భారత్‌లో తొలి రోబోటిక్ సర్జరీ నిర్వహించిన వైద్యుడు?
సైన్స్ అండ్ టెక్నాలజీ
62. అంతరిక్ష యాత్రికుల కోసం అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతున్న సంస్థ?
1) ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పొరేషన్
2) స్పేస్ ఎక్స్ 3) నాసా
4) న్యూ స్పేస్ ఇండియా కార్పొరేషన్
63. స్వాతంత్య్రానికి పూర్వం ‘క్రౌన్ రిప్రజంటేటివ్ పోలీస్’గా దేనిని పిలిచేవారు?
1) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
2) సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్
3) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
4) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
64. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్?
1) INS చక్ర 2) INS జలాశ్వ
3) INS అరిహంత్ 4) INS కుంబిర్
65. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1962 2) 1972
3) 1964 4) 1990
66. ‘భారత అణుశాస్త్ర పితామడు’గా ఎవరిని పిలుస్తారు?
1) విక్రమ్ సారాభాయ్
2) హోమి జహంగీర్ భాభా
3) అబ్దుల్ కలాం 4) రాజారామన్న
67. ప్రస్తుతం దేశంలో మొత్తం విద్యుత్‌లో థర్మల్ విద్యుత్ శాతం ఎంత ?
1) 55% 2) 60%
3) 63% 4) 70%
68. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1945 2) 1948
3) 1954 4) 1956
69. ఇస్రో 2022 జనవరిలో ఎక్కువ శక్తి కలిగిన ‘వికాస్’ ఇంజిన్ విజయవంతంగా ప్రయోగించింది అయితే ఏ రాకెట్లో దీన్ని ఉపయోగిస్తారు?
1) పీఎస్ఎల్వీ 2) బీఎస్ఎల్వీ
3) అంతరిక్ష యాత్ర ‘గగయున్’లో
4) పైవన్నీ
70. భారతదేశపు మొట్టమొదటి భారజల కేంద్రాన్ని 1962లో ఎక్కడ నెలకొల్పారు?
1) నంగల్ (పంజాబ్)
2) కల్పకం (తమిళనాడు)
3) తారాపూర్ (మహారాష్ట్ర)
4) కైగా (కర్ణాటక)
71. భారతదేశం తన తొలి అణు పరీక్షలను తొలిసారిగా 1974 మే 18న ఎక్కడ నిర్వహించింది?
1) పోఖ్రాన్ (రాజస్థాన్)
2) జాదూగూడ (బీహార్)
3) పోఖ్రాన్ (మహారాష్ట్ర)
4) జాదూగూడ (జారండ్)
72. దేశంలో 2021 సెప్టెంబర్‌లో ప్రారంభించిన అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) జారండ్
73. భారత్ పోఖ్రాన్‌లోనే రెండవసారి అణు పరీక్షలను ఎప్పుడు జరిపింది?
1) 1978 మే 13
2) 1998 మే 11, 13
3) 1998 మే 18
4) 1978 మే 11, 13
74. అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒడిశాలో ఎక్కడ ఉంది?
1) బాలాసోర్ 2) పూరీ
3) భువనేశ్వర్ 4) కటక్
75. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది?
1) భోపాల్ 2) హైదరాబాద్
3) కల్పకం 4) రాంచీ
76. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్
1) సోడియం-124 2) కోబాల్ట్-60
3) అయోడిన్-10 4) కోబాల్ట్-90
77. దేశపు మొదటి రిసెర్చ్ రియాక్టర్
1) కామిని 2) ధ్రువ
3) జర్లీనా 4) అప్సర
78. కుడంకుళం అణువిద్యుత్ రియాక్టర్‌ను ఏ దేశ సహకారంతో నిర్మించారు?
1) అమెరికా 2) ఆస్ట్రేలియా
3) ఫ్రాన్స్ 4) రష్యా
79. ఆసియాలో మొదటి సోలార్పాండ్ను ఎక్కడ ఏర్పరిచారు?
1) భుజ్ (గుజరాత్)
2) విజింజం (కేరళ)
3) ట్యూటికోరిన్ (తమిళనాడు)
4) లోనావాలా (మహారాష్ట్ర)
80. జాతీయ టి.బి. నివారణ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1964 2) 1962
3) 1968 4) 1966
81. దేశంలో మొట్టమొదటి పోలియో రహిత జిల్లా ?
1) సేలం (తమిళనాడు)
2) గుంటూరు (ఆంధ్రప్రదేశ్)
3) బస్తర్ (ఛత్తీస్‌గఢ్)
4) పట్టనామితిట్టా (కేరళ)
82. సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏ నగరంలో ఉంది?
1) ముంబై 2) హైదరాబాద్
3) భువనేశ్వర్ 4) చెన్నై
83. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా సృష్టించిన మొదటి శిశువు?
1) ఈవ్ 2) ఆడమ్
3) జాన్ 4) డాలీ
84. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1992 2) 1990
3) 1988 4) 1986
85. ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి వైరస్‌ను వ్యాప్తిచేసేది ఏది?
1) ఆడ అనాఫిలిస్ దోమ
2) ఆడ క్యూలెక్స్ దోమ
3) ఆడ ఏడిస్ ఈజిప్ట్టి దోమ
4) ప్లాస్మోడియం
86. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కృత్రిమ గర్భాశయాన్ని’ రూపొందించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వారు?
1) ఇటలీ 2) బ్రిటన్
3) జపాన్ 4) చైనా
87. ఏ దేశానికి భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించనుంది?
1) ఉక్రెయిన్ 2) ఇండోనేషియా
3) ఫిలిప్పీన్స్ 4) నేపాల్
88. ప్రపంచంలోనే భారీ జన్యు బ్యాంక్ ఎక్కడ ఉంది?
1) భారత్ 2) చైనా
3) దక్షిణ కొరియా 4) అమెరికా
89. ఆసియాలో మొట్టమొదటి మెదడు బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) మైసూర్ 2) న్యూఢిల్లీ
3) టోక్యో 4) బీజింగ్
90. దేశంలో ప్రప్రథమ ‘బోన్ బ్యాంక్’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముంబై 2) హైదరాబాద్
3) భోపాల్ 4) చెన్నై
91. వైఫై కన్నా వేగంగా పనిచేసే లై-ఫై టెక్నాలజీని కనుగొన్న శాస్త్రవేత్త ?
1) హెరాల్డ్ హస్ 2) హెన్రీ హెరాల్డ్
3) థామస్ హెన్రీ 4) 1, 3
92. ఏ సంవత్సరంలో లీవిట్, విజ్లర్లు ప్రచురించిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో మొట్టమొదటిసారి ‘సమాచార సాంకేతిక విజ్ఞానం’ పదాన్ని వాడటం జరిగింది?
1) 1968 2) 1958
3) 1948 4) 1988
93. ఆధునిక కంప్యూటర్ పితామడుగా ఎవరిని పరిగణిస్తారు?
1) బ్లెయిసీ పాస్కల్ 2) టిమ్ బెర్నర్స్‌లీ
3) స్టీవ్ జాబ్స్ 4) చార్లెస్ బాబేజ్
94. కంప్యూటర్లలో ఉపయోగించే సంఖ్యామానం ?
1) దశాంశ సంఖ్యామానం
2) ద్విసంఖ్యామానం
3) గ్రీకు సంఖ్యామానం
4) అరబిక్ సంఖ్యామానం
95. ఇటీవల ఏ రాష్ట్రం/ యూనియన్ టెరిటరీ ‘కరెప్షన్ ఫ్రీ-1064’ అనే యాప్‌ను ప్రారంభించింది?
1) గుజరాత్ 2) ఉత్తరాఖండ్
3) పంజాబ్ 4) ఢిల్లీ
96. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సభ్యదేశాలు ?
1) యు.ఎస్.ఎ, ఫ్రాన్స్, యూకే, రష్యా, జపాన్
2) యు.ఎస్.ఎ, కెనడా, చైనా, రష్యా, ఇజ్రాయల్
3) యు.ఎస్.ఎ, రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
4) యు.ఎస్.ఎ, భారత్, రష్యా, యూకే, జపాన్
97. ఏ సంవత్సరంలో మొదటి ప్రభుత్వ సంస్థ విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించారు?
1) 1992 2) 1991
3) 2002 4) 2002
98. మొట్టమొదటి వెబ్ అడ్రస్ బ్రౌజర్?
1) world wide web
2) Netscape Navigator
3) Internet Explorer
4) Safari
99. కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ?
1) డిసెంబర్ 2 2) డిసెంబర్ 3
3) డిసెంబర్ 4 4) డిసెంబర్ 5
100. WWWను కనుగొన్నది?
1) టిమ్-బెరర్నర్స్-లీ 2) చార్లెస్ బాబేజ్
3) జాన్ హోప్కిన్స్ 4) జాన్ నేపియర్
101. భారతదేశ మొదటి టెరాఫ్లాప్ సూపర్ కంప్యూటర్?
1) అన్నపూర్ణ 2) పరం పద్మ
3) అనుపం 4) అనురాగ్
102. అంతరిక్ష సంస్థ నాసా ‘లూసి’ అనే వ్యోమ నౌకను విజయవంతంగా నింగిలో ప్రయోగించింది అయితే లూసీ అనేది దేనికి సంబంధించింది?
1) ఇంధనం 2) మానవ శిలాజం
3) గ్రహశకం 4) పైవేవీకాదు
103. ఏ దేశం సిమోర్గ్ సూపర్ కంప్యూటర్ విడుదల చేసింది?
1) ఇరాక్ 2) ఇరాన్
3) చైనా 4) జపాన్
104. రోబోటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది?
1) క్యారల్ క్యాపెక్ 2) ధియోఫిలోస్
3) ఇసాక్ అసిమోవ్ 4) జార్జి డివోల్
105. రోబోట్ అనే పదాన్ని ప్రతిపాదించింది?
1) క్యారల్ క్యాపెక్ 2) థియోఫిలోస్
3) ఇసాక్ అసిమోవ్ 4) జార్జి డివోల్
106. భారత్‌లో తొలిసారిగా రోబోటిక్ సర్జరీని నిర్వహించిన వైద్యుడు?
1) డా. డోగ్ర 2) డా. అశితోష్ ముఖర్జీ
3) డా. జగదీష్ 4) పై ఎవరూ కాదు
107. ‘నానో’ అనే పదానికి మూలం?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఫ్రెంచ్ 4) పైవేవీకాదు
108. భారతదేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు?
1) సిఎన్ఆర్ రావు
2) ఎపిజే అబ్దుల్ కలాం
3) హెచ్ జహంగీర్ బాబా
4) యూ ఆర్ రావు
109. నానో టెక్నాలజీ పరిశోధనకు ప్రత్యేక బమతి?
1) ఫ్యాన్మన్ ప్రైజ్ 2) నోబెల్ ప్రైజ్
3) నోరియా ప్రైజ్ 4) పై ఏదీ కాదు
110. 2021వ సంవత్సరం వరకు నిర్ణయించిన నియోవైజ్ టెలిస్కోపు మిషన్ కాల పరిమితిని ఎన్నో సంవత్సరం వరకు పొడిగించారు?
1) 2022 2) 2024
3) 2023 4) 2026
111. అంగారక గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్ ‘ఇన్సైట్’ విజయవంతంగా ఆ గ్రహంపై దిగింది?
1) నాసా 2) ఇస్రో
3) స్పేస్ఎక్స్ 4) జాక్సా
112. ఏ ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడానికి ‘ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌క్యాస్టింగ్ అప్రోచ్’ అనే కొత్త టెక్నాలజీని భారత వాతావరణ శాఖ అభివృద్ధి చేసింది?
1) వరద ప్రభావం
2) భూకంప ప్రభావం
3) కరువు ప్రభావం
4) రసాయన విపత్తు ప్రభావం
113. నేషనల్ మిసో స్పియర్, స్ట్రాటో స్పియర్, ట్రోపో స్పియర్ రాడార్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది?
1) గాదంకి 2) బెంగళూరు
3) అహ్మదాబాద్ 4) మహేంద్రగిరి
114. దేశంలోనే తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేసే ప్రక్రియ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
115. మధుమేహానికి సంబంధించి సవరించిన వర్గీకరణను స్వీడన్ శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ప్రకారం ఈ వ్యాధిలో ఎన్ని విభిన్న రకాలు ఉన్నాయి?
1) 2 2) 3 3) 5 4) 4
116. ఏ పద్ధతి ద్వారా సముద్ర నీటిని తాగడానికి అనువుగా మార్చే కైన, పర్యావరణ అనుకూల విధానాన్ని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) రామన్ ఎఫెక్ట్ 2) న్యూటన్ లాస్
3) డాప్లల్ ఎఫెక్ట్ 4) కాక్రపిలరే ఎఫెక్ట్
117. దేశీయ ఖగోళ నిపుణులు తయారీకి దేశంలో మొట్టమొదట అంతరిక్ష విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) భోపాల్ 2) తిరువనంతపురం
3) శ్రీహరికోట 4) బెంగళూరు
118. అంతరిక్ష సమీకృత పరీక్షా వేదిక ఒడిశాలో ఎక్కడ ఉంది?
1) బాలాసోర్ 2) పుణె
3) భువనేశ్వర్ 4) కటక్
119. ప్రమాదకర ఈ-కోలి బ్యాక్టీరియాను సులువుగా గుర్తించే పద్ధతిని ఏ పరిశోధకులు కనుగొన్నారు?
1) ఐఐటీ మద్రాసు
2) బీఐటీఎస్ హైదరాబాద్
3) ఐఐఎస్ఐ బెంగళూరు
4) ఐఐటీ కాన్పూర్
120. చైనా షెంఝూ-5 ద్వారా అంతరిక్షంలోకి పంపిన వ్యక్తి పేరు?
1) కర్నల్ హైషింగ్ 2) యాంగ్ ల్యూయీ
3) కర్నల్ ఫెయ్జున్ లాంగ్
4) శాలీ కె.రైడ్
121. తిరువనంతపురంలో గల అంతరిక్ష కేంద్రాలు?
1) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
2)తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
3) లిక్విడ్ ప్రొనల్షన్ సిస్టమ్స్ సెంటర్
4) పైవన్నీ
122. ఇరాన్ కొత్తగా అణుశుద్ధి కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పనుంది?
1) టెహరాన్ 2) కోయ్
3) ఎస్పహన్ 4) యపాద్
జవాబులు
62.1 63.2 64.3 65.1 66.2 67.3 68.2 69.4 70.1 71.1 72.1 73.3 74.1 75.3 76.2 77.4 78.4 79.1 80.2 81.4
82.2 83.1 84.2 85.3 86.3 87.3 88.2 89.1 90.4 91.1 92.2 93.4 94.2 95.2 96.3 97.3 98.1 99.1 100.1 101.2
102.2 103.2 104.3 105.1 106.1 107.2 108.1 109.1 110.3 111.1 112.1 113.1 114.1 115.3 116.4 117.2
118.1 119.2 120.2 121.4 122.3
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు