అగ్ని ప్రమాదం వల్ల అంతమైన సింధూ నగరం ఏది?
- భారతదేశ చరిత్ర
- చారిత్రక పూర్వయుగం- సింధూ నాగరికత
1. కింది వాటిలో ప్రాచీన శిలాయుగపు సంస్కృతి వర్ధిల్లిన ప్రదేశం ఏది?
1) లాంఘ్నజ్ (గుజరాత్)
2) అత్తిరాంపక్కం (చెన్నై)
3) బగోర్ (రాజస్థాన్)
4) బూర్జహాం (కశ్మీర్)
2. తామ్రశిలా యుగపు సంస్కృతి (Chal colithic Culture) విలసిల్లిన ప్రదేశాన్ని గుర్తించండి?
1) శివాలిక్ కొండలు (ఉత్తర భారత్)
2) అదంఘర్మిల్ (శర్మదావాయ)
3) ఆహార్ (రాజస్థాన్)
4) కొల్దీవ (ఉత్తరప్రదేశ్)
3. నవీన శిలాయుగపు సంస్కృతి వర్ధిల్లిన ప్రదేశాలను గుర్తించండి?
ఎ. కొల్దీవ (ఉత్తరప్రదేశ్)
బి. ఛిరాండ్ (బీహార్)
సి. హల్లూర్ (కర్ణాటక)
డి. ఉట్నూర్ (తెలంగాణ)
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
4. భారత ఉపఖండంలో నవీనశిలాయుగ సంస్కృతి వర్ధిల్లిన మొదటి ప్రదేశం ఏది?
1) కొల్దీవ (ఉత్తరప్రదేశ్)
2) మహాగర్ (ఉత్తరప్రదేశ్)
3) ఆహార్ (రాజస్థాన్)
4) మెవార్గర్ (పాకిస్థాన్లోని బెలూచిస్థాన్)
5. ‘సోథి సంస్కృతి’ ఏ యుగానికి సంబంధించింది?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) తామ్ర శిలాయుగం
6. బెలూచిస్థాన్లోని (పాకిస్థాన్) జోబ్, క్వెట్ట, నవ్, కుల్లి సంస్కృతులు ఏ యుగానికి సంబంధించినవి?
1) తామ్ర శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) ప్రాచీన శిలాయుగం
7. పాచీన శిలాయుగ సంస్కృతి వర్ధిల్లిన ప్రదేశాలకు సంబంధించి సరికానిది?
1) సోన్లోయ, పొట్వార్ పీఠభూమి (వాయవ్య భారత్)
2) అత్తరాంపక్కం (చెన్నై)
3) శివాలిక్ కొండలు (ఉత్తర భారత్)
4) బాలాథార్ (రాజస్థాన్)
8. మహారాష్ట్రలో తామ్రశిలాయుగ సంస్కృతి బయల్పడిన ప్రదేశం?
1) ఇనాంగావ్ 2) జోర్వే
3) చాంధోలి 4) దైమాబాద్
9. రాజస్థాన్లో తామ్రశిలాయుగ సంస్కృతి బయల్పడిన తొలి ప్రదేశం?
1) గిలుండ్ 2) తాంబవళి
3) బాలాథార్ 4) ఆహార్
10. ‘Pit dwellings’ (గుంతర్షో నివాసాలు) ఎక్కడ బయల్పడ్డాయి?
1) బాలాథాల్ 2) బూర్జహాం
3) కొడెకల్ 4) పాయంపల్లి
11. భారత ఉపఖండంలో వ్యవసాయం ఏ కాలంలో ప్రారంభమయింది?
1) క్రీ.పూ 7000 2) క్రీ.పూ 5000
3) క్రీ.పూ 2500 4) క్రీ.పూ 2000
12. నవీనశిలాయుగానికి చెందిన ‘బూడిద కుప్పలు’ ఎక్కడ లభ్యమయ్యాయి?
ఎ. పిక్లిహల్ (కర్ణాటక)
బి. పాలవాయి (ఆంధ్రప్రదేశ్)
సి. ఉట్నూరు (తెలంగాణ)
డి. కుప్గల్ (కర్ణాటక)
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
13. జతపరచండి?
ఎ. పల్లవరం 1. ప్రాచీన శిలాయుగం
బి. కొడెకల్ 2. మధ్య శిలాయుగం
సి. కొట్-డిజీ 3. నవీన శిలాయుగం
డి. లాంగ్నజ్ 4. తామ్ర శిలాయుగం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4
14. భారత్లో తొలి పశుపోషణకు సంబంధించి ఆధారాలు ఎక్కడ లభించాయి?
ఎ. లాంగ్నజ్ బి. భీంబెట్కా
సి. చోపానిమండి డి. బగరో
ఇ. అదమ్గర్
1) ఎ, సి, డి 2) డి, ఇ
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి, ఇ
15. భారత్లో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏది?
1) అత్తరాంపక్కం (తమిళనాడు)
2) సోన్వయ (పంజాబ్)
3) పల్లవరం (తమిళనాడు)
4) భీంబెట్కా (మధ్యప్రదేశ్)
16. మధ్యశిలాయుగానికి సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది ఏది?
1) కృత్రిమ గృహనిర్మాణం మధ్యశిలాయు గంలోనే ప్రారంభమయింది
2) భారత్లో కుండల తయారీ (Hand made pots) మధ్యశిలాయుగంలోనే ప్రారంభమయింది
3) మానవులు జంతువులను మచ్చికచేసు కోవడం లేదా పశుపోషణ ఈ యుగంలోనే ప్రారంభమయింది
4) ఈ కాలంలోనే వ్యవసాయం ప్రారంభ మయింది
17. తామ్రశిలాయుగానికి చెందిన ‘సోథి సంస్కృతి’ ఎక్కడ బయల్పడింది?
1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) రాజస్థాన్ 4) సింధ్ (పాకిస్థాన్)
18. దక్షిణ భారతదేశంలోని నవీనశిలాయుగ ప్రాంతంలో బంగారు పూసలు ఎక్కడ లభ్య మయ్యాయి?
1) హల్లూరు 2) బస్కి
3) కొడెకల్ 4) తెక్కెలికోట
19. చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖ నం లేదా శిలాయుగానికి చెందిన మానవులు వేసిన చిత్రాలు గల భీంబెట్కా గుహలు (మధ్యప్రదేశ్) కనుగొన్నది ఎవరు?
1) ఎసీఎల్ కార్లీ 2) వీఎస్ వాకంకార్
3) హెచ్డీ సంకాలియా
4) సర్జాన్లుబ్బాక్
20. కింది వాటిలో తామ్రశిలాయుగ సంస్కృతి వర్ధిల్లిన ప్రదేశాలకు సంబంధించి సరికానిది?
1) గిలుండ్ (రాజస్థాన్)
2) నవదతోలి ( మధ్యప్రదేశ్)
3) దైమాబాద్ (మహారాష్ట్ర)
4) మహాగఢ్ (ఉత్తరప్రదేశ్)
21. పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పద్దతులను జతపర్చండి?
ఎ. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి 1. కాల్చిన వస్తువులు, ఇటుకలు బూడిద
వయస్సును నిర్ధారించే పద్ధ్ధతి
బి. పొటాషియం ఆర్గాన్ డేటింగ్ పద్దతి 2. లావాలో బయటపడిన వస్తువుల
వయస్సును నిర్ధారించే పద్దతి
సి. డెండ్రికొనాలజీ 3. వృక్షాల వయస్సును బట్టి నిర్ధారించే పద్ధ్ధతి
డి. థెర్మోల్యుమినసెన్స్ డేటింగ్ పద్దతి 4. తామ్రశిలాయుగం
1) ఎ-1, బి-3, సి-4, డి-2 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4 4) ఎ-2, బి-3, సి-1, డి-4
22. జోబ్, క్వెట్ట, నల్, కుల్లి సంస్కృతులు(పాకిస్థాన్లోని బెలుచిస్థాన్) హరప్పానాగరికతలో ఏ దశకు చెందినవి?
1) తొలి హరప్పా లేదా పూర్వ హరప్పా దశ
2) మధ్య హరప్పా దశ
3) మలి హరప్పా దశ 4) ఏదీకాదు
23. సింధూ నాగరికత నగరాల్లో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేశాలు బయల్పడ్డాయి?
1) కాలిబంగన్ 2) లోథాల్
3) థోలపార 4) సర్కోటడ
24. సింధూ నాగరికతకు సంబంధించి కింది వాటిని జతపరచండి?
ఎ. పూసల తయారీ పరిశ్రమ 1. రోపార్
బి. యజ్ఞవేదికలు 2. లోథాల్
సి. మట్టితో చేసిన నాగలి బొమ్మ 3. బన్వాలీ
డి. నేసిన ఎర్రటి గుడ్డముక్క/నూలుగుడ్డ 4. మొహంజదారో
ఇ. కోడిగుడ్డ ఆకారంలో సమాధులు 5. చాన్హుదారో
1) ఎ-1, బి-2, సి-3, డి-4 ,ఇ-5 2) ఎ-5, బి-4, సి-3, డి-2 ,ఇ-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3 ,ఇ-5 4) ఎ-4, బి-3, సి-2, డి-5 ,ఇ-1
25. జతపరచండి?
ఎ. చాన్హుదారో 1. ఎన్జీ మజుందార్
బి. రోపార్ 2. వైడీ శర్మ (యోగేశ్వరదయాళ్ శర్మ)
సి. కాలిబంగన్ 3. ఘోష్ (అమలానందఘోష్)
డి. సుర్కొటోడ 4. జగపతి జోగి
ఇ. బన్వాలి 5. ఆర్ఎస్ బిస్త్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 ,ఇ-5 2) ఎ-5, బి-4, సి-3, డి-2 ,ఇ-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3 ,ఇ-5 4) ఎ-4, బి-3, సి-2, డి-5 ,ఇ-1
26. ‘ఒంటె ఎముకలు’ బయల్పడిన సింధూ నగరం?
1) బన్వాలి 2) లోథాల్ 3) కాలిబంగన్ 4) రోపార్
27. జతపరచండి?
పట్టణం నది
ఎ. రోపార్ 1. రావి నది
బి. హరప్పా 2. భోగావో నది
సి. లోథాల్ 3. షుగ్గర్/సరస్వతి నది
డి. కాలిబంగన్ 4. సట్లెజ్ నది
ఇ. అలంఘీర్పూర్ 5. హింధాన్ నది
28. జతపరచండి?
పట్టణం వస్తు అవశేషాలు
ఎ. మొహంజదారో 1. కోటలేని ఎకైక నగరం
బి. చాన్హుదారో 2. స్టీటైట్తో చేసిన
గుడ్డపు మనిషి బొమ్మ
సి. లోథాల్ 3. నాగలితో దున్నే భూమి
డి. కాలిబంగన్ 4. కుండల్లో శవాన్ని
పెట్టి ఖననం చేసే పద్ధతి
ఇ. సర్కోటడ 5. హింధాన్నది
29. అగ్నిని పూజించినట్లుగా తెలిపే ఆధారాలు దొరికిన సింధూ నాగరికత పట్టణాలు?
1) కాలిబంగన్, బన్వాలి
2) లోథాల్, బన్వాలి
3) కాలిబంగన్, లోథాల్
4) థోలవీర, సర్కోటడ
30. సింధూ ప్రజలు బార్లి పంటను పండించిన ఆధారాలు లభించిన పట్టణం?
1) బన్వాలి 2) చాన్హుదారో
3) లోథాల్ 4) కాలిబంగన్
31. సింధూ నాగరికతకు సంబంధించిన కింది ప్రవచనాల్లో సరికానిది?
1) లోథాల్లో మాత్రమే ఇండ్లకు కిటికీలు, తలుపులు, ప్రధాన రహదారి వైపు నిర్మించారు
2) థోలవీరలో మాత్రమే మధ్యనగరం కనిపిస్తుంది
3) చాన్హుదారోలో మాత్రమే కోటనిర్మాణం జరగలేదు
4) మొహంజదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలు ఉపయోగించారు
32. సింధూ నాగరికత అత్యంత విశిష్ఠ లక్షణాన్ని గుర్తించండి?
1) వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థను కలిగి ఉండటం
2) మాతృదేవతను పూజించడం
3) అంతర్గత, అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించడం
4) ప్రణాళికబద్ధమైన నగరాలను నిర్మించడం
33. భారత్లో లభించిన సింధూ నగరాల్లోని అన్నింటికంటే పెద్ద నగరం ఏది?
1) రాఖిగర్హి 2) థోలవీర
3) కాలిబంగన్ 4) సుర్కోటోడ
34. ప్రతిపాదన (ఎ): మెసపటోమియా నాగరికత సింధూ నాగరికతకు సమకాలికమైనది, సింధూ ప్రజలు మెసపటోమియాతో వాణిజ్యసంబంధాలను కొనసాగించారు.
కారణం (ఆర్): సింధూ ప్రజల చిత్రలిపి కలిగిన ముద్రికలు మెసపటోమియా నగరాలు, మెసపటోమియాకు చెందిన మొహంజోదారోలో లభించడం వీరి మధ్య వ్యాపార సంబంధాలను సూచిస్తుంది.
సరైన సమాధానం గుర్తించండి?
1) (ఎ), (ఆర్) నిజం
2) (ఎ) నిజం (ఆర్) తప్పు
3) (ఎ), (ఆర్) నిజం (ఆర్), (ఎ) కు సరైన వివరణ
4) (ఎ), (ఆర్) నిజం (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు
35. సింధూ నాగరికత అంతమవ్వడానికి గల కారణాలకు సంబంధించి చరిత్రకారులు చెప్పిన భిన్నమైన అభిప్రాయాల్లో సరైనది గుర్తించండి?
ఎ. అర్యుల దండయాత్రవల్ల సింధూ నాగరికత అంతమైంది- మార్టిమర్ వీలర్
బి. తరుచుగా సంభవించే వరదల వల్ల సింధూనాగరికత అంతమైంది-జీఎఫ్ డేల్స్
సి. భూకంపాల వల్ల నదుల్లో ప్రవహించే నీరు శాశ్వతంగా నగరాల్లోకి చేరి నగరాలు అంతరించాయి- రాబర్ట్ ఎల్ రైన్స్
డి. పర్యావరణం కారణాల వల్ల సింధూ నాగరికత అంతమైంది-ఫెయిర్ సర్వీస్
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
36. అగ్నిప్రమాదం వల్ల పతనమైన ఏకైక సింధూ నగరం ఏది?
1) బన్హాలి 2) కోట్డిజీ
3) థోలవీర 4) రాఖీగర్హి
37. ఈశాన్య భారత్లో నవీనశిలాయుగపు సంస్కృతి విలసిల్లిన ప్రదేశం ఏది?
1) మహశక 2) కాయత
3) గుంగెరియా 4) దావోజలివాదింగ్
38. మొహంజోదారోలో లభ్యమైన పశుపతి మహాదేశ ముద్రికల్లో లేని జంతువు ఏది?
1) ఖడ్గమృగం 2) పులి
3) జింక 4) ఎద్దు
39. సింధూ ప్రజలు అద్భుతమైన పట్టణ జీవితాన్ని గడిపారనడానికి గల ప్రధాన ఆధారాన్ని గుర్తించండి?
1) మొహంజదారోలోని మహాస్నానవాటిక
2) మొహంజదారోలోని మహాధాన్యాగారం
3) పట్టణాల చుట్టూ నిర్మించిన కోటగోడలు
4) పైవన్నీ సరైనవే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు