర్ధ గోళాలను మస్తిష్కార్ధ గోళాలు అంటారు. ఇవి రెండు రకాలు.
- కుడి మస్తిష్కార్ధ గోళం: దీని ఆధీనంలో ఎడమ వైపు శరీర భాగాలు ఉంటాయి. ఈ మస్తిష్కార్ధ గోళానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎడమవైపున ఉన్న భాగాలకు పక్షవాతం వస్తుంది.
- ఎడమ మస్తిష్కార్ధ గోళం: ఈ మస్తిష్కార్ధ గోళం ఆధీనంలో కుడి వైపు శరీర భాగాలు ఉంటాయి. దీనికి ఏదైనా ప్రమాదం జరిగితే కుడి వైపున ఉన్న అవయవాలకు పక్షవాతం వస్తుంది.
- మస్తిష్కం ఆధీనంలో జ్ఞాపకశక్తి, ఆలోచనలు, తెలివితేటలు ఉంటాయి. మధ్య మెదడు
- మధ్య మెదడులో నాడీ కణాలు గుంపులు గుంపులుగా విస్తరించి ఉంటాయి.
- మధ్య మెదడులో ఉండే నాడీ కణాల సంఖ్య – 10 బిలియన్లు
- మానవ మెదడులో ప్రతిరోజు సుమారు 20,000 నాడీ కణాలు నాశనం అవుతాయి.
- ఒక్కసారి నశిస్తే మళ్లీ తిరిగి ఏర్పడే శక్తి నాడీ కణానికి ఉండదు. వెనుక మెదడు
- దీనిలో రెండు భాగాలుంటాయి. అవి అనుమస్తిష్కం, మజ్జాముఖం.
- అనుమస్తిష్కం (సెరిబెల్లమ్): దీన్ని చిన్న మెదడు అంటారు. ఇది మానవుడి శరీర సమతాస్థితిని కాపాడుతుంది. శరీరాన్ని అదుపులో ఉంచే ప్రక్రియను సమతాస్థితి అంటారు.
- మజ్జాముఖం (మెడుల్లా అంబ్లాగేటా): ఇది త్రికోణాకృతిలో ఉంటుంది. దీని ఆధీనంలో శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటివి ఉంటాయి.
వెన్నుపాము
- మానవుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని గ్రహించి, మెదడుకు చేరవేయడం వెన్నుపాము ముఖ్య విధి. కాబట్టి వెన్నుపామును ‘టెలిఫోన్ ఎక్చేంచ్’ అంటారు.
- వెన్నుపాము అడ్డుకోతను పరిశీలిస్తే H ఆకారం లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది.
- వెన్నుపాము బయటి వైపు తెలుపు రంగు పదార్థం, లోపలి వైపు బూడిద రంగు పదార్థం ఉంటుంది.
- వెన్నుపాములో రెండు రకాల శృంగాలు ఉంటాయి. అవి ఉదరశృంగం, పృష్ఠ శృంగం.
- పృష్ఠ శృంగం: పృష్ఠ శృంగాల నుంచి ఏర్పడే నాడులను జ్ఞాన నాడులు/అభివాహి నాడులు అంటారు.
- ఉదర శృంగం: ఉదర శృంగాల నుంచి ఏర్పడే నాడులను చాలక నాడులు/ అపవాహి నాడులు అంటారు.
- వెన్నుపాము, మెదడుకు మధ్య రిలే కేంద్రంగా ‘ఫ్రాన్స్ వెరోలి’ పనిచేస్తుంది.
- పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల సంఖ్య- 43 జతలు
- పరదీయ నాడీ వ్యవస్థలో నాడులుంటాయి. అవి కపాలనాడులు-12 జతలు, కశేరు నాడులు-31 జతలు
- కపాల నాడులు: కపాలం నుంచి పుట్టే నాడులనే కపాల నాడులు అంటారు. ఇవి 12 జతలుంటాయి. వీటిలో 10వ జత కపాలనాడిని ‘వేగస్ నాడి’ అంటారు. ఇది మానవుని శరీరంలో ఉండే అతిపెద్ద నాడి. ఇది హృదయ స్పందనను తన ఆధీనంలో ఉంచు కుంటుంది. క్లోమ గ్రంథిలో క్లోమ రసం ఉత్పత్తికి సహాయపడుతుంది.
- వెన్నునాడులు/కశేరు నాడులు: వెన్నుపాము నుంచి పుట్టే నాడులనే వెన్ను నాడులు అంటారు. ఇవి 31 జతలు ఉంటాయి. వీటిలో వివిధ రకాల నాడులుంటాయి.
- జ్ఞాన నాడులు/అభివాహి నాడులు: ఇవి మానవుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని గ్రహించి మెదడు, వెన్నుపాముకు చేరవేస్తాయి.
- చాలక నాడులు/ అపవాహి నాడులు: ఈ నాడులు మెదడు, వెన్నుపాము నుంచి సమాచారాన్ని గ్రహించి శరీరంలోని వివిధ భాగాలకు చేరవేస్తాయి.
- మిశ్రమ నాడులు/ సహ సంబంధ నాడులు: ఇవి జ్ఞాన, చాలక నాడులు చేసే పనులను నిర్వర్తిస్తాయి. కాబట్టి వీటిని మిశ్రమ నాడులు అంటారు.
- స్వయం చోదిత నాడీవ్యవస్థ మెదడుతో సంబంధం లేకుండా తన పనిని తానే నిర్వర్తించే నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు. దీన్ని రెండు భాగాలుగా విభజించారు.
- సహానుభూత నాడీవ్యవస్థ: ఇది అవయవాల పని వేగాన్ని పెంచుతుంది.
- సహానుభూత పర నాడీ వ్యవస్థ: ఇది అవయవాల పని వేగాన్ని తగ్గిస్తుంది.
నాడీ వ్యవస్థ చర్యలు
- నాడీ వ్యవస్థ చర్యలు మూడు రకాలు
- సంకల్పిత ప్రతీకార చర్య: ఈ చర్య మెదడు ఆధీనంలో ఉంటుంది.
- ఉదా: వినడం, చదవడం, రాయడం, వేడిగా ఉన్న వస్తువును ముట్టుకోవడం.
- అసంకల్పిత ప్రతీకార చర్య: ఈ చర్య మెదడు ఆధీనంలో ఉండదు.
ఉదా: తుమ్మడం, దగ్గడం, కనురెప్పలు వాల్చడం, వేడి వస్తువులను ముట్టుకోగానే చేతిని వెనుకకు తీసుకోవడం. - నింబంధిత ప్రతీకార చర్య: రష్యాకు చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త కుక్క నోటి లోపలి నుంచి లాలాజలం ఉత్పత్తి కావడం అనేది నిబంధిత ప్రతీకార చర్యగా వివరించారు. ఈయన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.
- ఉదా: ప్రతిరోజు జనగణమన సమయానికి పాఠశాలకు వెళ్లడం, ఉదయం రోజూ ఒకే సమయానికి లేవడం.
నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు
- అతినిద్ర వ్యాధి: ఇది ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా వస్తుంది. నిద్రలోనే ఉంటూ కోమాలోకి వెళ్లిపోవడం ఈ వ్యాధి లక్షణం. సీసీ ఈగ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
- పార్కిన్సన్: ఈ వ్యాధి డోపమైన్ అనే రసాయనం లోపం వల్ల వస్తుంది. గతాన్ని మర్చిపోవడం దీని లక్షణం.
- అల్జీమర్స్: ఈ వ్యాధి ముసలి తనంలోనే వస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం దీని లక్షణం.
- స్క్రీజీఫోబియా: లేని దృశ్యాన్ని ఊహించు కోవడం, ఆందోళన చెందడం, లేని శబ్ధాలను గ్రహించడం ఈ వ్యాధి లక్షణం.
నాడీ కణం నిర్మాణం
- మానవ శరీరంలో ఉండే అతిపొడవైన కణం నాడీ కణం. నాడీ కణంలో గ్లియల్ కణాలు ఉంటాయి. ఇవి పోషక పదార్థాలను నాడీకణాలకు చేరవేస్తాయి. నాడీ కణంలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి డెండ్రైట్స్, సైటాన్, ఆక్సాన్.
- డెండ్రైట్స్: ఇవి దారపు పోగుల వలె ఉంటాయి. ఇవి సమాచారాన్ని మొదట సంగ్రహిస్తాయి.
- సైటాన్: నాడీ కణం పూర్వపు భాగాన్ని సైటాన్ అంటారు. సైటాన్ మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో జీవ పదార్థం ఉంటుంది. ఈ జీవపదార్థంలో నిస్సల్ కణికలు ఉంటాయి. నిస్సల్ కణికలు డెండ్రైట్స్ నుంచి సమాచారాన్ని నెమ్మదిగా సైటాన్కు చేరవేస్తాయి.
- ఆక్సాన్: ఇది సన్నగా, స్థూపాకారంగా ఉండే నిర్మాణం. దీనిలో చిన్నచిన్న కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటినే మైలీన్ తొడుగు అంటారు. మైలీన్ తొడుగు సైటాన్ నుంచి సమాచారాన్ని వేగంగా ఆక్సాన్కు చేరవేస్తుంది. మైలిన్ తొడుగు లేని ప్రాంతాన్ని రణ్వీర్ కణుపు అంటారు. రన్వీర్ కణుపు దగ్గర సమాచారం అంతం అవుతుంది. నాడీ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి సంధిని ఏర్పరుచుకుంటాయి. ఈ సంధినే నాడీ కణ సంధి అంటారు. నాడీ కణాలు ఉద్దీపనలకు గురైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ 55 మిల్లీ వోల్టులు.
టీ కృష్ణ: విషయ నిపుణులు ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
- Tags
Previous article
‘మార్బుల్ రివర్’ అని
Next article
వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు