ఫ్యామిలీ కోర్టుల చట్టం ఎప్పుడు రూపొందింది?
142. పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) సాంఘిక దురాచారాలైన కట్టు బాని సత్వం వెట్టిచాకిరీ నిషేధించబడినది
2) దేవదాసి, జోగిని, మాతంగి వంటి దురాచారాలు నిషేధించబడినవి
3) ఆర్టికల్స్ 24, 25ల్లో వివరణ ఉన్నది
4) బేగార్ వ్యవస్థ అంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా పనిచేయించడాన్ని నిషేధించింది
ఎ) 1, 3, 4 బి) 1, 2, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
143. స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 22 బి) ఆర్టికల్ 23
సి) ఆర్టికల్ 24 డి) ఆర్టికల్ 25
144. వివిధ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
a) వెట్టి చాకిరి నిషేధ చట్టం 1) 1956
b) వరకట్న నిషేధ చట్టం 2) 1948
c) స్త్రీలు, బాలికల అక్రమ వ్యాపార రవాణా నిరోధక చట్టం 3) 1976
d) కనీస వేతనాల 4) 1961 అమలు చట్టం
ఎ) a-2, b-4, c-1, d-3
బి) a-4, b-1, c-2, d-3
సి) a-3, b-4, c-1, d-2
డి) a-3, b-4, c-2, d-1
145. కింద పేర్కొన్న వాటిలో వివిధ చట్టాలు అవిరూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
a) గృహహింస నిరోధక చట్టం 1) 2013
b) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమానవేతనం చెల్లింపు చట్టం 2) 2015
c) నిర్భయ చట్టం 3) 1976
ఎ) a-2, b- 3, c-1
బి) a-3, b- 2, c-1
సి) a-1, b- 2, c-3
డి) a-2, b- 1, c-3
146. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23ను సమర్థవంతంగా అమలు చేయుటకు కనీస వేతనాల అమలు సవరణ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?
ఎ) 1958 బి) 1965
సి) 1971 డి) 1976
147. 14 సంవత్సరాలలోపు బాలలను పరిశ్రమల్లో, గనుల్లో, పేలుడు పదార్థాలు తయారీ లో పనుల కోసం నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది?
ఎ) ఆర్టికల్ 23 బి) ఆర్టికల్ 24
సి) ఆర్టికల్ 25 డి) ఆర్టికల్ 26
148. వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబు ఏది?
a) మార్కెట్ షిప్పింగ్ చట్టం 1) 1948
b) గనుల చట్టం 2) 1958
c) కర్మాగారాల చట్టం 3) 1986
d) బాలకార్మిక నిషేధ చట్టం 4) 1952
ఎ) a-2, b-4, c-1, d-3
బి) a-2, b-4, c-3, d-1
సి) a-1, b-3, c-2, d-4
డి) a-4, b-2, c-1, d-3
149. వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
a) ప్లాంటేషన్ కార్మికుల చట్టం 1) 1966
b) బాలల హక్కుల రక్షణ చట్టం 2) 2005
c) బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం 3) 1951
ఎ) a-3, b- 1, c-2
బి) a-1, b- 2, c-3
సి) a-3, b- 2, c-1
డి) a-2, b- 1, c-3
150. 14 సంవత్సరాలలోపు బాల బాలికలను పనుల కోసం నియమించుకున్న యజమానులపై కేసు నమోదు చేసి, ఒక్కొక్క యజమాని నుంచి రూ. 20,000/- చొప్పున జరిమానా వసూలు చేసి, బాల కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పు నిచ్చింది?
ఎ) ఎం.సి. మోహతా Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
బి) జయతీఘోష్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
151. పాఠశాలల్లో విద్యార్థులను శిక్షించడం పీడనం కిందకు వస్తుందని 2004లో ఏ న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది?
ఎ) సుప్రీంకోర్టు
బి) అలహాబాద్ హైకోర్టు
సి) ఢిల్లీ హైకోర్టు
డి) మద్రాస్ హైకోర్టు
152. కనీస వేతనం పొందడం కార్మికుల హక్కుగా ఏషియన్ గేమ్స్ కేసుగా పేరొందిన ఏ కేసు సందర్భంగా 1982లో సుప్రీంకోర్టు కీలక మైన తీర్పు నిచ్చింది?
ఎ) అబ్దుల్ లతీఫ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) విశాల్ జిత్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
153. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) 2007లో ఏర్పాటు చేశారు
2) రాజ్యాంగబద్ధ సంస్థగా ఆర్టికల్ 24(1)లో పేర్కొనబడినది
3) ఒక చైర్మన్ , ఆరుగురు సభ్యులు ఉంటారు
4) పార్లమెంటు ఏర్పాటు చేసిన చట్టబద్ధసంస్థ
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
154. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కు మొదటి చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు?
ఎ) రీతూ ముఖర్జీ బి) శాంతా సిన్హా
సి) అరుంధతీరాయ్ డి) మేధాపాట్కర్
155. POCSO Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) Protection of Childrens from Sexual Offences Act
బి) Prevention of Childrens from Sexual Offences Act
సి) Prంrague of Children from Sexual Offences Act
డి) Puneshment of Childrens from Sexual Offences Act
156. పోక్సో( POCSO) చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఈ చట్టాన్ని 2012లో రూపొందించారు
2) 18 ఏండ్ల బాలబాలికలను లైంగికంగా వేధించడం నేరం
3) 2019లో ఈ చట్టాన్ని సవరించారు
4) ఈ చట్టాన్ని 2020 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయసమీక్షకు గురిచేసింది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
157. Sexual Harassment of Women Work Place Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఈ చట్టం 2013లో రూపొందింది
2) ఈ చట్టం ప్రకారం మహిళలను భయపెట్టడం, ప్రలోభపెట్టడం నేరం
3) పనిచేసే ప్రదేశాల్లో ‘Local Complaints Committee’ (LCC) ఏర్పాటు చేయాలి.
4) పనిచేసే ప్రదేశాల్లో Internal Complaints Committee’ (ICC) ఏర్పాటు చేయాలి.
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
158 Sexual Harassment of Women Work Place Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) వేధింపులకు గురైన బాధితులు మూడు నెలల్లోపు ఫిర్యాదు చేయాలి.
2) ఫిర్యాదు అందిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి
3) దర్యాప్తు పూర్తి అయిన 60 రోజుల్లోపు నిందితులకు శిక్ష విధించాలి
4) నిందితుడు వయోవృద్ధుడైతే శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
159. ఢిల్లీలో నిర్భయ ఘటన ఎప్పుడు జరిగింది?
ఎ) 2012, డిసెంబర్ 16
బి) 2013, డిసెంబర్ 16
సి) 2011, డిసెంబర్ 16
డి) 2010, డిసెంబర్ 16
160. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం మహిళలపై వేధింపుల నియంత్రణకు అవసరమైన సిఫార్సుల కోసం ఏర్పడిన జేఎస్ వర్మ కమిషన్ లో సభ్యులుగా ఎవరున్నారు?
ఎ) రీతూ ముఖర్జీ, నీలం మిశ్రా
బి) లీలాసేథ్ , గోపాల సుబ్రమణ్యం
సి) ఉషామెహ్రా, అరుంధతీరాయ్
డి) మేధాపాట్కర్ , ఉషామెహ్రా
161. నేరన్యాయ సవరణ చట్టం (నిర్భయ చట్టం) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2013 జనవరి 3
బి) 2013 జనవరి 26
సి) 2013 ఫిబ్రవరి 3
డి) 2014 జనవరి 1
162. నేరన్యాయ సవరణ చట్టం ప్రకారం కింద పేర్కొన్న దేనిని నేరంగా పరిగణిస్తారు?
1) 18 సం.ల్లోపు బాలికలతో వారి అనుమతి లేకుండా లైంగిక చర్య జరపడం నేరం
2) అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష
3) నగ్నవీడియోలు తీయడం, ఇతరుల లైంగిక కార్యకలపాలను రహస్యంగా చూడటం నేరం
4) మహిళలను వెంటపడి వేధించడం నేరం
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
163. వివిధ చట్టాల రూపకల్పనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) హిందూ వివాహ చట్టం, 1955లో రూపొందినది
2) హిందూ మైనర్ల సంరక్షణ చట్టం1963లో రూపొందినది
3) ఫ్యామిలీ కోర్టుల చట్టం 1984లో రూపొందింది
4) ప్రసూతి సౌకర్యాల చట్టం 1961లో రూపొందింది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 1, 3, 4
164. మత స్వాతంత్య్రపు హక్కుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 25 – భారతీయులు తమ అంతరాత్మకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు
2) ఆర్టికల్ 26- మతాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మతధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు
3) ఆర్టికల్ 27-మతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయవచ్చు
4) ఆర్టికల్ 28-ప్రభుత్వ విద్యాసంస్థలలో మత బోధన నిషేధం
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
165. హిందూ మతంలో అంతర్భాగంగా సిక్కులు, జైనులు, బౌద్ధులను పేర్కొనవచ్చునని రాజ్యాం గంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 25(1)(ఎ)
బి) ఆర్టికల్ 25(2)(ఎ)
సి) ఆర్టికల్ 25(2)(బి)
డి) ఆర్టికల్ 25(3)(ఎ)
166. మనదేశంలో బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం చేసిన తొలిరాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర (1961)
బి) తమిళనాడు (1959)
సి) ఉత్తరప్రదేశ్ (1963)
డి) ఒడిశా (1967)
167. విద్యా, సాంస్కృతిక హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 29- అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు.
2) ఆర్టికల్ 30 – అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యా సంస్థలను నెలకొల్పవచ్చు
3) మనదేశంలో చట్టబద్ధంగా మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల విభజన ఉన్నది
4) భారత రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాల (Minority)కి సంబంధించి నిర్వచనం ఉంది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
168. కింద పేర్కొన్న వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్థారించేందుకు దేశాన్ని యూనిట్ గా తీసుకున్నారు
2) భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్థారించేందుకు దేశాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారు.
3) ప్రజాప్రయోజనాల రీత్యా మతపరమైన వ్యవహారాలపై ప్రభుత్వం హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు
4) మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొవడానికి వీలులేదు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
169. మైనారిటీ విద్యా సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే సందర్భం, జోక్యం చేసుకోకూడని సందర్భాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పును వెలువరించింది?
ఎ) బలర్షా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
బి) ఎస్.పి. మిట్టల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) సూరత్ రెహ్మాన్ బర్మతి Vs స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు
డి) టీఎంఏ పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
170. తమకు నచ్చిన భాషలో విద్యను అభ్యసించే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) దయానంద్ ఆంగ్లోవేదిక్ కళాశాలVs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
బి) ప్రమతి ఎడ్యుకేషనల్ సొసైటీ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు సి) ఎ, బి
డి) పి.ఎ.ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
171. టీఎంఏ పాయ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో మైనార్టీ విద్యా సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే ఏ సందర్భాన్ని సుప్రీంకోర్టు పేర్కొంటుంది.
1) ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వాహణ సందర్భం
2) విద్యా ప్రమాణాలను సంరక్షించే సందర్భం
3) ప్రభుత్వం జారీచేసే నియమనిబంధనలను ఉల్లంఘించిన సందర్భం
4) విద్యాసంస్థ నిర్వహణలో అక్రమాలు జరిగిన సందర్భం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
172. మైనారిటీ స్థాయిని నిర్థారించేందుకు భారత దేశం అంతటినీ కాకుండా రాష్ట్ర జనాభాను యూనిట్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
ఎ) టీఎంఏ పాయ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
బి) సెయింట్ జేవియర్ కాలేజీ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు
సి) పి.ఏ. ఇనాందార్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు డి) బి, సి
జవాబులు
142-బి 143-బి 144-సి 145-ఎ 146-డి 147-బి 148-ఎ 149-సి 150-ఎ 151-సి 152-బి 153-డి
154-బి 155-ఎ 156-ఎ 157-డి 158-బి 159-ఎ 160-బి 161-సి 162-బి 163-డి 164-సి 165-సి
166-డి 167-ఎ 168-సి 169-డి 170-సి 171-డి 172-ఎ
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్ , వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు