ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి?
ఆసియాలో ముఖ్యమైన భూస్వరూపాలు
మైదానాలు
-సమతలమైన భూభాగం ఉండి అక్కడక్కడ కొంచెం ఎత్తుగా ఉండేవి మైదానాలు.
-సైబీరియా మైదానం: ఇది రష్యాలో ఉన్నది. యూరాల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్నది.
-చైనా మైదానం: చైనాలోని హొయాంగ్‌హో, యాంగ్ట్సికియాంగ్, సికియాంగ్ నదుల మధ్య ఉన్నది.
-మెసపటోమియా మైదానం: ఇది ఇరాక్‌లోని టైగ్రిస్, యూప్రటిస్ నదుల మధ్య ఉన్నది.
-ఐరావతి మైదానం: ఇది మయన్మార్‌లో ఉన్నది.
-గంగా-సింధు మైదానం: ఇది భారతదేశంలో ఉన్నది. ఇది ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడిన మైదానం.
-మెకాంగ్ నదీ మైదానం: ఇది ఆగ్నేయాసియాలో ఉన్నది.
-తురానియన్ మైదానం: ఇది కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో ఆముదార్య, సిరిదార్య నదుల మధ్య ఉన్నది.
పీఠభూములు
-కొంచెం ఏటవాలుగా ఉండి ఉపరితలం విశాలంగా ఉండే భూభాగాన్ని పీఠభూమి అంటారు.
ఆసియా ఖండంలో అనేక పీఠభూములు ఉన్నాయి. అవి..
-టిబెట్ పీఠభూమి: ప్రపంచంలోనే ఎత్తయిన, అతి పెద్ద పీఠభూమి అయిన ఇది టిబెట్‌లో ఉన్నది. దీన్ని ప్రపంచ పైకప్పు (Roof of world) అని పిలుస్తారు. ఇది కైలాసనాథ-కున్లున్ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నది.
-దక్కన్ పీఠభూమి: ఇది భారతదేశంలో ఉన్నది. ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా ఉన్నది. నర్మదానదికి దక్షిణా భాగాన విస్తరించి ఉన్న ఈ పీఠభూమి దేశంలో అతిపెద్దది.
-మెసపటోమియా పీఠభూమి: ఇది ఇరాక్‌లోని యుప్రటిస్-టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది.
-ఇరానియన్ పీఠభూమి: ఇది ఇరాన్‌లోని జాగ్రోస్-ఎల్‌బ్రజ్ పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-యునాన్ పీఠభూమి: ఇది టిబెట్ పీఠభూమికి ఈశాన్యభాగంలో ఉన్నది.
-తక్లమకాన్ ఎడారి పీఠభూమి: ఇది చైనాలోని టియన్షాన్-కున్లున్ పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-ట్రైకాన్ పీఠభూమి: ఇది చైనాలోని టియాన్షాన్-కింగన్ పర్వతాల మధ్య విస్తరించి ఉన్నది.
-షాన్ పీఠభూమి: ఇది మయన్మార్‌లోని పెగుయెమా-అరకాన్ యెమా పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-టియాన్ షాన్ పీఠభూమి: ఇది టిబెట్‌లోని కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది పర్వతాంతర పీఠభూమి.
-కాబ్టో పీఠభూమి: ఇది మంగోలియాలో ఉన్నది.
-అనటోలియా పీఠభూమి: ఇది టర్కీలో ఉన్నది. దీన్ని ఆసియా మైనర్ పీఠభూమి అంటారు.
-ఆర్మేనియా పీఠభూమి: ఆర్మేనియాలోని కాస్పియన్, నల్ల సముద్రాల మధ్య ఉన్నది.
భారత్‌లో పీఠభూములు
-మాల్వా పీఠభూమి: ఇది మధ్యప్రదేశ్‌లో ఉన్నది. నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. కానీ వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు.
-బుందేల్‌ఖండ్ పీఠభూమి: ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉన్నది. ఇందులో పన్నా అనే ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి.
-బాందర్ పీఠభూమి: ఇది మధ్యప్రదేశ్‌లో ఉన్నది.
-కథియవార్ పీఠభూమి: ఇది గుజరాత్లో ఉన్నది.
-గిర్ పీఠభూమి: గుజరాత్లో ఉన్న ఈ పీఠభూమిలో ఎత్తయిన శిఖరం గిర్నార్ (1117 మీ.). ఇది గిర్ అడవుల్లో భాగంగా ఉండి ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందింది.
-హజారీబాగ్ పీఠభూమి: ఇది జార్ఖండ్‌లో ఉంది. ఇందులో ఎత్తయిన శిఖరం పరూష్నాథ్ (1100 మీ.)
-రాంచి పీఠభూమి: ఇది జార్ఖండ్‌లో ఉన్నది.
-చోటా నాగపూర్ పీఠభూమి: ఇది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో విస్తరించి ఉంది. దీన్ని భారతదేశపు పైకప్పు అని, భారదేశపు ఖనిజాల గిన్నే, రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. (రూర్ అనేది జర్మనీలో అధికంగా ఖనిజాలు లభించే ప్రాంతం. కాబట్టి దీన్ని రూర్తో పోల్చారు)
-రాజమహల్ పీఠభూమి: ఇది జార్ఖండ్‌లో ఉన్నది.
-బస్తర్ పీఠభూమి: ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.
-కర్ణాటక పీఠభూమి: ఇది దక్షిణభారతదేశంలో ఎత్తయిన పీఠభూమి. దీన్ని దక్షిణ భారతదేశ పైకప్పు అని పిలుస్తారు.
-తెలంగాణ పీఠభూమి: ఇది తెలంగాణలో ఉన్నది.
-షిల్లాంగ్ పీఠభూమి: ఇది మేఘాలయాలో ఉన్నది. చోటా నాగపూర్‌కి తూర్పున్న ఉన్నది. ఈ పీఠభూమి కాలానుగుణంగా ఈశాన్య భారతదేశం వైపు జరగడం వల్ల దీన్ని ద్వీపకల్ప భారత ఔట్పోస్ట్గా వర్ణిస్తారు.
పర్వతాలు
-చాలా ఎక్కువ వాలును కలిగి ఉపరితలం ఎత్తయిన శిఖరాలను కలిగి ఉండేవి పర్వతాలు. ఇవి ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 20 శాతం ఆక్రమించాయి. ఆసియాలోని ప్రముఖ పర్వతాలు..
-మౌంట్ ఎవరెస్ట్: ఇది నేపాల్‌లో ఉన్నది. ఇది హిమాలయాల్లో ఎత్తయిన శిఖరం (8848/8850 మీ.).
నేపాల్‌లోని పర్వతాలు: మకాలు, ధవళగిరి, మనస్లూ, చోఓయ్, అన్నపూర్ణ-కే2 శిఖరం (గాడ్విన్ ఆస్టిన్): ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్, భారత్‌లో ఉన్నది. ఇది ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం. 8611 మీ. ఎత్తున్న ఈ శిఖరం హిమాలయాల్లో రెండో ఎత్తయినది కాగా భారత్‌లో ఎత్తయిన శిఖరం.
-కాంచనగంగ: ఇది సిక్కింలో ఉన్నది. దేశంలో రెండో ఎత్తయిన శిఖరం (8598 మీ.).
-లొటెత్సా: ఇది టిబెట్‌లో ఉన్నది.
-నంగ పర్వత్: ఇది జమ్ముకశ్మీర్‌లో ఉన్నది.
-నందాదేవి, కామెట్: ఇది ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
-నామ్చాబర్వా: ఇవి అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
-టియాన్షాన్- చైనా
-కార్డమమ్- కంబోడియా
-అల్టామ్, యాబ్లోనోలి- రష్యా
-జాగ్రోస్, ఎల్బర్గ్- ఇరాన్
-ఆఖ్దార్- ఒమన్
నదులు
-చాంగ్జియాంగ్ నది: ఇది చైనాలోని కున్లున్ షాన్ వద్ద జన్మిస్తుంది. చైనాలో ప్రవహించి తూర్పు చైనా సముద్రంలో కలుస్తుంది.
-ఓబ్ నది: ఇది రష్యాలోని ఆల్టాయ్ వద్ద జన్మిస్తుంది. చైనా, రష్యాల్లో ప్రవహించి గల్ఫ్ ఆఫ్ ఓబ్ (రష్యా) వద్ద సముద్రంలో కలుస్తుంది.
-అమూర్ నది: ఇది కాన్కా సరస్సులో జన్మిస్తుంది. చైనా, మంగోలియా, రష్యా గుండా ప్రవహించి ఓఖోట్స్ (టార్ టార్ జలసంధి వద్ద) సముద్రంలో కలస్తుంది.
-మెకాంగ్ నది: ఇది టిబెట్ పీఠభూమి (చైనా)లో జన్మిస్తుంది. చైనా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం (ప్రధాన ప్రవాహ దేశం), కాంబోడియా గుండ ప్రవహించి హొచి వద్ద దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది.
-యాంగ్ట్సికియాంగ్ నది: దీన్ని బ్లూ రివర్ అని పిలుస్తారు. ఆసియా ఖండంలో అతి పొడవైన నది అయిన ఇది టిబెట్ పీఠభూమిలో (చైనా) జన్మిస్తుంది. చైనాలో ప్రవహించి హాంకాంగ్ వద్ద తూర్పు చైనా సముద్రంలో కలుస్తుంది.
-హొయాంగ్ హో నది: దీన్ని చైనా దుఃఖ దాయిని అని పిలుస్తారు. టిబెట్ పీఠభూమిలో (చైనా) జన్మిస్తుంది. చైనాలో ప్రవహించి పసుపు సముద్రంలో కలుస్తుంది.
-ఐరావతి నది: దీన్ని మయన్మార్ జీవనది అంటారు. ఉత్తర మయన్మార్‌లో జన్మిస్తుంది. చైనా గుండా ప్రవహించి అండమాన్ సముద్రంలో కలుస్తుంది.
-సాల్విన్ నది: టిబెట్, చైనా సరిహద్దులో జన్మిస్తుంది. చైనా, థాయ్‌లాండ్, మయన్మార్‌లలో ప్రవహించి అండమాన్ సముద్రంలో కలుస్తుంది.
-టారిమ్ నది: టిబెట్‌లోని పామీర్ పీఠభూమిలో జన్మిస్తుంది. టిబెట్, చైనా, తజకిస్థాన్‌లలో ప్రవహిస్తుంది. Lopnur వద్ద సముద్రంలో కలుస్తుంది.
-టైగ్రిస్-యుప్రటిస్ నదులు: దక్షిణ టర్కీలో జన్మించే ఈ నది టర్కీ, సిరియా, ఇరాక్లలో ప్రవహిస్తుంది. పర్షియన్ సింధుశాఖలోని షట్-ఆల్-అరబ్ వద్ద సముద్రంలో కలుస్తాయి.
-అముదార్య-సిరిదార్య నదులు: హిమాలయాల్లోని కారకొరమ్ పర్వత శ్రేణిలో (టిబెట్) ఈ నదులు జన్మిస్తాయి. తజకిస్థాన్, ఉజ్బెకిస్ణాన్, కజకిస్థాన్‌లలో ప్రవహిస్తాయి. సిరిదార్య నది కజకిస్ణాన్ నుంచి (ఉత్తర దిశ నుంచి), ఆముదార్య నది ఉజ్బెకిస్థాన్ నుంచి (దక్షిణ దిశ నుంచి) అరల్ సముద్రంలో కలుస్తాయి.
-లీనానది: ఇది రష్యాలోని బైకాల్ సరస్సులో జన్మిస్తుంది. రష్యాలో ప్రవహించి టిక్సి వద్ద లెప్టె సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఏడాదంతా దాదాపు ఘనీభవనస్థితిలో ఉంటుంది.
-యెనిసె నది: మంగోలియాలోని స్టానొవో పర్వతాల్లో జన్మిస్తుంది. మంగోలియా, రష్యాల్లో ప్రవహించి కారా సముద్రంలో (రష్యాకు ఉత్తరాన) కలుస్తుంది.
-వోల్గా నది: రష్యాలోని వాల్దాయ్ కొండల్లో జన్మిస్తుంది. రష్యాలో ప్రవహించి ఆస్టార్ కాన్ వద్ద కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది.
-యూరల్ నది: రష్యాలోని యూరల్ పర్వతాల్లో పుట్టి, రష్యా, కజకిస్థాన్‌లలో ప్రవహిస్తుంది. కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది.
-డెనిఫర్ నది: రష్యా పర్వత శ్రేణిలో జన్మిస్తుంది. రష్యా, బెలారస్, ఉక్రెయిన్లలో ప్రవహించి నల్ల సముద్రంలో కలుస్తుంది.
-బహ్మ్రపుత్ర నది: భారతదేశంలో అత్యధిక నీటి పరిమాణంతో ప్రహించే ఈ నది.. టిబెట్‌లోని కైలాసనాథ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద గల షిమ్యమ్ డగ్ వద్ద జన్మిస్తుంది. టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహించి డాఖిన్షాబాజ్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-సింధు నది: టిబెట్‌లోని కైలాసనాథ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద గల గుర్తాంగ్ చూ హిమానీనదంలో ఈ నది జన్మిస్తుంది. టిబెట్, భారత్, పాకిస్థాన్లలో ప్రవహిస్తుంది. కచ్ సింధు శాఖలోని బుంజి అగాథదరిని ఏర్పరుస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో కెల్లా పొడవైనది.
భారత్‌లో ముఖ్యమైన నదులు
-హిమాలయ లేదా యవ్వన లేదా తరుణ నదులు
-గంగానది: అలకనంద-భాగీరథి అనే రెండు నదులు దేవ ప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడుతాయి. ఇది భారతదేశంలో అతిపొడవైన నది. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి డాఖిన్‌షా బాజ్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-గోదావరి నది: మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబక్ వద్ద బిల సరస్సులో ఈ నది జన్మిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలలో ప్రవహిస్తుంది. ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దేశంలో రెండో పొడవైన, దక్షిణ భారతంలో అతి పొడవైన నది.
-కృష్ణా నది: పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద గల జోర్గ్రామంలో జన్మిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తుంది. ఏపీలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలస్తుంది. ఇది దేశంలో మూడో పొడవైన నది.
-మహానది: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో సిహావా వద్ద జన్మిస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ప్రంహించి నారాజ్ (కటక్) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు