గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం ఏది?
తెలంగాణ జాగ్రఫీ
1. తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి?
1) 12,751 2) 12,769
3) 12,700 4) 12,786
2. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో 1953, డిసెంబర్ 29న కమిషన్‌ను నియమించింది?
1) ఎస్కే థార్ 2) వాంఛూ
3) ఫజల్ అలీ 4) శ్రీకృష్ణ
3. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1) ఏప్రిల్ 12, 1967
2) ఏప్రిల్ 12, 1968
3) ఏప్రిల్ 12, 1969
4) ఏప్రిల్ 12, 1970
4. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1953 2) 1954
3) 1956 4) 1957
5. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన జలవిద్యుత్ ప్రాజెక్టు?
1) భద్రాద్రి 2) శబరి
3) సీలేరు 4) యాదాద్రి
6. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001, ఏప్రిల్ 27
2) 2000, ఏప్రిల్ 27
3) 2002, ఏప్రిల్ 27
4) 2003, ఏప్రిల్ 27
7. కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పరిశీలించ- డానికి ఏ కమిటీని నియమించింది?
1) ఎస్కే థార్ 2) శ్రీకృష్ణ
3) వాంఛూ 4) ఫజల్ అలీ
8. ఆంధ్రులకు కొత్తరాష్ట్రం ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం 19 డిసెంబర్, 1952న నియమించిన కమిటీ ఏది?
1) ఎస్ కే థార్ కమిటీ
2) వాంఛూ
3) ఫజల్ అలీ కమిటీ 4) పైవన్నీ
9. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం ఎంత?
1) 1,12,077 చ.కి.మీ
2) 1,14,840 చ.కి.మీ
3) 1,16,720 చ.కి.మీ
4) 1,17,815 చ.కి.మీ
10. దేశంలో జనాభాపరంగా, వైశాల్యంపరంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) 10 2) 11 3) 12 4) 13
11. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది?
1) 2.42 శాతం 2) 3.41 శాతం
3) 4.2 శాతం 4) 4.9 శాతం
12. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత?
1) 3,50,03,674
2) 2,70,04,783
3) 3,20,52,114
4) 3,11,66,326
13. తెలంగాణలోని భద్రకాళి సరస్సు దేనికి సంబంధించింది?
1) సింగూర్ డ్యాం 2) మానేరు డ్యాం
3) మంజీర డ్యాం
4) శ్రీరామ్ సాగర్ డ్యాం
14. 2022 జనవరి వరకు తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
1) 466 2) 451
3) 454 4) 594
15. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి?
1) 112 2) 117 3) 118 4) 119
16. తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యంపరంగా అతి పెద్ద జిల్లా ఏది?
1) భద్రాద్రి-కొత్తగూడెం
2) ఆదిలాబాద్
3) ఖమ్మం 4) సిద్దిపేట
17. తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యంపరంగా చిన్న జిల్లా ఏది?
1) వరంగల్ 2) హైదరాబాద్
3) మెదక్ 4) రంగారెడ్డి
18. తెలంగాణలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా?
1) భద్రాద్రి 2) ఖమ్మం
3) మెదక్ 4) నల్లగొండ
19. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా ?
1) మహబూబ్‌నగర్ 2) హైదరాబాద్
3) మేడ్చల్ 4) కరీంనగర్
20. తెలంగాణలో జనాభా పరంగా అతి చిన్న జిల్లా?
1) నాగర్‌కర్నూల్ 2) ఖమ్మం
3) ములుగు 4) ఆదిలాబాద్
21. సరైనది గుర్తించండి.
1) ఆదిలాబాద్, నిర్మల్- నిర్మల్ గుట్టలు
2) నాగర్‌కర్నూల్-అమ్రాబాద్ గుట్టలు
3) వికారాబాద్ – అనంతగిరి కొండలు
4) పైవన్నీ
22. తెలంగాణ రాష్ట్ర భూభాగం ఏ ఆకారంలో ఉంటుంది?
1) త్రిభుజాకారం 2) దీర్ఘ చతురస్రం
3) సమద్విబా త్రిభుజం
4) పైవాటిలో ఏదీకాదు
23. నదుల పరీవాహక ప్రాంతం బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి చెందినది?
1) ప్రాణహిత-గోదావరి
2) కిన్నెరసాని-కృష్ణా
3) కాగ్న-భీమ
4) మంజీర-మానేరు
24. తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తయిన కొండ-లక్ష్మీదేవిపల్లికొండ ఏ జిల్లాలో ఉంది?
1) నిర్మల్ 2) నల్లగొండ
3) రంగారెడ్డి 4) సంగారెడ్డి
25. తెలంగాణలో పశ్చిమకనుమల్లో ఎత్తయిన- మహబూబాఘాట్ ఏ జిల్లాలో ఉంది?
1) జయశంకర్ 2) కుమ్రం భీం
3) నిర్మల్ 4) ఆదిలాబాద్
26. గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం ఏది?
1) మాంగనీస్ 2) నేలబొగ్గు
3) రాగి 4) బైరటీస్
27. ఒక ప్రదేశపు స్థలాకృతి దేన్ని నిర్ణయించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది?
1) అవపాతపురేటు
2) మృత్తికా క్రమక్షయం
3) 1, 2 4) ఉష్ణోగ్రత
28. తెలంగాణలో ఎక్కువ భాగం ఏ మృత్తికలు విస్తరించి ఉన్నాయి?
1) ఎర మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
29. తెలంగాణలో ఎర మృత్తికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 56 2) 48 3) 45 4) 37
30. తెలంగాణలో నల్లరేగడి మృత్తికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 37 2) 32 3) 25 4) 20
31. ‘తనను తాను దున్నుకునే నేలలు’ అని ఏ మృత్తికలను అంటారు?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
32. నల్ల మృత్తికలు క్షార స్వభావం (PH) విలువ?
1) 7.8 – 8.7 2) 8.7 – 9.1
3) 9.4 – 9.6 4) 10 – 10.5
33. ఏ మృత్తికలు నీటిని గ్రహించి చాలాకాలం వరకు నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంటాయి?
1) నల్ల మృత్తికలు 2) ఎర మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
34. ఒండ్రు మృత్తికల్లో ఎక్కువగా ఏం ఉన్నాయి?
1) పాస్ఫరస్ 2) పొటాషియం
3) 1, 2 4) నైట్రోజన్
35. లాటరైట్ మృత్తికల నిర్మాణం ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది?
1) ఎక్కువ లోతులో శైథిల్య ప్రక్రియ
2) నదుల వల్ల కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ
3) ధూళిరూపంలో గాలిద్వారా కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ
4) పైవన్నీ
36. మృత్తిక సంరక్షణకు చేపట్టవలసిన చర్యలేంటి?
1) అడవుల పెంపకం
2) ఆనకట్టల నిర్మాణం
3) అతిగా పశువుల మేతమేయకుండా చూడటం
4) పైవన్నీ
37. మృత్తిక సంరక్షణకు తోడ్పడే జాతీయ సంస్థలకు సంబంధించి సరైనది గుర్తించండి.
1) నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే, ల్యాండ్ అండ్ ప్లానింగ్- నాగపూర్
2) ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్‌సైన్స్ – భోపాల్
3) వర్షాధార పంటల వ్యవసాయ పరిశోధనా కేంద్రం – హైదరాబాద్
4) పైవన్నీ
38. తెలంగాణలోని ఏ ప్రదేశంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది?
1) దేవరకొండ 2) అలంపూర్
3) రామగుండం 4) కొత్తగూడెం
39. తెలంగాణలోని ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది?
1) హైదరాబాద్ 2) వికారాబాద్
3) వనపర్తి 4) ఆదిలాబాద్
40. తెలంగాణలో సాధారణ వర్షపాతం ఎంత?
1) 906.6 మి.మీ 2) 825 మి.మీ
3) 936 మి.మీ 4) 978 మి.మీ
41. తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుంచి ఏ దిశకు వెళ్లేకొద్దీ పెరుగుతుంది?
1) తూర్పు 2) ఉత్తరం
3) పశ్చిమం 4) ఏదీకాదు
42. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వర్షపాతం ఏ రుతుపవనాల వల్ల కలుగుతుంది?
1) నైరుతి రుతుపవనాలు
2) తిరోగమన రుతుపవనాలు
3) ఈశాన్య రుతుపవనాలు
4) ఏదీకాదు
43. ప్రసిద్ధ శాస్త్రవేత్త రాయ్ ప్రకారం తెలంగాణలో వీచే పవనాలు ?
1) ఈశాన్య పవనాలు
2) నైరుతి పవనాలు
3) 1, 2
4) ఆగ్నేయ పవనాలు
44. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అడవులు ఏవి?
1) నల్లమల 2) శేషాచలం
3) నీలగిరి 4) విక్టోరియా
45. భూమధ్య రేఖ వద్ద ఉండే అడవులు ఏవి?
1) సమశీతోష్ణ అడవులు
2) ఉష్ణమండల అడవులు
3) శీతోష్ణ అడవులు
4) ఉపశీతోష్ణ అడవులు
46. మధ్య అక్షాంశం వద్ద ఎక్కువగా ఏ అడవులు ఉంటాయి?
1) శీతోష్ణ అడవులు
2) ఉపశీతోష్ణ అడవులు
3) సమశీతోష్ణ అడవులు
4) ఉష్ణమండల అడవులు
47. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత?
1) 26,969.54 చ.కి.మీ
2) 28,405.73 చ.కి.మీ
3) 29,716.32 చ.కి.మీ
4) 32,546.14 చ.కి.మీ
48. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉంది?
1) 21.10 శాతం 2) 24.05 శాతం
3) 27.21 శాతం 4) 29.27 శాతం
49. దక్కన్ పీఠభూమిలో అడవుల విస్తీర్ణం తగ్గుతూ రావడానికి కారణం?
1) కలప పెంపకం 2) పశువుల మేత
3) 1, 2 4) ప్రాజెక్టుల నిర్మాణం
50. అడవుల ప్రధాన లక్ష్యం?
1) పచ్చదనం పెంచి జీవనోపాధిని సమగ్రప-రచడం
2) పశువుల మేత కోసం
3) ఆహారం కోసం 4) కలప కోసం
51. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది?
1) భద్రాద్రి-కొత్తగూడెం
2) ఖమ్మం
3) హైదరాబాద్ 4) నిజామాబాద్
52. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా?
1) కరీంనగర్ 2) మెదక్
3) సూర్యాపేట 4) సంగారెడ్డి
53. గోదావరి నది కుడి ఒడ్డున దట్టమైన ఏ అడవులు ఉన్నాయి?
1) ఎరచందనం 2) సర్వి
3) టేకు 4) పైవన్నీ
54. ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంతో అంతర్ రాష్ట్రీయ సరిహద్దు లేదు?
1) రంగారెడ్డి 2) హైదరాబాద్
3) నల్లగొండ 4) వనపర్తి
55. మంచిర్యాల జిల్లాలో ఉన్న అభయారణ్యం ఏది?
1) కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం
2) శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం
3) ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
4) పైవన్నీ
56. అలీసాగర్ జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్ 2) మహబూబాబాద్
3) భద్రాద్రి 4) వరంగల్
57. పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్ 2) మహబూబాబాద్
3) భద్రాద్రి 4) ఖమ్మం
58. మంజీర పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) గజ్వేల్ 2) తూప్రాన్
3) సంగారెడ్డి 4) మహదేవ్పూర్
59. పోచారం పక్షుల సంరక్షణా కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్ 2) సూర్యాపేట
3) ఆదిలాబాద్ 4) కుమ్రం భీం
60. శామీర్‌పేట్ జింకల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్ 2) వరంగల్
3) ఆదిలాబాద్ 4) మేడ్చల్
61. తెలంగాణలో అతి పురాతన అభయారణ్యం?
1) మంజీర అభయారణ్యం
2) కిన్నెరసాని అభయారణ్యం
3) కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం
4) ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
62. సమ్మక్క సారలమ్మ వంటి గిరిజనుల ప్రసిద్ధ దేవాలయం ఏ అభయారణ్యంలో ఉంది?
1) మంజీర అభయారణ్యం
2) ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
3) కిన్నెరసాని అభయారణ్యం
4) పాకాల అభయారణ్యం
63. మంజీర వన్యప్రాణి అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
1) జోగులాంబ-గద్వాల 2) సంగారెడ్డి
3) కుమ్రం భీం-ఆసిఫాబాద్ 4) నల్గొండ
జవాబులు
1.2 2.3 3.3 4.3 5.3 6.1 7.2 8.2 9.1 10.2 11.2 12.1 13.2 14.4 15.4 16.1 17.2 18.4 19.2 20.3 21.4 22.3 23.1 24.3
25.4 26.2 27.3 28.1 29.2 30.3 31.1 32.1 33.1 343 35.1 36.4 37.4 38.3 39.4 40.1 41.2 42.1 43.3 44.1
45.2 46.3 47.1 48.2 49.3 50.1 51.1 52.1 53.3 54.2 55.4 56.1 57.2 58.3 59.1 60.4 61.4 62.2 63.2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు