నగదే రాజు.. డిజిటల్ దివ్యమైనది
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన మార్గదర్శనం సూచించడానికి ఒక అత్యున్నత సంస్థ/ బ్యాంక్ ఉంటుంది. దానినే ‘కేంద్ర బ్యాంక్’ అంటారు.
- ఈ కేంద్ర బ్యాంక్‌ను ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారి, బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణాధికారి అని కూడా పిలుస్తారు.
- భారతదేశంలో ఉన్న కేంద్ర బ్యాంకును భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్బీఐ) ‘రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా’ అంటారు.
- దేశంలో ఆర్బీఐని 1926లో కరెన్సీ, ఫైనాన్స్‌పై నియమించిన రాయల్ కమిషన్ (దీనినే హిల్టన్ యంగ్ కమిషన్ అంటారు). సూచన మేరకు, జె.ఎం. కీన్స్ – ప్రణాళిక ఆధారంగా, ఆర్బీఐ 1934 చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న రూ. 5 కోట్ల మూలధనంతో, 5 లక్షల వాటాదారులతో (ఒక్కొక్కరి వాటా 100రూ.) ప్రైవేటు యాజమాన్యం కింద / వాటాదార్ల బ్యాంకుగా ఏర్పాటు చేశారు.
- డా. బీఆర్ అంబేద్కర్ రచించిన ‘The Problem & Rupee -Its origin and Solution’ థీసిస్ ఆధారంగా చేసుకొని 1934లో ఆర్బీఐ చట్టం రూపొందింది.
- ఆర్బీఐ వాటాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం న్యాయం కాదని భావించి 14 సం.ల తరువాత 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేశారు.
- ఆర్బీఐ ప్రధాన కార్యాలయం మొదట కలకత్తాలో స్థాపించి 1937లో కలకత్తా నుంచి ముంబైకి మార్చారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
- 1947 ఏప్రిల్ వరకు ఆర్బీఐ భారతదేశం, పాకిస్థాన్, బర్మా దేశాలకు కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. 1948 జూన్1 వరకు ఆర్బీఐ భారతదేశంతోపాటు పాకిస్థాన్‌కు కేంద్ర బ్యాంకుగా పని చేసింది. ఆ తరువాత ఆర్బీఐ నిధుల్లో 70 శాతం ఇండియాకు 30 శాతం పాకిస్థాన్‌కు పంచుతూ ఇండియాకు ఆర్బీఐని ఇవ్వడం జరిగింది.
- మొత్తం ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ శిఖరాగ్ర సంస్థ / అత్యున్నత బ్యాంక్/ అపెక్స్ బ్యాంక్‌గా ఉంది.
- ఆర్బీఐ చిహ్నంలో Double Mohar, Bengal Tiger(Earlier sketch of the loin), Palm tree లు ఉన్నాయి.
- ఆర్బీఐ ఆధికారిక పత్రిక న్యూస్ లెటర్స్ అనే పక్షపత్రికను 1974 నుంచి ప్రచురిస్తుంది.
- ఆర్బీఐ నినాదం (స్లోగన్) Cash is King, but digital is divine ‘నగదు రాజు కాని డిజిటల్ దివ్యమైనది.’
- ఆర్బీఐ కేంద్ర బోర్డులో ప్రధానంగా నాలుగు డిపార్ట్మెంటులు ఉంటాయి.
1) బోర్డ్ ఆఫ్ ఫైనాన్స్ సూపర్విజన్
2) బోర్డ్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్
3) బోర్డ్ ఫర్ సిట్టింగ్ ఫీజ్ అండ్ హాల్టింగ్ అలవెన్సెస్
4) లోకల్ బోర్డ్స్ - ఆర్బీఐ పాలకబోర్డ్లో 21 మంది డైరెక్టర్స్ ఉంటారు.
- వీరందరిని ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం భారత ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీ కాలం 4 ఏండ్లు (కాని అవసరమైతే ప్రభుత్వం మార్పు చేయవచ్చు.)
- ఆర్బీఐ పాలకబోర్డులోని 21 మంది డైరెక్టర్లను రెండు విధాలుగా విభజిస్తారు.
1. అధికారిక డైరెక్టర్లు (ఆఫిషియల్ డైరెక్టర్లు) వీరు ఐదుగురు ఉంటారు. వీరిలో ఒకరు ఆర్బీఐ గవర్నర్, నలుగురు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఉంటారు.
2. అనధికార డైరెక్టర్లు (అనఫిషియల్ డైరెక్టర్స్) వీరిలో 16 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు భారత ప్రభుత్వ అధికారులు. 10 మంది భారత ప్రభుత్వం చేత నియమితులైన డైరెక్టర్లు, నలుగురు ప్రాంతీయ బోర్డుల చైర్మన్లు ఉంటారు. - ఆర్బీఐకి దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ బోర్డులు ప్రముఖ నగరాల్లో ఉన్నాయి. అది ముంబై, కలకత్తా, చెన్నై, న్యూఢిల్లీ.
- ప్రతి ప్రాంతీయ బోర్డులో ఐదుగురు (1+4) ఉంటారు. వీరి పదవీకాలం నాలుగేండ్లు.
- ఆర్బీఐ దేశావ్యాప్తంగా 27 ప్రాంతీయ కార్యాలయాలు, నాలుగు ఉప కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ దేశ వ్యాప్తంగా 6 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
- ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటాడు
- కేంద్ర ఆర్థిక మంత్రి సిఫార్సు చేత ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్బీఐ గవర్నర్‌ను నియమిస్తుంది.
- ఇతని పదవి కాలం నాలుగు సం.లు (భారత ప్రభుత్వం పెంచవచ్చు, తగ్గించవచ్చు)
ఆర్బీఐ గవర్నర్లు
- ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ ఒస్బోర్న్ స్మిత్ (Osborne Smith) (1935-37)
- ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మొదటి గవర్నర్ ఒస్బోర్న్ స్మిత్
- ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ సి.డి. దేశ్‌ముఖ్ (1943-49).
- ఆర్బీఐకి ఎక్కువకాలం పనిచేసిన గవర్నర్ శ్రీ బెనగల్ రామారావు (1949-57)
- ఆర్బీఐకి తక్కువ కాలం పని చేసిన గవర్నర్ అమిత్ ఘోష్ (1985 జనవరి-1985 ఫిబ్రవరి) కేవలం 20 రోజులు మాత్రమే.
- కనీస మద్దతు ధరలు (మినిమం సపోర్టు ప్రైస్) సూచించిన ఆర్బీఐ గవర్నర్ ఎల్.కె.ఝా
- భారత బ్యాంకింగ్ రంగ పితామహుడు (గవర్నర్) ఎం. నరసింహం
- భారత ప్రధాన మంత్రిగా వ్యవహరించిన ఆర్బీఐ గవర్నర్ డా.మన్మోహన్సింగ్ (1982-85)
- 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ డా.వై.వి. రెడ్డి (2003-08)
- ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన తెలుగువారు వై.వి. రెడ్డి, దువ్వూరి సుబ్బారావు.
- ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తి కాంత్‌దాస్ (2018 డిసెంబర్ 12 నుంచి కొనసాగుతున్నారు.
- ఇతను ఆర్బీఐ 25వ గవర్నర్. ఇతని పదవీకాలం మరో మూడేళ్లు పొడిగించారు. (2021 డిసెంబర్లో) ఇతను 15వ ఆర్థిక సంఘంలో సభ్యులుగా పని చేస్తున్నారు.
- ఆర్బీఐ పాలక బోర్డ్‌లో ఒక గవర్నర్‌తోపాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు.
1) ఎం.కె. జైన్
2) ఎం.డి. పాత్ర
3) ఎం. రాజేశ్వరరావు
4) టి. రవికుమార్
ప్రాక్టీస్ బిట్స్
1. దేశంలో కేంద్ర బ్యాంకును ఏమని పిలుస్తారు?
ఎ) భారతీయ స్టేట్ బ్యాంక్
బి) భారతీయ రిజర్వు బ్యాంకు
సి) ఎ, బి
డి) భారతీయ ఆర్థిక బ్యాంకు
2. దేశంలో ఆర్బీఐ ఏర్పాటుకు సూచించిన కమిషన్ ఏది?
ఎ) రాయల్ కమిషన్
బి) ఫైనాన్స్ కమిషన్
సి) సర్కారియా కమిషన్
డి) కొఠారీ కమిషన్
3. భారతీయ రిజర్వుబ్యాంకు ఏర్పడిన సంవత్సరం?
ఎ) 1934 ఏప్రిల్ 1 బి) 1935 ఏప్రిల్ 1
సి) 1934 మార్చి 1 డి) 1949 జనవరి 1
4. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) ముంబై బి) కోల్‌కతా
సి) మద్రాస్ డి) చెన్నై
5. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
ఎ) మద్రాస్ బి) కోల్‌కతా
సి) ముంబై డి) న్యూఢిల్లీ
6. రాయల్ కమిషన్‌కు మరొక పేరు?
ఎ) హిల్టన్ యంగ్ కమిషన్
బి) హిల్లరీ యంగ్ కమిషన్
సి) యంగ్ కమిషన్
డి) హిల్టన్ కమిషన్
7. ఆర్బీఐని ఎవరి ప్రణాళిక ఆధారంగా రూపొందించారు?
ఎ) జె.ఎం కీన్స్ ప్రణాళిక
బి) జె.బి. కీన్స్ ప్రణాలిక
సి) ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రణాళిక
డి) ఆచార్యా మార్షల్ ప్రణాళిక
8. ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారు?
ఎ) 1939 జనవరి 1
బి) 1949 జనవరి 1
సి) 1955 జనవరి 1
డి) 1955 జూలై 1
9. 1947 ఏప్రిల్ 1 నాటికి ఆర్బీఐ ఏ దేశాలకు కేంద్ర బ్యాంక్‌గా పనిచేసింది?
ఎ) భారత్, పాకిస్థాన్, బర్మా
బి) భారత్ పాకిస్థాన్, బంగ్లాదేశ్
సి) భారత్, నేపాల్, పాకిస్థాన్
డి) భారత్, నేపాల్, బర్మా
10. మొత్తం ద్రవ్య వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థ/ అత్యున్నత బ్యాంక్/ అపెక్స్ బ్యాంక్ ఏది?
ఎ) ఎస్బీఐ బి) ఆర్బీఐ
సి) ఐసీఐసీఐ డి) ఐడీబీఐ
11. ఆర్బీఐ అధికారిక పత్రిక ఏది?
ఎ) లెటర్ న్యూస్ బి) న్యూస్ లెటర్
సి) పామ్ న్యూస్ డి) బెంగాల్ న్యూస్
12. ఆర్బీఐ కేంద్ర బోర్డులో ఎంతమంది డైరెక్టర్స్ ఉంటారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
13. ఆర్బీఐ పాలకబోర్డులో ఎంతమంది డైరెక్టర్స్ ఉంటారు?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 21
14. ఆర్బీఐకి దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రాంతీయ బోర్డులు ఉన్నాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
15. ఆర్బీఐ డైరెక్టర్స్ పదవీకాలం ఎంత?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
16. ఆర్బీఐ అధికార డైరెక్టర్లు, అనధికార డైరెక్టర్లు ఎంత మంది ఉంటారు?
ఎ) 5, 16 బి) 6, 15
సి) 7, 14 డి) 8, 13
17. ఆర్బీఐకి దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి?
ఎ) 25 బి) 26 సి) 27 డి) 28
18. ఆర్బీఐకి దేశవ్యాప్తంగా ఎన్ని ఉప కార్యాలయాలు ఉన్నాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
19. ఆర్బీఐ కి ఎన్ని శిక్షణ కేంద్రాలు ఉన్నాయి?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
20. ఆర్బీఐ గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) ప్రధానమంత్రి కార్యాలయం
బి) కేంద్ర ఆర్థిక మంత్రి సిఫార్సు చేత
ప్రధానమంత్రి కార్యాలయం
సి) రాష్ట్రపతి
డి) ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి
21. ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ ఎవరు?
ఎ) ఒస్బోర్న్స్మిత్ బి) సి.డి.దేశ్‌ముఖ్
సి) ఎల్.కె. ఝా
డి) ఎం. నరసింహం
22. ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
ఎ) ఎం. నరసింహం బి) వై.వి. రెడ్డి
సి) సి.డి. దేశ్‌ముఖ్
డి) నరసింహం
23. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన దేశ ప్రధాని అయినది ఎవరు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) డా. మన్మోహన్ సింగ్
సి) ఎ.బి. వాజ్పాయ్
డి) సుభాష్ చంద్రబోస్
24. ఎక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) బెనగల్ రామారావు
బి) శక్తికాంత్‌దాస్ సి) నరసింహం
డి) దువ్వూరి సుబ్బారావు
25. తక్కువకాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) కె.జి. అంభిగోంకర్
బి) అమిత్ ఘోష్
సి) వై.వి. రెడ్డి డి) టి. రవిశంకర్
26. రాజీనామా చేసిన మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) బెనగల్ రామారావు
బి) ఎస్ జగన్నాథన్
సి) ఉర్జిత్పటేల్ డి) ఒస్బోర్న్ స్మిత్
27. భారతదేశ బ్యాంకింగ్ రంగం పితామహుడు ఎవరు?
ఎ) ఎం. నరసింహం
బి) సి. రంగరాజన్
సి) బీమల్ జరాన్
డి) మన్మోహన్ సింగ్
28. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన తెలుగువారు ఎవరు?
ఎ) ఎం. నరసింహం, రంగరాజన్
బి) వై.వి. రెడ్డి, దువ్వూరి సుబ్బారావు
సి) టి. రవిశంకర్, దువ్వూరి సుబ్బారావు
డి) వై.వి. రెడ్డి, టి. రవిశంకర్
29. కిందివారిలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు ఎవరు?
ఎ) టి. రవిశంకర్ బి) శక్తికాంత్ దాస్
సి) ఎం.కె. జైన్
డి) ఎం. రాజేశ్వర్ రావు
30. కేంద్రబ్యాంకుకు మరొక పేరు?
ఎ) ద్రవ్య వ్యవస్థ నియంత్రణ అధికారి
బి) బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణాధికారి
సి) ఎ, బి డి) పైవేవీకావు
31. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) శక్తి కాంత్‌దాస్ బి) ఉర్జీత్ పటేల్
సి) రఘురామ్ రాజన్
డి) వై.వి.రెడ్డి
32. 25వ ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) ఉర్జీత్ పటేల్ బి) శక్తికాంత్‌దాస్
సి) వై.వి. రెడ్డి డి) మన్మోహన్ సింగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు