భారతరత్న పురస్కారం పొందిన తొలిమహిళ? (పాలిటీ)
65. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) పార్లమెంటు 1957లో ప్రభుత్వ ఉద్యోగాలు నివాస అర్హతల చట్టాన్ని రూపొందించింది
2) ముల్కీ నిబంధనల ద్వారా ఆంధ్ర ప్రాంతం వారికి ప్రత్యేక ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించారు
3) ముల్కీ నిబంధనలు ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించారు
4) ముల్కీ నిబంధనలను 1970లో సుప్రీంకోర్టు సమర్థించింది.
ఎ) 1, 2, 3 బి)1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 3
66. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన తెలంగాణ ప్రాంత నివాసితులకు మాత్రమే తెలంగాణలో గల ఉద్యోగాలను రిజర్వు చేస్తూ రూపొందించిన ముల్కీ నింబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) అనంత రామకృష్ణ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
బి) ఏవీఎస్. నరసింహారావు Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
సి) బాలాజీ రాఘవన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
డి) దామోదరం సంజీవయ్య Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
67. ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ భద్రతను కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని గుర్తించండి?
ఎ) 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1973
బి) 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
68. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రక్షణను కల్పిస్తున్న ఆర్టికల్ 371(డి) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1974, జూలై 1
బి) 1975, జనవరి 16
సి) 1975, ఫిబ్రవరి 13
డి) 1975, డిసెంబర్ 3
69. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) సరోజినీ దేవా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) వెంకట రమణ దేవరు Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
సి) ఇందిరా సహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) రాకేష్ దరి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
70. బీపీ మండల్ కమిషన్ సిఫార్సులమేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించినది ఎవరు?
ఎ) పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
బి) వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
సి) అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం
డి) మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం
71. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 16(4ఎ)-ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు
2) ఆర్టికల్ 16(4బి)-ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో మిగులు పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులుగా పరిగణించి తదుపరి నోటిఫికేషన్‌కు బదిలీ చేయవచ్చు
3) ఆర్టికల్ 16(5)-మత స్వభావ సంబంధిత ఉద్యోగాల భర్తీలో సంబంధిత మతస్తు లనే నియమించాలి
4) ఆర్టికల్ 16(6)- వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక రిజర్వేషన్లు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
72. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(6)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 99వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 100వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 101వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 102వ రాజ్యాంగ సవరణ చట్టం
73. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించారు?
ఎ) 85వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 87వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 88వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 89వ రాజ్యాంగ సవరణ చట్టం
74. ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections) వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 10 శాతం రిజర్వేషన్లు నిర్దేశిస్తున్న ఆర్టికల్ 16(6) ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 102 రాజ్యాంగ సవరణ చట్టం
బి) 103 రాజ్యాంగ సవరణ చట్టం
సి) 104వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 105వ రాజ్యాంగ సవరణ చట్టం
75. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం-గుజరాత్
2) విద్యా ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలవారికి రిజర్వేషన్ లభించాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల్లోపు ఉండాలి.
3) విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి రిజర్వేషన్ లభించాలంటే 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి.
4) విద్య ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలవారికి రిజర్వేషన్ లభించాలంటే 100 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు ఉండాలి.
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
76. అస్పృశ్యత/అంటరానితనానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) అంటరాని తనాన్ని ఒక పాపంగా గాంధీజీ పేర్కొన్నారు
2) ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం
3) 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టం రూపొందింది
4) అస్పృశ్యత నేర నిషేధ చట్టం 1955 నవంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చింది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
77. అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించరాదని కర్ణాటక హైకోర్టు తీర్పునివ్వడంతో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని 1976లో ఏ విధంగా మార్చారు?
ఎ) నేర నిషేధ పరిరక్షణ చట్టం
బి) పౌరహక్కుల పరిరక్షణ చట్టం
సి) హరిజన, గిరిజన వర్గాల రక్షణ చట్టం
డి) అణగారిన వర్గాల రక్షణ చట్టం
78. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1976 ప్రకారం కింద పేర్కొన్న ఏ అంశం నేరంగా పరిగణించబడుతుంది?
1) ఆరాధనా స్థల ప్రవేశాన్ని లేదా ఆరాధించడాన్ని వ్యక్తులకు నిరాకరించడం
2) అస్పృశ్యతను సాంప్రదాయ, మత, తాత్విక కారణాలతో సమర్థించడం
3) దుకాణాల్లో, హోటళ్లలో, వినోద స్థలాల్లో ప్రవేశాన్ని నిరాకరించడం
4) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అస్పృశ్యత గురించి బోధించడం
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
79. పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1976 ప్రకారం నేరం రుజువైతే విధించే శిక్షను గుర్తించండి?
ఎ) 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష
బి) 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలుశిక్ష
సి) 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల జైలుశిక్ష
డి) 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల జైలుశిక్ష
80. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అకృత్యాల నిరోధక చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఈ చట్టం 1989లో రూపొందింది
2) ఈ చట్టం 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది
3) ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలంటే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ అవసరం
4) ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నిందితులకు మరణ శిక్ష కూడా విధిస్తారు.
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
81. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18కి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 18(1)- విద్యాపరమైన మిలిటరీ పరమైన బిరుదులు తప్ప ప్రభుత్వం ఏ ఇతర బిరుదులను ఇవ్వరాదు
2) ఆర్టికల్ 18(2) – విదేశాలు ఇచ్చే బిరుదులను భారతీయ పౌరులు స్వీకరించరాదు
3) ఆర్టికల్ 18(3) ఒక వ్యక్తి భారత పౌరుడు కాకపోయినప్పటికీ, భారతదేశంలో ప్రభుత్వ పదవిని నిర్వహిస్తుంటే అతడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ఇచ్చే బిరుదులను స్వీకరించరాదు
4) ఆర్టికల్ 18(4) ప్రధానమంత్రి అనుమతితో విదేశాలు ఇచ్చే బిరుదులను భారతీయ పౌరులు స్వీకరించవచ్చు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
82. 1954లో భారత రత్న పురస్కారాన్ని పొందిన వారిలో లేనివారిని గుర్తించండి?
ఎ) చక్రవర్తుల రాజగోపాలాచారి
బి) సర్వేపల్లి రాధాకృష్ణన్
సి) సీవీ రామన్
డి) బాబు రాజేంద్ర ప్రసాద్
83. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) భారత రత్న పురస్కారం పొందిన తొలిమహిళ – ఇందిరాగాంధీ
2) మరణానంతరం భారతరత్న పురస్కారం పొందిన తొలివ్యక్తి – లాల్‌బహదూర్ శాస్త్రి
3) భారతరత్న పురస్కారం పొందిన మొదటి క్రీడాకారుడు – విశ్వనాథన్ ఆనంద్
4) భారతరత్న పురస్కారం పొందిన మొదటి సంగీత విద్వాంసులు – ఎం.ఎస్. సుబ్బలక్ష్మి
ఎ) 1, 2, 3 ,4 బి) 1, 2, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
84. భారతరత్న పురస్కారానికి సంబంధించిన కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
1) 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రారంభించింది
2) 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది
3) 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పునరుద్ధరించింది
4) 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం రద్దు చేసింది
ఎ) 1, 2, 3 బి) 1, 2 ,3 ,4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
85. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్స్ 19 నుండి 22 మధ్య పేర్కొన్న ‘స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కులకు భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా ఎవరు అభివర్ణించారు?
ఎ) డా.బీఆర్ అంబేద్కర్
బి) జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
సి) జస్టిస్ సిక్రీ
డి) నళినీ రంజన్ సర్కార్
86. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 19(1)(ఎ) i) వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
బి) ఆర్టికల్ 19(1) (బి) ii) భావప్రకటనా, వాక్స్వాతంత్య్రపు హక్కు
సి) ఆర్టికల్ 19(1)(సి) iii) ఆయుధాలు ధరించకుండా, శాంతియుతంగా సమావేశాలు నిర్వహణ
డి) ఆర్టికల్ 19(1)(డి) iv) దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు
ఎ) ఎ-iii, బి-i, సి-iv, డి-ii బి) ఎ-ii, బి-iii, సి-i, డి-iv
సి) ఎ-ii, బి-iii, సి-iv, డి-i డి) ఎ-iv, బి-iii, సి-i, డి-ii
87. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 19(1)(E) i) దేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే హక్కు
బి) ఆర్టికల్ 19(1)(F) ii) ఇష్టమైన వృత్తి వ్యాపారాన్ని నిర్వహించుకునే హక్కు
సి) ఆర్టికల్ 19(1)(G) iii) ఆస్తిని సంపాదించుకోవడం, అనుభవించడం,
అన్యాక్రాంతం చేయడం
ఎ) ఎ-i, బి-ii, సి-iii బి) ఎ-iii, బి-i, సి-ii
సి) ఎ-i, బి-iii, సి-ii డి) ఎ-ii, బి-i, సి-iii
88. ఆర్టికల్ 19(1)(ఎ)లో పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగంగా ఉన్న అంశాన్ని గుర్తించండి?
1) పత్రికాస్వేచ్ఛ, వాణిజ్య ప్రకటనల స్వేచ్ఛ బంద్‌లకు వ్యతిరేకమైన స్వేచ్ఛ
2) మౌనంగా ఉండే స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ
3) ప్రభుత్వ కార్యకలపాల గురించి తెలుసుకునే స్వేచ్ఛ
4) టెలిఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేసే స్వేచ్ఛ
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
89. భావ ప్రకటన స్వేచ్ఛకు భౌగోళిక పరిమితులు లేవని విదేశాల్లో పర్యటించే భారతీయ పౌరుల భావప్రకటన స్వేచ్ఛపై భారత ప్రభుత్వం పరిమితులు విధించరాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) హరీష్ ఉప్పల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) టి.కె. రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
సి) సుబ్రహ్మణ్యస్వామి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
90. సాధారణ పౌరుడు సైతం ఏ సమయంలో నైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయవచ్చు నని అది అతని భావప్రకటనా హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది.
ఎ) శ్రియాసింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) బాబులాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
డి) దిగంబర ప్రసాద్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక
జవాబులు
65-డి 66-బి 67-ఎ 68-ఎ 69-సి 70-బి 71-ఎ 72-సి 73-ఎ 74-బి 75-బి 76-ఎ 77-బి 78-డి 79-ఎ 80-సి
81-బి 82-డి 83-బి 84-ఎ 85-సి 86-బి 87-సి 88-ఎ 89-డి 90-బి
సత్యనారాయణ
ఏకేఆర్ పబ్లికేషన్స్, వికారాబాద్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు