జవహర్ ఎత్తిపోతల పథకం అసలు పేరేమిటి?

- జాగ్రఫీ
1. రాష్ట్రంలో నూలు వస్త్రపరిశ్రమ ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) కుమ్రంభీం ఆసిఫాబాద్
4) పైవన్నీ
2. ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ‘ఎలినినో’ ఏర్పడుతుంది?
1) హిందూ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
3. ‘కేఫ్ ఆఫ్ కమోరిన్’ అంటే?
1) ప్రధాన భారతదేశ దక్షిణ చివరి అగ్రం
2) ప్రధాన భారతదేశ ఉత్తర చివరి భాగం
3) ప్రధాన భారతదేశ తూర్పు చివరి భాగం
4) ప్రధాన భారతదేశ పడమర చివరి భాగం
4. ధనుష్కోటి వేటిని కలుపుతుంది?
1) అరేబియా సముద్రం గల్ఫ్ ఆఫ్ కంబాట్
2) బంగాళాఖాతం, అరేబియా సముద్రం
3) బంగాళాఖాతం, హిందూమహాసముద్రం
4)హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం
5. జతపరచండి.
ఎ. భారత్-మాల్దీవులు 1. కోకో ఛానల్
బి. భారత్- మయన్మార్ 2. 80 డిగ్రీల ఛానల్
సి. భారత్- ఇండోనేషియా 3. గ్రేట్ ఛానల్
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-3, సి-1
6. సతత హరిత, శృంగారపు అడవులకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు?
1) పూర్వాంచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) శివాలిక్ హిమాలయాలు
4) హిమాచల్ హిమాలయాలు
7. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ‘మజిలీ’ ఏ ప్రాంతంలో ఉంది?
1) బ్రహ్మపుత్ర మైదానాలు
2) గంగా మైదానాలు
3) రాజస్థాన్ మైదానాలు
4) పంజాబ్, హర్యానా మైదానాలు
8. జతపరచండి.
ఎ. థాల్‌ఘాట్/బాల్ఘాట్ కనుమ 1. ముంబై- ఇండోర్‌లను కలుపుతుంది
బి. పాల్ఘాట్ కనుమ 2. కొచ్చిన్, కొయంబత్తూరును కలుపుతుంది
సి. బనిహల్ కనుమ 3. జమ్ము, శ్రీనగర్‌ను కలుపుతుంది
డి. జీలప్ కనుమ 4.టిబెట్-పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్తో కలుపుతుంది
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-3, డి-1 4) ఎ-2, బి-3, సి-4, డి-1
9. సింధూనది గురించి కింది వాటిలో సరైనది?
1) అది కైలాస్- మానస సరోవర్‌లో పుట్టింది
2) సింధూ నది పూర్తి పారుదల ప్రదేశం వైశాల్యం దాదాపుగా 4లక్షల 20వేల మైళ్లు
3) దీన్ని పర్షియన్లు హైందవీ, టిబెటన్లు సింగె అని పిలుస్తారు
4) సింధూ నది భారత్‌లో 740 కిలోమీటర్లు ప్రవహిస్తుంది
10. కింది వాటిని పరిశీలించండి? ఆనకట విద్యుత్ ప్రాజెక్ట్ నది
ఎ. కిశావు – అలకనంద
బి. కోటేశ్వర్ – భగీరథ
సి. నంగల్ – సట్లెజ్
1) ఎ 2) ఎ, సి 3) బి, సి 4) బి
11. జతపరచండి. సరిహద్దు పంచుకొనే రాష్ర్టాలు
ఎ. కామారెడ్డి 1. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర
బి. జోగులాంబ గద్వాల 2. కర్ణాటక, ఏపీ
సి. జయశంకర్ భూపాలపల్లి 3. కర్ణాటక, ఏపీ
డి. భద్రాద్రి కొత్తగూడెం 4. ఛత్తీస్‌గఢ్, ఏపీ
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
12. కింది వాటిలో సరికానిది?
1) ఏపీ రాష్ట్రం, తెలంగాణ 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది
2) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, తెలంగాణ 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది
3) మహారాష్ట్ర, తెలంగాణ 5 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది
4) కర్ణాటక, తెలంగాణ 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది
13. తెలంగాణ రాష్ట్ర భూభాగం కింది ఏ ఆకారంలో ఉంది?
1) సమబాహూ త్రిభుజం
2) అసమబాహు త్రిభుజం
3) సమద్విబాహు త్రిభుజం
4) చతురస్రం
14. ఈశాన్య రుతుపవన కాలంలో ఏ రకం వర్షపాతం కలుగుతుంది?
1) చక్రవాత వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం
3) సంవహన వర్షపాతం
4) ఏదీకాదు
15. జతపరచండి
ఎ. తుంగభద్ర నది 1. అజీవనది (నాన్ పెరినియాల్)
బి. డిండి నది 2. ముచుకుంద నది
సి. మూసీ నది 3. మీనాంబరం
డి. మంజీర నది 4. రామాయణంలో పంపానది
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
16. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) పొటమాలజీ 2) లిమ్నాలజీ
3) పొమాలజీ 4) క్రోనాలజీ
17. నాగార్జునసాగర్ ఆనకట్ట జాతికి అంకితం చేసింది ఎప్పుడు?
1) 1967 సెప్టెంబర్ 4
2) 1968 ఆగస్టు 4
3) 1967 ఆగస్టు 4
4) 1968 సెప్టెంబర్ 4
18. 1920లో ఉస్మాన్‌సాగర్ డ్యాం ఎవరి కాలం లో నిర్మించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) సాలార్జంగ్ 4) 1, 3
19. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం?
1) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
2) అలీసాగర్ ఎత్తిపోతల పథకం
3) దేవాదుల ఎత్తిపోతల పథకం
4) అర్గుల రాజారాం ఎత్తిపోతం పథకం
20. జవహర్ ఎత్తిపోతల పథకం అసలు పేరేమిటి?
1) గుత్ప ఎత్తిపోతల పథకం
2) కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం
3) సీతారామ ఎత్తిపోతల పథకం
4) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
21. లాటరైట్ నేలలు తెలంగాణలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
1) జహీరాబాద్, నారాయణఖేడ్,
ఆదిలాబాద్
2) జహీరాబాద్, నారాయణఖేడ్, కరీంనగర్
3) జహీరాబాద్, నారాయణఖేడ్, ఖమ్మం
4) జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్
22. మృత్తికా క్రమక్షయానికి నివారణ చర్యలేవి?
1) వర్షాభావా ప్రాంతాల్లో వాటర్షెడ్ల నిర్మాణం
2) విస్తాపన వ్యవసాయం
3) అడవుల్లో అతిగా పశువులను మేపడం
4) పైవన్నీ
23. జతపరచండి
ఎ. ఒండ్రునేలలు 1. వరి, రాగి, పొగాకు, నూనెగింజలు, కూరగాయలు
బి. రాతినేలలు 2. గోధుమ, పత్తి, చెరకు, జనుము, నూనెగింజలు
సి. నల్లరేగడి నేలలు 3. కాఫీ, తేయాకు, రబ్బరు, జీడిమామిడి
డి. ఎర్రనేలలు 4. పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-2, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-1
24. ఉల్లీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) వనపర్తి 2) జోగులాంబ గద్వాల
3) మెదక్ 4) మహబూబాబాద్
25. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉన్న ప్రాంతం?
1) నాగర్‌కర్నూల్, నల్లగొండ
2) మహబూబ్‌నగర్, సూర్యాపేట
3) జోగులాంబ గద్వాల, నల్లగొండ
4) వనపర్తి, మహబూబ్‌నగర్
26. ఏ అభయారణ్యం మొసళ్లకు ప్రసిద్ధి చెందింది?
1) పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
2) అమ్రాబాద్
3) మంజీరా అభయారణ్యం
4) పాకాల అభయారణ్యం
27. జతపరచండి
ఎ. కాళేశ్వరం ప్రాజెక్టు 1. పెన్‌గంగా
బి. తమ్మిడిహట్టి 2. ప్రాణహిత
సి. చనాఖా-కొరాటా 3. గోదావరి
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-3, బి-1, సి-2
28. తెలంగాణ రాష్ట్రంలో ఏ సరస్సును ‘పక్షుల స్వర్గధామంగా’ పేర్కొంటారు?
1) భద్రసాగర్ 2) పోచారం
3) లక్కవరం సరస్సు
4) అమీన్పూర్ సరస్సు
29. జతపరచండి
ఎ. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 1. పాల్వంచ
బి. కాకతీయ-1 థర్మల్ పవర్ కార్పొరేషన్ 2. ఘన్పూర్
సి. కాకతీయ-2 థర్మల్ పవర్ కార్పొరేషన్ 3. చేల్పూరు
డి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 4. దామరచర్ల
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-4, సి-2, డి-3 4) ఎ-1, బి-2, సి-4, డి-3
30. సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వనామం?
1) దక్కన్ హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్
2) దక్కన్ నిజాం కంపెనీ లిమిటెడ్
3) హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్
4) ఏదీకాదు
31. భూకంపాలు ఏ ప్రాంతాల్లో ఏర్పడుతాయి?
1) రెండు శిలావరణ పలకాలు అపసరణం చెందే చోట
2) రెండు శిలావరణ పలకాలు సమాంతరంగా చెందే చోట
3) రెండు శిలవారణ పలకాలు సమాంతరంగా కదిలేచోట
4) మూడు శిలావరణ పలకాలు ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో కదిలేచోట
32. ఏ కారణాల వల్ల ప్రమాదకర భూకంపాలు సంభవిస్తాయి?
1) భూతాపాలు
2) అగ్నిపర్వత విస్ఫోటనాలు
3) గనుల పై కప్పు కూలిపోవడం
4) విరూపకారక కారకాలు
33. ఎడారి ప్రాంతంలో కనిపించే ఇసుకు మైదానాలను ఏమని పిలుస్తారు?
1) హమ్మడాలు 2) సెరీర్
3) ఎర్గ్స్ 4) రెగ్
34. భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతం?
1) లక్షద్వీప్ 2) లిటిల్ అండమాన్
3) కార్నికోబార్ 4) గ్రేట్‌నికోబార్
35. కరంజ దీవి ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) ఛత్తీస్‌గఢ్ 4) ఒడిశా
36. దేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేసేది ఎవరు?
1) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) సర్వే ఆఫ్ ఇండియా
4) జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
37. డంకన్పాస్ ఏ ప్రాంతం మధ్య ఉంది?
1) ఉత్తర, తూర్పు అండమాన్
2) గ్రేట్ అండమాన్, లిటిల్అండమాన్
3) ఉత్తర, దక్షిణ అండమాన్
4) అండమాన్ నికోబార్
38. నాటికల్ కొలత దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
1) సముద్రాల ఉపరితల దూరాన్ని
2) సముద్రాల లోతు
3) నదులు, సముద్రాల ఉపరితలం
4) సముద్రాలు, నదుల ఉపరితల దూరం, లోతు
39.జతపరచండి
ఎ. కశ్మీర్ హిమాలయాలు 1. పొడవైన హిమానీ నదులకు ప్రసిద్ధి
బి. పంజాబ్ హిమాలయాలు 2. ప్రకృతి సౌందర్యానికి, పండ్ల తోటలకు ప్రసిద్ధి
సి. కుమావున్ హిమాలయాలు 3. మతపరమైన కేంద్రాలు, సరస్సులకు ప్రసిద్ధి
డి. నేపాల్ హిమాలయాలు 4. ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4 4) ఎ-4, బి-3, సి-1, డి-2
40. హిమాలయ ఉద్భవం ఏ సిద్ధాంతంలో అనుబంధమైంది?
1) సంవహన ప్రవాహ సిద్ధాంతం
2) పులక విరూపకారక సిద్ధాంతం
3) పురోగామి తరంగ సిద్ధాంతం
4) ఉపవిభాగ/నిమజ్జన (అవతరణ) సిద్ధాంతం

44
- Tags
- nipuna news
RELATED ARTICLES
-
Scholarships | Scholarships for 2023
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !