తొలకరి జల్లులుగా పిలిచే వర్షపాతం?
3) వర్షపాతం (Rainfall)
-మొత్తం వర్షపాతంలో 5 శాతం మాత్రమే శీతాకాలంలో కురుస్తుంది.
-మధ్యధరా సముద్రం మీదుగా వీచే నైరుతి పశ్చిమ పవనాలు ప్రపంచ మధ్య పర్వత శ్రేణులగుండా ప్రవహిస్తూ కాస్పియన్, అరల్ సముద్రం, నల్ల సముద్రం, పర్షియా సింధూ శాఖలో తేమను గ్రహిస్తూ హిమాలయ పర్వత సానువుల గుండా రాజస్థాన్, జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానా, బీహార్‌లలోకి వస్తాయి. వీటిని పశ్చిమ విక్షోభాలు, పశ్చిమ అలజడులు, ఆటంకాలు (Western Disturbances) అని కూడా అంటారు.
-హిమాలయాల్లో హిమపాతానికి ఇవి కారణమవుతున్నాయి. వాయవ్య ప్రాంతంలో ఈ పశ్చిమ విక్షోభాల వల్ల వర్షం కురుస్తుంది.
– శీతాకాలంలో సంభవించే మొత్తం వర్షపాతాన్ని ‘మహవత్’ అంటారు. ఈ విక్షోభాల వల్ల సంభవించే వర్షపాతం ఉత్తర భారత్‌లో రబీకాలంలో పండే గోధుమ, బార్లీ పంటకు ఉపయోగపడుతుంది.
– ఈ విక్షోభాలు శీతాకాలంలో 4 నుంచి 6 వరకు వస్తుంటాయి. పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ వీటి పురోగమనానికి తోడ్పడుతాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో ఇవి పురోగమిస్తాయి. ఇవి వేడిగా, పొడిగా, ఇసుకతో కూడిన పవనాలు.
వేసవి కాలం (Summer Season)
1) ఉష్ణోగ్రత: మార్చి 21 నాటికి సూర్యుడు భూమధ్య రేఖ వద్ద ప్రకాశిస్తూ ఉంటాడు.
– ఏప్రిల్ నాటికి గుజరాత్, మధ్యప్రదేశ్‌లో, మే నాటికి వాయవ్య భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
-ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు 51 డిగ్రీల సెంటిగ్రేడ్. ఈ ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో గల ఫలోడి (Salt City) వద్ద 2016, మే 19న నమోదయ్యింది.
WMO (World Metrological Organisation) ప్రకారం ప్రపంచంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 56 డిగ్రీల సెంటిగ్రేడ్, ఈ ఉష్ణోగ్రత డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా (USA)లో నమోదైంది.
2) పీడనం, పవనాలు (Pressure, Winds): వాయవ్య ప్రాంతంలో అత్యల్పంగా పీడనం నమోదు కాగా, రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకు అత్యల్ప పీడనం నమోదవుతుంది.
-రుతుపవనాలను ఆకర్షించే అల్ప పీడన కేంద్రం ఇక్కడ ఏర్పడుతుంది.
-మే, జూన్ మాసంలో థార్ ఎడారి మీదుగా భారత మైదానాల్లో వీచే భయంకర స్థానిక పవనాలను లూ (Loo) అంటారు.
-వీటిని స్థానికంగా కాళీ ఆంధీ లేదా ఆంధీ (Black Storms) అంటారు. సగటున గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, దక్షిణ గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో వడదెబ్బకు కారణమవుతాయి.
-చోటానాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో బలమైన ఉష్ణ సంవహన ప్రక్రియ వల్ల ఊర్థ ప్రవాహాలు ఏర్పడుతాయి. ఈ పశ్చిమ పవనాల ప్రభావం బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందుకే వీటిని నార్వెస్టర్స్ (Norwesters) అంటారు. బెంగాల్లో కాల్బైశాఖి (In the month of Baisakhi) అంటారు. ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్యన ఏర్పడుతాయి.
3) వర్షపాతం (Rainfall): మొత్తం వార్షిక వర్షపాతంలో 10 శాతం ఈ వేసవి కాలంలో కురుస్తుంది. అదికూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పాటు వల్ల కురిసే సంవహన వర్షపాతం (Convenctional).
-ఈ సంవహన వర్షపాతాన్ని సాయంకాలపు వర్షపాతం లేదా 4 గంటల వర్షపాతం లేదా ఆరంభపు జల్లులు అని కూడా అంటారు. ఈ వర్షపాతాన్ని తొలకరి జల్లులు (Premonsoon Showers) అంటారు.
– ఈ సంవహన వర్షపాతాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు.
1) మామిడి జల్లులు (Mango Showers): ఇవి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తాయి.
-ఇవి మామిడి పండ్లు రాలకుండా ఉండటానికి, పక్వానికి (Ripening of mangoes) రావడానికి ఉపయోగపడుతాయి.
-వీటిని ఏప్రిల్ వానలు అని కూడా అంటారు.
2) చెరీ బ్లాసమ్ షవర్స్ (Coffee Showers): కేరళ, కర్ణాటక ప్రాంతంలో కురిసే తొలకరి జల్లులు. డిసెంబర్లో ప్రారంభమైన కాఫీ పంట కొంతకాలం మార్చికి ముగుస్తుంది.
– కాఫీ పుష్పాలు వికసించే దశలో కాఫీ నాణ్యతకు వానలు అవసరం.
3) తేయాకు జల్లులు (Tea Showers): అసోం రాష్ట్రంలో తేయాకు, నాణ్యతకు, ఉత్పాదకతకు ఉపయోగపడే వర్షాలు.
4) ఏరువాక జల్లులు: ఆంధ్రప్రదేశ్
5) తొలకరి వానలు (Premonsoon Showers): తెలంగాణ
– వేసవిలో అత్యధిక సగటు వర్షపాతం అసోం రాష్ట్రంలో నమోదవుతుంది (500 సెం.మీ.).
నైరుతి రుతుపవన కాలం (South West Monsoon)
1) ఉష్ణోగ్రత: మే నెలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో 3 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 6 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య, వాయవ్య ప్రాంతంలో 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మధ్య తక్కువ అవుతుంది.
– ఇక్కడ రోజువారీ అధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు నమోదవుతుంది. మేఘావృతంగా లేకపోవడం, తక్కువ వర్షపాతం వాయవ్య ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణం.- రుతుపవనాల రాకతో తగ్గిన ఉష్ణోగ్రతలు సెప్టెంబర్‌లో తిరిగి పెరగడం ప్రారంభమవుతాయి.
2) పీడనం, పవనాలు: వాయవ్యం నుంచి గంగా మైదానం మీదుగా బంగాళాఖాతం వరకు అల్పపీడనం
(Low Pressure) ఏర్పడుతుంది.
l ‘అంతర అయన రేఖ అభిసరణ’ ప్రాంతానికి చెందిన అల్పపీడనం ఇది. దీన్నే రుతుపవన ద్రోణి
(Monsoon Trough) అంటారు.
– ఈ అల్పపీడన ద్రోణి చేత ఆకర్షించబడిన ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటగానే ‘కోరియాలిస్’ ప్రభావం వల్ల ఫెరల్ సూత్రం ప్రకారం నైరుతి రుతుపవనాలుగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి. ఇవి సగటున గంటకు 30 కి.మీ.ల వేగంతో వీస్తాయి.
– ఈ అకస్మాత్తు వర్షగమనాన్ని రుతుపవన వర్షారంభం (Brust of Monsoon) అంటారు. దీనివల్ల కేరళ, తమిళనాడు, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు కురుస్తాయి.
-రుతుపవనాలు విస్తరించిన తర్వాత వర్షాల మధ్య వ్యవధి కాలం ఎక్కువగా ఉంటే రుతుపవన విరామం అంటారు.
– హిమాలయ పర్వత వాలుల గుండా రుతుపవనాలు విస్తరించడం, బంగాళాఖాతపు ఉత్తర భాగాన రుతుపవన ద్రోణి ఏర్పడటం, ఆగ్నేయాసియా పరిసర ప్రాంతంలో తీవ్రమైన తుఫానులు ఏర్పడటం దీనికి కారణం.
– పశ్చిమ తీరంలో రుతుపవనాల విరామానికి కారణం రుతుపవనాలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ప్రయాణించడం.
3) రుతుపవనాల ప్రవేశం: దక్షిణార్థ గోళంలో అయన రేఖా ప్రాంతంలో సముద్రాల మీదుగా ప్రారంభమైన ఈ పవనాలు పుష్కలంగా నీటి ఆవిరిని కలిగి ఉంటాయి.
-సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించే తేదీ జూన్ 1.
-రుతుపవన అధ్యయనం ప్రారంభించిన తర్వాత ముందుగా రుతుపవనాలు వచ్చినది 1908, మే 11న కాగా అత్యంత ఆలస్యంగా వచ్చిన తేదీ 1972, జూన్ 18.
– మొత్తం మీద రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించడానికి 45 రోజులు సమయం పడుతుంది.
– ఈ సమయంలో బంగాళాఖాతం ఉత్తరభాగాన వాయుగుండాలు ఏర్పడుతాయి. వీటిని రుతుపవన వాయుగుండాలు (Monsoon Depression) అంటారు. వీటివల్ల ఉత్తర భారతదేశంలో వర్షపాతం విరివిరిగా కురుస్తుంది.
రుతువపనాల యాంత్రికం (Mechanism of Monsoon)
– కన్యాకుమారి అగ్రంను తాకిన నైరుతి రుతువపనాలు అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాత శాఖతో పోలిస్తే ఎక్కువ బలమైనవి. కారణం అది అరేబియా సముద్ర తేమను అధికంగా గ్రహిస్తుంది.
1) అరేబియా సముద్ర శాఖ (Arabian sea Branch): ఇది జూన్ 1 నాటికి పశ్చిమ కనుమల పశ్చిమ వాలుల గుండా ప్రయాణిస్తూ పశ్చిమ తీర మైదానాలకు అధిక వర్షాన్నిస్తుంది.
– ఈ పడమటి కనుమలు తూర్పు వైపున కిందికి దిగే గాలుల ఉష్ణోగ్రతలు పెరిగి స్థిరత్వాన్ని పొంది వర్షాచ్ఛాయ ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది.
– పశ్చిమ భాగాన 250 నుంచి 400 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంటే, తూర్పు భాగాన 40 నుంచి 60 సెం.మీ.ల వర్షపాతం నమోదవుతుంది. పాల్ఘాట్ కనుమగుండా ప్రవేశించిన రుతుపవనాలు దక్కన్ పీఠభూమిలో వర్షాన్నిస్తాయి.
– 20 డిగ్రీల అక్షాంశం వరకు పురోగమించిన ఈ పవనాల్లోని ఒక భాగం సూరత్ వద్ద కుడివైపునకు మళ్లీ నర్మద, తపతి లోయల గుండా ప్రవహిస్తూ వింద్య, సాత్పూర సానువులకు వర్షాన్నిస్తుంది. అమర్కంటక్ పీఠభూమి పశ్చిమం వైపున వర్షాన్నిస్తుంది. ఆ తరువాత గంగానది లోయలోకి ప్రవేశించి బంగాళాఖాతపు శాఖతో కలిసిపోతుంది.
– ప్రధాన శాఖ మాత్రం అలాగే కచ్ ప్రాంతాన్ని దాటి ఆరావళి పర్వతాలకు సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఆరావళి పర్వతాలు ఎలాంటి అడ్డంకులను కలిగించకపోవడం వల్ల పెద్దగా వర్షం పడదు.
– ఒక్క దక్షిణ భాగాన అబూ కొండల్లో పర్వతీయ వర్షపాతం కురుస్తూ 170 సెం.మీ. వరకు నమోదై సబర్మతి నదీ ప్రవాహానికి కావాల్సిన నీటిని అందిస్తుంది.
-అలాగే పంజాబ్ మైదానాల్లోకి ప్రవేశిస్తూ బంగాళాఖాతపు శాఖను కలిసి పశ్చిమ హిమాలయాల వైపునకు పురోగమిస్తుంది.
– నైరుతి రుతుపవనాల వల్ల పశ్చిమ కనుమల్లో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాలు.
1) అగుంబె: 765 సెం.మీ., కర్ణాటక. దీనిని దక్షిణ చిరపుంజి (Cherrapunji of South India) అని అంటారు.
2) అంబోలి: 750 సెం.మీ., మహారాష్ట్ర. దీనిని క్వీన్ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా పిలుస్తారు.
3) మహాబలేశ్వరం: 560 సెం.మీ., మహారాష్ట్రలో ఉంది.
– దక్షిణాసియాలో అతిపెద్దదైన థార్ ఎడారి ఏర్పడటానికి కారణం నైరుతి రుతుపవనాలు రాజస్థాన్ పశ్చిమ భాగానికి వర్షాన్ని ఇవ్వకపోవడమే.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు