గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
1. సరికాని అంశాన్ని గుర్తించండి.
1) 1951 నాటికి హైదరాబాద్ రాష్ట్ర జనాభా – 18.7 మిలియన్లు
2) హైదరాబాద్ రాష్ట్రంలో 1951లో వ్యవసాయ కార్మికుల వాటా – 25.2 శాతం
3) హైదరాబాద్ రాష్ట్రంలో పట్టణ జనాభా పరిశ్రమల్లో శ్రామికుల వాటా శాతాలు తక్కువగా ఉన్నాయి
4) జనాభా వృద్ధిరేటు భారతదేశంలో కంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువే
2. సాలార్జంగ్ సంస్కరణల్లో భాగంగా ఎగుమతులు-దిగుమతులపై పన్నులు తొలగించి సుంకాల శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
1) 1860 2) 1863
3) 1870 4) 1871
3. సరికాని జతను గుర్తించండి.
1) నీటిపారుదల శాఖ ఏర్పాటు- 1878
2) ఖజానా శాఖ ఏర్పాటు – 1855
3) సైనిక శాఖ ఏర్పాటు – 1864
4) అటవీ శాఖ ఏర్పాటు – 1870
4. అసఫ్ జాహీ వంశ పాలనలో ఏ కాలాన్ని సంపూర్ణంగా వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు?
1) 1724-1857 2) 1855-1873
3) 1724-1748 4) 1853-1883
5. హైదరాబాద్ రాష్ట్రంలో బొంబాయి భూమిశిస్తు చట్టం 1879 కొన్ని అంశాలు జోడించి ‘హైదరాబాద్ భూమిశిస్తు చట్టం’ ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
1) 1908 2) 1912
3) 1925 4) 1936
6. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి జాగీర్ను ఏ సంవత్సరంలో నిజాం-ఉల్- ముల్క్ ఇచ్చారు?
1) 1726 2) 1748
3) 1736 4) 1724
7. 1922లో కేవలం 0.8 మిలియన్ ఎకరా లకు నీటిపారుదల ఉండగా, అది 1945 నాటికి ఎంతకు పెరిగింది?
1) 2.5 మిలియన్ ఎకరాలు
2) 1.7 మిలియన్ ఎకరాలు
3) 3.8 మిలియన్ ఎకరాలు
4) 1.9 మిలియన్ ఎకరాలు
8. కుతుబ్‌షాహీల కాలంలో ప్రధానంగా తయారైన పారిశ్రామిక ఉత్పత్తులు ?
1) యుద్ధ సామగ్రి
2) ఎగుమతులకు సంబంధించిన వసా్త్రలు, వజ్రాలు, నౌకా నిర్మాణం
3) స్వదేశీ డిమాండ్‌కు అవసరమైన విలాస వస్తువులు
4) పైవన్నీ
9. నిజాం కాలంలో 1881లో జరిగిన మొదటి జనాభా గణాంకాల ప్రకారం గ్రామీణ వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన ఉత్పత్తి కులాల శాతం?
1) 25 2) 35 3) 10 4) 18
10. సరికాని అంశం గుర్తించండి.
1) హైదరాబాద్ రాష్ట్రంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ – 1857
2) మొదటి పోస్టల్ శాఖ ఏర్పాటు – 1872
3) హైదరాబాద్‌లో గోదావరి లోయ రైల్వేలైన్ – 1899 ప్రారంభం
4) సింగరేణి కాలరీస్ కంపెనీ ఏర్పాటు – 1925
11. 1929లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ప్రధాన ఉద్దేశం ఏంటి?
1) ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించడం
2) పరిశ్రమల శాఖకు నిధులు అందించడం
3) ఐటీఎఫ్‌లో ప్రభుత్వ పెట్టుబడి లాభాలు కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించడం
4) 2, 3
12. ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా నిజాం ప్రభుత్వం ముషీరాబాద్-ఆజంగర్ ప్రాంతంలో 200 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పరిచింది?
1) సర్ ఎం.విశ్వేశ్వరయ్య
2) అరవముదం అయ్యంగార్
3) ఖుస్రో 4) ఎవరూ కాదు
13. కోడ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్‌ను నిజాం రాష్ట్ర రైల్వే కంపెనీ ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1) 1932 2) 1935
3) 1940 4) 1948
14. హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిసారి ప్రణాళిక శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1948 2) 1935
3) 1943 4) 1949
15. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1946-51 2) 1935-48
3) 1919-35 4) 1921-30
16. సామాజిక ఆర్థిక సర్వే-2022 ప్రకారం సరికాని అంశం ?
1) రాష్ట్ర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల్లో)- రూ.2,34,751
2) స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (ప్రస్తుత ధరల్లో)- రూ.11,54,860 కోట్లు
3) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు (స్థిర ధరల్లో)- 11.2 శాతం
4) పంట రుణాల లక్ష్యం- రూ.95,542.7 కోట్లు
17. భారతదేశ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం వృద్ధిరేట్లు సమానంగా ఉన్నాయి?
1) పారిశ్రామిక రంగం
2) సేవా రంగం
3) వ్యవసాయ రంగం 4) ఏదీకాదు
18. సరికాని అంశాన్ని గుర్తించండి
ఎ. పట్టణ నిరుద్యోగిత అత్యల్పంగా ఉన్నది పూర్వపు మహబూబ్‌నగర్
బి. స్త్రీల నిరుద్యోగిత అత్యధికంగా ఉన్నది హైదరాబాద్
సి. గ్రామాల కంటే పట్టణాల్లో నిరుద్యోగిత అధికం
డి. పట్టణ ప్రాంత నిరుద్యోగిత రేటు 6.9 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 1.3 శాతం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
19. సగటు భారతీయునికి ఎన్ని కిలో క్యాలరీల ఆహారం పొందలేని స్థితిని పేదరికంగా గుర్తిస్తారు?
1) 2400 2) 2100
3) 1900 4) 1850
20. భారతదేశం, తెలంగాణలో ఏ పేదరిక కొలమానం వినియోగిస్తున్నారు?
1) నిరపేక్ష 2) సాపేక్ష
3) తలల లెక్కింపు నిష్పత్తి
4) పైవన్నీ
21. 2011లో రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్ని లక్షల మంది పేదవారు ఉన్నారు?
1) 20 లక్షలు 2) 15 లక్షలు
3) 35 లక్షలు 4) 43 లక్షలు
22. జతపరచండి.
1. తెలంగాణలో పేదరిక శాతం (2011-12) ఎ. 10 శాతం
2. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదలు బి. 20 లక్షలు
3. పట్టణాల్లో పేదరిక శాతం సి. 11.1 శాతం
4. గ్రామాల్లో ప్రతి వ్యక్తికి సగటున నెలకు అవసరమయ్యే మొత్తం
డి. రూ.816
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
23. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు?
1) TS iPASS ఏర్పాటు ద్వారా ఉద్యోగ కల్పన
2) నాలుగు విద్యుచ్ఛక్తి పథకాలు
3) మిషన్ కాకతీయ & మిషన్ భగీరథ
4) పైవన్నీ
24. రంగారెడ్డి జిల్లాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1978 2) 1883
3) 1953 4) 1956
25. ప్రధానంగా ప్రణాళిక వ్యయాన్ని నిర్ణయించవలసిన అంశాలు?
1) జనాభా 2) భూభాగం
3) వెనుకబాటు 4) పైవన్నీ
26. కృష్ణానది జలాల అంతర్రాష్ట్ర పంపిణీ కోసం భారత ప్రభుత్వం 1969లో ఎవరి ఆధ్వర్యంలో కమిటీని వేసింది?
1) ఆర్ ఎస్ బచావత్ 2) బ్రిజేష్ కుమార్
3) ఆర్ ఎస్ సర్కారియా
4) ఎవరూ కాదు
27. 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిపై ఎవరు సర్వే చేపట్టారు?
1) ఐడీబీఐ 2) ఎస్బీఐ
3) కేంద్ర ప్రభుత్వం 4) ప్రణాళికా సంఘం
28. గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2009 2) 2004
3) 2001 4) 2008
29. 1980లో తెలంగాణ పంటల్లో వచ్చిన ప్రధాన మార్పు ఏది?
1) చిరుధాన్యాల స్థానంలో వరి పండించారు
2) వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది
3) వ్యవసాయ ఉత్పత్తులు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది
4) పైవన్నీ
30. తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదలకు ప్రధాన వనరు?
1) గొట్టపు బావులు 2) చెరువులు
3) కాలువలు 4) ఏదీకాదు
31. 2012-13లో 70వ జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణ రైతుల రుణగ్రస్తతలో ఉన్న వ్యవసాయ కుటుంబాల శాతం?
1) 78 శాతం 2) 89 శాతం
3) 81 శాతం 4) 58 శాతం
32. సరైన అంశాలను గుర్తించండి.
ఎ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీడీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది
బి. పూర్వపు జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లో ఫ్యాక్టరీల సంఖ్య అధికం
సి. పారిశ్రామిక ఉద్యోగితలో విభజన కాని నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి
డి. తెలంగాణలోని పరిశ్రమలు ఉద్యోగ కల్పనలో అత్యధిక వృద్ధిరేటును కనబరిచాయి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
33. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 100 ఎకరాల సామర్థ్యం ఉన్న పెద్ద చెరువులు దాదాపు ఎన్ని ఉండేవి?
1) 16,000 2) 56,000
3) 1560 4) 18,600
34. తెలంగాణ బడ్జెటరీ మిగులును అంచనా వేయడానికి నియమించిన కమిటీలు?
1) కే లలిత్ 2) జస్టిస్ వీ భార్గవ
3) 1, 2 4) శ్రీకృష్ణ కమిటీ
35. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంవత్సరం నుంచి ప్రాంతాల వారీగా ఆదాయ, వ్యయాలను చూపించడం మానేశారు?
1) 1969 2) 1968
3) 1973 4) 1975
36. ఆర్థికంగా, సామాజికంగా ఆమోద- యోగ్యమైన కనీస జీవన ప్రమాణ స్థాయిని కొనసాగించలేని స్థితిని ఏమంటారు?
1) నిరపేక్ష పేదరికం 2) సాపేక్ష పేదరికం
3) దుర్బర పేదరికం 4) ఏదీకాదు
37. సరికాని జతను గుర్తించండి.
1) భారత తలసరి రోజువారీ ఇంధన అవసరం- డా. వై కే అలఘ్ కమిటీ
2) మూలధరతో దారిద్య్ర రేఖ నిర్మాణం – డీటీ లక్డావాలా కమిటీ
3) క్యాలరీలతో పాటు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు – టెండూల్కర్ కమిటీ
4) కుటుంబ వినియోగ వ్యయం – ప్రణాళిక
38. 1993-94 నుంచి 2011-12ల మధ్య తెలంగాణలో గ్రామీణ పేదరికం 49.0 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గగా పట్టణ పేదరికం ఎంత శాతం తగ్గింది?
1) 30.5 శాతం నుంచి 5.0 శాతానికి
2) 28.6 శాతం నుంచి 10.1 శాతానికి
3) 35.8 శాతం నుంచి 18.6 శాతానికి
4) 33.8 శాతం నుంచి 12.6 శాతానికి
39. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను ఏ రోజున నిర్వహించారు?
1) 2014 ఆగస్టు 19
2) 2014 సెప్టెంబరు 13
3) 2015 జూన్ 6
4) 2017 ఆగస్టు 19
40. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మొత్తం కుటుంబాలు 102 లక్షలు కాగా జనాభా ఎంత ఉంది?
1) 263 లక్షలు 2) 368 లక్షలు
3) 513 లక్షలు 4) 218 లక్షలు
41. సమగ్ర కుటుంబసర్వే- 2014 ప్రకారం సగటు కుటుంబ పరిమాణం?
1) 4.2 2) 3.6 3) 5.1 4) 3.8
42. జతపరచండి.
1. ఎస్సీ జనాభా ఎ. 15.5 శాతం
2. ఎస్టీ జనాభా బి. 9.3 శాతం
3. దశాబ్ది వృద్ధి రేటు సి. 13.6 శాతం
4. అక్షరాస్యత డి. 66.5 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
43. తెలంగాణలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా?
1) మేడ్చల్-మల్కాజిగిరి
2) రంగారెడ్డి 3) హైదరాబాద్
4) జోగులాంబ గద్వాల
44. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లా?
1) మంచిర్యాల 2) భద్రాద్రి-కొత్తగూడెం
3) మహబూబ్‌నగర్ 4) రంగారెడ్డి
45. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత తెలంగా-ణలో అధిక వైశాల్యం ఉన్న జిల్లా?
1) జోగులాంబ-గద్వాల
2) ఖమ్మం 3) రంగారెడ్డి
4) భద్రాద్రి-కొత్తగూడెం
46. 2001-2011 మధ్యకాలంలో తెలంగాణలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత పెరిగింది?
1) 12 2) 14 3) 16 4) 18
47. రాష్ట్రం మొత్తం మీద సగటు లింగ నిష్పత్తి (1998)లో పోల్చితే ఏ వర్గం వారిలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది?
1) ఎస్సీ 2) ఎస్టీ 3) ఓబీసీ 4) ముస్లిం
48. అతి తక్కువ అక్షరాస్యత నమోదైన మండలం?
1) బాలాపూర్(రంగారెడ్డి)
2) నర్వ (మహబూబ్‌నగర్)
3) కన్నేపల్లి (మంచిర్యాల)
4) కల్లూరు-తిమ్మనదొడ్డి (జోగులాంబ)
జవాబులు
1.3 2.1 3.4 4.1 5.1 6.1 7.2 8.4 9.3 10.4 11.4 12.1 13.1 14.3 15.1 16.4 17.1 18.4 19.2 20.1 21.3 22.1 23.4 24.1 25.4 26.1 27.1 28.3 29.4 30.1 31.2 32.4 33.1 34.3 35.2 36.1 37.4 38.1 39.1 40.2 41.2 42.1 43.3 44.1 45.4 46.2 47.1 48.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు