భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన ద్వీపపు మ్యూజియం ఏది?
1. కిందివాటిలో చరితకారులు, పురాతత్వ శాస్త్రవేత్తల అభ్రిపాయం ప్రకారం ఇక్ష్వాకుల పాలనలో ఉన్న తెలంగాణ జిల్లాలు ఏవి?
ఎ) నల్లగొండ బి) మహబూబ్నగర్
సి) ఖమ్మం డి) పైవన్నీ
2. పురాణాల్లో శ్రీపర్వతీయులనీ, ఆంధ్ర భృత్యులనీ, ఎవరిని పేర్కొన్నారు?
ఎ) ఇక్షాకులు బి) అభీరులు
సి) ప్రాచీన పల్లవులు డి) చుటునాగులు
3. ఇక్ష్వాకులు ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలు చెబుతున్నాయి?
ఎ) వందేండ్లు
బి) రెండు వందల ఏండ్లు
సి) మూడు వందల ఏండ్లు
డి) అయిదు వందల ఏండ్లు
4. పురాణాల ప్రకారం ఇక్ష్వాక వంశంలో ఎందరు రాజులున్నారు?
ఎ) పది మంది 2) ఏడుగురు
సి) ఐదుగురు డి) నలుగురు
5. కింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది?
ఎ) నాగార్జున కొండ
బి) విజయపురి
సి) అమరావతి డి) శ్రీ పర్వతం
6. ఇక్ష్వాక వంశ రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు
బి) వీరపురుషదత్తుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుష దత్తుడు
7. ఇక్ష్వాక వంశ రాజ్యస్థాపనకు శ్రీ శాంతమూలుడు ఏ మతాన్ని అవలంభించాడు?
ఎ) వైదిక మతం బి) బౌద్ధ మతం
సి) జైన మతం డి) ఏదీకాదు
8. శ్రీ శాంతమూలుడు తన సోదరి శాంతిశ్రీని ఎవరికిచ్చి వివాహం చేశాడు?
ఎ) వాసిష్ఠీపుత్ర స్కందశ్రీ
బి) వీరపురుష దత్తుడు
సి) మహాసేనుడు డి) క్షాత్రపుడు
9. మహాతలవరి, మహాదానపత్ని అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి?
ఎ) శాంతిశ్రీ బి) అడవి శాంతిశ్రీ
సి) హమ్మసిరిక డి) పై ఎవరూకాదు
10. మహా తలవరుడు అంటే ?
ఎ) అనేక రాజ్యాలను జయించినవాడు
బి) మహా సామంతుడు
సి) చక్రవర్తి డి) మహామంత్రి
11. శ్రీ శాంత మూలుని కుమార్తె ఎవరు?
ఎ) శాంతిశ్రీ బి) అడవి శాంతి శ్రీ
సి) వాపిశ్రీ డి) షష్ఠిశ్రీ
12. లక్షలకొద్ది గోవులను, నాగళ్లను, బంగారు నాణేలను దానం చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిన రాజు ఎవరు?
ఎ) శ్రీ శాంతమూలుడు
బి) వీరపురుషదత్తుడు
సి) శ్రీ ఎవుల శాంతమూలుడు
డి) రుద్రపురుష దత్తుడు
13. ఏ ఇక్ష్వాక రాజు కాలాన్ని తెలుగునాట బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తున్నారు?
ఎ) శ్రీ శాంతమూలుడు
బి) రుద్రపురుష దత్తుడు
సి) వీరపురుషదత్తుడు సి) ఏదీకాదు
14. వీర పురుష దత్తుని కాలంలో మహాయాన బౌద్ధమతస్తులకు పుణ్యక్షేత్రంగా విలసిల్లిన ప్రాంతం?
ఎ) అమరావతి బి) శ్రీపర్వతం
సి) ఘంటసాల డి) విజయపురి
15. వైదిక మతావలంభికుడు అయిన వీర పురుషదత్తుని తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలియజేస్తున్నది ఏది?
ఎ) అమరావతిలోని శాసనాలు
బి) నాగార్జున కొండ శిల్ప సాక్ష్యాలు
సి) హాయాన్త్సాంగ్ రచనలు
డి) శ్రీ శాంతమూలుని శాసనాలు
16. వీరపురుష దత్తుని కుమారుడైన శ్రీ ఎవుల శాంతమూలుని తల్లి ఎవరు?
ఎ) వాసిష్ఠీ భట్టీదేవి బి) మహాదేవి
సి) శాంతి శ్రీ డి) పై ఎవరూకాదు
17. ఇక్ష్వాకు వంశంలో చిట్టచివరి రాజు ఎవరు ?
ఎ) రుద్ర పురుషదత్తుడు
బి) శ్రీ శాంతమూలుడు
సి) వీరపురుష దత్తుడు
డి) పైఎవరూ కాదు
18. రుద్ర పురుషదత్తున్ని జయించినది ఎవరు?
ఎ) పల్లవ నరసింహ వర్మ
బి) శివస్కందవర్మ
సి) బుద్ధ యాంకరుడు
డి) శాంతివర్మ
19. ఇక్ష్వాకుల కాలంలో ఏ వృత్తి ప్రథమ స్థానంలో ఉన్నది?
ఎ) విదేశీ వ్యాపారం
బి) వ్యవసాయం
సి) నేత వసా్త్రల అమ్మకం డి) పైవన్నీ
20. స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ తెలుగునాట ఎవరి కాలంలో ప్రారంభమైంది?
ఎ) శాతవాహనులు బి) ఇక్ష్వాకులు
సి) చాళుక్యులు డి) పల్లవులు
21. ఉలిక ప్రముఖుడు అంటే?
ఎ) సైన్యాధిపతి బి) శ్రేణి నాయకుడు
సి) మహామంత్రి డి) సామంతులు
22. ఇక్ష్వాకులు ముద్రించిన నాణేలు ఏవి?
ఎ) సీసం బి) బంగారం
సి) వెండి డి) పైవన్నీ
23. ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉన్న దీనారాలు ఎక్కడి నుంచి వచ్చాయని భావిస్తున్నారు?
ఎ) తమిళ దేశం బి) రోమ్
సి) ఉత్తర దేశం డి) పర్షియా
24. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్దగ్యాలరి ఎక్కడ ఉంది?
ఎ) నాగార్జున కొండ బి) అమరావతి
సి) విజయపురి డి) కాంచీపురం
25. హరితీ అంటే?
ఎ) శిశువులను రక్షించే దేవత
బి) పాపులను శిక్షించే దేవత
సి) సంగీతంలో ఒక రాగం
డి) ఒక గొప్ప కట్టడం
26. అశ్వమేధం వాజపేయం, అగ్రిష్టోమం మొదలైన క్రతువులు చేసిన రాజు ఎవరు?
ఎ) రుద్ర పురుషదత్తుడు
బి) వీరపురుషదత్తుడు
సి) శాంతమూలుడు
డి) పై ఎవరూకాదు
27. అనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన, నాగపూజ ఎవరి కాలంలో కన్పిస్తుంది?
ఎ) శాతవాహనులు బి) పల్లవులు
సి) ఇక్ష్వాకులు డి) పై ఎవరూ కాదు
28. వీరగల్లులు అంటే?
ఎ) యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు
బి) యుద్ధంలో పారిపోయిన సైనికులు
సి) కుస్తీపోటీలు జరిపే స్థలం
డి) రహస్య మందిరం
29. ముడుపు స్థూపాల నిర్మాణం అంటే?
ఎ) రహస్యంగా చెక్కించే స్థూపాలు
బి) అత్యంత ప్రతిభాపాటవాలతో చెక్కిన స్థూపాలు
సి) ఏదైనా కోరిక నెరవేరితే స్థూపాలను నిర్మిస్తానని మొక్కడం
డి) ధ్వంసం చేసిన స్థూపాలు
30. ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన స్థూపాన్ని పునర్నిర్మించినది ఎవరు?
ఎ) శాంతమూలుడు బి) శాంతిశ్రీ
సి) షష్ఠిశ్రీ డి) గౌతమీ బాలశ్రీ
31. ఇక్ష్వాకుల్లో తొలుత సంస్కృతాన్ని శాసనాల్లో వాడినది ఎవరు?
ఎ) శాంతిశ్రీ
బి) శ్రీ శాంతమూలుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
32. తమిళ తెలుగు పదాల కలయికతో పేరుగల ఇక్ష్వాక రాజు ?
ఎ) ఎవుల (బబల) శాంతమూలుడు
బి) శ్రీ శాంతమూలుడు
సి) రుద్ర పురుషదత్తుడు
డి) పై ఎవరూకాదు
33. థేరవాదులు ఏ మతానికి చెందినవారు?
ఎ) వైదికమతం బి) బౌద్ధమతం
సి) జైనమతం డి) ఏదీకాదు
34. భారతదేశ శాసనాల్లో సంవత్సరం ప్రథమంగా ఎవరి శాసనాల్లో లభించింది?
ఎ) అశోకుడు బి) శాతవాహనులు
సి) ఇక్షాకులు డి) పల్లవులు
35. కిందివారిలో నల్లగొండ జిల్లా ఫణిగిరిలో జరిగిన తవ్వకాలు పరిశోధనల్లో బయల్పడిన శాసన ఫలకాల్లో ప్రస్తావించిన ఇక్ష్వాకరాజు ఎవరు?
ఎ) శ్రీశాంత మూలుడు
బి) వీరపురుష దత్తుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
36. కిందివారిలో తెలంగాణలో ఇక్ష్వాకుల నాణేలు లభించిన ప్రాంతం ఏది?
ఎ) ఫణిగిరి బి) ధూళికట్ట
సి) పెద్దబంకూరు డి) కోటిలింగాల
37. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు?
ఎ) నిగమాలు బి) ఫణిం
సి) గ్రామసంచిక డి) ఏదీకాదు
38. భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన ద్వీపపు మ్యూజియం ఏది?
ఎ) అమరావతి బి) నాగార్జున కొండ
సి) నలంద సి) భట్టిప్రోలు
39. ఇక్ష్వాకుల కాలంలో వివిధ గ్రామాలను కలిపి ఏమని వ్యవహరించేవారు?
ఎ) గ్రామసంచిక బి) ఫణిం
సి) శ్రేణి డి) హారతి
40. ఇక్ష్వాకుల కాలంలో ఉన్న సాంఘిక దురాచారం?
ఎ) సతీసహగమనం బి) శిశుహత్య
సి) నరబలి డి) మతకలహాలు
41. ఇక్ష్వాకుల కాలంలో సౌందర్యానికి ప్రతీకలుగా పేరొందిన కట్టడాలు ఎక్కడున్నాయి?
1) విజయపురి 2) శ్రీ పర్వతం
3) మంచికల్లు 4) హలంపురం
ఎ) 1, 2, 3, 4 బి) 1. 2. 3
సి) 1, 2 డి) 2, 3, 4
42. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) విజయపురి బి) నాగార్జున కొండ
సి) మంచికల్లు డి) అలంపురం
43. బౌద్ధ నిర్మాణాలతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టిన రాజు?
ఎ) వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు
బి) వీరపురుష దత్తుడు
సి) ఎవల శాంతమూలుడు
డి) రుద్ర పురుష దత్తుడు
44. అప్రతిహాత సంకపన అనే బిరుదు కింది ఏ రాజుకు సంబంధించినది?
ఎ) వీరపురుషదత్తుడు
బి) మహాసేనుడు
సి) క్షాత్రపుడు
డి) వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు
45. తెలంగాణలో లభించిన శాసనం ప్రకారం శ్రీ శాంతమూలుడు ఏ రాజ్యంలో మహాతలవరుడిగా పనిచేసినట్లు తెలుస్తోంది?
ఎ) విష్ణుకుండిన రాజ్యం
బి) శాతవాహన రాజ్యం
సి) శాలంకాయన రాజ్యం
డి) వాకాటక రాజ్యం
46. రెండవ ఎవుల శాంతమూలుని శాసనాలు కీ.శ. 1954-61 మధ్య కాలంలో ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి?
ఎ) నాగార్జున కొండ బి) జగ్గయ్య పేట
సి) విజయపురి డి) అమరావతి
47. రుద్ర పురుషదత్తుడు ఈ కింది ఏసంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు?
ఎ) కీ.శ.223-243
బి) క్రీ.శ.237-248
సి) క్రీ.శ.367-291
డి) క్రీ.శ.291-302
48. కింది ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏది?
ఎ) పారశీకం బి) ప్రాకృతం
సి) తెలుగు డి) తమిళం
49. వీరపురుష దత్తుడు ఈ కింది శాసనాల్ని వేయించాడు?
ఎ) నాగార్జున కొండ బి) ఉప్పుగుండూరు
సి) జగ్గయ్యపేట డి) పైవన్నీ
50. శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యాన్ని తెలిపే గ్రంథాలేవి?
ఎ) పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ బి) టాలమీ
సి) ప్లీనీ రచనలు డి) పైవన్నీ
51. దక్షిణ భారతదేశంలోని తొలి దేవాలయం ఏది?
ఎ) హరితీ దేవాలయం
బి) పుష్టభద్రస్వామి దేవాలయం
సి) అష్టభుజస్వామి దేవాలయం
డి) నవగ్రహ దేవాలమం
52. బుద్ధుడిని కిరీటం లేని రాజుగా, దేవుడిగా చెక్కిన అద్భుత శిల్పం ఎక్కడుంది?
ఎ) నాగార్జున కొండ బి) జగ్గయ్యపేట
సి) ఏలేశ్వరం డి) ఫణిగిరి
53. దక్షిణాపథ సామ్రాట్ బిరుదు కింది వారిలో ఎవరికి కలదు?
ఎ) ఎవుల శాంతమూలుడు
బి) శ్రీ శాంత మూలుడు
సి) వీరపురుషదత్తుడు
డి) రుద్రపురుషదత్తుడు
54. వాకాటకుల రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) ప్రవరసేనుడు-1 బి) వింధ్యశక్తి
సి) రుద్ర సేనుడు-1 డి) రుద్రసేనుడు-2
55. రెండవ చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతి గుప్త ఏ వాకాటక రాజుకు భార్య?
ఎ) ఒకటో రుద్రసేనుడు
బి) ఒకటో పృథ్వీసేనుడు
సి) రెండో రుద్ర సేనుడు
డి) రెండో ప్రవరసేనుడు
56, సామ్రాట్ బిరుదు ధరించిన వాకాటక రాజు?
ఎ) మొదటి ప్రవరసేనుడు
బి) సర్వసేనుడు
సి) రెండో రుద్ర సేనుడు
డి) రెండో ప్రవరసేనుడు
57. పాకృతభాషలో సేతుబంద అనే కావ్యాన్ని రచించిన వాకాటక రాజు
ఎ) మొదటి ప్రవరసేనుడు
బి) రెండో ప్రవరసేనుడు
సి) రెండో రుద్రసేనుడు
డి) సర్వసేనుడు
58. వాకాటకుల చరిత్రకు ఆధారమైన శాసనాలు?
ఎ) అలహాబాద్ స్తంభశాసనం
బి) పూనా రాగి శాసనం
సి) అజంతాగుహలు
డి) నాందేడ్ రాగి శాసనం
59. వాకాటకుల కాలంలో ఉన్న ప్రధానమైన మతాలు ఏవి?
ఎ) బౌద్ధం, జైనం
బి) హిందూ, జైనం
సి) హిందూమతం, బౌద్ధం, జైనం
డి) పైవేవీకావు
60. హరి విజయ అనే పాకృత కావ్యాన్ని రచించిన వాకాటక రాజు?
ఎ) హరిసేనుడు బి) సర్వసేనుడు
సి) రెండో ప్రవరసేనుడు
డి) రెండో రుద్ర సేనుడు
61. వాకాటకుల వంశానికి మూల పురుషుడు అయిన వింధ్యశక్తి రాజధాని నగరం ఏది?
ఎ) ఉజ్జయిన బి) అకోలా
సి) విదిష డి) ఔరంగబాద్
62. సముద్ర గుప్తుడి సమకాలీనుడైన వాకాటకరాజు ఎవరు?
ఎ) రెండో ప్రవరసేనుడు
బి) రెండవ రుద్ర సేనుడు
సి) ఒకటో పృథ్వీసేనుడు
డి) ఒకటో రుద్రసేనుడు
63. వింధ్యశక్తి వాకాటక వంశస్థుడని, ద్విజుడని, విష్ణు వృద్ధ గోత్రికుడని ఎన్నో గుహ శాసనం తెలుపుతుంది?
ఎ) 14వ బి) 15వ
సి)16వ డి) 17వ
సమాధానాలు
1-డి 2-ఎ 3-ఎ 4-బి 5-బి 6-ఎ 7-ఎ 8-ఎ 9-ఎ 10-బి 11-బి 12-ఎ 13-సి 14-బి 15-బి 16-ఎ
17-ఎ 18-ఎ 19-బి 20-బి 21-బి 22-ఎ 23-బి 24-ఎ 25-ఎ 26-సి 27-సి 28-ఎ 29-సి 30-బి 31-సి 32-ఎ
33-బి 34-సి 35-ఎ 36-ఎ 37-ఎ 38-బి 39-ఎ 40-ఎ 41-సి 42-బి 43-సి 44-డి 45-బి 46-ఎ 47-డి 48-బి 49-డి 50-డి 51-సి 52-బి 53-బి 54-బి 55-సి 56-ఎ 57-బి 58-ఎ 59-సి 60-బి 61-సి 62-డి 63-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు