జేఈఈ మెయిన్‌లో ఐదుగురికి వంద పర్సంటైల్
-దేశంలో 24 మందికి.. ఐదుగురు మనోళ్లే
-ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో 3, 5 ర్యాంకులు
-జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్‌తో సత్తాచాటారు. రాష్ట్రానికి చెందిన ధీరజ్ కురుకుంద, అనికేత్ ఛటోపాధ్యాయ్, జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేశ్ బియాని, బూస శివనాగ వెంకటఆదిత్య 100 ఎన్టీఏ స్కోర్‌ను సాధించారు. జాతీయస్థాయిలో 24 మంది విద్యార్థులే 100 పర్సంటైల్ సొంతం చేసుకోగా, అందులో ఐదుగురు తెలంగాణ విద్యార్థులే. అంటే 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో 20% వాటా తెలంగాణ విద్యార్థులదే. జూన్‌లో నిర్వహించిన మెయిన్-1, జూలైలో నిర్వహించిన మెయిన్-2 ఫలితాలను కలిపి తుది ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. ఈ స్కోర్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తారు. సోమవారం నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభంకాగా, 11 వరకు సమయం ఉన్నది. అడ్మిట్‌కార్డులు 23 నుంచి 28 వరకు జారీచేస్తారు. 28న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా, ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదలవుతాయి.
క్యాటగిరీ ర్యాంకుల్లోనూ టాప్
ఈ ఫలితాల్లో క్యాటగిరీ ర్యాంకుల్లోనూ తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ మేల్ టాపర్లుగా 18 మంది నిలువగా, ఐదుగురు తెలంగాణ విద్యార్థులే. మేల్ టాపర్స్‌గా ధీరజ్ కురుకుంద, అనికేత్ ఛటోపాధ్యాయ్, జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేశ్ బియాని, బూస శివనాగ వెంకటఆదిత్య నిలువగా, ఫిమేల్ క్యాటగిరీలో చందా మౌమిత స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఎస్సీ క్యాటగిరీలో కాకర జశ్వంత్ జాతీయస్థాయిలో మూడోర్యాంక్, ఎస్టీ క్యాటగిరీలో మాలోత్ విశాల్నాయక్ జాతీయస్థాయి ఐదోర్యాంక్ సొంతం చేసుకొన్నారు. పీడబ్ల్యూడీ క్యాటగిరీలో గైకోటి విఘ్నేశ్ జాతీయస్థాయిలో మూడోర్యాంక్, మందల రాల్ జాతీయస్థాయిలో ఐదో ర్యాంక్‌తో అదరగొట్టారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన వారు
పేరు పర్సంటైల్
ధీరజ్ కురుకుంద 100.0000000
అనికేత్ ఛటోపాధ్యాయ్ 100.0000000
జాస్తి యశ్వంత్ వీవీఎస్ 100.0000000
రూపేశ్ బియాని 100.0000000
బీఎస్ వెంకట ఆదిత్య 100.0000000
చందా మౌమిత 99.9812734
కాకర జశ్వంత్ 99.9844822
మాలోత్ విశాల్నాయక్ 99.8344771
గైకోటి విఘ్నేశ్ 99.8703166
మందల రాల్ 99.7904613
క్యాటగిరీ కనిష్ఠ స్కోర్ గరిష్ఠ స్కోర్
జనరల్ 88.4 100
పీడబ్ల్యూడీ 0.003 88.3
ఈడబ్ల్యూఎస్ 63.1 88.4
ఓబీసీ-ఎన్సీఎల్ 67.0 88.4
ఎస్సీ 43.08 88.4
ఎస్టీ 26.7 88.4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు