కణంలో కొవ్వుల తయారీలో పాల్గొనే కణాంగం?
కణం – కణాంగాలు – కణజాలాలు
1. కణానికి సంబంధించి సరికానిది.
ఎ. సజీవ కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్.
బి. కణాన్ని మొదట ఒక చెట్టు బెరడులో కనుగొన్నారు.
సి. కణం అంటే లాటిన్ భాషలో పెద్ద గది అని అర్థం.
డి. కణం గురించిన అధ్యయనాన్ని హిస్టాలజీ అంటారు.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
2. అమ్ని – సెల్యులా – డే – సెల్యూలే కి సరైనది.
ఎ. కణాలు పూర్వ కణాల నుంచి ఉద్భవిస్తాయి.
బి. కణ విభజనకు సంబంధించినది.
సి. కనుగొన్నది ష్లెడెన్ అండ్ ష్వాన్.
డి. రుడాల్ఫ్ విర్చోవ్.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
3. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఎ. అతిపెద్ద కణం – ఆస్ట్రిచ్ అండం
బి. అతిచిన్న కణం – శుక్ర కణం
సి. అతిపొడవైన కణం – కండర కణం
డి. అకణ జీవి – వైరస్
1) ఎ, బి 2) బి, సి 3) డి 4) సి
4. కింది వాటిని జతపర్చండి.
1. కణం ఎ. కార్డియాలజీ
2. కణజాలం బి. సైటాలజీ
3. కేంద్రకం సి. ఆంకాలజీ
4. క్యాన్సర్ డి. హిస్టాలజీ
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
5. కింది వాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.
నిశ్చితం (A): కణాన్ని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అంటారు.
కారణం (R): ప్రతి సజీవి కణం చేత నిర్మితమై ఉంటుంది.
1) Aకు R సరైన కారణం కాదు
2) Aకు R సరైన కారణం
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం R సత్యం
6. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి.
వాక్యం (A): కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ష్లెడెన్, ష్వాన్
వాక్యం (B): కణ విభజనను కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్
1) A, B రెండూ సత్యం
2) A, B రెండూ అసత్యం
3) A సత్యం, B అసత్యం
4) A అసత్యం, B సత్యం
7. కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): బ్యాక్టీరియా కేంద్రకపూర్వ జీవి.
కారణం (R): కేంద్రక త్వచం లోపించడంతో కేంద్రకం అస్పష్టంగా ఉంటుంది.
1) A కు R సరైన కారణం
2) A కు R సరైన కారణం కాదు
3) A సత్యం R అసత్యం
4) A అసత్యం R సత్యం
8. కింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
1) బ్యాక్టీరియా 2) నాస్టాక్
3) అమీబా 4) అసిల్లటోరియా
9. ప్లాస్మిడ్కు సంబంధించి సరికానిది ఏది?
ఎ. బ్యాక్టీరియాలో అదనపు జన్యు పదార్థం
బి. జీవ సాంకేతిక శాస్త్రంలో ఉపయోగిస్తారు
సి. ఈస్ట్ కణంలో కూడా ఉంటుంది
డి. క్రోమోజోమ్‌లలో ఉంటుంది
1) ఎ, బి 2) సి, డి
3) బి, సి 4) ఎ, డి
10. ఒక విద్యార్థి కణాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తున్నప్పుడు అతనికి కణం లోపల కేంద్రకం అస్పష్టంగా కనిపించింది అని సూచించాడు. అయిన అది ఏ కణం?
1) అకణం 2) బకణం
3) నిజకేంద్రక కణం
4) కేంద్రకపూర్వ కణం
11. కింది వాటిలో ఏక కణ జీవిని గుర్తించండి.
ఎ. ఈస్ట్ బి. అమీబా
సి. యూగ్లీనా డి. ప్లాస్మోడియం
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) ఎ, సి
12. కేంద్రకపూర్వ కణానికి సంబంధించి సరికానిది ఏది?
ఎ. కేంద్రకం స్పష్టంగా ఉంటుంది.
బి. కేంద్రక త్వచం ఉండదు.
సి. జన్యుపదార్థం నగ్నంగా ఉంటుంది.
డి. 80S రకానికి చెందిన రైబోజోమ్‌లు ఉంటాయి.
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) ఎ, సి
13. కింది వాటిలో కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉండే కణాంగాలు ఏవి?
ఎ. ప్లాస్టిడ్లు బి. కణకవచం
సి. రిక్తిక డి. సెంట్రియోల్లు
1) డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
14. కింది వాటిని జతపర్చండి.
1. కణ మేధస్సు ఎ. రైబోజోమ్‌లు
2. కణం వంటగది బి. రిక్తిక
3. ప్రొటీన్ కర్మాగారం సి. కేంద్రకం
4. కణ భాండాగారం డి. హరితరేణువు
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
15. సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): కేంద్రకాన్ని కణం మెదడు అంటారు.
కారణం (R): కణంలో అన్ని చర్యలు
కేంద్రకం ఆధీనంలో ఉంటాయి.
1) A కు R సరైన కారణం కాదు
2) A కు R సరైన కారణం
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
16. సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): రిక్తికను కణ శక్తి భాండాగారం అంటారు.
కారణం (R): కణంలో విడుదలయ్యే
వ్యర్థాలు రిక్తికలో నిల్వ అవుతాయి.
1) A కు R సరైన కారణం కాదు
2) A కు R సరైన కారణం
3) A అసత్యం, R సత్యం
4) A సత్యం, R అసత్యం
17. హరితరేణువుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. కణంలో కణం అంటారు.
బి. కణంలో వంటగది.
సి. స్వయం పత్రహరితంగల కణం
డి. శ్వాసక్రియ జరుగుతుంది.
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
18. కింది ఏ కణాంగాల్లో DNA ఉంటుంది?
ఎ. కేంద్రకం బి. హరితరేణువు
సి. మైటోకాండ్రియా డి. లైసోజోమ్‌లు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
19. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కణంలో రెండు త్వచాలు కలిగిన కణాంగాల గురించి వివరించాలనుకున్నాడు. అయిన అతను కింది వాటిలో ఏ కణాంగాలను వివరించవచ్చు.
ఎ. రైబోజోమ్‌లు బి. లైసోజోమ్‌లు
సి. మైటోకాండ్రియా డి. కేంద్రకం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) బి, సి, డి
20. మైటోకాండ్రియాకు సంబంధించి సరైన వాక్యం?
1) కణ శ్వాసక్రియ జరుగుతుంది
2) కణ భాండాగారం
3) కేవలం జంతుకణంలో మాత్రమే ఉంటుంది
4) ఆవరించి ఒకే త్వచం ఉంటుంది
21. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.
వాక్యం (A): మైటోకాండ్రియాలో ATP రూపంలో శక్తి ఉత్పత్తి అవుతుంది.
వాక్యం (B): మైటోకాండ్రియాలో DNA ఉండదు. కాబట్టి స్వయం ప్రతిపత్తి కాదు.
1) A అసత్యం, B అసత్యం
2) A సత్యం, B అసత్యం
3) A సత్యం, B సత్యం
4) A అసత్యం, B సత్యం
22. కింది వాటిని జతపర్చండి.
1. బెండా ఎ. అంతర్జీవ ద్రవ్యజాలం
2. పోర్టర్ బి. హరితరేణువు
3. పెలాడే సి. రైబోజోమ్
4. సాక్స్ డి. మైటోకాండ్రియా
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
23. కణం అంతా వలవలె విస్తరించి ఉండి, కణ అస్థిపంజరంగా పిలువబడే కణాంగం ఏది?
1) గాల్జీ సంక్లిష్టం
2) రైబోజోమ్‌లు
3) అంతర్జీవ ద్రవ్యజాలం 4) లైసోజోమ్‌లు
24. కింది వాటిలో లైసోజోమ్లకు సంబంధించి సరైనది ఏది?
ఎ. కనుగొన్నది డిడువే
బి. కణం ఆత్మహత్య కోశాలు
సి. జలవిశ్లేషక ఎంజైమ్‌లు ఉంటాయి
డి. ఒకే త్వచం కలిగిన నిర్మాణాలు
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
25. కణంలో కొవ్వుల తయారీలో పాల్గొనే కణాంగం?
1) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
2) లైసోజోమ్స్
3) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం
4) కేంద్రకం
26. రిక్తికకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. మొక్కల ప్రధాన లక్షణం
బి. ఆవరించి టోనోప్లాస్ట్ అనే పొర కలదు
సి. ఆంథోసయనిన్ వర్ణద్రవ్యం నిలువ ఉంటుంది
డి. కణశక్తి భాండాగారం
1) బి, సి, డి 2) ఎ, సి, డి
3) బి, డి 4) ఎ, బి, సి
27. మానవ కణంలో క్రోమోజోమ్‌ల సంఖ్య?
ఎ. 46 క్రోమోజోమ్‌లు
బి. 46 జతల క్రోమోజోమ్‌లు
సి. 23 క్రోమోజోమ్‌లు
డి. 23 జతల క్రోమోజోమ్‌లు
1) ఎ, సి 2) ఎ, డి
3) బి, సి 4) బి, డి
28. కింది వాటిలో స్రావక కణాంగం ఏది?
1) లైసోజోమ్స్ 2) కేంద్రకం
3) గాల్జీ నిర్మాణాలు 4) రిక్తిక
29. కేంద్రకంలో ఉండే కేంద్రకామ్లాలు ఏవి?
ఎ. ప్రొటీన్స్ బి. రైబోజోమ్స్
సి. DNA డి. RNA
1) సి, డి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, డి
30. కింది వాటిలో DNA కు సంబంధించి సరికానిది ఏది?
1) DNA నిర్మాణం ద్వికుండలి
2) DNA ఒక జన్యు పదార్థం
3) DNA నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ & క్రిక్
4) వైరస్లలో DNA ఉండదు
31. కింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
1) ఎడిపోజ్ 2) దారువు
3) సంధిబంధనం 4) లిగమెంట్
32. కింది మొక్కల్లో లోపించిన కణజాలం?
ఎ. ఉపకళా కణజాలం బి. అస్థి
సి. మృదులాస్థి డి. విభాజ్య
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
33. కింది వాటిని జతపర్చండి.
1. విభాజ్య కణజాలం ఎ. యాంత్రిక శక్తి
2. పోషక కణజాలం బి. పెరుగుదల
3. మృదు కణజాలం సి. ఆహార సరఫరా
4. స్థూలకోణ కణజాలం డి. ఆహారం నిల్వ
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
34. కింది వాటిలో దారు మూలకం కానిది ఏది?
ఎ. చాలనీ కణాలు బి. చాలనీ నాళాలు
సి. సహకణాలు డి. దారు నాళాలు
1) బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
35. నాళికా పుంజాలు వేటి కలయిక ఫలితంగా ఏర్పడుతాయి?
1) మృదు, దృఢ కణజాలం
2) మృదు, స్థూలకోణ కణజాలం
3) మృదు, విభాజ్య కణజాలం
4) దారువు, పోషక కణజాలం
36. కింది వాటిలో సరికానిది ఏది?
1) సంధిబంధనం – ఎముక కండరంతో కలిసేచోట ఉంటుంది
2) స్నాయుబంధనం – ఎముక మరొక ఎముకతో కలిసేచోట ఉంటుంది
3) ఎడిపోజ్ – కొవ్వులను నిల్వ చేసేది
4) 1, 2
37. కింది వాటిలో సరైన క్రమం ఏది?
1) ప్రొటీన్స్ – డీఎన్ఏ – ఆర్ఎన్ఏ
2) ఆర్ఎన్ఏ – డీఎన్ఏ – ప్రొటీన్స్
3) డీఎన్ఏ – ప్రొటీన్స్ – ఆర్ఎన్ఏ
4) డిఎన్ఏ – ఆర్ఎన్ఏ – ప్రొటీన్స్
38. కింది వాటిలో బయటి నుంచి లోపలికి సరైన క్రమం?
1) కణత్వచం – కణకవచం – కేంద్రక త్వచం – కణద్రవ్యం
2) కణకవచం – కణత్వచం – కణద్రవ్యం – కేంద్రక త్వచం
3) కణకవచం – కణద్రవ్యం – కణత్వచం – కేంద్రక త్వచం
4) కణద్రవ్యం – కణత్వచం – కణకవచం – కేంద్రక త్వచం
39. ఉపాధ్యాయుడు ఒక బొమ్మను బోర్డుపై గీసి, దాని గురించి విద్యార్థులకు వివరిస్తూ ఇది కేంద్రకపూర్వ జీవులలో లోపించి ఉంటుంది అని చెప్పాడు. అయిన అతను దేని గురించి వివరించాడు?
1) మైటోకాండ్రియా 2) రైబోజోమ్‌లు
3) కణత్వచం 4) కణద్రవ్యం
40. కింది వాటిని జతపర్చండి.
1. పైకో ఎరిథ్రిన్ ఎ. నీలి ఆకుపచ్చ శైవలాలు
2. పైకో సయనిన్ బి. గోధుమ శైవలాలు
3. ఫ్యూకోజాంథిన్ సి. పక్వ టామాటాలు
4. లైకోపీన్ డి. ఎరుపు శైవలాలు
1) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2) 2-ఎ, 2-బి, 2-సి, 3-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సమాధానాలు
1-3 2-4 3-4 4-1 5-2 6-3 7-1 8-3 9-2 10-4 11-2 12-3 13-3 14-1 15-2 16-3 17-4 18-1 19-3 20-1 21-2 22-2 23-3 24-4 25-3 26-4 27-2 28-3 29-1 30-4 31-2 32-3 33-2 34-3 35-4 36-4 37-4 38-2 39-1 40-4
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు