ఐన్ స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం ?
భౌతిక శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్
1. ఉత్సర్గనాళ ప్రయోగాన్ని నిర్వహించి పరమాణు నమూనాను వివరించిన శాస్త్రవేత్త ?
a) JJ థామ్సన్ b) రూథర్ ఫర్డ్
c) నీల్స్ బోర్ d) సోమర్ ఫీల్డ్
2. ఉత్సర్గ నాళంలో 0.4 mm Hg పీడనం వద్ద కనిపించే చీకటి, ప్రకాశవంతమైన చారలతో నిండిన పట్టీలను ఏమంటారు?
a) అబ్సిరేషన్స్ b) స్ట్రయేషన్స్
c) ఆసిలేషన్స్ d) నోడ్స్
3. ఉత్సర్గనాళంలో కాథోడ్ కిరణాల వేగం? (cకాంతివేగం)
a) 0.1 c b) 0.01 c
c) 0.001 c d) 0.0001 c
4. కింది వాటిలో కాథోడ్ కిరణాలు దేనిలో ఉంటాయి ?
a) సాధారణ టి.వి
b) సాధారణ కంప్యూటర్ మానిటర్
c) ట్యూబ్ లైట్ d) పైవన్నీ
5. కాథోడ్ కిరణాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
a) జింక్ సల్ఫైడ్ తెరపై ప్రతిదీప్తిని కలుగజేస్తాయి
b) విద్యుత్ క్షేత్రంలో ధనపలక వైపునకు వంగుతాయి
c) ఇవి దాదాపు కాంతి వేగంలో పదోవంతు వేగంతో ప్రయాణిస్తాయి
d) పైవన్నీ
6. న్యూట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త ?
a) JJ థామ్సన్ b) గోల్డ్ స్టెయిన్
c) చాడ్విక్ d) నీల్స్ బోర్
7. పరమాణు కేంద్రకంలో ఉండే కణాలు ?
a) ఎలక్టాన్లు b) ప్రోటాన్లు
c) న్యూట్రాన్లు d) b, c
8. పరమాణు నిర్మాణాన్ని సౌరమండల నమూనాగా వివరించింది ?
a) JJ థామ్సన్ b) నీల్స్బోర్
c) రూథర్ ఫర్డ్ d) ప్లాంక్
9. పరమాణు కేంద్రకం ఆవేశం ?
a) ధనావేశం b) రుణావేశం
c) ఆవేశం లేదు d) పరమాణువును బట్టి ఉంటుంది
10. పరమాణువు ఆవేశం ?
a) ధనావేశం b) రుణావేశం
c) తటస్థం d) a లేదా b
11. రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాలో లోపాన్ని సరిచేసింది ?
a) మాక్స్ ప్లాంక్ b) నీల్స్బోర్
c) JJ థామ్సన్ d) చాడ్విక్
12. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్టాన్ ద్రవ్యరాశితో పోల్చితే ఎన్నిరెట్లు ఉంటుంది?
a) 1836 b) 1386
c) 1368 d) 1686
13. హీలియం పరమాణు కేంద్రకాన్ని కింది విధంగా కూడా పిలుస్తారు?
a) ఆల్ఫా- కణం b) బీటా – కణం
c) మెసాన్ d) పాజిట్రాన్
14. ఆల్ఫా- కణం పై ఉండే ఆవేశం ?
a) 1 యూనిట్ ధనావేశం
b) 1 యూనిట్ రుణావేశం
c) 2 యూనిట్ల ధనావేశం
d) 2 యూనిట్ల రుణావేశం
15. కూలిడ్జ్ నాళంలో భారలోహంతో తయారు చేసిన లక్ష్య ఫలకంపై వేగంగా చలించే ఎలక్టాన్లు పతనం అయినప్పు ఉత్పత్తి అయ్యేవి ?
a) అతినీలలోహిత కిరణాలు
b) X – కిరణాలు c) గామా – కిరణాలు
d) పరారుణ కిరణాలు
16. X – కిరణాల వేగం ?
a) కాంతి వేగం కంటే ఎక్కువ
b) కాంతి వేగం కంటే కొద్దిగా తక్కువ
c) కాంతి వేగంతో సమానం
d) ధ్వని వేగంతో సమానం
17. X – కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ్ నాళంలోని లక్ష్య ఫలకానికి ఉండాల్సిన లక్షణం ?
a) అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత
b) తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత
c) అధిక బాష్పీభవన ఉష్ణోగ్రత
d) తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత
18. విద్యుత్ క్షేత్రంలో X – కిరణాల ప్రవర్తనకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది ?
a) ధన ఫలక వైపునకు వంగుతాయి
b) రుణ ఫలక వైపునకు వంగుతాయి
c) రెం ఫలకల నుంచి దూరంగా ప్రయాణిస్తాయి
d) ఎటువైపు వంగకుండా ప్రయాణిస్తాయి
19. కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించిన శాస్త్రవేత్త ?
a) ఐన్ స్టీన్ b) నీల్స్బోర్
c) హెర్ట్ d) ష్రోడింజర్
20. చీకటి పడగానే తమంత తాముగా వెలిగి, వెలుతురు రాగానే ఆరిపోయే దీపాల్లో ఇమిడి ఉన్న సూత్రం ?
a) కాంతి విద్యుత్ ఫలితం
b) రామన్ ఫలితం
c) స్టార్క్ ఫలితం
d) జీమాన్ ఫలితం
21. పదార్థ ద్వంద్వ స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
a) ఐన్ స్టీన్ b) ప్లాంక్
c) డీ బ్రోగలి d) మోస్లే
22. న్యూక్లియాన్లు అని వేటికి పేరు?
a) ఎలక్టాన్లు b) ప్రోటాన్లు
c) న్యూట్రాన్లు d) మోస్లే
23. పరమాణు సంఖ్యకు కింది వాటిలో సరైన వివరణ ఏది?
a) కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య
b) కేంద్రకంలోని న్యూట్రాన్ల సంఖ్య
c) కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం
d) పరమాణువులోని ఎలక్టాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్య
24. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే ?
a) ప్రోటాన్ల సంఖ్య b) న్యూట్రాన్ల సంఖ్య
c) కేంద్రక కణాల సంఖ్య
d) ఎలక్టాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్య
25. ‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాన్ని కింది విధంగా నిర్వచిస్తారు?
a) C12 పరమాణు ద్రవ్యరాశిలో 1/12వ వంతు
b) O16 పరమాణు ద్రవ్యరాశిలో 1/16వ వంతు
c) C13 పరమాణు ద్రవ్యరాశిలో 1/13వ వంతు
d) O17 పరమాణు ద్రవ్యరాశిలో 1/17వ వంతు
26. ఐన్ స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం ?
a) M=EC2 b) C=ME2
c) C=EM2 d) E=MC2
27. ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణానికి సమానమైన ద్రవ్యరాశి ?
a) 1.66X10-24 గ్రా
b) 1.66X10 -27 గ్రా
c) 1.66X10-19 గ్రా
d) 1.66X10-31 గ్రా
28. ఒక కి.గ్రా. ద్రవ్యరాశి విధ్వంసమైనప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి ?
a) 9X109 జే b) 9X1012 జే
c) 9X1016 జే d) 9X1024 జే
29. 1 u (MeV) పదార్థం ఎంత శక్తికి సమానం ?
a) 931.5 eV b) 931.5 KeV
c) 931.5 MeV d) 931.5 GeV
30. సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించే మూలకాల పరమాణు సంఖ్య ఎంతకంటే ఎక్కువగా ఉంటుంది?
a) 49 b) 64 c) 81 d) 82
31. ‘పిచ్ బ్లెండ్ ’ ఏ మూలక ఖనిజం?
a) ఇనుము b) పాదరసం
c) బంగారం d) యురేనియం
32. పరమాణు కేంద్రకం నుంచి ఉద్భవించే ఎలక్టాన్లను ఏమంటారు ?
a) a- కణాలు b) b – కణాలు
c) p -మెసాన్లు d) మ్యూయాన్లు
33. ఆల్ఫా- కణాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ కానిదేది?
a) ప్రోటాన్ ద్రవ్యరాశికి 4 రెట్లు ఉంటాయి.
b) విద్యుత్ క్షేత్రంలో రుణపలక వైపునకు వంగి ప్రయాణిస్తాయి
c) అయస్కాంత క్షేత్రంలో రుజుమార్గంలో ప్రయాణిస్తాయి
d) ప్రోటాన్ ఆవేశానికి 2 రెట్లు ఆవేశం ఉంటుంది
34. గామా (g) కిరణాల వేగం ఎంత (c కాంతి వేగం) ?
a) 0.1 c b) c
c) 2c d) 0.5 c
35. రేడియో ధార్మిక కేంద్రకం ఒక బీటా కణాన్ని ఉద్గారం చేసినప్పు దాని పరమాణు సంఖ్య
a) 1 యూనిట్ తగ్గుతుంది
b) 1 యూనిట్ పెరుగుతుంది
c) 2 యూనిట్లు తగ్గుతుంది d) మారదు
36. రేడియోధార్మిక కేంద్రకం ఒక బీటా-కణాన్ని ఉద్గారం చేసినప్పు దాని ద్రవ్యరాశి సంఖ్య ?
a) 1 యూనిట్ తగ్గుతుంది
b) 1 యూనిట్ పెరుగుతుంది.
c) 2 యూనిట్లు తగ్గుతుంది d) మారదు
37. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి ఏది ?
a) నెవ్ట్యూనియం b) యురేనియం
c) ఆక్టీనియం d) థోరియం
38. ఒక రేడియోధార్మిక శ్రేణిలో చివరగా ఏర్పడే స్థిర మూలకం ?
a) టంగ్ స్టన్ b) బేరియం
c) క్రిప్టాన్ d) సీసం
39. రేడియోధార్మిక జడవాయువు ?
a) రేడియం b) రేడాన్
c) థోరియం d) హీలియం
40. అర్ధ జీవితకాలం 1 రోజుగా గల 100 గ్రాముల రేడియోధార్మిక పదార్థం నాలుగు రోజులకు ఎంతగా మిగులుతుంది?
a) 50 గ్రా b) 25 గ్రా
c) 12.5గ్రా d) 6.25 గ్రా
41. కార్బన్ (146C) అర్ధ జీవిత కాలం ఎంత ?
a) 5730 సంవత్సరాలు
b) 7530 సంవత్సరాలు
c) 5370 సంవత్సరాలు
d) 5073 సంవత్సరాలు
42. ఐసోటోపులకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది ?
a) ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి
b) వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటాయి
c) న్యూట్రాన్ల సంఖ్య వేర్వేరుగా ఉంటుంది
d) పైవన్నీ సరైనవే
43. కింది వాటిలో హైడ్రోజన్ ఐసోటోపు ?
a) డ్యుటీరియం b) ట్రిటియం
c) a, b d) పెంటియం
44. సమాన సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉన్న మూలకాలను ఏమంటారు?
a) ఐసోటోపులు b) ఐసోటోన్లు
c) ఐసోబారులు d) ఐసోమర్లు
45. 713N అనే సంకేతంతో సూచించబడే పరమాణువులో ఉండే న్యూట్రాన్ల సంఖ్య?
a) 6 b) 7 c) 13 d) 14
46. థైరాయిడ్ గ్రంథి పని తీరును పరీక్షించడానికి ఉపయోగించే ఐసోటోపు ఏది?
a) కోబాల్ట్ b) సోడియం
c) అయోడిన్ d) కార్బన్
47. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు ఏది?
a) లెడ్ b) కార్బన్
c) సోడియం d) కోబాల్ట్
48. భూమి, శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు ఏది?
a) కార్బన్ b) సోడియం
c) క్రోమియం d) యురేనియం
49. కింది వాటిలో రేడియోధార్మికతను కొలిచే సరైన ప్రమాణం ఏది?
a) క్యూరీ b) బెకరల్
c) రూథర్ పర్డ్ d) పైవన్నీ
50. కేంద్రక బలాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది?
a) అవేశంపై ఆధారపడవు, స్పిన్ పై ఆధారపడుతాయి
b) అల్పవ్యాప్తి బలాలు
c) ఆకర్షణ బలాలు d) పైవన్నీ
51. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో ఉపయోగపడే న్యూట్రాన్ ?
a) ఉష్ణ న్యూట్రాన్
b) శీతల న్యూట్రాన్
c) తటస్థ న్యూట్రాన్
d) వేగ న్యూట్రాన్
52. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడే సగటు విఘటన శక్తి ఎంత?
a) 212 eV b) 2.12 eV
c) 21.2 eV d) 212 Mev
53. అనియంత్రిత శృంఖల చర్యలో న్యూట్రాన్ల సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది?
a) అంకశ్రేఢిలో b) గుణశ్రేఢిలో
c) హరాత్మక శ్రేఢిలో d) ఘాతాంకంగా
54. కేంద్రక రియాక్టర్ లో భారజలం చేసే పని ?
a) చర్యావేగాన్ని నియంత్రించడం
b) న్యూట్రాన్ ల వేగాన్ని నియంత్రించడం
c) చర్యను ప్రోత్సహించడం
d) రక్షణ కోసం
55. భార జలం అంటే ?
a) హైడ్రోజన్ పెరాక్సైడ్
b) డ్యుటీరియం ఆక్సైడ్
c) లవణాలు కలిగిన నీరు
d) శుద్ధి చేసిన నీరు
56. ఆటంబాంబు సూత్రం ?
a) కేంద్రక సంలీనం
b) కేంద్రక వియోగం
c) కేంద్రక విచ్ఛిత్తి
d) పరమాణు దహనం
57. సూర్యుడు, నక్షత్రాలలో శక్తికి కారణం?
a) కేంద్రక సంలీనం
b) కేంద్రక విచ్ఛిత్తి c) కేంద్రక దహనం
d) పరమాణు దహనం
58. ఎలక్టాన్ ద్రవ్యరాశికి సమాన ద్రవ్యరాశి, సమానస్థాయిలో ధనావేశం గల కణం?
a) న్యూట్రాన్ b) పాజిట్రాన్
c) మ్యూయాన్ d) మెసాన్
59. శుద్ధి చేసిన యురేనియం ఆక్సైడ్ ఖనిజాన్ని ఏమంటారు?
a) ఎల్లోకేక్ b) పింక్ కేక్
c) గ్రీన్ కేక్ d) వైట్ కేక్
60. కేంద్రకంలోని ఎలక్టాన్ సంఖ్య ఎప్పుడూ..?
a) 10 b) 1 c) -1 d) 1
సమాధానాలు
1. a 2. b 3. a 4. d 5. d 6. c 7. d 8. c 9. a 10. c 11. b 12. a 13. a 14. c 15. b 16. c
17. a 18. d 19. a 20. a 21. c 22. d 23. a 24. c 25. a 26. d 27. a 28. c 29. c 30. d 31. d 32. b 33. c 34. b 35. b 36. d 37. a 38. d 39. b 40. d 41. a 42. d 43. c 44. b 45. a 46. c 47. b 48. d
49. d 50. d 51. a 52. d 53. b 54. b 55. b 56. c 57. a 58. b 59. a 60. d
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






