ఎరుపు నలుపు సమ్మేళనం
మానవులకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన, అరుదైన సంపద నేలలు. ఇవే మానవ జీవన పురోగమనాన్ని నిర్దేశిస్తాయి. నేలల ప్రభావం వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. దేశ వ్యాప్తంగా చూస్తే సారవంతమైన నేలలు.. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే నేలలు తెలంగాణలో ఉన్నాయి. ఆరోగ్యకర మైన వ్యవసాయాన్ని చేయడం ద్వారా నేలలను పరిరక్షించవచ్చు.
# తెలంగాణ నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం. ఈ నేలల్లో గనులు. బాక్సైట్ తదితర నిక్షేపాలు అపారంగా, ఖనిజ పదార్థాలు అనేకం ఉన్నాయి. నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్, సల్ఫైట్, మైకా, స్పటికం సాధారణ మృత్తికల్లో కనిపిస్తాయి. శీతోష్ణస్థితి కారకాలైన అవపాతం ఉష్ణోగ్రత నేలపై అధికంగా ప్రభావితం చూపిస్తాయి.
#శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే అంత్య పదార్థాన్ని మృత్తికలు అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన సహజసిద్ధ పరిస్థితుల్లో ఏర్పడుతుంది. రాళ్ళు, రప్పలతో ఉండి సేంద్రియ అవశేషాలకు మూలమైన భూ ఉపరితల భాగాన్నే మృత్తికలు అంటారు.
#నేలలు పునరుత్పాదిత సహజ వనరులు. పునరుత్పాతనకు చాలా కాలం పడుతుంది. మృత్తికలు ఏర్పడటానికి ప్రధానంగా ఆధార శిలలు అవసరం. మృత్తికల్లో లక్షణాలు ఆధార శిలలపై ఆధారపడి ఉంటాయి.
#సాధారణంగా మృత్తికలు రెండు విధాలుగా ఏర్పడతాయి. భూమిపై ఉన్న రాళ్లు వాటిపై ఉన్న వాతావరణం ప్రభావం వల్ల శిథిలమై చివరకు మెత్తని మట్టిగా మారతాయి. వీటిని స్థాన బద్ద మృత్తికలు అంటారు. ఇవి మొదటి రకం ఉదా: నల్ల మృత్తికలు, ఎరమృత్తికలు.
#భూమిపై ఉన్న రాళ్లు వాటిపై ఉన్న వాతావరణం వల్ల మొత్తని మన్నుగా మారి నీటిలో కలిసి కొట్టుకొని పోయిగానీ, ధూళి రూపంలో గాలి ద్వారా కొట్టుకుపోయి మరొక చోట మేటవేసి మృత్తికలుగా మారవచ్చు.
# ఒక ప్రదేశం శిలాకృతి ఆ ప్రదేశం వాలు, ఎత్తు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రదేశం స్థలాకృతి అవపాతం రేటును, మృత్తిక క్రమక్షయాన్ని నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాలు, బాక్టీరియా నేలల తయారీపై ప్రభావం చూపిస్తాయి.
# శిలలు గాలి, నీరు, నదుల వల్ల క్రమక్షయం చెంది శిథిలమై ఏర్పడేవి మృత్తికలు. శిలలు శైథిల్యం చెందడాన్ని వెదరింగ్ అంటారు.
# నేలల స్వభావం గురించి చర్చించే శాస్త్రం పెడాలజీ/ఎడపాలజీ
# తెలంగాణ భారత ద్వీపకల్పంలో భాగమైన దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో తూర్పునకు విస్తరించి ఉన్నది.
# దక్కన్ పీఠభూమి పురాతన శిలలతోనూ, రూపాంతర శిలలతోనూ, అగ్ని శిలలతోనూ ఏర్పడి ఉంది.
మృత్తికలు ఏర్పడటానికి కావలసిన అనుకూల పరిస్థితులు
# మాతృశిల
# వర్షపాతం, ఉష్ణోగ్రత
# సహజ ఉద్భిజ్జ సంపద
# పరివాహం
# సూక్ష్మజీవులు
#క్రిమికీటకాలు
#జంతువులు
# మానవులు
#మృత్తికలు ఏర్పడటానికి అవసరమైన కాలం
నేలల రకాలు
తెలంగాణలో అత్యంత సారవంతమైన ఒండ్రు మృత్తికల నుంచి నిరుపయోగమైన ఇసుక నేలల వరకు అన్ని రకాల నేలలు ఉన్నాయి. అయితే ప్రధానంగా 4 రకాల నేలలు కలవు
1) ఎర్రనేలలు
2) నల్లరేగడి నేలలు (Black soils)
3) ఒండ్రు నేలలు (Allivial soils)
4) లాటరైట్ నేలలు (Latarite Soils)
ఎర్ర మృత్తికలు
# ఎర్రమృత్తికలు రాష్ట్ర విస్తీర్ణంలో 48 శాతం ఆక్రమించి ఉన్నాయి. ఎక్కువగా గ్రానైట్ నుంచి రూపాంతరం చెంది ఎర్రనేలలుగా ఏర్పడ్డాయి.
#కొన్ని సార్లు ఈ నేలలు గ్రానైట్, రాళ్ల సమూహాల నుంచి కూడా ఏర్పడతాయి.
#వీటి అంతర్ నిర్మాణం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
1) రెడ్లోమ్ 2) ఎర్రనేలలు
#రెడ్లోమ్ రకానికి చెందిన ఎర నేలల్లో బంకబన్ను ఎక్కువగా ఉండి కొన్ని రాళ్లు ఉంటాయి.
#ఎర్ర నేలల్లో గండ్ర ఇసుక, రాళ్లతో పదార్థం అంతా వెదజల్లిన రీతిలో ఉంటుంది.
# ఎరమృత్తికల రంగు అనేది ఫెరిక్ ఆక్సైడ్ యాన్ హైడ్రస్గా పనిచేసినపుడు ఎరుపు రంగును కలిగి ఉంటుంది.
#ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకిపోయి లోపలి పొరల్లోకి పోయే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఈ నేలలు ఎత్తైన ప్రదేశాల్లో గుట్టల మధ్య భాగం వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి.
# ఈ రకం నేలల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ రకం నేలలు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
#ఈ నేలల్లో ప్రధానంగా పండే పంటలు పప్పు దినుసులు, వేరుశనగ, ఆముదాలు.
నల్లరేగడి మృత్తికలు
#తెలంగాణ విస్తీర్ణంలో 25 శాతం ఆక్రమించి ద్వితీయ స్థానంలో ఉన్నాయి.
# అవక్షేపక శిలలు, రూపాంతర ప్రాప్తి శిలలు, సున్నపురాయి శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి.
#నీటిని గ్రహించి నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేసవికాలంలో బీటలు వారి చీలిపోయి ఉంటాయి.
# నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ భూములున్నాయి.
ఒండ్రు మృత్తికలు
# ఒండ్రు మృత్తికలు ప్రధానంగా నదుల వల్ల కొట్టుకు వచ్చి మేట వేసిన భూమివల్ల ఏర్పడినవి. ఈ మృత్తికల్లో పాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉండి నైట్రోజన్ ఆర్గానిక్ కార్బన్లు తక్కువ మోతాదులో ఉంటాయి.
# ఇవి వ్యవసాయ అనుకూలమైన భూములు. ఈ నేలలు కృష్ణా, గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.
లాటరైట్ మృత్తికలు
#ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వల్ల ఈ మృత్తికలు తయారవుతాయి. ఈ మృత్తికల నిర్మాణం కొన్ని కిలోమీటర్ల లోతువరకు శైథిల్యం ప్రక్రియ జరుగుతుంది.
# ఇవి ఆమ్లస్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని జేగురు నేలలని కూడా అంటారు.
# ఈ రకం నేలలు ఎక్కువగా మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్, జహీరాబాద్ మండలాల్లో ఉన్నాయి.
#ఇవి తోటల పెంపకానికి అనుకూలమైనవి
# మృత్తికా క్రమక్షయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా మృత్తికా క్రమక్షయంపై ఆధారపడి ఉంటుంది.
మృత్తికా క్రమక్షయ నివారణ చర్యలు
# అడవుల పెంపకం
# అతిగా పశువులు మేత వేయకుండా చూడటం
#ఆనకట్టల నిర్మాణం
#వ్యవసాయ పద్ధతులైన వాలు కట్టలను పెంచడం, సాంద్రీకరణ వ్యవసాయం తగ్గించడం, పంటలను మార్చి వేయడం మొదలైన పద్ధతులు
మృత్తికా సంరక్షణకు తోడ్పడే జాతీయ సంస్థలు
– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే, ల్యాండ్ అండ్ ప్లానింగ్ – నాగపూర్
– ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ –భోపాల్
-వర్షాధార పంటల వ్యవసాయ పరిశోధన కేంద్రం – హైదరాబాద్
-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ సెంటర్ రాజేంద్రనగర్ – హైదరాబాద్
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అధికంగా విస్తరించిన నేలలేవి? (ఎ)
ఎ) ఎరనేలలు బి) ఒండ్రు నేలలు
సి) నల్లరేగడి నేలలు
డి) లాటరైట్ నేలలు
2. పత్తిసాగుకు అత్యంత అనుకూలమైన నేలలు ఏవి? (సి)
ఎ) ఎరనేలలు బి) ఒండ్రు నేలలు
సి) నల్లరేగడి నేలలు
డి) లాటరైట్ నేలలు
3. తెలంగాణలో తక్కువగా కనిపించే నేలలేవి? (బి)
ఎ) ఎరనేలలు
బి) లాటరైట్ నేలలు
సి) నల్లరేగడి నేలలు
డి) ఒండ్రు నేలలు
4. రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నేలల విస్తీర్ణత శాతం ఎంత? (ఎ)
ఎ) 25 శాతం బి) 30 శాతం
సి) 35 శాతం డి) 40 శాతం
5. నేలల స్వభావం గురించి చర్చించే శాస్త్రం?(సి)
ఎ) లిథాలజీ బి) జియాలజీ
సి) పెడాలజీ డి) ఆర్నిథాలజీ
6. మృత్తిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? (బి)
ఎ) మినరోజెనేసిస్ బి) పీడోజెనెసిస్
సి) క్రయోజెనెసిస్ డి) లిథోజెనెసిస్
7. జేగురు నేలలని వేటిని పిలుస్తారు? (ఎ)
ఎ) లాటరైట్ నేలలు బి) నల్లరేగడి నేలలు
సి) ఎరనేలలు డి) ఒండ్రు నేలలు
8. జలధార శక్తి అధికంగా ఉండే నేలలు? (బి)
ఎ) ఎరనేలలు బి) నల్లరేగడి నేలలు
సి) లాటరైట్ నేలలు డి) ఒండ్రు నేలలు
9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది?(ఎ)
ఎ) భోపాల్ బి) డెహ్రాడూన్
సి) నాగపూర్ డి) హైదరాబాద్
10. ఏ రకం భూమికి అతి తక్కువ ఎరువులు అవసరం? (సి)
ఎ) నల్లరేగడి నేలలు బి) ఎర నేలలు
సి) ఒండ్రు నేలలు డి) లాటరైట్ నేలలు
11. తనను తాను దున్నుకునే నేలలు అని వేటిని అంటారు? (బి)
ఎ) ఎరనేలలు బి) నల్లరేగడి నేలలు
సి) లాటరైట్ నేలలు డి) ఒండ్రు నేలలు
12. నల్ల రేగడి నేలలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి? (ఎ)
ఎ) నిజామాబాద్ బి) నారాయణ్‌ఖేడ్
సి) సంగారెడ్డి డి) ఆదిలాబాద్
13. లాటరైట్ మృత్తికలు ఎక్కువగా ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? (సి)
ఎ) వరంగల్ బి) నిజామాబాద్
సి) సంగారెడ్డి డి) ఆదిలాబాద్
14. నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే, ల్యాండ్ అండ్ ప్లానింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (సి)
ఎ) డెహ్రాడూన్ బి) భోపాల్
సి) నాగపూర్ డి) హైదరాబాద్
15. కింది వాటిని జతపరచండి? (డి)
నేల పంటలు
1) ఒండ్రుమట్టి a) నూనెగింజలు
2) ఎరమట్టి b) గోధుమ, వరి
3) నల్లమట్టి c) తేయాకు, పోకచెక్క
4) లాటరైట్ d) పత్తి
ఎ) 1-c, 2-b, 3-d, 4-a
బి) 1-b, 2-c, 3-a, 4-d
సి) 1-a, 2-c, 3-b, 4-d
డి) 1-b, 2-a, 3-d, 4-c
16. దుబ్బనేలలు ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి?(డి)
ఎ) రంగారెడ్డి బి) నల్లగొండ
సి) మెదక్ డి) పైవన్నీ
17. ఏ నేలలు ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి అధిక తేమ, అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి? (సి)
ఎ) ఎరనేలలు
బి) నల్లరేగడి నేలలు
సి) లాటరైట్ నేలలు డి) ఒండ్రు నేలలు
18. కింది వాటిలో సరికానిది ఏది? (డి)
ఎ) లాటరైట్ నేలలు – ఆమ్ల నేలలు
బి) నల్లరేగడి నేలలు – దుబ్బనేలలు
సి) చల్క నేలలు -ఇసుకతో కూడిన నేలలు
డి) దుబ్బనేలలు -కాల్షియం అధికంగా ఉన్న నేలలు
19. బంగ్లాపెంకు తయారీలో ఏ మట్టిని ఉపయోగిస్తారు? (ఎ)
ఎ) లాటరైట్ బి) నల్లరేగడి
సి) ఒండ్రుమట్టి డి) ఎరమట్టి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు