ధరల స్థాయిలో మార్పులు..కట్టడి చేసే రూపాలు
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. ఒకేసారి ధరలు అధికంగా పెరిగినంత మాత్రాన దాన్ని ద్రవ్యోల్బణం అనకూడదు. నిర్విరామంగా క్రమక్రమంగా దీర్ఘకాలంగా ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్యోల్బణం రకాలు
ద్రవ్యోల్బణం నిర్వచనాలు
– ధరలు పెరుగుతున్న స్థితిని అంటే ద్రవ్యం విలువ తగ్గుతున్న స్థితి ద్రవ్యోల్బణం
– క్రౌథర్
-తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశి తరమడమే ద్రవ్యోల్బణం – డాల్టన్
– సాధారణ ధరల స్థాయిలోని పెరుగుదల ద్రవ్యోల్బణం – శామ్యూల్సన్
ద్రవ్యోల్బణం రకాలు
(Types of Inflation )
– ధరల పెరుగుదల / ద్రవ్యోల్బణ రేటును, కారణాన్ని బట్టి ప్రభుత్వ ప్రతిస్పందనను బట్టి ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా విభజించారు.
-ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని ఐదు రకాలుగా విభజించారు.
పాకుతున్న ద్రవ్యోల్బణం
(Creeping Inflation)
-ఇది మొదటి దశ ద్రవ్యోల్బణం.
– ధరల స్థాయిలోని పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అంటారు.
– వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3% లోపు ఉంటుంది.
– ఇది హాని కరం కాదు. ఇది ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నడుస్తున్న ద్రవ్యోల్బణం
(Walking Inflation)
– ఇది రెండో దశ ద్రవ్యోల్బణం
– ధరలస్థాయిలోని పెరుగుదల ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు.
– వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3 నుంచి 6 శాతం మధ్య ఉంటుంది.
– ఇటువంటి ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అదుపు చేయాలని సూచిస్తుంది.
పరిగెడుతున్న ద్రవ్యోల్బణం
(Running Inflation))
– ఇది మూడోదశ ద్రవ్యోల్బణం
– ధరలస్థాయిలోని పెరుగుదల వేగంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అంటారు.
– వార్షిక ద్రవ్యోల్బణ రేటు 6 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.
– ఇది ఆర్థిక వ్యవస్థకు హానికరమైనది. కావున ప్రభుత్వం అదుపు చేయాలి
దూకే ద్రవ్యోల్బణం
-ఇది నాలుగో దశ ద్రవ్యోల్బణం
– ధరల స్థాయిలోని పెరుగుదల చాలా వేగంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని దూకే ద్రవ్యోల్బణం అంటారు.
– దీన్నే దౌడుతీసే ద్రవ్యోల్బణం లేదా ఉరకలెత్తే (Galloping Inflation) ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. వార్షిక ద్రవ్యోల్బణ రేటు రెండు అంకెల స్థాయిలో అంటే 10 నుంచి 99 శాతం మధ్య ఉంటుంది.
-ఇటువంటి ద్రవ్యోల్బణం పొదుపును దెబ్బతీసి దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇటువంటి ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అదుపు చేయాలి. లేదంటే ఆర్థిక వ్యవస్థ కుంటుబడుతుంది.
అతి ద్రవ్యోల్బణం (Hyper Inflation)
-ఇది ద్రవ్యోల్బణం చివరి దశ
-ధరల స్థాయిలో పెరుగుదల తీవ్రంగా ఉంటే దాన్ని అతి ద్రవ్యోల్బణం అంటారు.
-ధరలు ఆకాశానికి చేరుకున్న విధంగా వాటిని నియంత్రించడం ఆర్థిక వ్యవవ్థ సంరక్షకులకు శక్తికి మించినవైనపుడు దాన్ని అతి ద్రవ్యోల్బణం అంటారు.
-వార్షిక ద్రవ్యోల్బణ రేటు మూడంకెల స్థాయిలో అంటే 100 శాతం మించి ఉంటుంది.
– ఇటువంటి పరిస్థితి మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక దేశం ఎదుర్కొంటుంది.
– ద్రవ్యోల్బణం ఏర్పడే కారణాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు.
డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం (Demand pull Inflation)
– సమష్టి సప్లయ్ కంటే సమిష్ఠి డిమాండ్ ఎక్కువగా ఉన్పప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బ ణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.
-ఇటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి పెట్టుబడి వ్యయం, వినియోగవ్యయం, ప్రభుత్వ వ్యయం పెరుగుదల కారణం కావచ్చు.
-సమష్టి డిమాండ్ = C+1+G+(X-M) కాబట్టి దీనిలో ఏది పెరిగినా సమష్టి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం (Cost Push Inflation)
– 1950కు పూర్వం సమష్టి డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుందనే అభిప్రాయం ఉండేది.
– 1950 సంవత్సరం తరువాత వ్యయ పేరిత ద్రవ్యోల్బణ సిద్ధాంతం ఆర్థికవేత్తల దృష్టిని ఆకర్షించింది.
– దీన్నే ‘ఆధునిక ద్రవ్యోల్బణ సిద్ధాంతం’ అని కూడా అంటారు.
-ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ‘వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం’ అంటారు.
-శ్రామికుల వేతనాలు పెరగడం, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం, వ్యవస్థాపకుల లాభాలు పెంచుకోవడం వల్ల గానీ ఉత్పత్తి వ్యయం పెరిగి తద్వారా ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణంగా చెప్పవచ్చు.
-శ్రామికుల వేతనాలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బ ణాన్ని వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఏకస్వామ్యాలు ప్రబలుట/ లాభాలు పెరుగుట వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని లాభప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.
– వ్యయప్రేరిత ద్రవ్యోల్బణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారిలో మాల్థస్, సిడ్జివిక్లు ముఖ్యులు.
మిశ్రమ ద్రవ్యోల్బణం
(Mixed Inflation)
-డిమాండ్ ప్రేరిత, వ్యయప్రేరిత ద్రవ్యోల్బ ణాన్ని కలిపి మిశ్రమ ద్రవ్యోల్బణం అంటారు.
– దీనినే వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.
– దీనిని చార్లెస్ షుల్జ్ ‘డిమాండ్ బదిలీ ద్రవ్యోల్బణం’ అని పేర్కొన్నాడు.
వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం
-ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్ తగ్గి ద్రవ్యోల్బణం ఏర్పడు తుంది.
అంతర్లీన ద్రవ్యోల్బణం (Built Inflation)
– వేతనాలు పెరగాలనే కార్మికుల ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి/ ధరల పెరుగుదల కు ప్రేరణ కల్పిస్తాయి. దీనినే ధర విస్పోట నం లేదా వేతన విస్పోటనం అంటారు.
– దీనివల్ల వ్యయం పెరిగి మరలా ధరలు పెరుగుతాయి. దీనినే హ్యాంగోవర్ ద్రవ్యోల్బణం (Hangover Inflation) అంటారు.
-ప్రభుత్వ ప్రతిస్పందనను బట్టి లేదా ధరల నియంత్రణ స్థాయిని బట్టి ద్రవ్యోల్బణాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు.
బహిరంగ ద్రవ్యోల్బణం
(Open Inflation)
-ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల బహిర్గతంగా ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు.
అణిచివేసిన ద్రవ్యోల్బణం (Suppressed Inflation)
-ధరల పెరుగుదల ప్రభుత్వ విధానాల ద్వారా (రేషనింగ్, పరపతి నియంత్రణ) నియంత్రించినప్పటికీ ధరలు పెరిగితే నల్లబజారు (బ్లాక్‌మార్కెట్) వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని అణచివేసిన ద్రవ్యోల్బణం అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ద్రవ్యోల్బణం అంటే ?
ఎ) ధరల పెరుగుదల బి) ధరల తగ్గుదల
సి) అధిక ధరలు డి) ఎక్కువ ధరలు
2. ద్రవ్యం విలువ తగ్గుతున్న స్థితి అంటే ధరలు పెరుగుతున్న స్థితి ద్రవ్యోల్బణం
ఎ) శామ్యూల్సన్ బి) డాల్టన్
సి) క్రౌథర్ డి) ఫిషర్
3. ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
4. వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3 శాతం లోపు ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) పాకుతున్న ద్రవ్యోల్బణం
బి) నడుస్తున్న ద్రవ్యోల్బణం
సి) పరుగెడుతున్న ద్రవ్యోల్బణం
డి) దూకుతున్న ద్రవ్యోల్బణం
5. నడుస్తున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
6. పరుగెడుతున్న ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణ రేటు ఎంత?
ఎ) 2 శాతం లోపు బి) 3 శాతం లోపు
సి) 3-6 శాతం లోపు
డి) 6-10 శాతంలోపు
7. దూకుతున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది?
ఎ) రెండో దశ బి) మూడో దశ
సి) నాలుగో దశ డి) చివరి దశ
8. ధరల స్థాయిలోని పెరుగుదల తీవ్రంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) నడుస్తున్న ద్రవ్యోల్బణం
బి) పరుగెడుతున్న ద్రవ్యోల్బణం
సి) దూకే ద్రవ్యోల్బణం
డి) అతి ద్రవ్యోల్బణం
9. దూకే ద్రవ్యోల్బణానికి మరొక పేరు?
ఎ) దౌడు తీసే ద్రవ్యోల్బణం
బి) ఉరకలేస్తున్న ద్రవ్యోల్బణం
సి) Golloping Inflation
డి) పైవన్నీ
10. ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన ద్రవ్యోల్బణం ఏది?
ఎ) పాకుతున్న ద్రవ్యోల్బణం
బి) నడుస్తున్న ద్రవ్యోల్బణం
సి) పరుగెడుతున్న ద్రవ్యోల్బణం
డి) ఎ, బి
11. ప్రస్తుతం అతి ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటున్న దేశం ఏది?
ఎ) రష్యా బి) శ్రీలంక
సి) పాకిస్థాన్ డి) భారతదేశం
12. వార్షిక ద్రవ్యోల్బణ రేటు రెండంకెల స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది?
ఎ) నడుస్తున్న ద్రవ్యోల్బణం
బి) పరుగెడుతున్న ద్రవ్యోల్బణం
సి) దూకే ద్రవ్యోల్బణం
డి) అతి ద్రవ్యోల్బణం
13. పొదుపును దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ద్రవ్యోల్బణం ఏది?
ఎ) అతి ద్రవ్యోల్బణం
బి) దూకే ద్రవ్యోల్బణం
సి) పరుగెడుతున్న ద్రవ్యోల్బణం
డి) ఎ, బి
14. సమష్టి సప్లయ్ కంటే సమష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నపుడు ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
బి) వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం
సి) మిశ్రమ ద్రవ్యోల్బణం డి) ఎ,బి
15. వ్యయప్రేరిత ద్రవ్యోల్బణానికి మరోపేరు?
ఎ) ఆధునిక ద్రవ్యోల్బణ సిద్ధాంతం
బి) బహిరంగ ద్రవ్యోల్బణం
సి) అంతర్లీన ద్రవ్యోల్బణం
డి) వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం
16. మిశ్రమ ద్రవ్యోణానికి మరోపేరు?
ఎ) అంతర్లీన ద్రవ్యోల్బణం
బి) వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం
సి) బహిర్గత ద్రవ్యోల్బణం డి) పైవన్నీ
17. రాబర్ట్ జె. గార్డెన్ ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
18. అంతర్లీన ద్రవ్యోల్బణానికి మరొక పేరు?
ఎ) ధర విస్పోటనం
బి) వేతన విస్పోటనం
సి) హ్యాంగోవర్ ద్రవ్యోల్బణం డి) పైవన్నీ
19. ధరల పెరుగుదలను ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించినప్పటికీ ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) బహిరంగ ద్రవ్యోల్బణం
బి) అణిచి వేసిన ద్రవ్యోల్బణం
సి) అంతర్లీన ద్రవ్యోల్బణం డి) పైవన్నీ
20. ప్రభుత్వ ప్రతిస్పందనను బట్టి/ ధరల నియంత్రణ స్థాయిని బట్టి ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి)3 సి) 4 డి) 5
21. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) మాల్థస్ బి) సిడ్జివిక్
సి) చార్లెస్ షుల్జ్ డి) ఎ, బి
22. వార్షిక ద్రవ్యోల్బణ రేటు మూడంకెల స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం?
ఎ)దూకే ద్రవ్యోల్బణం
బి) అతి ద్రవ్యోల్బణం
సి) పరిగెడుతున్న ద్రవ్యోల్బణం డి) ఎ, బి
23. ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత అంతర్లీన ద్రవ్యోల్బణం అని వర్గీకరించినది ఎవరు?
ఎ) గార్డెన్ బి) చార్లెస్ షుల్జ్
సి) మాల్థస్ డి) సిడ్జివిక్
24. వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, ప్రభుత్వ వ్యయం పెరిగి ధరలు పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం
బి) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
సి) మిశ్రమ ద్రవ్యోల్బణం
డి) పైవేవీకావు
సమాధానాలు
1-ఎ 2-సి 3-డి 4-ఎ 5-బి 6-డి 7-సి 8-డి 9-డి 10-ఎ 11-బి 12-సి 13-బి 14-ఎ 15-ఎ 16-బి
17-బి 18-డి 19-బి 20-ఎ 21-డి 22-బి 23-ఎ 24-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు