చరిత్రకు ఆధారాలు శాసనాలు.. గ్రంథాలు
శాసనాలు-వాటి ప్రాముఖ్యత
-నానాఘాట్ శాసనం: శాతవాహన చక్రవర్తి మొదటి శాతకర్ణి భార్య దేవీ నాగనిక ప్రాకృతంలో ఈ శాసనాన్ని వేయించింది. ఈ శాసనంపై మొదటి శాతకర్ణి, శ్రీముఖుని ప్రతిమలు ఉన్నాయి. అప్రతిహత చక్ర ఏకవీర, సూర, దక్షిణాపథపతి వంటి బిరుదుల మొదటి శాతకర్ణి కలిగి ఉన్నాడని అందులో పేర్కొన్నారు.
-సాంచీ స్థూప శాసనం: రెండో శాతకర్ణి సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించడంతో ఇతని ఆస్థానంలో ఉన్న వాసిష్టీపుత్ర ఆనందుడు ఈ శాసనాన్ని వేయించాడు.
-నాసిక్ శాసనం: ఈ శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో వేయించింది. ఇందులో శాతకర్ణిని ఏకబ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమనిలయ, త్రిసముద్రతోయ పీతవాహన, దక్షిణ సముద్రాధీశ్వరా మొదలైన బిరుదులతో వర్ణించింది.
-మ్యాకదోని శాసనం: శాతవాహన చివరి రాజైన మూడో పులోమావి ఈ శాసనాన్ని వేయించాడు.
-రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి శాసనాలు: ఇక్షాక రాజ్యస్థాపకుడు వాసిష్టీపుత్ర శాంతమూలుడు ప్రాకృతంలో వేయించాడు.
-అల్లూరి, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట శాసనాలు: దక్షిణాది అశోకుడిగా పేరుగాంచిన ఇక్షాక రాజు వీరపురుష దత్తుడు ప్రాకృతంలో వేయించాడు.
-ఉపాసిక బోధిశ్రీశాసనం: ఉపాసిక బోధిశ్రీ ఈ శాసనాన్ని వేయించింది. ఆమె వీరపురుషదత్తుని భాండాగారీకుడైన రేవంతుడు లేదా బోధిశర్మ కుమార్తె. ఈ శాసనంలో బౌద్ధమతం కోసం చేసిన కార్యక్రమాలను వివరించింది. ఈ శాసనం ప్రకారం బౌద్ధమత వ్యాప్తికోసం బౌద్ధ సన్యాసులను ఆమె శ్రీలంక, కశ్మీర్, టిబెట్ ప్రాంతాలకు పంపించిందని తెలుస్తున్నది.
-నాగార్జునకొండ సంస్కృత శాసనం: ఎహువల శాంతమూలుడు ఈ శాసనాన్ని వేయించాడు. ఇతని కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం మొదలైంది.
-రామతీర్థ శాసనం: విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు ఇంద్రవర్మ లేదా మహారాజేంద్రవర్మ ఈ శాసనాన్ని వేయించాడు.
-తుమ్మలగూడెం, చిక్కుళ్ల శాసనాలు: వీటి నిర్మాత విక్రమేంద్ర భట్టారక వర్మ లేదా రెండో విక్రమేంద్రవర్మ.
-పొలమూరు, ఈపూరు శాసనాలు: నాలుగో మాధవ వర్మ ఈ శాసనాలు వేయించాడు.
-కొల్లిపర శాసనం: వేములవాడ చాళుక్యరాజు మొదటి అరికేసరి వేయించాడు.
-కురవగట్టు శాసనం: మొదటి అరికేసరి సోదరుడైన బీరన్న గుహుడు ఈ శాసనాన్ని వేయించాడు.
-కుర్క్యాల శాసనం: కన్నడంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందిన పంప కవి సోదరుడైన జినవల్లభుడు ఈ శాసనాన్ని వేయించాడు. కంద పద్యాలు సంస్కృత, కన్నడ, తెలుగులో కనబడే మొదటి శాసనం ఇదే.
-పర్బని, వేములవాడ శాసనాలు: మూడో అరికేసరి ఈ శాసనాలను వేయించాడు.
-మొఘల్ చెరువు శాసనం: ముదిగొండ చాళుక్య రాజైన నాలుగో కుసుమాయుధుడు వేయించాడు.
-క్రివ్వక దానశాసనం: ఆరో కుసుమాయుధుడు ఈ శాసనాన్ని వేయించాడు.
-మాగల్లు శాసనం: వేంగీ చాళుక్యరాజు దానార్ణవుడు దీని నిర్మాత. కాకతీయుల గురించి తెలిపే తొలి శాసనం.
-శనిగర శాసనం: ఒకటో బేతరాజు మంత్రి నారాయణ చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి ఈ శాసనాన్ని వేయించాడు.
-ఖాజీపేట శాసనం: దీన్ని రెండో బేతరాజు వేయించాడు. దీనిప్రకారం ఆయన గొప్ప యుద్ధవీరుడు.
-అనుమకొండ శాసనం: కాకతీయ రుద్రదేవుడు తన స్వతంత్రానికి గుర్తుగా అనుమకొండలో రుద్రేశ్వర ఆలయం లేదా వేయి స్తంభాల గుడిని నిర్మించి ఈ శాసనాన్ని వేయించాడు. దీన్ని అచితేంద్రుడు లిఖించాడు.
-గణపవరం శాసనం: దీన్ని కూడా కాకతీ రుద్రదేవుడు వేయించాడు. అనుమకొండ, గణపవర శాసనాల్లో తన తండ్రి రెండో ప్రోలరాజు విజయాలను వివరించాడు.
-మోటుపల్లి అభయ శాసనం: గణపతి దేవుడు మోటుపల్లిని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిచేసి వర్తకుల రక్షణ కోసం నియమ నిబంధనలతో ఈ శాసనాన్ని వేయించాడు. మోటుపల్లిలో ఈ శాసన నియమాలు అమలు చేయడానికి సిద్ధయ దేవుని అధికారిగా నియమించాడు.
-మల్కాపురం శాసనం: రాణీ రుద్రమదేవి ఈ శాసనం వేయించింది. ఇందులో శైవ గోళకీ మఠాల గురించి వివరించింది. ప్రసూతి వైద్యశాలల గురించి ఇది తెలుపుతుంది.
-బీదర్ కోట శాసనం: యాదవ రాజు మహాదేవునిపై విజయానికి గుర్తుగా రుద్రమదేవి ఈ శాసనాన్ని వేయించింది.
-చందుపట్ల శాసనం: కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని ఈ శాసనం తెలుపుతుంది.
-కలువబేరుశాసనం: రెడ్డిరాణి అనతల్లి ఈ శాసనం వేయించింది. కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానుల దాడులను ఇది వివరిస్తుంది.
-విలాస తామ్ర శాసనం: ముసునూరి ప్రోలయనాయకుడు దీన్ని వేయించాడు. కాకతీయ రెండో ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు, రెండో ప్రతాపరుద్రుని మరణం గురించి ఈ శాసనం తెలుపుతుంది.
గ్రంథాలు-రచయితలు (శాతవాహనుల నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు)
-కాతంత్ర వ్యాకరణం: దీని రచయిత శర్వవర్మ. తన రాజు కుంతల శాతకర్ణి ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకోవడానికి ఈ పుస్తకాన్ని రచించాడు.
-బృహత్కథ: ఈ గ్రంథాన్ని గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించాడు. విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించడానికి ఇది ఆధారమైంది.
-లీలావతి పరిణయం: కుతూహాలుడు దీన్ని రచించాడు. హాలుడు, సింహళ రాకుమార్తె లీలావతి వివాహం ఆధారంగా ఈ గ్రంథాన్ని రచించారు.
-కామసూత్ర: దీన్ని వాత్సాయనుడు రాశాడు. ఇది ఒక శృంగార గ్రంథం. ఇందులో శాతవాహనుల కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు.
-కథాసరిత్సాగరం: దీని రచయిత సోమదేవుడు. బృహత్కథ ఆధారంగా దీన్ని రాశారు. శాతవాహనుల కాలం నాటి పాలనా విశేషాలు, ప్రజల స్థితిగతులు ఇందులో తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించాడు.
-బృహత్కథా మంజరి: క్షేమేంద్రుడు దీన్ని రచించాడు.
-కువలయమాల: దీని రచయిత ఉద్యోదనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జనకు నాగార్జున కొండ విశ్వవిద్యాలయానికి వచ్చేవారు.
-ఆదిపురాణం, విక్రమార్జున విజయం: కన్నడ సాహిత్యంలో ఆదికవిగా పరిగణించే పంపకవి వీటిని రచించాడు.
-కవిజనాశ్రయం: ఇది ఛందో గ్రంథం. మల్లియ రేచన దీన్ని రచించాడు. ఇది తెలుగులో మొదటి లక్షణ గ్రంథం.
-యశస్థిలక చంపూకావ్యం, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, సన్నావారి ప్రకరణ, యశోధర మహారాజు చరిత్ర- సోమదేవసూరి.
-నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీశతకం: బద్దెన
-బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర: ఈ గ్రంథాల రచయిత పాల్కురికి సోమనాధుడు. ఇవి కాకతీయుల కాలంనాటి మత స్థితిగతులను, శైవమత ఉజ్వల దశను తెలుపుతాయి.
-శివయోగసారం: కొలను గణపతిదేవుడు దీన్ని రాశాడు. ఇది ఇందులూరి నాయకుల చరిత్రను తెలుపుతుంది.
-క్రీడాభిరామం: దీని రచయిత వినుకొండ వల్లభరాయుడు. కాకతీయుల కాలంనాటి ప్రజల జీవన పరస్థితిని తెలుపుతుంది.
-నీతిసారం: ఇది కాకతీయ రాజ్య నిర్వహణ వివరాలను తెలుపుతుంది. దీన్ని కాకతి రుద్రదేవుడు రచించాడు.
-ప్రతాపరుద్ర యశోభూషణ: కాకతీయుల కాలంనాటి కేంద్ర ప్రభుత్వ స్వభావం, సైనిక వ్యవస్థ గురించి తెలుపుతూ విద్యానాథుడు దీన్ని రచించాడు.
-నృత్యరత్నావళి: కాకతీయ గణపతి దేవుని గజసాహిణి జాయప సేనాని రాశాడు. ఇది నాటి నృత్యరీతులను తెలుపుతుంది.
-ప్రజ్ఞా పారమిత శాస్త్రం, మాధ్యమిక కారిక, సుహృల్లేఖ, శూన్యసప్తశతి, ద్వాదశ నికాయం, రసరత్నాకరం, రసరంజని, దశభూమి, ఆరోగ్యమంజరి మొదలైన గ్రంథాలను ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు.
-ఆంధ్రమహాభారతం, నిర్వచనోత్తర రామాయణం- తిక్కన సోమయాజి.
-ప్రతాప చరిత్ర- ఏకామ్రనాథుడు
-సిద్దేశ్వర చరిత్ర- కాసే సర్వప్ప
-రంగనాథ రామాయణం- గోన బుద్ధారెడ్డి
-భాస్కర రామాయణం- భాస్కరాచార్యుడు (తెలుగులో మొదటి చంపు గ్రంథం)
-మార్కండేయ పురాణం- మారన
-సకల నీతిసారం- మడికి సింగనాచార్యులు
-పురుషార్థసారం- శివదేవయ్య
-ప్రేమాభిరామం- త్రిపురాంతకుడు
-శివతత్వసారం, శ్రీగిరి శతకం- మల్లికార్జున పండితుడు
-పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, రుద్రభాషణం- పాల్కురికి సోమనాథుడు
-దశకుమార చరిత్ర- దండి
-కేయూరబాహు చరిత్ర- మంచన
-కుమార సంభవం- నన్నెచోడుడు
-దాశరథీ శతకం, రామదాసు కీర్తనలు- భక్తరామదాసు
-మువ్వ గోపాల పదాలు- క్షేత్రయ్య
-యయాతి చరిత్ర- పొన్నెగంటి తెలగనార్యుడు (సర్దార్ అమీన్ఖాన్కు అంకితమిచ్చాడు)
-తపతీ సంవరణోపాఖ్యానం- అద్దంకి గంగాధర కవి. (ఇబ్రహీం కుతుబ్షాకి అంకితమిచ్చాడు)
-రాజనీతి రత్నాకరం- కృష్ణయామాత్యుడు
-దశర్థ రాజనందన చరిత్ర – మరిగంటి సింగరాచార్యుడు
-సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం- కందుకూరి రుద్రకవి
-వజ్రాభ్యుదయం- వెల్లుట్ల నారాయణ కవి
-వైజయంతి విలాసం- సారంగతమ్మయ్య
-కులియత్ అలీ- ఇది కల్పితాల పుస్తకం. మహ్మద్ కులీ కుతుబ్షా రచించాడు.
-తోతానామా: దీన్ని గవాసి రచించాడు. శుకస్తపతి అనే తెలుగు కావ్యానికి ఇది ఉర్దూ అనువాదం.
-నేచురల్ హిస్టరీ: దీన్ని ప్లీనీ రచించాడు. తూర్పు దేశాల చరిత్ర, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితులను ఇది తెలుపుతుంది.
-పూల్బన్- ఇబ్నే నిషాతి
* బయ్యారం చెరువు శాసనం: కాకతీయ గణపతి దేవుని సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది. ఇందులో కాకతీయుల వంశవృక్షం గురించి వివరించారు. దీనిప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతడు దుర్జయ వంశానికి చెందినవాడు.
* గాథాసప్తశతి: దీన్ని శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలనం చేశాడు. ఇందులో ఏడు వందల పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి. ఈ గ్రంథంలో సుమారు 40కిపైగా తెలుగు పదాలు ఉన్నాయి. (అందం, అత్త, పొట్ట, అద్దం, పిల్లి మొదలైనవి). అనులక్ష్మి, అనువలబ్ద, రేవ, మాధవి వంటి మహిళా కవులు ఈ సంకలనానికి సహాయపడ్డారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు