మరో 181 పోస్టులకు నోటిఫికేషన్
# నిరుద్యోగ మహిళలకు సర్కారు శుభవార్త
# స్త్రీ, శిశు సంక్షేమశాఖలో కొత్త కొలువులు
# గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
# వచ్చే నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఈ సారి మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ములుగు అటవీ కళాశాలలో 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వారంరోజులు గడవక ముందే మరో నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో 80,039 కొలువులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నాటినుంచీ శరవేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకూ ఆర్థికశాఖ 49,455 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శనివారం టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 8 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేండ్లు, ఎన్సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్టు వివరించారు. వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్)కు వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https:// www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించారు. సందేహాలు, ఫిర్యాదులకు 040-23542 185, 040-23542187 లేదా help desk@tspsc.gov.in సంప్రదించాలని అనితారామచంద్రన్ పేర్కొన్నారు.
జోన్ల వారీగా పోస్టుల వివరాలు…
జోన్ పోస్టుల సంఖ్య
కాళేశ్వరం 26
బాసర 27
రాజన్న 29
భద్రాద్రి 26
యాదాద్రి 21
చార్మినార్ 21
జోగుళాంబ 31
మొత్తం 181
- Tags
- Grade-1 Supervisor
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?