అలా చేస్తే విజయం మీదే
- ఇప్పుడు చదవాల్సినది సిలబస్ కాదు.. సినాప్సిస్
- సొంత నోట్స్తోనే స్కోరింగ్‌కు అవకాశం
- ప్రిలిమినరీ అభ్యర్థులకు గ్రూప్ 1 అధికారి ప్రశాంతి సూచనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సమయాన్ని సమన్వయం చేసుకొంటే విజయం మీదే అంటున్నారు గ్రూప్ -1 అధికారి వంగీపురం ప్రశాంతి. ఇప్పుడు చదవాల్సినది సిలబస్ కాదు.. సినాప్సిస్ అని, సొంత నోట్స్ సాధనతోనే స్కోరింగ్‌కు అవకాశం ఉన్నదని గ్రూప్-1 ప్రిలిమినరీ అభ్యర్థులకు సూచించారు. ప్రస్తుతం ఆమె జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
బలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి
చదివిన సబ్జెక్టుల నుంచి ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాస్తాననే నమ్మకం ఉండాలి. ఈ నెల 16న నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు అర్హత సాధిస్తామనే ఆత్మవిశ్వాసం బలంగా నాటుకుపోవాలి. అప్పుడే 150 మార్కుల ప్రశ్నాపత్రాన్ని అవలీలగా పూర్తిచేయగలుగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని విభజించుకొని రివిజన్ చేయాలి. పోటీ పరీక్షల్లో ఎవరి వారే పోటీ అనే విధంగా ఆలోచించాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎైట్లెతే చదివారో.. ఇప్పుడూ అదే సమయపాలన పాటించండి. కానీ పరీక్ష దగ్గరపడుతున్నదని ఎక్కువ గంటలు చదవాలని అనుకోకూడదు.
సిలబస్ కాదు.. సినాప్సిస్
ఇప్పుడు చదవాల్సింది సిలబస్ కాదు.. సినాప్సిస్ మాత్రమే.. ఇన్ని రోజులు చదివిన అంశాలను నోట్స్ రూపంలో రాసుకున్నవాటినే రివిజన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న అంశాలను మొదటగా చదివి, మిగతావి తదుపరిగా చదవడం వల్ల ఎక్కువ అంశాలను గుర్తుపెట్టుకొనే వీలుంటుంది. దాంతో ప్రిలిమ్స్‌లో స్కోరింగ్ చేసేందుకు ఎక్కువ స్కోప్ ఉంటున్నది.
గంట ముందే పరీక్ష కేంద్రాలకు..
గంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులుండవు. అంతకుముందు మాడల్ పేపర్ ప్రాక్టీస్ చేసిన అనుభవాన్ని మరొక్కసారి గుర్తుచేసుకోండి. ఆ నమ్మకంతోనే పరీక్షను విజయవంతంగా పూర్తిచేసి మెయిన్స్‌కు ఆర్హత సాధిస్తారు.
1.2 నిమిషాలకు ఒక జవాబు
ప్రిలిమ్స్‌కు ముందు రెండు రోజులు మాడల్ పేపర్‌ను ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. 180 నిమిషాల్లో 150 ప్రశ్నలకు ఎంత సమయంలో ఎన్ని బిట్స్ కరెక్ట్‌గా చేయగలరో అంచనా వేసుకోండి. ఒక్కో ప్రశ్నకు ఎంత సమయంలో ఆన్సర్ చేయగలుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. అంటే 1.2 నిమిషాలకు ఒక జవాబు పూర్తిచేయాల్సి ఉంటున్నది. కాబట్టి మాడల్ పేపర్ ప్రాక్టీస్ వల్ల ఎగ్జామ్ హాల్లో ఆత్రుత లేకుండా ఆన్సర్స్ చేయొచ్చు. దాంతో గ్రూప్-1లో తొలిమెట్టును దాటేయొచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు