– 2వ సమావేశం 1947 జనవరి 20 నుంచి 26 వరకు
– 3వ సమావేశం 1947 ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు
– 4వ సమావేశం 1947 జూలై 14 నుంచి 31 వరకు
– 5వ సమావేశం 1947 ఆగస్ట్ 14 నుంచి 15 వరకు
– 6వ సమావేశం 1948 జనవరి 27న
– 7వ సమావేశం 1948 నవంబర్ 4 నుంచి 1949 జనవరి 8 వరకు
– 8వ సమావేశం 1948 మే 16 నుంచి జూన్ 16 వరకు
– 9వ సమావేశం 1949 జూలై 30 నుంచి సెప్టెంబర్ 18 వరకు
– 10వ సమావేశం 1949 అక్టోబర్ 6 నుంచి 17 వరకు
– 11వ సమావేశం 1949 నవంబర్ 14 నుంచి 26 వరకు
– రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగపరిషత్ 11 సమావేశాలను నిర్వహించింది. 12వ సమావేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
– మొదటి సమావేశానికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది.
– రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 22 కమిటీలను నియమించింది. దీనిలో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు ఉన్నాయి.
రాజ్యాంగ పరిషత్ ముఖ్య విషయాలు
రాజ్యాంగ పరిషత్ కాలాన్ని మూడు దశలుగా పరిగణిస్తారు
Iవ దశ: 1946, డిసెంబర్ 9 నుంచి 1947, ఆగస్టు 15
వరకు కేవలం రాజ్యాంగ పరిషత్గా పనిచేసింది.
IIవ దశ: 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబర్ 26
వరకు రాజ్యాంగ పరిషత్, పార్లమెంటుగా
దేశానికి అవసరమైన శాసనాలు రూపొందించింది.
IIIవ దశ: 1949, నవంబర్ 26 నుంచి 1952 మే 12
వరకు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.
– తాత్కాలిక పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేసింది జీవీ మౌలాంకర్ (అధ్యక్షుడు). తాత్కాలిక పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అనంతశయనం అయ్యంగార్
– కేంద్ర శాసనసభగా రాజ్యాంగ పరిషత్ పనిచేసింది
– రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలో 7,635 సవరణలు ప్రతిపాదించగా 2,473 సవరణలపై చర్చ జరిగింది.
– రాజ్యాంగ రచనకు సమావేశాలు జరిగిన రోజులు 165
– ముసాయిదా పరిశీలనకు పట్టిన రోజులు 114
– భారత రాజ్యాంగ రచనకు సుమారు రూ. 64 లక్షలు ఖర్చు చేశారు.
– రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు (ఐరావతం)
– రాజ్యాంగంపై 1949, నవంబర్ 26న డా.బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకం చేశాడు
– 1949, నవంబర్ 26న ఆమోదం పొంది 1950, జనవరి 26న అమల్లోకి రావడానికి కారణం 1929, డిసెంబర్ 31న లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్ లాల్‌నెహ్రూ సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానం ప్రకటించగా 1930, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.
– రాజ్యాంగ పరిషత్‌లో ఎక్కువగా సవరణలు ప్రతిపాదించినది: హరివిష్ణు కామత్
డా. బీఆర్ అంబేద్కర్‌పై వ్యాఖ్యలు
రాజ్యాంగ నిర్మాత – అనంత శయనం అయ్యంగార్
సుశిక్తుడైన పైలెట్ – డా. బాబు రాజేంద్ర ప్రసాద్
చిత్తు ప్రతి నిర్మాత, భారత రాజ్యాంగ న్యాయ సలహాదారుడు, రాజ్యాంగ పరిషత్‌కు స్నేహితుడు, మార్గదర్శి, తాత్వికుడు
– బీఎన్ రావు
– బీఎన్ రావు రూపొందించిన చిత్తు రాజ్యాంగ ప్రతిలో 240 ప్రకరణలు 13 షెడ్యూల్స్ ఉన్నాయి.
రాజ్యాంగ పరిషత్ ప్రాధాన్యత
– రాజ్యాంగ నిర్మాతలు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను ముందుగానే గ్రహించి భవిష్యత్ ఆలోచనతో సమాఖ్య స్ఫూర్తితో భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ మనదేశం సాధించాల్సిన లక్ష్యాలను, ఆశయాలను, ఆదర్శాలను ముందుగానే రూపొందించగలిగారు.
– భారత రాజ్యాంగం బహుళ అవసరాలకు ప్రతీక అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు.
– నెహ్రూను రాజ్యాంగ పరిషత్‌లో ఆదర్శవాదిగా వర్ణిస్తారు.
– భారత రాజ్యాంగాన్ని సర్వసమ్మతి, సమన్వయ పద్ధతి ద్వారా రూపొందించారని గ్రాన్ విల్లే ఆస్టిన్ పేర్కొన్నాడు.
– రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ అయితే నెహ్రూను భారత జాతి నిర్మాత, ప్రవేశిక రచయితగా పేర్కొన్నారు.
– భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో ఉత్తమమైనది అని కేఎస్ హెగ్డే వివరించాడు.
– భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చినప్పటికీ అంతకుముందే అంటే 1949, నవంబర్ 26న అమల్లోకి వచ్చిన అంశాలు వరుసగా
– పౌరసత్వం
– ఎన్నికలు
– తాత్కాలిక ప్రొవిజన్స్
– షార్ట్ టైటిల్స్
– తాత్కాలిక పార్లమెంట్
అనగా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి స్వీకరించిన అంశాలు
– భారత రాజ్యాంగాన్ని నకలు లేదా మాతృక అని 1935 భారత ప్రభుత్వ చట్టం అని కేటీ షా పేర్కొన్నారు.
భారత రాజ్యాంగానికి ఆధారాలు
1935 భారత ప్రభుత్వ చట్టం
– ఫెడరల్ విధానం (సమాఖ్య పద్ధతి)
– పబ్లిక్ సర్వీస్ కమిషన్
– రాష్ట్రపతి, గవర్నర్ విచక్షణాధికారాలు
– న్యాయ వ్యవస్థ-పరిపాలనాంశాలు
బ్రిటన్ రాజ్యాంగం
– పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, సమన్యాయ పాలన, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అటార్నీ జనరల్, కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్, కమిటీ పద్ధతి, శాసన ప్రక్రియ, సభా హక్కులు.
అమెరికా రాజ్యాంగం
– ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష అధికారం, స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి పదవి, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం.
సోవియట్ రష్యా రాజ్యాంగం
– ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
ఐర్లాండ్ రాజ్యాంగం
– నిర్ధేశిక నియమాలు, నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతి, రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నియమించే విధానం.
ఆస్ట్రేలియా రాజ్యాంగం
– ఉమ్మడి జాబితా (సంధ్యా సమయ మండలం), సహకార సమాఖ్య విధానం, అంతరాష్ట్ర వర్తక వాణిజ్యం, పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశం.
కెనడా రాజ్యాంగం
– యూనియన్ ఆఫ్ స్టేట్స్ (బలమైన కేంద్రం), అవశిష్ట అధికారాలు కేంద్రానికి వర్తించడం, గవర్నర్ల నియామకం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగం
– రాజ్యాంగాన్ని సవరించే విధానం
– రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ
ఫ్రెంచ్ రాజ్యాంగం
– గణతంత్ర వ్యవస్థ (రిపబ్లిక్)
– ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
– తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం (ప్రొటెం స్పీకర్)
తైమూర్ – జర్మనీ రాజ్యాంగం
– జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దుచేసే విధానం
జపాన్ రాజ్యాంగం
– చట్టం నిర్ధారించిన పద్ధతి
– జర్మనీ రాజ్యాంగం నుంచి జాతీయ అత్యవసర పరిస్థితి. ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం మొదలైన అంశాలను తీసుకున్నారు.
స్వయంగా రూపొందించుకున్న అంశాలు:
– పంచాయతీరాజ్ వ్యవస్థ
– రాష్ట్రపతి ఎన్నికల గణం
– అఖిల భారత సర్వీసులు
– ఆర్థికసంఘం, మైనార్టీలకు ప్రత్యేక రక్షణలు
– ఏకీకృత సమగ్రన్యాయవ్యవస్థ
– ఏక పౌరసత్వం
– ఆర్థిక సంఘం, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు.
– భారత రాజ్యాంగంలో సుమారు 60 దేశాల రాజ్యాంగాల్లోని విశిష్ట లక్షణాలను పొందుపర్చారు
– భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్నిదేశాల రాజ్యాంగాల్లో ఉన్న మంచి విషయాల సమాహారం అని డా. బీఆర్ అంబేద్కర్ అన్నారు.
– భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించినది అని వర్ణిస్తే నేను గర్వపడుతాను అని – డా. బీఆర్ అంబేద్కర్ తెలిపాడు.
– రాజ్యాంగం వైఫల్యం చెందితే దాన్ని నిందించరాదు. దాన్ని అమలు పరిచే వారిని నిందించాలి అని అంబేద్కర్ పేర్కొన్నాడు.
రాజ్యాంగ పరిషత్‌పై విమర్శ
– రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికార సంస్థ కాదు.
– రాజ్యాంగ పరిషత్‌లో ప్రజలందరికీ ప్రాతినిథ్యం లేదు. కేవలం 28.5 శాతం ప్రజలకు మాత్రమే ప్రాతినిథ్యం ఉంది.
– భారత రాజ్యాంగం హిందువుల సంస్థ-విస్కౌంట్ సైమన్
– రాజ్యాంగ పరిషత్ యాంటీ కాంగ్రెస్, కాంగ్రెస్ యాంటీ రాజ్యాంగ పరిషత్ -గ్రాన్ విల్లే ఆస్టిన్
– రాజ్యాంగ పరిషత్ నలుగురి ముఠా అనగా రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభబాయ్ పటేల్, జవరహల్లాల్ నెహ్రూ, డా. బీఆర్ అంబేద్కర్‌కు మాత్రమే అధిక ప్రాధాన్యం ఉంది అని గ్రాన్ విల్లే ఆస్టిన్ వర్ణించాడు.
– భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని ఐవర్ జెన్నింగ్ పేర్కొన్నాడు.
– రాజ్యాంగ పరిషత్ ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత కల్పించబడింది- విన్స్టన్ చర్చిల్
రాజ్యాంగ పరిషత్ కమిటీలు-చైర్మన్లు
1. నియమ నిబంధనల కమిటీ – డా. బాబు రాజేంద్రప్రసాద్
2. రాజ్యాంగ సారథ్య సంఘం – డా. బాబు రాజేంద్రప్రసాద్
3. స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ – డా. బాబు రాజేంద్రప్రసాద్
4. జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ – డా. బాబు రాజేంద్రప్రసాద్
5. రాజ్యాంగ సలహా సంఘం – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
6. ప్రాథమిక హక్కుల కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
7. అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
8. రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
9. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ – జేబీ కృపలాని
10. అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ – హెచ్‌సీ ముఖర్జీ
11. యూనియన్ పవర్స్ కమిటీ – జవహర్లాల్ నెహ్రూ
12. కేంద్ర రాజ్యాంగ కమిటీ – జవహర్లాల్ నెహ్రూ
13. కేంద్ర అధికారాల కమిటీ – జవహర్లాల్ నెహ్రూ
14. సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ – వరదాచారి
15. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ – కేఎం మున్షీ
16. ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ – గోపీనాథ్ బోర్డో లాయిడ్
17. హౌస్ కమిటీ – భోగరాజు పట్టాభి సీతారామయ్య
18. పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ – జీవీ మౌలాంకర్
– రాజ్యాంగ పరిషత్ కమిటీల్లో అతిపెద్ద కమిటీ సలహా సంఘం.