హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
- గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సందేశాలు
- పరీక్షకు మరో రెండురోజులే సమయం
- డౌన్లోడ్ చేసుకోవాల్సినవారు 79,419 మంది
- చివరి నిమిషంలో ఇబ్బంది పడొద్దు: జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా త్వరగా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి కోరారు. పరీక్షకు ఇంకా రెండురోజులే సమయం ఉండటంతో చివరి నిమిషంలో హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు ప్రయత్నించి ఇబ్బందులు పడొద్దని సూచించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను ఇంకా 79,419 మంది (21 శాతం) డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉన్నది. తక్షణమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని వారందరికీ టీఎస్పీఎస్సీ రోజూ సందేశాలు పంపుతున్నది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉన్నది.
చివరి నిమిషంలో ఇబ్బందే..
అభ్యర్థులు హాల్ టికెట్లు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని మొదటి రోజునుంచే అలర్ట్ చేస్తున్నాం. రెండురోజుల నుంచి మెసేజ్‌లు పంపుతున్నాం. దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు సరైన ఫొటోలు జతచేయలేదు. హాల్ టికెట్లో ఫొటోలు స్పష్టంగా లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపం వల్ల హాల్‌టికెట్‌పై ఫొటోలు మిస్ అయ్యే ప్రమాదమున్నది. అందుకే.. వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫొటో సరిగా లేకపోయినా? ఫొటో అసలు ప్రింట్ కాకపోయినా? గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. ఆ ధ్రువీకరణ పత్రాన్ని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు సమర్పించాలి. అప్పుడే పరీక్షకు అనుమతిస్తారు. హాల్‌టికెట్‌లో ఫొటో కరెక్షన్స్ ఉంటే.. చివరి నిమిషంలో డౌన్లోడ్ చేకుసున్న అభ్యర్థులు ఇబ్బందులు పడే ప్రమాదమున్నది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్ 040 23542185 / 23542187 నంబర్లో లేదా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలి.
– బీ జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు