‘భీష్మ’ యుద్ధ ట్యాంకులను భారత్ ఎక్కడ తయారు చేస్తుంది?
రక్షణ రంగం అక్టోబర్ 24 తరువాయి
30. మిషన్ శక్తి కార్యక్రమానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. దీన్ని 27 మార్చి 2019న ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి చేపట్టారు
బి.ఈ ప్రయోగంలో భాగంగా భూ దిగువ కక్ష్యలోని ఉపగ్రహాన్ని PDV MK2
క్షిపణితో విజయవంతంగా కూల్చివేశారు
సి. దీంతో ప్రపంచంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరిజ్ఞానం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది
డి. మిషన్ శక్తి కార్యక్రమంలో జనవరి 2019లో ప్రయోగించిన Microsat-R ఉపగ్రహాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
31. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి సరైన వ్యాఖ్య?
ఎ. పౌర, సైనిక అవసరాల కోసం ఉద్దేశించిన ఉపగ్రహాల రక్షణ దీని ప్రధాన బాధ్యత
బి. దీని ఏర్పాటుకు నరేష్ చంద్ర టాస్క్‌ఫోర్స్ 2011లో సిఫార్సు చేసింది
సి. భారత త్రివిధ దళాలు, డీఆర్డీఓ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో దీన్ని 28 సెప్టెంబర్, 2018న ఏర్పాటు చేశారు
డి. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
32. కింది వాటిలో SRIJAN దేనికి సంబంధించింది?
1) రక్షణ రంగంలో విదేశీ సంస్థల
భాగస్వామ్యానికి ఉద్దేశించిన పోర్టల్
2) రక్షణ రంగంలో స్వదేశీ సంస్థల
భాగస్వామ్యానికి ఉద్దేశించిన పోర్టల్
3) భారత త్రివిధ దళాలకు అణు సాంకేతికతను సముపార్జించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్
4) అత్యాధునిక అణు జలాంతర్గాములు రూపొందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు
33. (ఎ) – అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ ప్రాజెక్టులో భాగంగా సూపర్ సోనిక్ వేగాలతో ప్రయాణించే క్షిపణులకు స్క్రామ్ జెట్ ఇంజిన్లను అమర్చుతారు
(ఆర్) – కేవలం సబ్ సోనిక్ వేగాలతో ప్రయాణించే క్షిపణులకు మాత్రమే RAMJET Engine సాంకేతికత ఉపయుక్తమైనది
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) అసత్యం
34. (ఎ) – అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సాంకేతికతను కలిగిన క్షిపణుల పరిధిని గణనీయంగా పెంచవచ్చు
(ఆర్) – ఈ క్షిపణుల్లో ఇంధనాన్ని మండించడానికి అవసరమయ్యే ఆక్సిజన్‌ను వాతావరణం నుంచే సేకరించుకునే సౌలభ్యం ఉంటుంది.
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) అసత్యం
35. కింది వాటిలో ప్రత్యేక భద్రతా బలగాలకు చెందినది?
1) ఇండియన్ కోస్ట్ గార్డ్
2) అస్సాం రైఫిల్స్
3) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
4) స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్
36. పినాక రాకెట్ లాంచింగ్ సిస్టంకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. వీటిని డీఆర్డీఓ అభివృద్ధి పరిచింది
బి. పినాక 1 గరిష్ఠ పరిధి 40 కిలోమీటర్లు కాగా పినాక 2 గరిష్ఠ పరిధి 75 కిలోమీటర్లు
సి. దీని ద్వారా 44 సెకన్లలో 12 రాకెట్లను ప్రయోగించవచ్చు
డి. దీనిలో స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్‌ను అనుసంధానించారు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
37. (ఎ) – బ్రహ్మోస్, నిర్భయ్ వంటి క్రూయిజ్ క్షిపణుల వేగాలను ధ్వని వేగంతో పోల్చి మాత్రమే వాటిని పలు రకాలుగా వర్గీకరిస్తారు
(ఆర్) – క్రూయిజ్ క్షిపణుల పేలోడ్ సామర్థ్యం చాలా స్వల్పంగా ఉంటుంది
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) అసత్యం
38. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి సరికాని జతను గుర్తించండి.
1) అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం – భారత్
2) ఎస్-400 మిస్సైల్ సిస్టం – రష్యా
3) పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ – భారత్
4) టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టం – ఇజ్రాయెల్
39. కేంద్ర బడ్జెట్ 2018-2019 ప్రకారం దేశంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయబోయే రాష్ర్టాలు?
ఎ. ఉత్తరప్రదేశ్ బి. పంజాబ్
సి. తమిళనాడు డి. గుజరాత్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) బి, డి
40. ప్రత్యేక భద్రతా బలగాలకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి.
1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 1965
2) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 1939
3) రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, 1986
4) గరుడ కమాండో ఫోర్స్, 2004
41. భారత్ కోస్ట్‌గార్డ్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం 2) కన్నూర్
3) ముంబై 4) తిరువనంతపురం
42. ఏ దేశం నుంచి భారత్ Chinook హెలికాప్టర్లను పొందింది?
1) రష్యా 2) ఇజ్రాయిల్
3) అమెరికా 4) ఫ్రాన్స్
43. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేస్తున్న కింది వాయు రవాణా వాహనాలను, వాటిని రూపొందించిన సంస్థల దృష్ట్యా సరికానిది గుర్తించండి.
1) రాఫెల్-డసాల్ట్ ఏవియేషన్
2) అపాచీ- బోయింగ్
3) చినూక్ – లాక్ హీడ్ మార్టిన్
4) మిరేజ్ – డసాల్ట్ ఏవియేషన్
44. భారత వైమానిక దళానికి చెందిన మెయింటె-నెన్స్ కమాండ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) న్యూఢిల్లీ 2) బెంగళూరు
3) నాగపూర్ 4) తిరువనంతపురం
45. కింది వాటిలో రష్యా నుంచి పొందిన మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేసేవి?
1) నేత్ర 2) తేజస్
3) లక్ష్య 4) నిశాంత్
46. జర్మనీ సహకారంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించి, నేపాల్,ఇజ్రాయెల్, దేశాలకు ఎగుమతి చేయనున్న హెలికాప్టర్?
1) HAL ఛీతా 2) HAL చేతక్
3) HAL ధ్రువ 4) HAL రుస్తుం
47. రాత్రి వేళల్లో సైతం సేవలు అందించగల HAL రుస్తుం రూపొందించడంలో భాగస్వామ్యం వహించిన సంస్థలు ?
ఎ. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్
బి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
సి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
డి. రిసెర్చ్ సెంటర్ ఇమారత్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
48. (ఎ) – 600 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ 2 క్షిపణిని అభివృద్ధి చేయడానికి 2016 నుంచి మార్గం సుగమమైంది
(ఆర్) – 2016లో ‘మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ’లో భారత్ కూడా ఒక సభ్య దేశం అయింది
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) అసత్యం
49. కింది వాటిలో ఏ క్షిపణి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉత్పత్తి చేయటం లేదు.
1) ఆకాష్ 2) పృథ్వీ
3) అగ్ని-II 4) బ్రహ్మోస్
50. 4 కి.మీ. పరిధిలో గల యుద్ధ ట్యాంకులను విధ్వంసం చేయగల క్షిపణి?
1) నాగ్ 2) ఆకాష్
3) పినాక 4) త్రిశూల్
51. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను భారత్ ఏ దేశ సహకారంతో తయారు చేస్తుంది?
1) అమెరికా 2) రష్యా
3) జపాన్ 4) ఫ్రాన్స్
52. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ ప్రధాన యుద్ధట్యాంకు?
1) అజేయ 2) రాజేంద్ర
3) అర్జున్ 4) తేజస్
53. క్షిపణుల అభివృద్ధి, తయారుచేయగల భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) చెన్నై
3) కలకత్తా 4) హైదరాబాద్
54. భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసిన విమాన వాహక నౌక?
1) INS విక్రమాదిత్య 2) INS విరాట్
3) INS అరిహంత్ 4) INS కల్కి
55. ఖండాంతర క్షిపణి అయిన అగ్ని-v పరిధి?
1) 10000 కి.మీ 2) 5000 కి.మీ.
3) 2000 కి.మీ 4) 1000 కి.మీ
56. భారతదేశ రక్షణ రంగ సంస్థ డీఆర్డీఓ నావికాదళ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ?
1) సముద్రిక 2) వాయువాహన్
3) ప్రద్యుమ్న 4) ఆకాశ్
57. కింది వాటిలో హెలికాప్టర్ నుంచి ప్రయోగించబడే యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి?
1) సూర్య 2) హెలినా
3) నాగ్ 4) అర్జున్
58. భారతదేశం అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ క్షిపణి అయిన బ్రహ్మోస్ వేగం?
1) 2.5 మాక్ 2) 1 మాక్
3) 1000 కి.మీ/గంట
4) 6.5 మాక్
59. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్ మెరైన్?
1) INS చక్ర 2) INS ప్రహార్
3) INS అరిహంత్ 4) INS సూర్య
60. నావికాదళ అవసరాల కోసం పృథ్వీ క్షిపణిని మార్పు చేసి ఏ క్షిపణిని రూపొందించారు?
1) త్రిశూల్ 2) ఆకాశ్
3) అస్త్ర 4) ధనుష్
61. క్షిపణి ప్రయాణించేటప్పుడు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను సంగ్రహించే విధంగా రూపొందించిన టెక్నాలజీ పేరు?
1) క్రూయిజ్ టెక్నాలజీ
2) రామ్‌జెట్ టెక్నాలజీ
3) ఎయిర్ టెక్నాలజీ
4) ప్రొపల్షన్ టెక్నాలజీ
62. ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఏ క్షిపణిని శత్రువుల క్షిపణులను కూల్చడానికి ఉపయోగిస్తున్నారు?
1) అగ్ని 2) నాగ్
3) బ్రహ్మోస్ 4) పృథ్వీ
63. భీష్మ యుద్ధ ట్యాంకులను భారతదేశం ఎక్కడ తయారు చేస్తుంది?
1) హెవీవెహికల్స్ ఫ్యాక్టరీ- ఆవడి
2) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ – బెంగళూరు
3) భారత డైనమిక్స్ లిమిటెడ్ – హైదరాబాద్
4) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ – మెదక్
64. యునైటెడ్ కింగ్డమ్ నుంచి కొనుగోలు చేసిన ఏ విమాన వాహక నౌక ప్రస్తుతం నావికాదళంలో ఉంది?
1) INS సింధు చక్ర
2) INS విక్రాంత్
3) INS సింధుఘోష్
4) INS విరాట్
65. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న విమాన వాహక నౌక?
1) 4 2) 2 3) 3 4) 5
66. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఏ ఆధునాతన శిక్షణ విమానాలను నావికాదళంలోకి ప్రవేశపెట్టారు?
1) మిగ్-21
2) సూపర్ హెర్కులస్
3) హోక్ఎంకె-132 4) ఫాల్కన్
67. భారతదేశం అడ్వాన్స్డ్ వెసిల్ ప్రాజెక్ట్‌లో (ఎ.వి.పి) భాగంగా వేటిని నిర్మిస్తుంది?
1) విమాన వాహక నౌకలు
2) క్షిపణులు
3) జలాంతర్గాములు
4) యుద్ధ విమానాలు
68. INS అరిహంత్ అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించే K-15 క్షిపణులను ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) ఆకాష్ 2) సాగరిక
3) సింధు 4) నమిక
69. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ PC-7 విమానాలు ఏ అవసరాల కోసం వినియోగపడుతున్నాయి?
1) పైలెట్లకు శిక్షణనివ్వడానికి
2) క్షిపణులను ప్రయోగించడానికి
3) యుద్ధ సామగ్రిని తరలించడానికి
4) సైనికులను తరలించడానికి
70. క్షిపణి రక్షణ కవచాన్ని మెదట ఏ నగరం చుట్టూ ఏర్పాటు చేయనున్నారు?
1) ముంబై 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) ఢిల్లీ
71. 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) అమెరికా 2) రష్యా
3) స్విట్జర్లాండ్ 4) జపాన్
72. విమానవాహక నౌక INS విక్రాంత్‌ను నిర్మించిన షిప్‌యార్డ్?
1) హిందుస్థాన్ షిప్‌యార్డ్
2) కొచ్చిన్ షిప్‌యార్డ్
3) మజ్గావ్ షిప్‌యార్డ్
4) గోవా షిప్‌యార్డ్
73. పృథ్వి ఎయిర్ డిఫెన్స్ క్షిపణిని ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) వాయువాహన్ 2) బ్రహ్మాస్త్ర
3) ప్రద్యుమ్న 4) రక్షక్
74. విమానాలను, హెలికాప్టర్లను తయారుచేస్తున్న నేషనల్ ఎయిర్ స్పేస్ లాబోరేటరీస్ అనే సంస్థ ఏ నగరంలో ఉంది?
1) విశాఖపట్నం 2) ముంబై
3) అహ్మదాబాద్ 4) బెంగళూరు
75. భారతదేశ తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ అయిన ఐఎన్ఎస్ అరిహంత్‌లో అణురియాక్టర్ ఉత్పత్తి చేసే విద్యుత్?
1) 100 మెగావాట్లు 2) 220 మెగావాట్లు
3) 80 మెగావాట్లు 4) 120 మెగావాట్లు
76. 5000 కి.మీ. పరిధి కలిగిన, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-v ఏ రకానికి చెందినది?
1) ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించగలదు
2) గాలి నుంచి గాలిలోకి ప్రయోగించగలదు
3) నీటిపై నుంచి గాలిలోకి ప్రయోగించగలదు
4) ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగలదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు