విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
-బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి సబిత
– సెప్టెంబర్ 8వరకు దరఖాస్తులు
సెమ్స్ ఒలింపిక్స్ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఈ పోటీలు ఎంతో అవసరమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సెమ్స్ ఒలింపిక్స్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కానొద్దని, అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సెమ్స్ ఒలింపిక్స్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పోటీలపై ఆసక్తి ఉండి 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 8 వరకు www.semsolympiad.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెమ్స్ ఒలింపిక్స్ కో ఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పీజే రెడ్డి, కే అనిల్‌కుమార్, బాణాల రాఘవ, గాయం భీష్మారెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, కోశాధికారి రఘు సురేశ్, కడారి అనంతరెడ్డి, చింతల రాంచందర్, శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు