భారతదేశంలో బ్యాంకుల ఏర్పాటు-విలీనం
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసినది ఆంగ్లేయులు
భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకును క్రీ.శ. 1770లో కలకత్తా కేంద్రంగా అలెగ్జాండర్ అండ్ కంపెనీ వారు ఇంగ్లిష్ ఏజెన్సీ హౌస్ వారితో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో స్థాపించారు. కాని 1782లో మూసివేశారు.
ఆ తరువాత 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ను కలకత్తాలో ఏర్పాటు చేశారు.
1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయిని ఏర్పాటు చేశారు.
1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌ను ఏర్పాటు చేశారు.
పై మూడు బ్యాంకులను 1921లో విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు వీలుగా ఒక పెద్ద వాణిజ్య బ్యాంక్ ఉంటే మంచిదన్న ఆలోచనతో 1953లో గోర్వాల అధ్యక్షతన గల గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సిఫార్సు చేసింది.
గోర్వాలా కమిటీ సూచన మేరకు 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
జాతీయం చేసిన తొలి వాణిజ్యబ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది.
1959 అక్టోబర్ 1న ఎస్బీఐ(అనుబంధ బ్యాంకుల) చట్టం చేశారు.
ఈ చట్టం ప్రాకారం 8 బ్యాంకులను ఎస్బీఐకి అనుబంద బ్యాంకులుగా ఏర్పాటు చేశారు. అవి
ఎస్బీఐ, అనుబంధ బ్యాంకులను కలిపి ఎస్బీఐ గ్రూప్‌గా పిలిచేవారు.
1963లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ జయపూర్లను విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ గా మార్చారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హోల్డింగ్ కంపెనీగా వర్ణించవచ్చు.
భారతదేశంలో ఎస్బీఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, ఎక్కువ బ్రాంచీలను కలిగిన బ్యాంకు, డిపాజిట్ల స్వీకరణ, రుణాల మంజూరులో లాభార్జనలో అతిపెద్దది ఎస్బీఐ
ఎస్బీఐ స్లోగన్ With you all the way pure Banking Nothing Else
ఎస్బీఐ మొదటి చైర్మన్ జాన్ మథాయ్ (1955 జూలై1)
మహిళా చైర్మన్ ఆరుంధతి బట్టాచార్య (2013 అక్టోబర్ 7 నుంచి 2017 అక్టోబర్ 6 వరకు
ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖర (7 అక్టోబర్ 2020)
2008, ఆగస్టు 13న స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్బీఐలో విలీనం చేశారు. 2010 జూలై 15న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను ఎస్బీఐలో విలీనం చేశారు.
2017 ఏప్రిల్ 1న మిగిలిన 5 ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేశారు.
వీటితోపాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్బీఐలో విలీనం చేశారు.
ఈ విలీనంతో ప్రపంచంలోని ఆస్తుల్లో 50 శాతంతో అతిపెద్దది ఎస్బీఐ ఒకటి.
ఈ వీలినం ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ప్రస్తావన ముగిసింది.
దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అనుబంధ బ్యాంకుల)చట్టం-1959, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టం-1956 రద్దు చేయబడినవి.
భారతీయ మహిళాబ్యాంకు
2013 నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాన -మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం మొదటి మహిళాబ్యాంకు అయిన భారతీయ మహిళా బ్యాంకును ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని మొదటి సీఎండీ ఉసా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేసిన మూడో దేశం భారతదేశం. మొదటిది పాకిస్థాన్ రెండోది టాంజానియా. ఈ బ్యాంకు ప్రధాన లక్ష్యం మహిళలకు సహాయం అందించి విత్త సమ్మిళతానికి దోహదం చేయడం. డిపాజిట్లను అందరి నుంచి స్వీకరించి రుణాలను మాత్రం మహిళలకే అందిస్తుంది. 2017లో ఎస్బీఐలో విలీనం చేశారు.
బ్యాంకింగ్ పదజాలం ఐఎఫ్ఎస్సీ (IFSC) :
ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ భారతదేశం భౌగోళిక సరిహద్దు లోపల గల బ్యాంకులు ఇంటర్ బ్యాంక్ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఉపయోగించే కోడ్‌ను ఐఎఫ్ఎస్సీ అంటారు.
ఐఎఫ్ఎస్సీ కోడ్ 11 అక్షరాలు గల ఆల్ఫాబీటా న్యూమరికల్ కోడ్. అంటే అంకెలు, ఇంగ్లిష్ అక్షరాలతో కలిపి ఉంటాయి.
స్విఫ్ట్ (SWIFT)
భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక బ్యాంకు విదేశాల్లో ఉన్న తన బ్రాంచీలతోగానీ, ఇతర బ్యాంకుల బ్రాంచీలతోగానీ లావాదేవీలు జరపడానికి ఉపయోగించే కోడ్‌ను ‘స్విఫ్ట్ కోడ్’ అంటారు.
స్విఫ్ట్ కోడ్ అనేది 8 లేదా 11 డిజిట్స్ కలిగి ఉన్న ఆల్ఫాన్యూమరికల్ కోడ్.
1973లో మొదట బెల్జియం దేశం ప్రధాన కేంద్రంగా స్విఫ్ట్ ప్రారంభించారు.
విత్త సంస్థలు
ఆర్థిక వ్యవస్థ నుంచి పొదుపులను సేకరించి పెట్టుబడులుగా మార్చే సంస్థలను ఆర్థిక / విత్త సంస్థలు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా 4 రంగాలుంటాయి. అవి కుటుంబ రంగం ,ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ రంగం.
ఈ నాలుగు రంగాల నుంచి పొదుపులను సేకరించి ఉత్పత్తి సంస్థలకు గాని సేవా సంస్థలకు గాని, వాణిజ్య సంస్థలకు గాని రుణాల రూపంలో పెట్టుబడులు అందించే సంస్థలను విత్త సంస్థలు అంటారు.
షెడ్యూల్డ్ బ్యాంకులు
ఆర్బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్లో నమోదయిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు.
నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు
ఆర్బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్లో నమోదు కాని బ్యాంకులను నాన్ షెడ్యూల్డ్ బ్యాంకు లు అంటారు.
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకం
వినియోగదారుల, ఖాతాదారుల సమస్యల పరిష్కారానికై ఆర్బీఐ 1995 జూన్ 14న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి తగిన ప్రతిస్పందన లేనపుడు అంటే ఈ బ్యాంకుల సేవల పట్ల సంతృప్తి చెందని ఖాతాదారులు 30 రోజుల్లోగా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు అంబుడ్స్‌మన్ తగిన చర్యలు తీసుకోవడం తద్వారా పరిష్కారానికి కృషి చేస్తుంది. 2006 నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా దీని పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17 అంబుడ్స్‌మన్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ప్రాక్టీస్ బిట్స్
1. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు ఏది?
ఎ) ఇంపీరియల్ బ్యాంకు
బి) అవద్ బ్యాంకు
సి) అలహాబాద్ బ్యాంకు
డి) హిందుస్థాన్ బ్యాంకు
2. 1806 సం.లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) పశ్చిమ బెంగాలు బి) కలకత్తా
సి) బొంబాయి డి) మద్రాస్
3. బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్‌ను ఏ సంవత్సరంలో మూసివేశారు?
ఎ) 1780 బి 1781
సి) 1782 డి) 1783
4. ‘బ్యాంక్ ఆఫ్ బొంబాయి’ని ఏ సం.లో ఏర్పాటు చేశారు?
ఎ) 1806 బి 1840
సి) 1843 డి) 1845
5. హిందుస్థాన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) కలకత్తా బి) బొంబాయి
సి) మద్రాస్ డి) పశ్చిమ బెంగాల్
6. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1955 జూలై 1 బి) 1955 జూన్ 1
సి) 1956 జూన్ 1 డి) 1956 జూలై 1
7. ఎస్బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1958 అక్టోబర్ 1
బి) 1959 అక్టోబర్ 1
సి) 1958 నవంబర్ 1
డి) 1959 నవంబర్ 1
8. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్’ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) మధ్య ప్రదేశ్ బి) కర్ణాటక
సి) కేరళ డి) ఆంధ్రప్రదేశ్
9. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా’ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) రాజస్థాన్ బి) పంజాబ్
సి) మధ్యప్రదేశ్ డి) మహారాష్ట్ర
10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జయపూర్గా ఎప్పుడు విలీనం చేశారు?
ఎ) 1961 బి) 1962
సి) 1963 డి) 1964
11. కిందివాటిలో ఏ బ్యాంకును హోల్డింగ్ కంపెనీ వర్ణించారు?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ జయపూర్
12. With You All The Way, Pure Ban king. Nothing Else ఏ బ్యాంకు నినాదం (Slogan).
ఎ) ఎస్బీహెచ్ బి) ఎస్బీఐ
సి) ఆర్బీఐ డి) ఏబీ
13. ఎస్బీఐ మొదటి చైర్మన్ ఎవరు?
ఎ) జాన్ మథాయ్ బి) భట్టాచార్య
సి) రజనీష్ కుమార్ డి) చందా కొచ్చార్
14. ఎస్బీఐ మొదటి మహిళా చైర్మన్ ఎవరు?
ఎ) చందా కొచ్చార్
బి) అరుంధతి భట్టాచార్యా
సి) అన్షురా కాంత్ డి) అశ్వీని
16. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఏ సంవత్సరంలో ఎస్బీఐలో విలీనం చేశారు?
ఎ) 2006 బి) 2008
సి) 2007 డి) 2009
17. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను ఏ సంవత్సరంలో ఎస్బీఐలో విలీనం చేశారు?
ఎ) 2009 బి) 2010
సి) 2011 డి) 2012
18. ఏ సంవత్సరం నాటికి ఎస్బీఐ అనుబంధ సంస్థల ప్రస్తావన ముగిసింది?
ఎ) 2005 బి) 2016
సి) 2017 డి) 2018
19. భారతీయ మహిళా బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేవారు?
ఎ) 2012 నవంబర్ 12
బి) 2013 నవంబర్ 12
సి) 2013 నవంబర్ 18
డి) 2013 నవంబర్ 19
20. భారతీయ మహిళాబ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ బి) ముంబాయి
సి) కోల్‌కతా డి) చెన్నై
21. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకు ను ఏర్పాటు చేసిన మొదటిదేశం ఏది?
ఎ) పాకిస్థాన్ బి) టాంజానియా
సి) భారతదేశం డి) బంగ్లాదేశ్
22. భారతీయ మహిళాబ్యాంకును ఎవరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారు?
ఎ) రాజీవ్ గాంధీ బి) ఇందిరాగాందీ
సి) నెహ్రూ డి) సంజయ్ గాంధీ
23. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేసిన మూడో దేశం ఏది?
ఎ) బంగ్లాదేశ్ బి) భారతదేశం
సి) టాంజానియా డి) పాకిస్థాన్
24. భారతీయ మహిళాబ్యాంకును ఏ సంవత్సరం ఎస్బీఐలో విలీనం చేశారు?
ఎ) 2010 బి) 2012
సి) 2016 డి) 2017
25. ఐఎఫ్ఎస్సీ అనేది?
ఎ) ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్
బి) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్
సి) ఇండియన్ ఫైనాన్షియల్ స్టేట్ కోడ్
డి) ఇండియన్ ఫైనాన్షియల్ స్కీమ్ కోడ్
26. ఐఎఫ్ఎస్సీ అంటే?
ఎ) 11 అక్షరాలుండే ఆల్ఫాన్యూమరికల్ కోడ్
బి) 8 అక్షరాలుండే ఆల్ఫాన్యూమరికల్ కోడ్
సి) 12 అక్షరాలుండే ఆల్ఫాన్యూమరికల్ కోడ్
డి) పైవన్నీ
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) -తెలంగాణ
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం)-కర్ణాటక
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోన్ (ఎస్బీటీ)-కేరళ
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ – మధ్యప్రదేశ్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర – మహారాష్ట్ర
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా – పంజాబ్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ – రాజస్థాన్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ – రాజస్థాన్
-పానుగంటి కేశవ రెడ్డి
రచయిత వైష్ణవి పబ్లికేషన్స్గోదావరిఖని
9949562008
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు