సముద్ర భూతలాన్ని ఎక్కువ ఆక్రమించి ఉన్న భాగం? జాగ్రఫీ
1. ప్రపంచంలో అతిపెద్ద ప్రవాళ బిత్తిక ‘ది గ్రేట్ బారియర్ రీఫ్’ ఎక్కడ ఉంది?
1) అమెరికా 2) అర్జెంటీనా
3) ఆస్ట్రేలియా 4) ఫిలిప్పీన్స్
2. అటోల్లు ఏ మహాసముద్రంలో ఎక్కువగా ఉన్నాయి?
1) హిందూ మహాసముద్రం
2) అంటార్కిటికా మహా సముద్రం
3) పసిఫిక్ మహా సముద్రం
4) అట్లాంటిక్ మహా సముద్రం
3. ఖండాల తూర్పువైపున వర్షాన్ని ఇవ్వడం వల్ల, పశ్చిమం వైపు వర్షచ్ఛాయ ప్రాంతాలు ఎడారులు ఏర్పడటానికి కారణమైన పవనాలు ఏవి?
1) వ్యాపార పవనాలు
2) పశ్చిమ పవనాలు
3) ప్రపంచ పవనాలు
4) ప్రతి వ్యాపార పవనాలు
4. ఎలాంటి మాధ్యమం లేకుండా సూర్యుని నుంచి భూమి నుంచి గ్రహించే వేడి వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఇది ఏ ప్రక్రియ?
1) ఉష్ణ సంవాహనం
2) ఉష్ణ వికిరణం
3) ఉష్ణ నిర్వహణ
4) ఉష్ణ వాహనం
5. కింది వాటిలో సరైనది గుర్తించండి
ఎ. సూర్యుని నుంచి సూర్యరశ్మీ హ్రస్వతరంగాల రూపంలో భూమిని చేరుతుంది
బి. భూమి దీర్ఘ తరంగాల రూపంలో వేడిని కోల్పోతుంది
సి. సూర్యుని నుంచి సూర్యరశ్మీ దీర్ఘతరంగాల రూపంలో భూమిని చేరుతుంది
డి. భూమి హ్రస్వ తరంగాల రూపంలో వేడిని కోల్పోతుంది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) బి, డి
6. కింది వాటిలో సరికానిది తెల్పండి?
ఎ. సూర్యుని నుంచి వెలువడే సౌరశక్తిని సూర్యవికిరణం అంటారు
బి. భూమి గ్రహించే సౌరశక్తిని సూర్యపుటం అంటారు
సి. సూర్యుని నుంచి వెలువడే సౌరశక్తిని సూర్యపుటం అంటారు
డి. భూమి గ్రహించే సౌరశక్తిని సౌరవికిరణం అంటారు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
7. హిమానీ నదం నిక్షేపాల వల్ల ఏర్పడే భూ స్వరూపాలు ఏవి?
ఎ. మొరైన్లు బి. డ్రమ్లినేలు
సి. హిమగర్తాలు డి. ఫియార్ప్స్
1) ఎ, బి 2) ఎ, సి
3) సి, డి 4) బి, డి
8. మొరైన్లు అంటే ఏమిటి?
1) నదుల క్రమక్షయ భూ స్వరూపం
2) హిమానీనద నిక్షేపణ భూ స్వరూపం
3) అంతర్భూజల క్రమక్షయ భూ స్వరూపం
4) పవన నిక్షేపణ భూ స్వరూపం
9. ఫెరల్ సిద్ధాంతం ప్రకారం భూభ్రమణం వల్ల భూమిపై పవనాలు ఏ దిశవైపు అపవర్తనం చెందుతాయి?
1) ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో కుడివైపునకు
2) ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో ఎడమవైపునకు
3) ఉత్తరార్ధ గోళంలో ఎడమవైపునకు, దక్షిణార్థ గోళంలో కుడివైపునకు
4) ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో ఎడమ వైపునకు
10. ఏ ఆవరణాన్ని సమాచార ఆవరణం అని పిలుస్తారు?
1) ఎక్సో ఆవరణం 2) థర్మో ఆవరణం
3) మీసో ఆవరణం 4) స్ట్రాటో ఆవరణం
11. మృత్తిక క్రమక్షయానికి సంబంధించిన చర్యలు ఏవి?
ఎ. కాంటూర్ బండింగ్
బి. అడవుల పెంపకం
సి. గడ్డిభూముల అభివృద్ధి
డి. వేదికల నిర్మాణం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
12. కేరళలో కరి నేలలుగా పిలుస్తున్న మృత్తికలు ఏవి?
1) పీట్ నేలలు 2) క్షార నేలలు
3) లాటరైట్ నేలలు 4) ఎర్రనేలలు
13. పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది?
1) ఎర్రనేలలు 2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు 4) లాటరైట్ నేలలు
14. ప్రపంచంలో అత్యధిక లవణీయత గల వాన్ సరస్సు ఏ దేశంలో ఉంది?
1) రష్యా 2) టర్కీ
3) బొలీవియా 4) చైనా
15. దేశంలో అత్యంత పొడవైన లాగూన్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం 2) ఒడిశా
3) కర్ణాటక 4) కేరళ
16. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
1) సుగంధ ద్రవ్యాల రాజు- మిరియాలు
2) సుగంధ ద్రవ్యాల రాణి- యాలకులు
3) సుగంధ ద్రవ్యాల రాజు- లవంగాలు
4) సుగంధ ద్రవ్యాల రాణి- ధనియాలు
17. జతపరచండి.
1. ఫ్లోరాకల్చర్ పి. పండ్ల తోటల
పెంపకం
2. పోమాలజీ క్యూ. పూల మొక్కల
పెంపకం
3. ఆర్బోరి కల్చర్ ఆర్. ఉద్యావనం,
మొక్కల పెంపకం
4. హార్టీ కల్చర్ ఎస్. కూరగాయల మొక్కల సాగు
1) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
2) 1-ఆర్, 2-ఎస్, 3-పి , 4-క్యూ
3) 1-పి, 2-క్యూ, 3-ఆర్ , 4- ఎస్
4) 1-ఎస్ , 2-క్యూ, 3-పి, 4-ఆర్
18. హరిత విప్లవం అనే పదాన్ని మొదట వాడినది?
1) విలియం ఎస్ గాడ్
2) నార్మన్ బోర్లాగ్
3) ఎం ఎస్ స్వామినాథన్
4) లెస్టర్ ఆర్ బ్రౌన్
19. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
1) ఎం ఎస్ స్వామినాథన్
2) వర్గీస్ కురియన్
3) నార్మన్ బోర్లాగ్
4) విలియం ఎస్ గాడ్
20. పశ్చిమ కనుమల్లో పర్యావరణం అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ?
1) జయతీఘోష్ కమిటీ
2) గాడ్గిల్ కమిటీ
3) ఎంజీకే మీనన్ కమిటీ
4) వీడీ సక్లానీ కమిటీ
21. మీసో ఆవరణానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. మీసో ఆవరణను బాహ్యట్రోపో ఆవరణం అంటారు
బి. మీసో ఆవరణంలో ఉల్కాపాతం సంభవిస్తుంది
సి. మీసో ఆవరణంలో జరిగే కొన్ని రసాయనిక చర్యల వల్ల దీన్ని రసాయనావరణం అంటారు
డి. మీసో ఆవరణంలో ఉష్ణోగ్రత పైకి వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంటుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) బి, డి
22. నల్లరేగడి నేలలు ఏర్పడటానికి కారణం?
1) బసాల్ట్ శిలల విచ్ఛిన్నం
2) గ్రానైట్ శిలల విచ్ఛిన్నం
3) లీచింగ్ అనే భూ స్వరూప ప్రక్రియ
4) సేంద్రియ పదార్థాల అవక్షేపం
23. ఏ ప్రకృతిసిద్ధ మండలంలో అల్ఫా- అల్ఫా అనే గడ్డి విస్తారంగా పెరుగుతుంది?
1) అయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి
2) సమశీతోష్ణ మండల పచ్చికబయళ్లు
3) ఉష్ణమండల పచ్చిక బయళ్లు
4) మధ్యధరా శీతోష్ణస్థితి మండలం
24 ‘బెర్ముడా ట్రయాంగిల్ ఏయే ప్రాంతాల మధ్య ఉంది?
1) బెర్ముడా దీవి, ఫోరిడా, పోర్టోరికా దీవులు
2) బెర్ముడా, జమైకా,పోర్టోరికా దీవులు
3) బెర్ముడా, ఏంటలీస్, పోర్టోరికా
4) బెర్ముడా, ఏంటలీస్, కరోలినా
25. ఏ మృత్తికలను కరి నేలలంటారు?
1) సేంద్రియ నేలలు 2) ఎర్రనేలలు
3) లాటరైట్ నేలలు
4) శుష్కనేలలు
26. అక్షాంశాల్లో పెద్ద వృత్తం ఏది?
1) మకరరేఖ 2) కర్కటరేఖ
3) భూమధ్యరేఖ
4) అంతర్జాతీయ దినరేఖ
27. ‘వన్స్టేట్-మినీ వరల్డ్’ ఏ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ట్యాగ్‌లైన్?
1) కేరళ 2) గోవా
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
28. భూమిపై వంకరగా గీసిన రేఖాంశం ఏది?
1) భారత ప్రామాణిక రేఖాంశం
2) గ్రీనిచ్ రేఖాంశం
3) అంతర్జాతీయ దినరేఖ
4) ఏదీకాదు
29. దక్షిణాయనాంతరం ఎప్పుడు సంభవిస్తుంది?
1) కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
2) మకరరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
3) ఆర్కిటిక్ వలయంపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
4) అంటార్కిటికా వలయంపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
30. ఉత్తరాయనాంతం ఎప్పుడు సంభవిస్తుంది?
1) అంటార్కిటికా వలయంపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
2) భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
3) కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
4) మకరరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు
32. సుంధా అగాథాన్ని ఏ మహాసముద్రంలో లోతైన అగాథమని అంటారు?
1) హిందూ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) పసిఫిక్ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
33. సముద్ర భూతలాన్ని ఎక్కువ ఆక్రమించి ఉన్న భాగం?
1) ఖండతీరపు వాలు
2) ఖండతీరపు అంచు
3) అగాథ సముద్ర మైదానం
4) మహాసముద్ర అగాధం
34. ‘ఎస్’ ఆకారంలో ఉన్న మహాసముద్రం పేరు?
1) హిందూ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) పసిఫిక్ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
35. భిలాయ్ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఛత్తీస్‌గఢ్ 2) జార్ఖండ్
3) ఒడిశా 4) పశ్చిమబెంగాల్
36. హిందాల్కో సంస్థ ఏ పరిశ్రమకు చెందింది?
1) ఇనుము, ఉక్కు పరిశ్రమ
2) మాంగనీస్ పరిశ్రమ
3) అల్యూమినియం పరిశ్రమ
4) సిమెంట్ పరిశ్రమ
37. యుద్ధనౌకలు తయారుచేస్తున్న ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రం ఏది?
1) హిందూస్థాన్ షిప్‌యార్డ్
2) మజగావ్ డాక్ యార్డ్
3) గోవా షిప్‌యార్డ్
4) గార్డెన్ రీచ్‌షిప్ యార్డ్
38. 1919లో ప్రారంభించిన ఇనుము-ఉక్కు కర్మాగారం ఏది?
1) టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
2) విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
3) ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
4) పోస్కో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
39. ఖండతీరపు అంచు ఎక్కువ ఉన్న మహాసముద్రం?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అంటార్కిటికా మహా సముద్రం
40. కోకో ఛానల్ ఏ దేశాల మధ్య ఉంది?
1) భారత్- మయన్మార్
2) భారత్- థాయిలాండ్
3) భారత్- ఇండోనేషియా
4) భారత్- మాల్దీవులు
గ్రహాలు కొన్ని ముఖ్యాంశాలు
అత్యంత ప్రకాశవంతమైన గ్రహం-శుక్రుడు
అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ (గురు గ్రహ ఉపగ్రహం)
తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు- శుక్రుడు, వరుణుడు
భూమి సోదరి- శుక్రుడు
సూర్యునికి దగ్గర గల గ్రహం- బుధుడు
అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహం- గురుడు
అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం- శుక్రుడు
అతి పెద్ద గ్రహం- గురుడు
అత్యల్ప సాంద్రత గల గ్రహం- శని
అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం-శని
ఉపగ్రహాలు లేని గ్రహాలు- బుధుడు, శుక్రుడు
భూమికి దగ్గరగా ఉన్న గ్రహం-శుక్రుడు
వేడి గ్రహం- శుక్రుడు
అత్యంత వేగంగా తిరిగే గ్రహం- బుధుడు
ఉదయతార, సాయంత్రతార, వేగుచుక్క- శుక్రుడు
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం (సూర్యుడు తర్వాత)- ఫ్రాక్సిమా
31. జతపరచండి.
1. ఉపధృవ మండలం పి. టైగా మండలం
2. స్టెప్పీ మండలం క్యూ. సమశీతోష్ణ మండలం
3. ఉష్ణమండల పచ్చిక బయళ్లు ఆర్. సవన్నాలు
4. ఉష్ణమండల వర్షారణ్యాలు ఎస్. డోల్ డ్రమ్స్
1) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్ 2) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
3) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4- ఎస్ 4) 1-ఎస్ , 2-క్యూ, 3-ఆర్, 4-పి
మస్తాన్ ఖాన్,
విషయనిపుణులు ఏకేఆర్ స్టడీసర్కిల్,
వికారాబాద్
- Tags
- Nipuna News Article
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?