స్టెమ్‌తో ఉజ్వల భవిష్యత్తు
బాలికలు నైపుణ్యం పెంచుకోవాలి: మంత్రి కేటీఆర్
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వీ-హబ్‌లో నిర్వహించిన గర్ల్స్ ఇన్ స్టెమ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 3డీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. 3డీ అంటే డిజిటైజ్, డీ కార్బనైజ్, డీసెంట్రలైజ్- ఈ మూడూ విద్యార్థులకు ఎంతో కీలకమని చెప్పారు. వీటి ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారిని వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు వీ-హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. సమావేశంలో వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.
- Tags
- Bright future
- KTR
- STEM
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






