నకాశీ చిత్రలేఖన కళారూపం ఆచరణలో ఉన్న ప్రాంతం?
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, వారసత్వ కళలు, సాహిత్యం
1. తెలంగాణ సమాజం చారిత్రకంగా పొరుగు రాష్ట్రాలతో పోల్చినప్పుడు కాస్త భిన్నమైనది ఎందుకంటే?
1) భౌగోళికంగా దక్కన్ పీఠభూమితో, పాలనాపరంగా నిజాం పరిపాలనలో ఉండటం
2) దేశానికి దక్షిణంగా ఉండటం
3) వివిధ జాతుల ప్రజలు నివసించడం
4) ఉత్తర భారతదేశంతో ఉన్న సంబంధాలు
2. తెలంగాణ సమాజానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలను గుర్తించండి?
1) నిజాం పాలనలో తెలంగాణకు రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛలేదు
2) నిరంకుశ పరిపాలన ఉండటం
3) పాలనా యంత్రాంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సమాజంలో మార్పులు రాలేదు
4) పైవన్నీ
3. పుట్టపాక తేలియా రుమాల్ కి (G.I) భౌగోళిక గుర్తింపు ఏ సంవత్సరంలో లభించింది?
1) 2018-19 2) 2020-21
3) 2019-20 4) 2018-19
4. ప్రజల జీవన విధానాల నుంచి ఉత్పత్తి సంబంధాల నుంచి సంస్కృతి రూపొందు-తుంది. ఇది ఎన్ని రకాలుగా విభజించారు?
1) 2 2) 5 3) 3 4) 10
5. తెలంగాణ సంస్కృతి రకాన్ని గుర్తించండి.
1) ప్రజల సంస్కృతి
2) పాలన సంస్కృతి
3) ప్రజల, పాలన సంస్కృతి
4) గ్రామీణ సంస్కృతి
6. పాలక వర్గాల సంస్కృతిని ఏ విధంగా వ్యవహ-రించవచ్చు?
1) శిష్ట సంస్కృతి 2) శిష్ట కళలు
3) శిష్ట సాహిత్యం 4) పైవన్నీ
7. ప్రజల సంస్కృతిని ఏ విధంగా పిలవచ్చు?
1) జానపద సంస్కృతి
2) జానపద సాహిత్యం
3) జానపద కళలు 4) పైవన్నీ
8. తెలంగాణ సంస్కృతి ఏ ప్రాంతంలో పరిఢవిల్లింది?
1) చోటా నాగ్ పూర్ పీఠభూమి
2) దక్కన్ పీఠభూమి
3) మాల్వా పీఠభూమి
4) పామీర్ పీఠభూమి
9. ప్రాచీన తెలంగాణ సమాజంలో వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా దేనితో జరిగేది?
1) ఉప్పు 2) వడ్లు
3) కూరగాయలు 4) వసా్త్రలు
10. తెలంగాణలో బహుళ ప్రచారంలో ఉన్న కళారూపాలను గుర్తించండి.
1) తోలు బొమ్మలాట 2) బాల సంతులు
3) శివసత్తులు 4) పైవన్నీ
11. దేవుడి ప్రతిరూపంగా భావించే తెలంగాణ కళారూపం ఏది?
1) కాటిపాపలు 2) పంబకథ
3) గుస్సాడి 4) పట్నాలు
12. మహిళా పారిశ్రామిక పార్కు ఉన్న ప్రాంతం?
1) జడ్చర్ల 2) లాలగుడి
3) జహీరాబాద్ 4) 1, 3
13. పద్మశాలీ కులస్థులకు ఆశ్రిత కులంగా ఉండే సాధన సూరులు ప్రదర్శించే విద్యను గుర్తించండి.
1) అగ్నిస్తంభన 2) జలస్తంభన
3) వాయుస్తంభన 4) పైవన్నీ
14. పంబల వాళ్లు తెలంగాణ సమాజంలో ఏ కులంలో ఒక తెగగా ఉంటున్నారు?
1) కురుమ 2) మాల
3) పద్మశాలి 4) కాపు
15. సంతానం లేని వారికి సంతానం కలగాలని దీవిస్తూ, యాచించే తెలంగాణలోని ఓ కళారూపం?
1) చెంచులు 2) ఎనోట్టివారు
3) బాలసంతులు 4) మందెచ్చులవారు
16. బుడిగ జంగాల్లో ఒక తెగను గుర్తించండి.
1) కాటిపాపలు 2) చెక్క బొమ్మలోళ్లు
3) బైండ్లలు 4) సాధనా సూరులు
17. భవానీ మాతకు కొలుపులు చేయించేవారు భవానీలుగా మారి చివరకు ఎవరిగా రూపాంతరం చెందారు?
1) బైండ్ల 2) గౌడ
3) రాజన్నలు 4) చెంచులు
18. పలకలతో చతురస్రాకారంలో పసుపు, కుంకుమ, పచ్చిబియ్యపు పిండి మొదలైన వాటితో వేసే ముగ్గులను పట్నాలు అంటారు. పట్నాల ముందు వేసే ‘చంద్రం’ అంటే?
1) పసుపు, కుంకుమ కలిపిన మిశ్రమం
2) పసుపు, సున్నం కలిపిన మిశ్రమం
3) యాటనెత్తురు అన్నంతో కలిపిన మిశ్రమం
4) ఏదీకాదు
19. శివున్ని కీర్తిస్తూ మోగించే వాయిద్యాన్ని శివ-మేళం అంటారు. దీనికి ఉన్న మరో పేరు?
1) జోడు 2) శృతి
3) చామిల్లాలీ 4) శృతిగంట
20. ఎన్నోట్టివారు వారి ఆశ్రిత కులానికి వచ్చే కథ ఏది?
1) పెరియ పురాణం 2) గౌడ పురాణం
3) బేతాలుని కథ 4) పోలురాజు కథ
21. ప్రాచీన కాలం నుంచి జానపద సాహిత్యం ఎవరి వల్ల ఊపిరి పోసుకుంది?
1) దాసర్లు 2) విప్రవినోదులు
3) గురపువాళ్లు 4) జంగాలు
22. గొల్లల ఆశ్రిత కులాన్ని గుర్తించండి.
1) శారదకాండ్రు 2) మందెచ్చులవారు
3) జంగాలు 4) డక్కలి
23. పిచ్చకుంట్లవారి గురించి ఎందులో ప్రస్తావిం-చారు?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) అరుంధతి కళ్యాణం
4) కామధేను పురాణం
24. ఏ ప్రాంత చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలను రూపొందించి తెలంగాణ విశి-ష్టతను ప్రపంచమంతా చాటారు?
1) కొయ్యలగూడెం 2) సిరిపురం
3) గద్వాల్ 4) తేరటుపల్లి
25. రగ్గులు, కంబళ్ల తయారీకి ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం?
1) నల్లగొండ 2) సిద్దిపేట
3) కామారెడ్డి 4) వరంగల్
26. ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దడమే అద్దకం పరిశ్రమ ప్రత్యేకత, దీనికి ప్రసిద్ధి పొందిన ప్రాంతం?
1) మెదక్ 2) ఆసిఫాబాద్
3) జగిత్యాల 4) వనపర్తి
27. ప్రపంచ ప్రఖ్యాత చేనేత పట్టు వసా్త్రలను తయారు చేసే తెలంగాణలోని ప్రదేశాలు ?
1) పోచంపల్లి 2) నారాయణపేట
3) గద్వాల, కొత్తకోట 4) పైవన్నీ
28. ప్రత్యేకమైన డిజైన్ తో చేసిన నేత వసా్త్రలకు ప్రసిద్ధి చెందిన ‘పోచంపల్లి’ ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్ 2) యాదాద్రి-భువనగిరి
3) గద్వాల 4) సంగారెడ్డి
29. బొమ్మలు -ఆటవస్తువుల తయారీకి అత్యంత ప్రసిద్ధిగాంచిన తెలంగాణ ప్రాంతం?
1) మహబూబాబాద్
2) జోగులాంబ గద్వాల్
3) ఖమ్మం 4) నిర్మల్
30. నిర్మల్ లో తయారయ్యే బొమ్మలు రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి పొందాయి. వీటి తయారీకి ఉపయోగించే కలప ఏది?
1) బూరుగు, పొనుకు
2) ఎర చందనం
3) జీలుగ 4) నల్లమద్ది
31. లేసు అల్లికల పరిశ్రమ కేంద్రీకృతమైన ప్రాంతం ఏది?
1) సూర్యాపేట 2) జనగాం
3) ఖమ్మం 4) మంచిర్యాల
32. తెలంగాణలో కంచు-ఇత్తడి-రాగి వస్తువులు రూపొందే ప్రాంతాలను గుర్తించండి.
1) పానగల్ , పెంబర్తి
2) కురనపల్లి, పరకాల
3) సిద్దిపేట 4) పైవన్నీ
33. డోక్రామెటల్ అంటే బెల్ మెటల్ కళ, దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు?
1) ఉషగవ్ 2) కేశలగడ
3) చిత్తల్ బరి 4) పైవన్నీ
34. సిల్వర్ ఫిలిగ్రీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) బీదర్ 2) హైదరాబాద్
3) కరీంనగర్ 4) నాందేడ్
35. మిశ్రమ ధాతువులను కలిపి రూపొందించే ప్రత్యేక వస్తువులైన బిద్రి వస్తువులకు కేంద్రీకృతమైన ప్రాంతం?
1) హైదరాబాద్ -బీదర్
2) పెద్దపల్లి
3) భద్రాద్రి-కొత్తగూడెం
4) మెదక్
36. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే ముఖ్యమైన పువ్వు ఏది?
1) తామర 2) దోస
3) గునుగు 4) కట్ల
37. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన రాష్ట్ర పండుగగా గుర్తించింది?
1) మార్చి-06-2014
2) జూన్ -16-2014
3) ఆగస్టు-20-2014
4) నవంబర్ -13-2014
38. జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిచోట ఆచరించే పండుగల్లో ముఖ్యమైన పండుగ బోనాలు. ఈ పండుగను పూర్వకా-లంలో ఏమని పిలిచేవారు?
1) ఊరడి 2) బతుకమ్మ
3) నవరాత్రుల పండుగ
4) ఈర్లగిరి
39. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఏ మాసంలో ఆచరిస్తారు?
1) భాద్రపద మాసం 2) కార్తీక మాసం
3) ఆషాఢ మాసం 4) ఫాల్గుణ మాసం
40. బోనాల పండుగ ఏ ప్రాంతంలో ప్రారంభమవుతుంది?
1) గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం
2) సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయం
3) బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయం
4) అక్కన్న మాదన్న దేవాలయం
41. నకాశీ చిత్రలేఖన కళారూపం ఎక్కడ ఆచరణలో ఉన్నది?
1) నిర్మల్ , ఆదిలాబాద్
2) చేర్యాల, వరంగల్
3) నారాయణ్ పేట
4) బొంతపల్లి, మెదక్
42. తెలుగు వారికి తొలి పండుగ అయిన ఉగాది పండుగను ఏ రోజున నిర్వహిస్తారు?
1) భాద్రపదశుద్ధ దశమి
2) ఆషాఢశుద్ధ పౌర్ణమి
3) చైత్రశుద్ధ పాడ్యమి
4) కార్తీక పంచమి
43. హిందువుల అతిపెద్ద పండుగ దసరా . అయితే ఈ పండుగను తొమ్మిది రాత్రులు, 10 రోజులు నిర్వహిస్తారు. 10వ రోజు ప్రత్యేకత ఏమిటి?
1) దుర్గాష్టమి
2) విజయదశమి
3) సరస్వతి పూజ 4) ఆయుధ పూజ
44. హిందువులు, జైనులు, సిక్కులు మొదలైన మతాల వారు ఆచరించే పండుగ?
1) శ్రీరామ నవమి 2) దీపావళి
3) గురుపూర్ణిమ 4) ఉగాది
45. తెలంగాణ మహమ్మదీయులు మొహరం పండుగ జరుపుకొంటారు. దీన్ని హిందు-వులు ఏ పండుగగా పిలుస్తారు?
1) పీర్ల పండుగ
2) బొడ్డెమ్మ పండుగ
3) వ్యాస పూర్ణిమ 4) మిలాద్ నబీ
46. తెలంగాణ ప్రాంతంలో పిల్లల పండుగగా పిలిచే పండుగ?
1) పీర్ల పండుగ 2) బతుకమ్మ పండుగ
3) విజయదశమి 4) బొడ్డెమ్మ పండుగ
47. తీజ్ పండుగను లంబాడాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
1) 3 2) 5 3) 9 4) 11
48. తెలంగాణలో లంబాడాలు తీజ్ పండుగను శ్రావణమాసంలో జరుపుకొంటారు. తీజ్ అంటే?
1) గోధుమ నారు 2) వరినారు
3) ఒకరకమైన వస్తువు
4) ఒకరకమైన పూజా విధానం
49. తెలంగాణలో గిరిజనులు పొలాలు సాగు చేయడానికి ముందు మే లేదా జూన్ మొదటివారంలో మంచి వర్షాలు కురవాలని జరుపుకొనే పండుగ?
1) సీత్ల 2) తీజ్
3) పెర్సిపెన్ 4) పెద్ద దేవుడు
50. తెలంగాణలో గోండుల గ్రామదేవతగా ఎవరిని కొలుస్తారు?
1) పెద్ద దేవుడు 2) అకిపెన్
3) పెర్సిపెన్ 4) ఈశ్వరుడు
51. సమ్మక్క-సారక్క జాతర జరిగే ప్రాంతం మేడారం ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్ 2) సిద్దిపేట
3) ములుగు 4) యాదాద్రి
52. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది?
1) 1990 2) 1992
3) 1994 4) 1996
53. తెలంగాణలో ముఖ్యమైన ఆదివాసుల పండుగలను లేదా జాతరలను గుర్తించండి.
1) నాగశేష జాతర
2) పెర్సిపెన్ జాతర
3) సీత్లా భవాని జాతర
4) పైవన్నీ
54. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవతలగా ఎవరిని పూజిస్తారు?
1) గంగమ్మ 2) పోచమ్మ
3) ఎల్లమ్మ 4) మహంకాళమ్మ
55. తెలంగాణలో పశుసంపదను కాపాడే దేవత ఎవరు?
1) రేణుక 2) సోమలమ్మ
3) మైసమ్మ 4) జోగమ్మ
56. అంటురోగాలు, దుష్టశక్తుల నుంచి, కలరా వంటి వ్యాధుల నుంచి కాపాడే గ్రామదేవతగా పూజించే దేవత ఎవరు?
1) ఎల్లమ్మ 2) పోచమ్మ
3) గంగమ్మ 4) సారలమ్మ
57. తమ వ్యవసాయ భూములను, పంటలను భయంకరమైన తెగుళ్ల నుంచి, దొంగల నుంచి, జంతువుల నుంచి ఎవరు కాపాడుతారని తెలంగాణ రైతుల విశ్వాసం?
1) పెర్సిపెన్ 2) పోతరాజు
3) భగవంతుడు 4) శివభయ్య
58. పశుపాలకులు గొరెలను, పశువులను కాపాడే దేవుళ్లని ఎవరిని ఆరాధిస్తారు?
1) పోతరాజు 2) అకిపెన్
3) బీరప్ప, కాటమరాజు 4) పెద్దదేవుడు
59. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జరిగే ఏడుపాయల జాతర ఏ జిల్లాలో ఉంది?
1) జగిత్యాల 2) మెదక్
3) జయశంకర్ భూపాలపల్లి
4) నిర్మల్
60. నాగోబా జాతరకు ఉన్న మరోపేరు?
1) ఇంద్రవెల్లి జాతర 2) వేలాల జాతర
3) కొరవి జాతర 4) నల్లకొండ జాతర
జవాబులు
1.1 2.4 3.3 4.1 5.3 6.4 7.4 8.2 9.2 10.4 11.3 12.4 13.4 14.2 15.3 16.2 17.1 18.2 19.3 20.2 21.4 22.2 23.1 24.3 25.4 26.1 27.4 28.2 29.4 30.1 31.3 32.4 33.4 34.3 35.1 36.3
37.2 38.1 39.3 40.1 41.2 42.3 43.2 44.2 45.1 46.4 47.3 48.1 49.4 50.2 51.3 52.4
53.4 54.2 55.3 56.1 57.2 58.3 59.2 60.1
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు