ప్లేస్మెంట్స్కే తొలి ప్రాధాన్యం
# ఆర్థిక పరిస్థితిని బట్టి కాలేజీల ఎంపిక
# ఫీజులు, స్కాలర్షిప్లదీ కీలక పాత్రే
#విద్యార్థుల అభిరుచులపై ఐసీ-3 సర్వే
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదు. 51% మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. 77%మంది విద్యార్థులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకొని కాలేజీలను ఎంపిక చేసుకొంటున్నారు. క్యాంపస్ వాతావరణం, వసతులు, ఫీజులు, స్కాలర్షిప్లు తదితర అంశాల గురించి ఆలోచిస్తున్నారు. అమెరికాకు చెందిన ఐసీ 3 ఇన్స్టిట్యూట్ 75 దేశాల్లోని 110 యూనివర్సిటీల్లో నిర్వహించిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. ఈ సర్వేలో హైదరాబాద్ విద్యార్థులు సైతం పాల్గొనడం విశేషం. ప్రపంచంలో నేటికీ అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలే అంతర్జాతీయ అధ్యయన వేదికలుగా కొనసాగుతున్నాయని సర్వే తెలిపింది. నేటితరం విద్యార్థులు ఎక్కువగా డాటా సైన్స్, అనలిటిక్స్ అండ్ హ్యూమానిటీస్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నది.
కాలేజీలు, కోర్సుల ఎంపికలో విద్యార్థుల ప్రాథమ్యాలు ఇలా
– ప్లేస్‌మెంట్స్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నవారు 51%
– కోర్సుల ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకొంటున్నవారు 51%
-వసతులు, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నవారు 38%
– ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నవారు 45%
-తమ ఆర్థిక పరిస్థితిని బట్టి కాలేజీలను ఎంచుకొంటన్నవారు 77%
49%మందికి లక్ష్యమే లేదు
ప్రపంచంలో 49% మంది విద్యార్థులకు ఎటువంటి లక్ష్యమూ లేదని సర్వేలో తేలింది. నేటికీ 49% మంది ఏ కాలేజీలో చేరాలి? ఏ కోర్సు చదవాలి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి కనీస సమాచారం ఉండటం లేదని, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లు తమకు అందుబాటులో లేవని తెలిపారు. అందుకే ఎటువంటి భవిష్యత్తు ప్రణాళిక లేకుండానే తమకు తోచిన సబ్జెక్టును ఎంపిక చేసుకొన్నామని పేర్కొన్నారు. కౌన్సెలర్లను నియమించుకొన్న 92% మంది తమకు వారి సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. 59% మంది విద్యార్థులు సరైన మార్గంలో నడవడానికి కౌన్సెలర్ల మార్గనిర్దేశనం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. యువతరం ఒక లక్ష్యం లేకుండా కెరీర్‌ను ఎంచుకోవడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐసీ 3 ఇన్స్టిట్యూట్ సర్వే చేసింది ఇలా..
– సర్వేకు ఎంచుకొన్న దేశాలు 75
– ఎంచుకొన్న విశ్వవిద్యాలయాలు 110
– పాల్గొన్న విద్యార్థులు 10,000
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు