మెడలో బొంగరం.. భజంలో బంతి!
మానవ అస్థిపంజర వ్యవస్థ
శరీరంలోని ఎముకల గూడును అస్థిపంజరం అంటారు. ఎముకలన్నీ కండరాలు, కీళ్లతో అనుసంధానమై ఉంటాయి. అస్థిపంజరం మానవ శరీరానికి నిర్దిష్టమైన ఆకారాన్నిస్తుంది. మానవ శరీరంలోని అన్ని ఎముకలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అస్థిపంజరం గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ‘ఆర్థోపెడిక్స్’ అంటారు.
మానవ అస్థిపంజరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. అవి ఎముకలు, కండరాలు, కీళ్లు.
ఎముకలు
l ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం- ఆస్టియాలజీ
l ఎముకల్లో ఉండే కణాలు- ఆస్టియోసైట్స్
l ఎముకల్లో ఉండే ప్రొటీన్- అస్సిన్
l ఎముకలు కాల్షియం, పాస్ఫరస్తో నిర్మితమవుతాయి.
l కాల్షియం ఎముకకు గట్టిదనాన్నిస్తుంది.
l పాస్ఫరస్ ఎముకకు మండే స్వభావాన్ని కలిగిస్తుంది.
l మానవుడి శరీరంలో ఉండే అతిపెద్ద ఎముక/అతిపొడవైన ఎముక- ఫీమర్ (తొడ ఎముక)
l మానవుడి శరీరంలో ఉండే అతిచిన్న ఎముక- చెవిలోని స్టేపిస్ (కర్ణాంతరాస్థి)
l మానవుడి శరీరంలో ఉండే అతి మెత్తని ఎముక- మృదులాస్థి
lమానవుడిలో ఉండే అతి గట్టి ఎముక- కింది దవడ ఎముక
l మానవ శరీరంలో ఎముక కంటే గట్టి పదార్థం- ఎనామిల్
l సాధారణ మానవుడి శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 206
lఅప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 300
శ్రోణి మేఖల: ఇందులో రెండు భాగాలుంటాయి. అవి జత్రుక-2, రెక్క ఎముక-2. జత్రుక, రెక్క ఎముకలను కలిపి ‘భుజాస్థులు’ అని అంటారు.
l ఎముకల పెరుగుదలకు తోడ్పడే విటమిన్- డి విటమిన్
l ఎముకల మధ్యలో ‘అస్థి మజ్జ’ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
l పక్షుల రెక్క ఎముకల మధ్యలో అస్థి మజ్జ ఉండదు. అవి గాలితో నిండి ఉంటాయి. వీటిని వాతిలాస్థులు అంటారు. ఇవి పక్షులు ఎగరడానికి సహాయపడతాయి.
ఎముకల వ్యాధులు
ఫ్లోరోసిస్
l ఈ వ్యాధి ఫ్లోరిన్ కలిసిన నీటిని తాగడం వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణాలు- దంతాలు పసుపు రంగులోకి మారడం, ఎముకలు వంకర్లు తిరగడం
l ఫ్లోరోసిస్ మన రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది.
l మనం తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం- 1.5 పీపీఎం
l నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటిలో ఉండే ఫ్లోరిన్ శాతం- 3.7 పీపీఎం
రికెట్స్ వ్యాధి
l ఈ వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది.
l ఇది డి విటమిన్ లోపం వల్ల సంభవించే అపస్థితి.
l వ్యాధి లక్షణాలు- ఎముకలు పెలుసుబారడం, ఎముకల్లో రంధ్రాలు ఏర్పడి కుచించుకుపోవడం
l ఈ వ్యాధిని దొడ్డికాలు లేదా ముట్టి కాలు అంటారు.
ఆస్టియో మలేషియా
l ఈ వ్యాధి పెద్దవారిలో వస్తుంది. ఇది కూడా విటమిన్ -డి లోపం వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణం- ఎముకలు వాపునకు గురవడం
కండరాలు
l ఎముకలకు అంటిపెట్టుకుని ఉండే కణజాల నిర్మాణాలను కండరాలు అంటారు.
l కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం- మయాలజీ
l కండరాల్లో ఉండే ప్రొటీన్- మయోసిన్
l మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య- 639
l శరీరంలోని అతిపెద్ద కండరం- గ్లూటియస్ మాక్సామస్ (తొడ భాగంలో ఉంటుంది)
l మానవ శరీరంలో ఉండే అతిచిన్న కండరం- స్టెపిడియస్ కండరం( చెవిలో ఉంటుంది)
l కండరాలు మూడు రకాలు అవి నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు.
l నియంత్రిత కండరాలు (రేఖిత కండరాలు): ఈ కండరాలు మన శరీరం ఆధీనంలో ఉంటాయి. ఇవి కాళ్లు, చేతుల్లో ఉంటాయి.
l అనియంత్రిత కండరాలు (అరేఖిత కండరాలు): ఈ కండరాలు శరీరం నియంత్రణలో ఉండవు. ఇవి పేగులు, గర్భాశయం, మూత్రాశయం, కనురెప్పల్లో ఉంటాయి.
l హృదయ కండరాలు: ఇవి హృదయంలోనే ఉంటాయి. ఇవి రక్తాన్ని పంపు చేయడంలో సహాయపడతాయి. ఈ కండరాలు నిర్మాణంలో నియంత్రిత కండరాలు, విధుల్లో అనియంత్రిత కండరాలను పోలి ఉంటాయి.
కీళ్లు
l ఒక ఎముకను మరొక ఎముకను కలుపుతూ ఉండే నిర్మాణాన్ని కీలు అంటారు.
l కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం – ఆర్థ్రాలజీ
l కీళ్లకు సంబంధించిన చికిత్స – ఆర్థరైటిస్
l మానవ శరీరంలో ఉండే కీళ్ల సంఖ్య – 230
l కీళ్లు రెండు రకాలు అవి. కదలని కీళ్లు, కదిలే కీళ్లు.
కదలని కీళ్లు: ఇవి పుర్రెలో ఉంటాయి. కదలని కీళ్లలో కదిలే కీలుగా ‘కింది దవడ ఎముక’ను పేర్కొంటారు.
కదిలే కీళ్లు: వీటిని తిరిగి నాలుగు రకాలుగా విభజించారు.
l బంతిగిన్నె కీలు- ఇది భుజంలో ఉంటుంది.
l మడతబందు కీలు- ఇది మోచేయి, మోకాలులో ఉంటుంది.
l బొంగరపు కీలు- ఇది మెడ భాగంలో ఉంటుంది.
l జారుడు కీలు- ఇది మణికట్టు, వెన్నుపూసల్లో ఉంటుంది.
కీళ్లకు సంబంధించిన వ్యాధులు
చికున్ గున్యా ఆస్టియో-ఆర్థరైటిస్
రుమటాయిడ్ గౌట్స్
సైనోవిటిస్ స్పాండిలైటిస్
మొక్కల్లో నత్రజని స్థాపన
l మొక్కలు పోషకాలను తయారుచేయడానికి నత్రజని అవసరం అవుతుంది.
l వాతావరణంలో 78 శాతం నత్రజని ఉంటుంది.
l మొక్కలు నత్రజనిని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, అనబినా, నాస్టాక్, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవుల ద్వారా తీసుకుంటాయి. ఈ సూక్ష్మజీవులు వాతావరణంలో ఉన్న నత్రజనిని గ్రహించి నత్రికామ్లాలుగా మార్చి, మొక్కల్లోని వేర్లకు అందిస్తాయి.
l లెగ్యుమినేసి (చిక్కుడు జాతి) వేరు బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా- రైజోబియం
నోట్: లెగ్యుమినేసి కుటుంబపు మొక్కలు, రైజోబియం బ్యాక్టీరియా ఆవాసం, ఆహారాన్ని పరస్పరం పంచుకుంటాయి. ఈ ప్రక్రియను సహజీవనం అంటారు.
బీటీ: బీటీ అంటే బాసిల్లస్ థురెంజియన్సిస్. ఇది ఒకరకమైన బ్యాక్టీరియా దీన్ని బయోపెస్టిసైడ్గా నిర్ధారిస్తారు. ఇది తనకు తానే రక్షించుకుంటుంది. బీటీ మొక్కల ఆకులను తిన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. కాని ఇది భవిష్యత్తులో మానవ మనుగడకు ప్రమాదం అవుతుంది. దీన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా సృష్టించారు.
మొక్కలకు వచ్చే వ్యాధులు
వరి
బ్లయిట్ తెగులు/ ఎండు తెగులు
l ఈ వ్యాధి జాంథోమోనాస్ ఒరైజా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణం- పత్రాలు పసుపు రంగులోకి మారడం
l ఎండు తెగులు గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి.
అగ్గి తెగులు
l ఈ వ్యాధి ‘సెరిక్యులేరియా ఒరైజా’ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణం- పత్రాలపైన అండాకార మచ్చలు ఏర్పడి తెల్లని బూజు ఏర్పడుతుంది
l ఈ వ్యాధి కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కాటుక తెగులు
l వ్యాధి స్పేసిలో-థికా-సోైర్గె’ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణం- పత్రాలపైన నలుపు రంగులో మచ్చలు ఏర్పడి, పత్రాలు, గింజలు కిందికి వేలాడుతాయి
l ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
చెరకు- ఎర్రకుళ్లు తెగులు
l ఈ వ్యాధి కలటోట్రైకామ్ పాల్కేటమ్ అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది.
l వ్యాధి లక్షణం- చెరకు గడలపై ఎరుపు రంగు చారలు ఏర్పడుతాయి
l చెరకులో ఎర్రకుళ్లు తెగులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
వేరుశనగ- తిక్కా తెగులు
l వేరుశనగలో తిక్కా తెగులు సేర్కోస్పోరా అరాఖిపోడిపోరా అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది.
l వ్యాధి లక్షణం- పత్రాలపైన నలుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి
l తిక్కాతెగులును ఆకుమచ్చ తెగులు అని కూడా అంటారు.
l ఈ వ్యాధి కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వేరు విల్ట్ తెగులు: ఇది కొబ్బరి మొక్కల్లో వస్తుంది. ఇది వైరస్ల వల్ల సంభవిస్తుంది.
మొజాయిక్ తెగులు: ఇది పొగాకులో వస్తుంది. పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్ (టీఎంవీ) వల్ల వస్తుంది. వ్యాధి సోకిన మొక్కల్లో పత్రాలు ముడుచుకుపోతాయి. ఇది కీటకాల ద్వారా వ్యాపిస్తుంది.
సిట్రస్ కాంకర్/నిమ్మగడ్డి తెగులు
l ఈ వ్యాధి జాంథోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
l వ్యాధి లక్షణం- పిందె దశలో ఉన్న కాయలపైన గోధుమ వర్ణంలో ఉండే మచ్చలు ఏర్పడటం, పసుపు రంగు మచ్చలు ఏర్పడటం
l సిట్రస్ కాంకర్ వ్యాధి సోకిన మొక్క భాగాలను కాల్చివేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు.
– టీ కృష్ణ
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు