స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం?
భౌతిక శాస్త్రం-1
1. సౌర కుటుంబంలో భూమి సూర్యుని నుంచి ఎన్నో గ్రహం?
1) 1 2) 2 3) 3 4) 5
2. ఇటీవల ఏ గ్రహానికి హోదా తొలగించారు?
1) శుక్రుడు 2) ప్లూటో
3) కుజుడు 4) చంద్రుడు
3. అతి ఎక్కువ సహజ ఉపగ్రహాలు గల గ్రహం?
1) భూమి 2) శుక్రుడు
3) బృహస్పతి 4) శని
4. అన్నిటి కంటే చిన్న గ్రహం?
1) బుధుడు 2) భూమి
3) నెప్ట్యూన్ 4) ప్లూటో
5. తూర్పు నుంచి పడమరకు ఆత్మ భ్రమణం చేసే గ్రహం?
1) యురేనస్ 2) శుక్రుడు
3) నెప్ట్యూన్ 4) 1, 2
6. అరుణగ్రహం అని దేన్ని పిలుస్తారు?
1) వరుణుడు 2) బృహస్పతి
3) కుజుడు 4) శని
7. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
1) బుధుడు 2) కుజుడు
3) యురేనస్ 4) భూమి
8. సూర్యుని నుంచి కాంతి భూమిని చేరడానికి దాదాపు ఎన్ని సెకన్లు పడుతుంది?
1) 5 2) 50 3) 500 4) 5000
9. సూర్య గ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది?
1) పౌర్ణమి 2) అమావాస్య
3) పౌర్ణమికి ముందు రోజు
4) అమావాస్యకు ముందురోజు
10. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?
1) 74 2) 75 3) 76 4) 77
11. ఉపగ్రహాలు లేని గ్రహం?
1) శుక్రుడు 2) శని
3) యురేనస్ 4) నెప్ట్యూన్
12. ధృవ నక్షత్రం విషయంలో సరైన వాక్యం?
1) సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంది
2) నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది
3) సప్తర్షి మండలంలో ఉంటుంది
4) ఎర్రగా కనిపిస్తుంది
13. భూమి ఆత్మ భ్రమణం దిశ విషయంలో సరైనది గుర్తించండి.
1) తూర్పు నుంచి పడమరకు ఉంటుంది
2) పడమర నుంచి తూర్పునకు ఉంటుంది
3) ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటుంది
4) దక్షిణం నుంచి ఉత్తరానికి ఉంటుంది
14. 2013 సంవత్సరంలో మంగళయాన్ ఉపగ్రహం ప్రయోగించిన రోజు?
1) 5 నవంబర్ 2) 6 నవంబర్
3) 7 నవంబర్ 4) 8 నవంబర్
15. మంగళయాన్ అనే ఉపగ్రహం ఏ గ్రహంపైకి ప్రయోగించారు?
1) బృహస్పతి 2) కుజుడు
3) చంద్రుడు 4) నెప్ట్యూన్
16. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1) నక్షత్రాలు స్వయం ప్రకాశాలు
2) సూర్యుడు ఒక నక్షత్రం
3) భూమికి అతిదగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు
4) అన్నీ సరైనవే
17. భౌతికశాస్త్రంలో మూల ప్రమాణాలు?
1) 3 2) 6 3) 9 4) 12
18. భౌతికశాస్త్రంలో ఉత్పన్న ప్రమాణాలు?
1) 7 2) 8 3) 9
4) ఎన్ని అయినా ఉండవచ్చు
19. ఉష్ణోగ్రతను కొలిచే SI ప్రమాణం?
1) కెల్విన్ 2) క్యాండిలా
3) కేలరీ 4) జౌల్
20. భిన్నమైనది గుర్తించండి.
1) ఆంగ్స్ట్రామ్
2) కాంతి సంవత్సరం
3) కిలోమీటరు 4) బలం
21. క్యారీ బ్యాగుల మందాన్ని వ్యక్తపరిచేది…
1) ఆంగ్స్ట్రామ్లు 2) మైక్రాన్లు
3) నానో మీటర్లు 4) కిలోబైట్లు
22. పేపరు నాణ్యతను GSMలలో తెలియజేస్తారు. GSM అంటే..?
1) Grams Second Metre
2) Grams per Second Metre
3) Grams Square Metre
4) Grams per Square Metre
23. నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి?
1) గొలుసులు 2) టేపులు
3) త్రిభుజీకరణ 4) ఖగోళ
24. స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం?
1) కోణం 2) ఘనకోణం
3) ఖగోళ దూరం 4) భారం
25. రిజర్వాయర్లో నీటిని టీఎంసీల్లో కొలుస్తారు. అయితే టీఎంసీ అంటే?
1) Thousand Million Cubic Feet
2) Thousand Metre Cube
3) Ten Million Cubic Feet
4) Ten Metre Cube
26. నదుల్లో నీటి ప్రవాహాన్ని దేనిలో తెలియజేస్తారు?
1) క్యూబిక్లు 2) క్యూసెక్లు
3) క్యూరీలు 4) క్యూప్రమ్లు
27. కాలాన్ని కచ్చితంగా సూచించేవి?
1) లోలక గడియారాలు
2) డిజిటల్ గడియారాలు
3) స్ప్రింగ్ గడియారాలు
4) పరమాణు గడియారాలు
28. ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం?
1) విద్యుత్ శక్తి 2) వోల్టేజీ
3) విద్యుత్ ప్రవాహం 4) విద్యుత్ నిరోధం
29. ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు?
1) గ్రాములు 2) మోల్లు
3) ఆంగ్స్ట్రామ్లు 4) పార్సెక్లు
30. వెర్నియర్ కాలిపర్స్లో లేనిది?
1) తలస్కేలు 2) పిచ్స్కేల్
3) ప్రధాన స్కేలు 4) 1, 2
31. ఫెర్మి ప్రమాణాల్లో వ్యక్తపరచగలిగేది?
1) కాగితం మందం
2) తరంగదైర్ఘ్యం
3) పరమాణు పరిమాణం
4) కేంద్రక పరిమాణం
32. మెమరీ కార్డుల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తారు. ‘జీ’ అంటే ఎన్ని బైట్స్?
1) 103 2) 106 3) 109 4) 1012
33. ఒక ఆంగ్స్ట్రామ్ ఎన్ని మీటర్లకు సమానం?
1) 10-9 2) 10-10 3) 10-11 4) 10-12
34. టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరం?
1) వెర్నియర్ కాలిపర్స్ 2) స్క్రూగేజ్
3) స్పెరామీటర్ 4) జామెట్రీ స్కేల్
35. మంచు నీటిలో తేలుతుంది. ఎందుకంటేనీటి కంటే మంచు..?
1) బరువు తక్కువ 2) ద్రవ్యరాశి తక్కువ
3) సాంద్రత తక్కువ 4) ఘ.ప. తక్కువ
36. పాదరసం సాంద్రత ఎంత?
1) 13.6 గ్రా/సెం.మీ3
2) 1.36 గ్రా/సెం.మీ3
3) 13600 గ్రా/సెం.మీ3
4) 13.6 కి.గ్రా/మీ3
37. 1 అడుగు పొడవు ఎన్ని ఘ.సెం.మీ లకు సమానం?
1) 30 సెం.మీ 2) 12 సెం.మీ
3) 30.72 సెం.మీ 4) 30.70 సెం.మీ
38. 1 లీటరు ఘ.ప ఎన్ని ఘ.సెం.మీ లకు సమానం?
1) 10-2 2) 102
3) 10-3 4) 103
39. ఒక రోజులో దాదాపు ఎన్ని సెకన్లు ఉంటాయి?
1) 6,25,000 2) 84,600
3) 5,62,000 4) 86,400
40. సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
1) ఫర్లాంగులు 2) కి.మీలు
3) మైళ్లు 4) నాటికల్ మైళ్లు
41. మీటర్ పొడవుకు ప్రామాణికంగా తీసుకున్న ప్లాటినమ్ ఇరిడియం కడ్డీని ఎక్కడ ఉంచారు?
1) పారిస్ 2) న్యూయార్క్
3) లండన్ 4) బెర్లిన్
42. ఒక కిలోబైట్ మెమరీ అంటే?
1) 1000 బైట్స్ 2) 1024 బైట్స్
3) 1048 బైట్స్ 4) 981 బైట్స్
43. టెరా అంటే ఎన్ని బైట్స్?
1) 109 2) 1010 3) 1011 4)1012
44. శుద్ధ గతిశాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణనలోకి తీసుకొనే అంశం?
1) తుది వేగం 2) స్థాన భ్రంశం
3) బలం 4) ప్రయాణకాలం
45. ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి సరైనది గుర్తించండి.
1) అన్ని కణాల చలనదశ ఒకేవైపు ఉంటుంది
2) అన్ని కణాలు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి
3) అన్ని కణాలు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి
4) పైవన్నీ సరైనవే
46. వస్తువు చలనానికి సంబంధించి సరైనది గుర్తించండి.
1. వస్తువు ప్రయాణించిన దారి పొడవును దూరం అంటారు
2. ప్రయాణించిన తొలి, తుది బిందువుల మధ్య కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశం అంటారు
3. స్థానభ్రంశం దూరం కంటే తక్కువ లేదా సమానం
4. సరళ రేఖా మార్గంలో ప్రయాణించే వస్తువు స్థానభ్రంశం దూరానికి సమానం
1) 1, 2 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) 2, 4
47. ఒక వ్యక్తి తూర్పు వైపునకు 6 కి.మీ. అక్కడి నుంచి దక్షిణ దిశలో 8 కి.మీ. నడిస్తే తొలిస్థానం నుంచి అతడు ప్రయాణించే దూరం, స్థానభ్రంశాలు వరుసగా?
1) 14 మీ., 10 మీ.
2) 10 మీ., 14 మీ.
3) 2 మీ., 14 మీ.
4) 14 మీ., 2 మీ.
48. 7 మీ. వ్యాసార్థం ఉన్న వృత్తాకార మార్గం వెంబడి, వృత్త వ్యాసం ఒక చివర నుంచి మరో చివరకు ప్రయాణిస్తే అతని ప్రయాణ దూరం, స్థానభ్రంశాలు వరుసగా?
1) 14 మీ., 22 మీ.
2) 22 మీ., 14 మీ.
3) 44 మీ., 28 మీ.
4) 28 మీ., 44 మీ.
49. గంటకు 90 కి.మీ. వడితో ప్రయాణించే రైలు ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరం?
1) 18 మీ. 2) 90 మీ.
3) 25 మీ. 4) 45 మీ.
50. పది నిమిషాల్లో ఒక వ్యక్తి అరకిలోమీటరు దూరం నడిస్తే, అతని వడి ఎంత?
1) 0.5 మీ/సె 2) 0.68 మీ/సె
3) 0.83 మీ/సె 4) 0.91 మీ/సె
51. ఒక వ్యక్తి ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 9 కిలోమీటర్ల దూరంలో గల ఆఫీసుకు వెళ్లి, తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరితే ఈ మధ్యకాలంలో అతని సగటు వేగం ఎంత?
1) 2 కి.మీ/గంట 2) 1 కి.మీ/గంట
3) 4 కి.మీ/గంట 4) 0 కి.మీ/గంట
52. సమాన కాల వ్యవధుల్లో వస్తువు వేగంలో మార్పు సమానంగా ఉంటే ఆ వస్తువు ఏవిధమైన చలనంలో ఉన్నట్లు?
1) సమవేగం 2) సమ త్వరణం
3) సమవడి 4) సమ స్థానభ్రంశం
53. వస్తువు పొందిన మొత్తం స్థానభ్రంశాన్నిమొత్తం కాలంతో భాగిస్తే వచ్చే భౌతికరాశి?
1) సగటు వేగం 2) సగటు వడి
3) సగటు స్థానభ్రంశం
4) సగటు త్వరణం
54. సరైనది గుర్తించండి.
1. చలనం అనేది ఒక సాపేక్ష భావన
2. చలనం అనేది ఒక నిరపేక్ష భావన
3. సమ వేగంతో ప్రయాణించే వస్తువుకు సమవడి ఉంటుంది
4. సమవడి ప్రయాణించే వస్తువుకు ఎప్పుడూ సమవేగం ఉంటుంది
1) 1, 2, 3, 4 2) 2, 4
3) 1, 3, 4 4) 1, 3
55. రైలులో ప్రయాణించే వ్యక్తి జారవిడిచిన వస్తువు ప్రయాణ మార్గం, బయట ఉన్న పరిశీలకునికి ఎలా కనిపిస్తుంది?
1) సరళరేఖా మార్గం, నిలువుగా కిందికి
2) సరళరేఖా మార్గం, వాలుగా కిందికి
3) పరావలయ మార్గం
4) అతిపరావలయ మార్గం
56. సమవేగంతో ప్రయాణించే వస్తువుకు ఏ విధమైన త్వరణం ఉంటుంది?
1) ధన త్వరణం 2) రుణ త్వరణం
3) అసమత్వరణం 4) సున్నా త్వరణం
57. 400 మీ. పొడవు గల రైలు 600 మీ. పొడవుగల వంతెనను 90. కి.మీ/గంట వేగంతో పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది?
1) 24 సెకన్లు 2) 11.11 సెకన్లు
3) 60 సెకన్లు 4) 40 సెకన్లు
58. స్వేచ్ఛగా భూమివైపునకు పడుతున్న వస్తువు త్వరణం మీ/సె2లలో ఎంత?
1) 2)
3) 2 4)
59. నిలువుగా పైకి విసిరిన వస్తువునకు గరిష్ఠోన్నతి వద్ద ఉండే త్వరణం ఎంత?
1) 0 2) 5 m/sec2
3) 10 m/s2 4) 15 m/s2
60. నిలువుగా పైకి విసిరిన వస్తువు 5 సెకన్ల పాటు పైకి ప్రయాణించి గరిష్ఠోన్నతిని చేరుకుంది. అక్కడి నుంచి కిందికి రావడానికి ఎంత కాలం పడుతుంది?
1) 5 సెకన్ల కంటే తక్కువ
2) 5 సెకన్ల కంటే ఎక్కువ
3) 5 సెకన్లు మాత్రమే
4) ఇచ్చిన సమాచారం సరిపోదు
61. 20 మీటర్ల ఎత్తయిన భవనంపై నుంచి ఒకేసారి ఒక ఇటుకను, ఒక తేలికైన దారపు ఉండను వదిలితే ఏ వస్తువు ముందుగా నేలను తాకుతుంది? (గాలి ఘర్షణ లేదు)
1) రెండూ ఒకేసారి 2) దారపు ఉండ
3) ఇటుక
4) ఇచ్చిన సమాచారం సరిపోదు
62. ఒక పంపు నుంచి నీటిబిందువులు చుక్కలు చుక్కలుగా కిందికి పడుతున్నాయి. పంపు చివర నుంచి నేలకు మధ్య గాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరం ఏవిధంగా ఉంటుంది?
1) అన్ని నీటి చుక్కల మధ్య సమాన దూరం ఉంటుంది
2) పంపునకు దగ్గరగా ఉన్న చుక్కలు దగ్గరదగ్గరగా ఉంటాయి
3) నేలకు దగ్గరలో ఉన్న చుక్కలు దగ్గర దగ్గరగా ఉంటాయి
4) నీటి చుక్కల మధ్య దూరమనేదే ఉండదు
63. క్షితిజ సమాంతరానికి కొంత కోణంతో విసిరిన వస్తువు ప్రయాణించే మార్గం ఏ ఆకారంలో ఉంటుంది?
1) అర్ధవృత్తాకారం 2) పరావలయం
3) వృత్తం 4) అతిపరావలయం
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు