జేఈఈ మెయిన్‌లో గురుకుల విద్యార్థుల హవా
– జేఈఈ అడ్వాన్స్‌కు 467 మంది అర్హత
-విద్యార్థులకు శుభాకాంక్షల వెల్లువ
జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 542 మంది పరీక్షకు హాజరుకాగా, 467 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఇందులో మాలోత్ రేవంత్ 97.66, భూక్యా నవీన్ 97.28 శాతం పర్సంటైల్ పొంది తమ ప్రతిభ కనబరిచారు. గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 20 మంది విద్యార్థులు 90 శాతం, 63 మంది విద్యార్థులు 80 శాతం, 134 మంది విద్యార్థులు 70 శాతం పర్సంటైల్ సాధించారు. దాదాపు 150 మంది విద్యార్థులు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన గిరిజన విద్యార్థులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి వీ సర్వేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ గురుకులాల నుంచి 20 మంది..
జేఈఈ మెయిన్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలోని జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 20 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక అయ్యారు. ఇందులో వీ దీప్తి 86.81, డీ న్సీ 82.19, నిఖిత 81.90, డీ గణేశ్ 79.53, డీ శ్యామల 79.53, వీ అశ్రిత 77.57 పర్సంటైల్ సాధించారు. వీరితోపాటు మొత్తం 20 మంది విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్థులను బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య భట్టు అభినందించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు