వయస్సుకు తగ్గ బరువులేని పిల్లలు అధికంగా గల రాష్ట్రం?
1. దేశంలో ఎంతమంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు?
1) 1/2వ వంతు 2) 2/3వ వంతు
3) 1/5వ వంతు 4) 3/4వ వంతు
2. తెలంగాణలో 2001 నాటికి ఎన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలున్నాయి?
1) 1/2వ వంతు 2) 2/3వ వంతు
3) 1/5వ వంతు 4) 3/4వ వంతు
3. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక-2017’ ప్రకారం తక్కువ ఆదాయంగల దేశాలు అంటే తలసరి ఆదాయం ఎంత ఉండాలి?
1) 995 డాలర్ల కంటే తక్కువ
2) 995-12,054 డాలర్ల మధ్య
3) 12,055 డాలర్ల కంటే ఎక్కువ
4) ఏదీకాదు
4. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమంలో పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలయ్యింది?
1) 12,000 2) 440
3) 400 4) 500
5. హెచ్‌డీఐని రూపొందించడానికి తీసుకునే అంశం ఏది?
1) ఆయుఃప్రమాణం 2) విద్యాస్థాయి
3) తలసరి ఆదాయం 4) పైవన్నీ
6. దేశంలో వ్యక్తుల సగటు ఆయు:ప్రమాణం ఎంత?
1) 75 సంవత్సరాలు
2) 64 సంవత్సరాలు
3) 68 సంవత్సరాలు
4) 66 సంవత్సరాలు
7. 2005 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఖర్చు పెట్టే మొత్తం ఎంత?
1) రూ.1149 2) రూ.1049
3) రూ.2005 4) రూ.6836
8. 1993లో దేశంలో 6 సంవత్సరాలకు మించిన ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లే వారి శాతం ఎంత?
1) 28 2) 39 3) 60 4) 40
9. హిమాచల్‌ప్రదేశ్‌లో 2006లో 6 సంవత్సరాలకు మించిన మగపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం?
1) 51 2) 57 3) 75 4) 85
10. కింది వాటిలో సరైనవి?
ఎ. సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి= మొత్తం ఉత్పత్తి+విత్తనాలు, దాణా, వృథా
బి. నికర దిగుమతులు= దిగుమతులు -ఎగుమతులు
సి. ప్రభుత్వ నిల్వల్లో తేడా= ఆరంభం నాటికి ఉన్న నిల్వలు-సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ 4) బి
11. వయస్సుకు తగ్గ బరువులేని పిల్లలు అధికంగా గల రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) గుజరాత్
3) పశ్చిమబెంగాల్ 4) ఉత్తరప్రదేశ్
12. భారత్‌లో సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన కూరగాయలు?
1) 150 గ్రాములు 2) 180 గ్రాములు
3) 300 గ్రాములు 4) 210 గ్రాములు
13. దేశంలో సగటున ప్రతి వ్యక్తికీ సంవత్సరానికి కోడిగుడ్ల లభ్యత ఎంత?
1) 50 2) 30 3) 58 4) 14
14. ఆయుర్వేదం, సిద్ద, యునాని వంటి వాటిపై పరిశోధనలు చేసే శాఖ?
1) ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ
2) ఆరోగ్య పరిశోధన శాఖ
3) ఆయుష్ శాఖ
4) ఏదీకాదు
15. ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలు చేసే శాఖ?
1) ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ
2) ఆరోగ్య పరిశోధన శాఖ
3) ఆయుష్ శాఖ
4) ఏదీకాదు
16. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు చేశారు?
1) 2012 2) 2011
3) 2013 4) 2010
17. ఒక రోజుకు ప్రతి వ్యక్తి పట్టణ ప్రాంతాల్లో ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి?
1) 2100 2) 2250
3) 2300 4) 2400
18. భారత్‌లో ఫోర్డ్ మోటర్స్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1990 2) 2012
3) 1995 4) 1994
19. కింది వాటిలో సేవారంగ కార్యకలాపం ఏది?
1) విత్త కార్యకలాపాలు 2) వర్తకం
3) రక్షణ రంగం 4) పైవన్నీ
20. భారత్‌లో దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో ఎంతమంది నిపుణుల కొరత ఉంది?
1) 9 లక్షలు 2) 20 లక్షలు
3) 15 లక్షలు 4) 64 లక్షలు
సమాధానాలు
1-3, 2-4, 3-1, 4-3 5-4, 6-3, 7-2, 8-1, 9-3, 10-4, 11-2, 12-3, 13-2, 14-3, 15-2, 16-3, 17-1, 18-3, 19-4, 20-2.
వెంకట్
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు