‘మార్బుల్ రివర్’ అని
జాగ్రఫీ
1. భారతదేశం విస్తృతి అక్షాంశాల దృష్ట్యా వేటి మధ్య విస్తరించింది?
1) అరుణాచల్‌ప్రదేశ్- రాణ్ ఆఫ్ కచ్
2) రాణ్ ఆఫ్ కచ్- జమ్ము కశ్మీర్
3) కన్యాకుమారి- జమ్ము కశ్మీర్
4) గుజరాత్- కన్యాకుమారి
2. భారత్‌లో పొడవైన బీచ్ ఏ తీరంతో సంబంధం కలిగి ఉంది?
1) మలబార్ 2) కోరమండల్
3) కైత్వార్ 4) సర్కార్
3. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ట్రం?
1) పంజాబ్ 2) రాజస్థాన్
3) అసోం 4) హర్యానా
4. పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం రాష్ర్టాలతో సరిహద్దును కలిగిఉన్న దేశం?
1) మయన్మార్ 2) భూటాన్
3) బంగ్లాదేశ్ 4) చైనా
5. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) గోవా
6. పులికాట్ సరస్సు ఏ తీరాల మధ్య విస్తరించి ఉంది?
1) వంగ-ఉత్కల్
2) ఉత్కల్- సర్కార్
3) సర్కార్- కోరమండల్
4) కోరమండల్- మలబార్
7. కేరళ తీరం వెంట వ్యవసాయం చేసే ముస్లింలను ఏమని పిలుస్తారు?
1) మోప్లాలు 2) తోడాలు
3) మల్ఫీలు 4) ఖాసీలు
8. భారతదేశానికి నైరుతి దిశలో దగ్గరగా ఉన్న దీవి ఏది?
1) జావా 2) సుమత్రా
3) శ్రీలంక 4) మాల్దీవులు
9. నర్మద, తపతి నదులు వరుసగా కింది వేటిని వేరుచేస్తూ ప్రవహిస్తున్నాయి?
1) వింధ్య, అజంత, సాత్పూర
2) అజంత, సాత్పూర, వింధ్య
3) సాత్పూర, అజంత, వింధ్య
4) వింధ్య, సాత్పూర, అజంత
10. కింది వాటిని జతపరచండి?
ఎ. భారత్ దక్షిణ భూభాగంలో చివరిది -1.అరోమకొండ
బి. పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శిఖరం- 2.కన్యాకుమారి
సి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం – 3. దొడబెట్ట
డి. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం – 4. అనైముడి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-4, సి-2, డి-3
11. భారత్‌తో ఆగ్నేయ దిశలో ఏ దీవి దగ్గరగా ఉంది?
1) శ్రీలంక 2) మాల్దీవులు
3) జావా 4) సుమత్రా
12. భారత్‌లో అగ్ని లావాతో కూడిన పీఠభూమికి ఉదాహరణ?
1) వింధ్య పీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) చోటా నాగపూర్ పీఠభూమి
4) దక్కన్ పీఠభూమి
13. ప్రతిపాదన (ఎ): పశ్చిమ కనుమల్లో జన్మించిన నదులు కూడా తూర్పు (ఆగ్నేయ) న ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. కారణం (ఆర్): ద్వీపకల్ప పీఠభూమి కొంచెం తూర్పు (ఆగ్నేయ) వైపున వాలును కలిగిఉంది.
1) (ఎ), (ఆర్) నిజం. (ఎ) కు (ఆర్)
సరైన వివరణ
2) (ఎ), (ఆర్) నిజం. (ఎ) కు (ఆర్)
సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు (ఆర్) నిజం
14. కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి?
ఎ. ద్వీపకల్ప పీఠభూమి
బి. గంగా సింధూ మైదానం
సి. హిమాలయాలు
డి. తీరమైదానాలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, బి, డి
3) బి, సి, డి, ఎ 4) డి, బి, సి, ఎ
15. కింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా?
ఎ. సాత్పూర పర్వతాలు
బి. వింధ్య పర్వతాలు
సి. నర్మదానది డి. అజంతా కొండలు
ఇ. తపతి నది
1) ఎ, బి, సి, డి, ఇ 2) సి, బి, ఎ, డి, ఇ
3) బి, సి, ఎ, ఇ, డి 4) బి, సి, ఎ, డి, ఇ
16. కింది రాష్ర్టాలను వాటి భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్కొనండి?
ఎ. మధ్యప్రదేశ్ బి. రాజస్థాన్
సి. మహారాష్ట్ర డి. ఉత్తరప్రదేశ్
1) ఎ, బి, సి, డి 2) బి, సి, ఎ, డి
3) బి, సి, డి, ఎ 4) బి, ఎ, సి, డి
17. భారత్‌లో అత్యధిక సంవత్సర వర్షపాతం నమోదయ్యే ప్రాంతం
1) చురు 2) చంబా
3) మాసిన్రాం 4) నాంచీ
18. భారత్‌లో అత్యధిక, అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం?
1) కేరళ, కర్ణాటక
2) మధ్యప్రదేశ్, హర్యానా
3) హర్యానా, రాజస్థాన్
4) మిజోరం,మధ్యప్రదేశ్
19. ఒయాసిస్ ఏర్పడటానికి కారణం?
1) హిమానీనద ఉపసంహరణ
2) వర్షపునీటి వల్ల ఎడారిలో గొయ్యి నిండటం
3) ఎడారిలో భూజతలం వరకూ జరిగే పవన క్రమక్షయం
4) ఏదీకాదు
20. భారత్‌లో ఎత్తయిన శిఖరం ఏ పర్వతశ్రేణిలో ఉంది?
1) ట్రాన్స్ హిమాలయాలు
2) పీర్‌పంజల్ పర్వతశ్రేణి
3) హిందూకుష్ పర్వతాలు
4) కారకోరమ్
21. రాడ్‌క్లిఫ్ రేఖకు దక్షిణాన చివర..భారత్- శ్రీలంక మధ్య ఉన్న ప్రధాన భాగం?
1) రామసేతు 2) పాంబన్దీవి
3) కచ్చటపుదీవి
4) మన్నార్ సింధుశాఖ
22. ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కారకాలు?
1) క్లోరోఫ్లోరో కార్బన్స్
2) హాలోజన్స్
3) మీథేన్స్ 4) పైవన్నీ
23. కింది వాటిలో ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ర్టా లు ఏవి?
ఎ. పంజాబ్ బి. రాజస్థాన్
సి. ఛత్తీస్‌గఢ్ డి. జార్ఖండ్
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, డి, బి
24. కింది వాటిలో లింగ నిష్పత్తి ఏది?
1) 1000 మంది స్త్రీలకు ఉన్న
పురుషుల సంఖ్య
2) 100 మంది స్త్రీలకు ఉన్న
పురుషుల సంఖ్య
3) 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
4) 100 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
25. ‘మార్బుల్ రివర్’ అని ఏ నదిని అంటారు?
1) తపతి 2) నర్మద
3) గంగా 4) పెన్‌గంగా
26. భారత్‌లో ఎత్తయిన జలపాతం?
1) జోగ్ 2) కుంటాల
3) కుంచికల్ 4) పైవన్నీ
27. భారతదేశపు పైకప్పు (ఎత్తయిన) పీఠభూమి అని దేన్ని పిలుస్తారు?
1) పామీర్ పీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) కర్నాటక పీఠభూమి
4) బుందేల్‌ఖండ్ పీఠభూమి
28. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి గల రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్ 2) తెలంగాణ
3) అసోం 4) జమ్ముకశ్మీర్
29. భారత్- బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద ప్రాంతం?
1) మైత్రీవన్ 2) తీన్బిఘా
3) కవ్వాంచల్ 4) కోకోదీవి
30. హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా?
ఎ. గ్రేటర్ బి. నిమ్న
సి. బాహ్య డి. టిబెట్
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఎ
3) బి, ఎ, సి, డి 4) డి, ఎ, బి, సి
31. ‘నీలగిరి కొండలు’ ఏ కనుమల్లో భాగం?
1) తూర్పు కనుమలు
2) పశ్చిమ కనుమలు
3) 1, 2 4) ఏదీకాదు
32. పీర్‌పంజల్ పర్వతశ్రేణి, మహాభారత్ పర్వతశ్రేణి ఏ హిమాలయాల్లో ఉన్నాయి?
1) నిమ్న హిమాలయాలు
2) గ్రేటర్ హిమాలయాలు
3) శివాలిక్ హిమాలయాలు
4) ట్రాన్స్ హిమాలయాలు
33. కింది వాటిని జతపర్చండి?
ఎ. సుర్మా లోయ 1. సిక్కిం
బి. చుంబీ లోయ 2. అసోం
సి. మాక్డోక్ లోయ 3. కేరళ
డి. నిశ్శబ్ద లోయ 4. మేఘాలయ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
34. కింది వాటిలో సరికాని జత?
1) అసోం- కచార్ కొండలు
2) అరుణాచల్‌ప్రదేశ్- మిష్మి కొండలు
3) మేఘాలయ- జయంతియా కొండలు
4) సిక్కిం- దుద్వా కొండలు
35. ‘డూన్’లు అనే సమతల మైదానాలు ఏ హిమాలయాల మధ్య ఏర్పడ్డాయి?
1) హిందుకుష్-హిమాద్రి
2) హిమాద్రి- ట్రాన్స్
3) శివాలిక్- నిమ్న
4) నిమ్న-ట్రాన్స్
36. భారత్‌లో ఎత్తయిన శిఖరం?
1) కాంచనజంగ 2) నందాదేవి
3) కృష్ణగిరి (k2) 4) ఏదీకాదు
37. ‘బెర్ముడా ట్రయాంగిల్ ఏ ప్రాంతాల మధ్య ఉంది?
1) బెర్ముడా దీవి, ఫ్లొరిడా, పోర్టోరికా దీవులు
2) బెర్ముడా, జమైకా,పోర్టోరికా దీవులు
3) బెర్ముడా, ఏంటలీస్, పోర్టోరికా
4) బెర్ముడా, ఏంటలిస్, కరోలినా
38. కింది వాటిని చదవండి?
ఎ. బాలాఘాట్ కనుమ
బి. దాల్ఘాట్ కనుమ
సి. సెహన్ ఘాట్ కనుమ
డి. పాల్ఘాట్ కనుమ
ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి, సి
3) సి, బి, ఎ, డి 4) బి, ఎ, డి, సి
39. ఈశాన్య రుతుపవనాలను తమిళనాడులో అడ్డగించే కొండలు?
1) నీలగిరి కొండలు
2) బలిగిరి రంగన్ కొండలు
3) జవధి కొండలు
4) షవరాయ్ కొండలు
-ఎస్కె.మస్తాన్ , సీనియర్ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్ , వికారాబాద్
- Tags
- Geography
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?